ఈ భాగంలో అనుభవాలు:
- బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత
- సుస్వాగతం సాయీ!
బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు అను ప్రియాంక బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిరామ్! నేను నా తల్లిదండ్రులతో యు.ఎస్.ఏ.లో నివాసముంటున్నాను. నేను ఇక్కడ వైద్యవిద్యను అభ్యసిస్తున్నాను. నేను డాక్టరునయ్యే ప్రయాణంలో భాగమైన USMLE (United States Medical Licensing Examination) మొదటి స్టెప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో సాయిబాబా నాకు ఎలా సహాయపడ్డారో తెలియజేసే అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.
గత సంవత్సరం నేను ఈ పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు, 'పరీక్షకు అవసరమైన అన్ని విషయాలను ఎలా పూర్తిచేయగలనా?' అని ఆలోచనలో పడ్డాను. అది నాకు అసాధ్యం అనిపించింది. అలా నేను అధైర్యపడిన సమయంలో మా అమ్మ నాతో, "బాబాని నమ్ముకో! ఆయన నీకు సహాయం చేస్తారు" అని చెప్పింది. ఆమె సూచనమేరకు నేను సాయిబాబాను ప్రార్థించడం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నా చదువును మెరుగుపరుచుకోవడానికి నేను ఏమి చేయగలనో అనే దానిపై దృష్టిసారించి, నా కృషి నేను చేస్తూ ఫలితాన్ని సాయిబాబాకు వదిలివేయాలని అనుకున్నాను. సాయిబాబాను మనసారా ప్రార్థించి నా ప్రిపరేషన్ మొదలుపెట్టాను. తరువాత పరీక్ష వ్రాశాను. బాబా అనుగ్రహంతో నేను ఆ పరీక్షను మంచి స్కోరుతో విజయవంతంగా పూర్తిచేశాను. "థాంక్యూ సో మచ్ బాబా!"
నేను యు.ఎస్ లో రెసిడెన్సీ ప్రోగ్రామ్‌కి కూడా దరఖాస్తు చేశాను. బాబా దయవల్ల నాకు 12 ఇంటర్వ్యూలకి పిలుపు వచ్చింది. బాబా అనుగ్రహంతో నేను రెసిడెన్సీ కార్యక్రమానికి ఎంపిక అవుతానని, ఆయన మార్గదర్శకత్వంలో మంచి డాక్టరుగా సమాజానికి సేవచెయ్యగలనని ఆశిస్తున్నాను.

సుస్వాగతం సాయీ!
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను ఒక సాధారణ సాయిభక్తురాలిని. 'నేను బాబా యొక్క చిన్న పిచ్చుకను' అని నన్ను నేను అనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. "సాయినాథా! నా దేవా! అందరినీ ఆశీర్వదించండి".
ఇది నా సాయికుటుంబంతో పంచుకోవాలనుకుంటున్న ఒక సాయి లీల. ఇటీవల మా తమ్ముడి వివాహం నిశ్చయమైంది. తన అక్కగా పెళ్లిపనుల్లో నా తల్లిదండ్రులకు సహాయం చేయడం నా బాధ్యత. ఆ బాధ్యతతో నేను షాపింగ్ చేసి, ప్రతి వస్తువుకు సంబంధించిన నగదు వ్యవహారం చూస్తున్నాను. మా బంధువులకు, మా తమ్ముడికి, తనకి కాబోయే భార్యకు కావలసిన బట్టలు, బహుమతులు తీనుకుంటున్నాము. ఒకరోజు, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మేము జాబితాలో ఉన్న దాదాపు అన్ని కొనుగోళ్ళూ చేసాము. కేవలం వధువు కోసం చీర, వరుడి కోసం సూట్ తీసుకోవాల్సి ఉంది. మేము పెళ్లిచీర కోసం చాలా షాపులు తిరిగాం, కానీ వధువుకు నచ్చిన చీర ఎంపిక చేయలేకపోయాము. ఆ సమయంలో మా తమ్ముడు ముందు తన సూట్ తీసుకుందామని అన్నాడు. మేము సరేనంటే, తను మమ్మల్ని ఒక షాపుకి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళు మనకు నచ్చిన విధంగా సూట్ కుట్టి ఇస్తారు. అంతా ఫైనలైజ్ అయ్యాక నేను జాగ్రత్తగా షాపతనికి అడ్వాన్సు ఇచ్చాను. తరువాత మళ్ళీ చీరకోసం షాపులు తిరగడం ప్రారంభించాము. సుమారు రెండు గంటలు తిరిగాక వధువు ఒక చీర ఇష్టపడింది. దానికి డబ్బులు చెల్లించే సమయంలో 7 వేల రూపాయలు తక్కువగా ఉన్నట్లు గమనించి నేను నిర్ఘాంతపోయాను. నా నిర్లక్ష్యానికి నేను నిజంగా సిగ్గుపడ్డాను.
ఆ సమయంలో నాకు అండనివ్వగలిగేది నా సాయి మాత్రమే. నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. నేను ఎక్కడ ఆ డబ్బు పోగొట్టుకున్నానో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. నా సాయి దయవల్ల సూట్ ఆర్డరిచ్చిన షాపులోనే ఎక్కువ డబ్బు చెల్లించినట్లు గుర్తించాను. వెంటనే మేము ఆ షాపుకి పరుగుతీశాము. అక్కడ మేనేజరుని నగదు ఎక్కువ ఉందేమో పరిశీలించమని మర్యాదపూర్వకంగా అడిగాము. మొదట అతను అందుకు సిద్ధంగా లేడు. పైగా చాలా మొరటుగా మాట్లాడి నన్ను అనుమానించాడు. అయినప్పటికీ నేను అతనిని చాలాసార్లు వేడుకున్నాను, కానీ అతను సహాయం చేయడానికి నిరాకరించాడు. నేను నా సాయి నామాన్ని తలచుకుని చివరిసారిగా ప్రయత్నించాను. “మీరు నగదు ఉంచేటప్పుడు నేను మీ నగదుపెట్టెలో నా సాయినాథుని ఫోటో చూశాను. నేను సీరియల్ నంబర్లు ఉన్న కొత్త నోట్లను మీకు ఇచ్చాను. మీరు నిజంగా సాయిభక్తులైతే మీరు చిత్తశుద్ధి గల వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. దయచేసి ఒకసారి తనిఖీ చేసి నిర్ధారించండి" అని అడిగాను. సాయి కృపతో అతను నగదు తనిఖీ చేసి అదనంగా ఉన్న నగదును నాకు తిరిగిచ్చాడు. అంతేకాదు, సాయినామం తలచినంతనే అతను చాలా స్నేహపూర్వకంగా మారాడు. మేము కూడా అతని మొరటుతనాన్ని క్షమించి, అతనికి పెళ్లి ఆహ్వానపత్రిక ఇచ్చాము. అతను ఒక అందమైన బహుమతితో సంతోషంగా వివాహానికి హాజరయ్యాడు. కానీ ఆ బహుమతి వధూవరుల కోసం కాదు! అవును, అతను నా కోసం నా సాయిబాబాను కానుకగా ఇచ్చాడు. ఏ పదాలతోనూ వర్ణించలేని ఆనందాన్ని నేను పొందాను. నేను “సుస్వాగతం సాయీ!” అని బాబాను ఆహ్వానించాను. "బాబా! దయచేసి నాకు మరియు మిమ్మల్ని విశ్వసించే మీ బిడ్డలందరికీ అండగా ఉండండి".
ఓం శ్రీ సాయినాథాయ నమో నమః.
source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2564.html

బాబా భక్తులుగా మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో చక్కని లీల ద్వారా తెలియజేశారు. థాంక్యూ!
ReplyDeleteబాబాను నమ్మితే ఆయనే అంతా చూసుకుంటారు
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm sai ram
ReplyDelete