సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 336వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. జీవితాన్ని ఆనందమయం చేసిన సాయి సందేశం
  2. ఊదీని మించిన ఔషధం లేదు

జీవితాన్ని ఆనందమయం చేసిన సాయి సందేశం

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా జీవితంలో నేను చాలా బాధలు పడ్డాను. వాటిని తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని నిద్రమాత్రలు నా ముందర పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాను. అంతలో నా ఫేస్‌బుక్ పేజీకి ఈ క్రింది మెసేజ్ వచ్చింది:

ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారు నీ రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోను, దయతోను కాపాడును”.

అది చూసి నేను నిర్ఘాంతపోయాను. ఆ తరువాత నా మొబైల్‌కు గ్రాండ్‌మాస్టర్ వీడియోలు రావటం జరిగింది. వాటిని చూసాను. తరవాత నా మానసిక స్థితి మారిపోయింది. అంతకుముందు ఎన్నడూ సాయి సచ్చరిత్ర చదవని నేను రోజూ దీపారాధన చేస్తూ సాయి సచ్చరిత్ర వారంరోజులపాటు పారాయణ చేశాను. అంతేకాదు రోజూ మధ్యాహ్న ఆరతి సమయానికి  సాయి మందిరానికి  వెళ్తుండేవాణ్ణి. అలా చేస్తుండగా కొన్నిరోజులకు బాబా అనుగ్రహంతో నా జీవితంలో అన్నీ మంచి సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేను చేసే ఉద్యోగంలో అందరూ నన్ను గౌరవించడం, ఫ్లాట్ అమ్ముడుపోవడం, బాకీలు అన్నీ తీర్చడం ఇలా అన్నీ సజావుగా జరిగిపోయాయి.

ఇప్పుడు సింగపూర్ నుండి ఆఫర్ లెటర్ రావడంతో నా పాస్‌పోర్ట్ బాబా పాదాల దగ్గర పెట్టి వీసా కోసం దరఖాస్తు చేశాను. ఇంకో పది రోజులలో వీసా వచ్చే అవకాశం ఉంది. నా జీవితంలో బాబా ఎన్నో అద్భుతాలను చేశారు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన బాబాకు ఏమిచ్చి కృతజ్ఞతలు తెలుపుకోగలను? నా తండ్రి సాయిబాబా పాదాలను ఎల్లప్పుడూ పట్టుకొనే ఉంటాను. ‘సాయీ’ అని పిలిస్తే వారిని కష్టాలనుండి గట్టెక్కిస్తారు బాబా. అందుకే సాయిబంధువులందరూ సాయి పాదాలు విడువకండి, ఎల్లప్పుడూ బాబా మనకు తోడుగా ఉంటారు.

ఊదీని మించిన ఔషధం లేదు

గత 11 సంవత్సరాల నుండి నేను బాబా భక్తురాలిని. నాకు వివాహమైన కొన్నిరోజులకి నేను గర్భవతినయ్యాను. కానీ, వ్యక్తిగత సమస్యల కారణంగా గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి నేను నిరంతరం కడుపునొప్పితో బాధపడుతుండేదాన్ని. వైద్యుణ్ణి సంప్రదిస్తే, సమస్య ఏమీ లేదని చెప్పారు. కానీ తరువాత కూడా నొప్పి తగ్గలేదు. నెలరోజుల తరువాత కూడా పరిస్థితి అలాగే ఉంది. అందువలన మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకున్నాను. స్కానింగ్ చేసిన తరువాత కూడా డాక్టర్ సమస్య ఏమీ లేదని నాతో చెప్పారు. అయినప్పటికీ నా కడుపునొప్పి సమస్య తీరలేదు. ఆ సమయంలో నేను ఆఫీసుకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా వచ్చింది. నొప్పితో ఎలా వెళ్లాలో, పని ఎలా చేయాలో అర్థం కాలేదు. ఆ స్థితిలో చివరకు నేను, "నాకు కడుపునొప్పి తగ్గేలా అనుగ్రహించమ"ని బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలిపి బాబా ముందు ఉంచి పూజ పూర్తి చేసిన తరువాత ఆ నీటిని త్రాగాను. అంతే! అద్భుతం జరిగింది. అన్ని రోజులుగా బాధిస్తున్న కడుపునొప్పి తగ్గిపోయింది. ఊదీని మించిన ఔషధం లేదు. ఈ అనుభవమే కాదు, మరెన్నో అనుభవాలు నాకు జరిగాయి. బాబా దయవల్లనే ఈరోజు నేను ఉన్నాను. "చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి మీ ఆశీస్సులను నాపై ఉంచండి. నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసు. మా అత్తగారికి ఆరోగ్యం బాగాలేదు. దయచేసి ఆమె వ్యాధిని నయం చేయండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా వివాహ జీవితంలోని అవాంతరాలను తొలగించండి బాబా".

శ్రీ శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2564.html


3 comments:

  1. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  2. BABA NENU NEE THO TAPPA EVVARIKI NAA ALOCHANALU, BHADALU SHARE CHESUKOLENU
    PLEASE SAVE ME SAIRAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo