ఈ భాగంలో అనుభవాలు:
- కరుణతో బాబా చేసిన అద్భుతం
- బాబా ఉనికి అనుభూతి
కరుణతో బాబా చేసిన అద్భుతం
నా పేరు సుజిత్ కుమార్. ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను బాబా బిడ్డని. నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ బాబానే. 2020లో మా కుటుంబమంతా శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలని అనుకుని దర్శనం టికెట్లు, సాయి వ్రతం టికెట్లు బుక్ చేసుకున్నాము. తర్వాత శిరిడీ వెళ్ళడానికి నాలుగు రోజుల ముందు వరంగల్‌లో జరగబోయే ఒక ఫంక్షన్‌కు వెళ్ళాలనుకుని నా భార్య తను ఉద్యోగం చేసే స్కూల్లో సెలవు అడిగింది. కానీ స్కూలు వాళ్ళు ఆమెకు సెలవు ఇవ్వలేదు సరికదా, ఒక నెలరోజుల వరకు ఎవరూ సెలవు అడగవద్దనీ, అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తామని తీవ్రంగా హెచ్చరించారు కూడా. దాంతో మేము వరంగల్ వెళ్ళే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాము. కానీ శిరిడీ వెళ్ళాల్సిన రోజు దగ్గరకు వచ్చింది. మరో నాలుగు రోజుల్లో ప్రయాణం. ఏం చేయాలో అర్థంకాక మాకు ఒకటే టెన్షన్. ఆ సమయంలో మేము, “తండ్రీ! నువ్వు పిలిపించుకుంటే శిరిడీకి వస్తాము. నీవే మాకు దిక్కు. నీ దర్శన భాగ్యం కలిగేలా అనుగ్రహించు బాబా!” అని బాబాని మనసారా వేడుకొని భారమంతా ఆయన మీదే వేశాము. మా కోరిక నెరవేరితే బాబా అనుగ్రహాన్ని ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటానని అనుకున్నాను. ఆశ్చర్యకరంగా ఆ మరుసటిరోజు స్కూల్ ప్రిన్సిపాల్ నా భార్యను పిలిచి తనంతటతానే, “నీకు సెలవు కావాలన్నావుగా, తీసుకో!” అన్నారు. ఆ మాట వినగానే బాబా చూపిన అనుగ్రహానికి మాకు కన్నీళ్ళు వచ్చేశాయి. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. నిజంగా ఇది బాబా చూపిన కరుణే కదా! ప్రతి విషయంలోనూ బాబా మా వెన్నంటి వుండి మమ్మల్ని కన్నబిడ్డల్లా ఆదుకుంటూ మా కోరికలను నెరవేరుస్తున్నాడు. బాబా చల్లని చూపులు ఎప్పుడూ అందరిమీదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఓం సాయినాథాయ నమః
బాబా ఉనికి అనుభూతి
నా పేరు శిల్పకావ్య. ఒకరోజు నేను పూజగది శుభ్రపరుస్తుండగా బాబా విగ్రహం క్రింద పడి మూడు ముక్కలుగా విడిపోయింది. నేను చాలా బాధపడ్డాను. నా శ్రేయోభిలాషులంతా, "దిగులుపడకు, క్రొత్త విగ్రహం తీసుకో" అని చెప్పారు. నేను వాళ్లతో, "బాబా నా బిడ్డ, తనకి గాయమైతే, నేను తనకి నయమయ్యేలా ప్రయత్నిస్తాను. అంతేకానీ, తనని విడిచిపెట్టను" అని అన్నాను. తరువాత నేను బాబా విగ్రహాన్ని అతికించి పెట్టాను. కానీ నా మనస్సులో ఎక్కడో 'ఇలా ఎందుకు జరిగింది?' అని ఆందోళనపడుతూ 'దీని ద్వారా బాబా నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో?' అని ఆ రోజంతా ఆలోచించాను. తరువాత వచ్చిన గురువారంనాడు నేను బాబాకి ఆరతి ఇస్తుంటే, హఠాత్తుగా బాబా ముందు వెలిగించి ఉన్న దీపంలో బాబా రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాను. (ఫోటో కింద జతపరుస్తున్నాను.) వెంటనే నేను అక్కడ కూర్చుని పరిశీలనగా చూశాను. బాబా మల్లెపువ్వుల మాల ధరించి నవ్వుతున్నట్లుగా కనిపించారు. స్పష్టంగా బాబా ఉనికిని నేను అనుభూతి చెంది, "బాబా! మీరు ఎల్లప్పుడూ నాతో ఉండండి. అదే నేను మిమ్మల్ని కోరుకునేది" అని బాబాను మొదటిసారి అడిగాను. నిజానికి నేను బాబాని దేనికోసమూ ప్రార్థించను. ఆయనయందు నమ్మకంతో ఆయనను ప్రేమిస్తూ ఉంటాను.
source: http://experiences.mahaparayan.com/2019/11/i-saw-baba-in-my-lamp.html

Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹
ReplyDeleteOm sai ram ����������
ReplyDeleteBaba Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDelete