- బాబా ఆశీస్సులు
- పొరపాటును సరిదిద్ది ఫోన్ సక్రమముగా పనిచేసేలా చేసారు బాబా
బాబా ఆశీస్సులు
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రేవతి. ఒకరోజు నేను ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే, ఒక భక్తురాలు తనకు 5 రోజులుగా తలనొప్పిగా ఉందని, బాబాను ప్రార్థించి ఊదీని నీళ్ళలో కలిపి త్రాగగా తలనొప్పి తగ్గిందని వ్రాశారు. అది చదివి, “ఇంత చిన్న విషయాలు బ్లాగులో వ్రాయాలా?” అని మనసులో అనిపించినా, వెంటనే నేను తప్పుగా ఆలోచించానని తెలిసి బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. కానీ బాబా నాకు ఏదైనా అనుభవపూర్వకంగా తెలియజేయాలనుకున్నారు కాబోలు, ఆరోజు రాత్రినుండే నాకు తలనొప్పి మొదలైంది. మందులు వేసుకున్నా నొప్పి తగ్గలేదు. 5వ రోజున నాకు నా తప్పు గుర్తుకువచ్చి, “బాబా, ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదేనని గ్రహించాను. నా తప్పు మన్నించండి. మీ దయవల్ల నా తలనొప్పి తగ్గిపోవాలి” అని బాబాకి చెప్పుకున్నాను. అలా బాబాకి చెప్పుకున్న పదినిమిషాల్లో నా తలనొప్పి తగ్గిపోయింది. ఈ అనుభవం ద్వారా ఎవరి సమస్యనూ తక్కువగా చూడకూడదని బాబా నాకు తెలియజేశారు. “థాంక్యూ సో మచ్ బాబా!”
మేము మా స్వగ్రామంలో నూతన గృహాన్ని నిర్మించుకున్నాము. 2020, ఆగస్టు 6న గృహప్రవేశం అనగా వారం రోజుల ముందు నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఇచ్చిన అభయంతో నాకు కరోనా భయం అస్సలు లేదు కానీ, గృహప్రవేశం ఎలా జరుగుతుందోనని ఆందోళనపడ్డాను. నేను వినాయకుడిని, బాబాని ఒక్కరుగానే భావించి పూజిస్తాను. అందుకే ఏ ఆటంకం లేకుండా గృహప్రవేశం జరగాలని వారిని మ్రొక్కుకున్నాను. వారి దయవలన మా గృహప్రవేశం ఏ ఆటంకం లేకుండా చాలా చక్కగా జరిగింది. బాబా అనుగ్రహం ఇలాగే ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
పొరపాటును సరిదిద్ది ఫోన్ సక్రమముగా పనిచేసేలా చేసారు బాబా
సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. 2020, సెప్టెంబరు 4వ తారీఖున జరిగిన ఒక అనుభవాన్ని నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. బాబాపై నమ్మకముంటే ఎంతటి సమస్యలనుండైనా మనల్ని సులువుగా దాటిస్తారు. ఆయనపై మనకు ఉండవలసింది కేవలం శ్రద్ధ మరియు సబూరి. బాబాను నా తండ్రిగా భావిస్తున్నాను. నిరంతరం ఆయన నామస్మరణ చేయటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఏ ఇతర విషయాలను మన మనసులోనికి రానివ్వకుండా ఎల్లప్పుడూ బాబాను తలచుకుంటే అన్నీ ఆయనే సూత్రధారియై నడిపిస్తారని నా నమ్మకం. ప్రతి ఒక్కరూ ఈ విధంగా అరిషడ్వర్గాలకు గురికాకుండా నిత్యం భగవన్నామస్మరణయందు ఉంటే, బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనకు మార్గదర్శకత్వం చేస్తారు. ఆయన పాదాలను ఆశ్రయించినవారిని బాబా ఎప్పుడూ మధ్యలో వదిలిపెట్టరు. ఇక నా అనుభవానికి వస్తే..
నేను ఈమధ్యన ఆన్లైన్ లో ఒక మొబైల్ ఫోన్ ను ఆర్డర్ చేశాను. అది సెప్టెంబరు 4వ తారీఖున డెలివరీ చేయబడింది. అది ఒక ప్రముఖ కంపెనీ మొబైల్. ధర కూడా ఎక్కువే. అయితే నేను చేసిన చిన్న పొరపాటు వలన ఫోన్ ఆన్ చేశాక డబుల్ క్లిక్ చేస్తేగానీ పనిచేసేది కాదు. అన్నీ మొబైల్స్ లాగా ఓపెన్ చేయగానే పనిచేసేది కాదు. నేను చాలా ప్రయత్నించాను, కానీ నావల్ల కాలేదు. ఇష్టంగా కొనుక్కున్న క్రొత్త మొబైల్ ను ఓపెన్ చేయగానే ఇలా జరిగినందుకు నేను చాలా నిరాశపడ్డాను. నేను చేయవలసిన ప్రయత్నం చేసి ఇంక వదిలేశాను. తరువాత బాబాను త్రికరణశుద్ధిగా ప్రార్థించాను. వెంటనే నా స్నేహితుడినుండి నాకు కాల్ వచ్చింది. తను నన్ను మళ్ళీ ప్రయత్నించమని చెప్పాడు. ఇది బాబా ఆశీర్వాదమే అనుకొని, “ఫోన్ సాధారణ స్థితికి రావాల"ని బాబాకు చెప్పుకుని, బాబాను స్మరించుకుంటూ మళ్ళీ నా ప్రయత్నం నేను చేశాను. నేను సెట్టింగ్ లో చిన్న మార్పును సరిచేయడం వలన నా ఫోన్ మునుపటి స్థితికి వచ్చి చాలా చక్కగా పనిచేసింది. నాకు ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఫోన్ కనుక సరిగ్గా పనిచేయకపోతే నేను మా కుటుంబం నుండి చాలా సమస్యను ఎదుర్కోవలసి వచ్చేది. కానీ బాబా నాకు ఆ ఫోన్ పట్ల అవగాహన కల్పించి నా పొరపాటును సరిదిద్దారు. “థాంక్యూ సో మచ్ బాబా!” నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. నా అనుభవాన్ని చదివిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri sairam
ReplyDeleteBaba ma daya chupinchayya thandri
ReplyDeleteBaba ma pyna daya karuna chupinchu thandri
ReplyDeleteసర్వం సాయి బాబా మహిమ
ReplyDeleteSarvam sai baba mahima
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏