సాయి వచనం:-
'అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ప్రారంభించిన పనిని మనమే పూర్తిచేయాలిగానీ ఇంకొకరికి అప్పగించకూడదు. వీలైనంత తరచుగా శిరిడీ వస్తుండాలి.'

'సాయిపథం అంటే - శ్రీసాయిబాబా చూపిన మార్గం, బాబా నడిచిన బాట, 'సాయి' అనే గమ్యానికి రహదారి. ఏ ఒక్క మతసాంప్రదాయానికీ చెందక, ప్రపంచంలోని అందరు మహాత్ములు ఆచరించి బోధించిన విశ్వజనీన ఆధ్యాత్మిక సాంప్రదాయమే ఈ సాయిమార్గం. మరో మాటలో, సాయిపథం అంటే సద్గురు పథం' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 552వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అండగా ఉంటూ జీవితాన్ని నడిపిస్తున్న బాబా

రాయచోటి నుండి శ్రీ పప్పుశెట్టి రెడ్డెయ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారం. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఎక్కడినుండి ప్రారంభించాలో అర్థం కావట్లేదు. సరే, బాబాతో పరిచయం దగ్గర నుంచి ప్రారంభిస్తాను. 

1. అది 2000 సంవత్సరం. ఆ సమయంలో నేను డిగ్రీ చదువుతున్నాను. అదే సంవత్సరం మా కాలేజీకి దగ్గర్లో బాబా మందిరం నిర్మించారు. అప్పుడే బాబాతో నాకు పరిచయం ఏర్పడింది. అదే సంవత్సరం నా  జీవితం అతలాకుతలం అయ్యింది. మా నాన్న టైలర్. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేని రోజులవి. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి నా జీవితం, చదువు రెండూ నాశనమైపోయాయి. సరిదిద్దుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. అప్పటినుండే నేను బాబా ప్రార్థించటం ప్రారంభించాను. నా మొదటి కోరికగా నా ప్రేమను గెలిపించమని బాబాను వేడుకున్నాను. కానీ నా కోరిక నెరవేరలేదు. దానికి బాబా దగ్గరనుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. బాబా అంగీకారం లేదని ఆ కోరికను ఇక వదిలేశాను.

2. 2004లో నాకు పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. 2005లో ఒక వ్యక్తిగత సమస్య నుండి బాబా నన్ను బయటపడేశారు. పోలీసు కేసు, కోర్టు వరకు పోవలసినదానిని బాబా తేలికగా పరిష్కరించారు
 
3. అది 2007వ సంవత్సరం. నా జీవితంలో ఇదొక గొప్ప సంవత్సరం. ఎందుకంటే, ఆ సంవత్సరంలోనే బాబా నన్ను శిరిడీకి రప్పించుకున్నారు. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. 3000 రూపాయలతో బ్రతుకుబండిని లాగే రోజులవి. నాకు స్థిరమైన జీవితాన్ని, సంతానాన్ని, స్వంత ఇంటిని ప్రసాదించమని బాబాను వేడుకుని సాయిలీలామృతం, గురుచరిత్ర పారాయణ చేశాను. కేవలం కోరికల కోసమే పారాయణ చేసినప్పటికీ బాబా ఎంతో ప్రేమతో నన్ను శిరిడీకి రప్పించుకుని తమ దర్శనాన్ని అనుగ్రహించారు

4. 2013వ సంవత్సరంలో బాబా కృపతో నేను స్థిరమైన జీవితం కోసం స్వంతంగా బట్టల వ్యాపారం ప్రారంభించాను. అప్పటికే పది సంవత్సరాల అనుభవం ఉన్నందున  తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించటానికి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది. 

5. 2016వ సంవత్సరం. చాలా బలవంతంగా బాబా నన్ను శిరిడీకి లాక్కున్నారు. అదే సమయంలో వ్యాపారంలో మార్పు చోటుచేసుకుంది. స్వంత ఇల్లు, సంతానం కావాలన్న కోరికలేమీ తీరనప్పటికీ నాకు పెద్దగా దిగులు లేదు. కారణం అప్పటికే నాకు కోరికలు లేకుండా పోయాయి. నిత్యం చేసే బాబా చరిత్ర పారాయణతో అది సాధ్యమైంది

6. 2018. మళ్ళీ నా జీవితంలో చీకటి అలుముకుంది. ఎటుపోవాలో తెలియని పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో నాకు ఆపరేషన్ జరిగింది. దాదాపు మూడు నెలల పాటు నరకం అనుభవించాను. ఆ సమయంలో కూడా నేను బాబా స్మరణ ఆపలేదు. బాబా తోడుతో ఎన్నో సమస్యలు నా వద్దకు రాకుండానే పరిష్కారం అయిపోతుండేవి. ఆ సంవత్సరం మే నెలలో కుంటుబంతో సహా శిరిడీ వెళ్ళాను. ఆగష్టులో ప్రారంభమైన ఆరోగ్యసమస్యలు బాబా అనుగ్రహంతో నవంబరులో పరిష్కరించబడ్డాయి

7. 2019-2020. వరుసగా ఐదవసారి శిరిడీ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. ఆరతికి వెళ్ళాలి అని అనుకుంటే చాలు, బాబా దయవల్ల ఏర్పాట్లన్నీ జరిగిపోయేవి. 2019లో మా ఫ్రెండ్స్ ఎల్లోరా గుహలు చూడటానికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ బుద్ధ విగ్రహం వున్న గుహలో పడిపోయాడు. తీరా చూస్తే కాలు కదిలించలేని పరిస్థితి. ముందే అతను ఒక కాలికి పోలియో కారణంగా సరిగా నడవలేకపోయేవాడు. తనను భుజాలపై ఎత్తుకుని మా వెహికల్ వద్దకు తీసుకొచ్చాము. నొప్పితో బాధపడుతున్న మా ఫ్రెండ్ ని చూసి మా అందరికీ దిగులుపట్టుకుంది. అసలే ఆ ప్రాంతం మాకు క్రొత్త. ప్రయాణానికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసుకుని మరీ డబ్బులు తీసుకుని వెళ్ళడంతో మా వద్ద డబ్బులు కూడా ఎక్కువ లేవు. “బాబా! నీ వద్దకు వస్తే ఇటువంటి పరిస్థితి ఎదురైంది. నీవే కాపాడాలి” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాము. ఇంతలో కుల్ఫీలు అమ్ముతూ ఒక ముస్లిం మా వద్దకు వచ్చాడు. కాలి బొటనవేలిని గట్టిగా తొక్కిపట్టమని చెప్పి వెనుకవైపునుండి ఒక్క తోపుతో మా ఫ్రెండ్ కాలినొప్పిని నయం చేశాడు. ఇక మావాడిలో పరుగులెత్తే ఉత్సాహం. అందరం ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

మేము శిరిడీ వెళితే వేసవి సెలవుల్లో అమ్మమ్మగారింటికి వెళ్ళిన పిల్లల్లా మారిపోతాము. త్వరలోనే మరిన్ని అనుభవాలతో మీ ముందుకు వస్తాను.


8 comments:

  1. Sprb sai mee exp..baba blessings are always vth their childrens..

    ReplyDelete
  2. ఓంసాయిరామ్

    ReplyDelete
  3. Baba bless us i am eagarily waiting for u to come and solve our problems pls bless us

    ReplyDelete
  4. ఓం సాయిరాం

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. ❤❤🧎🙏OM SRI SAI RAM🧎🙏❤❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo