
రాధాకృష్ణమాయి బాబాకు అవసరమైనది చేస్తూ, ఇతర భక్తులతో చేయిస్తూ పగలురాత్రి తేడా లేకుండా రోజంతా బాబా సేవలో నిమగ్నమై ఉండేది. మార్గాలను శుభ్రపరచడం, మన్ను, గులకరాళ్లు తొలగించడం, జంతువుల, పిల్లల మలాన్ని ఎత్తి పారవేయడం, గుంతలు త్రవ్వి మొక్కలు నాటడం, మట్టి, ఆవుపేడతో నేలను...