1. బాబా కృప
2. బాబా నాపై చూపిన అపార అనుగ్రహం
3. క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
బాబా కృప
ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఇటీవల రెండు సంవత్సరాల ఎనిమిది నెలల వయసున్న మా బాబు సాయికి జ్వరం, జలుబు, దగ్గు వచ్చి వారం రోజులైనా తగ్గలేదు. నాకు భయమేసి 'జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గింది. తరువాత నాకు, ఆ తరువాత మా వారికి కూడా జ్వరం, జలుబు వచ్చాయి. అప్పుడు నేను, 'మాకు కూడా జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల వారం రోజుల్లో మా ఇద్దరికీ జ్వరం తగ్గింది. రెండు వారాల తరువాత మళ్ళీ బాబుకి బాగా జలుబు చేసేసరికి నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపనందువల్లే ఇలా మళ్ళీ జలుబు చేసిందని, "బాబా! దయతో మళ్ళీ జ్వరం రాకుండా చూడండి తండ్రి" అని బాబాను వేడుకుని నా అనుభవాన్ని బ్లాగుకు పంపాను. అయితే వారం తరువాత మా సాయికి మళ్ళీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో సాయికి జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల తొందరగానే మా సాయికి జ్వరం తగ్గింది. "థాంక్యూ బాబా".
2022, మార్చి 30న మావారు, మా బాబుని తీసుకుని బయటకి వెళ్ళారు. మావారు వెళ్తూ ఇంటి తాళాలు తనతో తీసుకుని వెళ్లారు ఆ విషయం నాకు తెలీదు. మరుసటిరోజు ఉదయం మావారు స్కూలుకి వెళ్ళేటపుడు తాళాలు అడిగారు. వాటికోసం వెతికితే అవి కనపడలేదు. మరోపక్క స్కూలుకి టైం అయిపోతుందని మావారు తిడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్ధంకాక, "బాబా! తాళాలు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఐదు నిమిషాల తరువాత ఆ తాళాలు మావారికి మా బాబు సాయి జెర్కిన్‍లో కనిపించాయి. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఇటీవల హాస్పిటల్‍కి వెళ్లవలిసి వచ్చి మేము రెండుసార్లు హాస్పిటల్‍కి వెళ్ళాము. రెండుసార్లు కూడా నేను, 'అంతా మంచిగా ఉందని వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల రెండుసార్లూ బాగానే ఉంది అన్నారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
2022, ఏప్రిల్ 11న మా ఇంట్లో ఒక గది తాళం కనిపించలేదు. దాని అవసరం ఎంతో ఉందని కొంచెం సేపు వెతికానుగానీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు మావారు నన్ను తిడుతున్నారు. ఇంకా బాబాకి చెప్పుకొని, "తాళం దొరికితే, ఈరోజే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల 10 నిమిషాల్లో ఆ తాళం దొరికింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్. నేను మీకెప్పుడూ ఋణపడి ఉంటాను".
బాబా నాపై చూపిన అపార అనుగ్రహం
సాయి బంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు రేవతి. 2022, ఉగాది పండుగ రోజు ఉదయాన బాబా నాకొక శుభవార్తను ఇచ్చారు. దాని గురించే నేనిప్పుడు ముందుగా మీ అందరితో పంచుకుంటాను. నేను వృత్తిరిత్యా టీచరుని. 2022, మార్చి 6వ తేదీన మాకు ఒక డిపార్ట్మెంటల్ టెస్టు జరిగింది. ఆ టెస్టు జరగడానికి ముందు టెస్టుకు ప్రిపేర్ అవుదామంటే అవసరమైన బుక్స్ నా దగ్గర లేక చాలామందిని అడిగాను. అయితే ఎంతమందిని అడిగినా అందరూ బుక్స్ లేవు అన్నారు. అప్పుడు నేను ఆర్తితో బాబాను ప్రార్థించాను. బాబా దయవలన నాలుగు రోజుల్లో టెస్టు ఉందనగా నాతోపాటు ఆ టెస్టు వ్రాయనున్న ఒక టీచర్ తన వద్దనున్న కొన్ని బుక్స్ నాకిచ్చారు. ఆవిడ గొప్ప మనసుకి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. బాబానే ఆవిడతో నాకు బుక్స్ ఇప్పించారు. అది కూడా శివరాత్రి రోజు. కానీ ఆ రాత్రి నుండి నాకు జ్వరం మొదలైంది. ఎలాగో బాబా దయవల్ల టెస్టు జరగడానికి ముందురోజు జ్వరం తగ్గింది. దాంతో ఆ ఒక్క రోజే టెస్టుకు ప్రిపేర్ అయ్యి, "బాబా! నేను టెస్టుకు సరిగా ప్రిపేర్ కాలేదు. మీ మీదే భారం వేస్తున్నాను. నేను గనక టెస్టులో పాసైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ టెస్టు ఫలితాలు ఉగాది రోజున వెలువడ్డాయి. నేను, నాకు బుక్స్ ఇచ్చిన స్వర్ణ మేడం ఇద్దరమూ పాసయ్యాము. ఇది బాబా నాపై చూపిన అపార అనుగ్రహం. "బాబా! మీ ఋణం ఎప్పుటికీ తీర్చుకోలేను".
ఈ మధ్య మా టివి పని చేయలేదు. మా తమ్ముడు ఏదో ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో తను, "సెట్ అప్ బాక్స్ ప్రాబ్లెమ్ అనుకుంటా, కొత్తది తీసుకుంటే మంచిది" అని అన్నాడు. మేము అలాగే అన్నాం. కానీ ఏదో ఆశతో నేను, "బాబా! ఏ రిపేర్ లేకుండా టివి బాగైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. పది రోజుల తర్వాత మా ప్రింటర్ బాగుచేయడానికని ఒకతను మాఇంటికి వచ్చాడు. నేను ఏదో మామూలుగా మావారితో, "అతణ్ణి ఒకసారి టివి కూడా చూడమని చెప్పండి" అని అన్నాను. మావారు అలాగేనని అతనితో చెపితే, అతను సెట్ అప్ బాక్స్ వైర్లు తీసి మళ్ళీ పెట్టగానే టివి మునపటిలా పని చేసింది. అసలు అతను తనకు టివి రిపేర్ చేయడం రాదని, అయినా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తే ఐదు నిమిషాల్లో టివి ఆన్ అయింది. ఇదంతా బాబా దయకాక మరేమిటి? "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్. నేను ఏదైనా అనుభవం పంచుకుంటానని మీకు మాటిచ్చి మరిచిపోయి ఉంటే మన్నించి నాకు గుర్తు చేయండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
"బాబా! మీకు శతకోటి వందనాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ఆదరిస్తున్న అందరినీ చల్లగా చూడండి తండ్రి". ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళు ఎంతో ఓపికగా మన అనుభవాలను చదివి, వాటిని సరిచేసి బ్లాగులో ప్రచురిస్తున్నారు. నా పేరు కృష్ణవేణి. ఈ మధ్య మా బాబు స్కూలువాళ్లతో వండర్ ల్యాండ్‍కి వెళ్తానని అన్నాడు. మేము వద్దన్నా వాడు వినలేదు. దాంతో మేము సరేనని, టూర్ కోసం డబ్బులు కట్టాము. కానీ మాబాబు ఎప్పుడూ మమ్మల్ని వదిలి వెళ్ళనందున నాకు కొంచెం భయమేసి, "బాబా! బాబు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటా"ని బాబాను వేడుకుని ఇక బాబా చూసుకుంటారని ధైర్యంగా ఉన్నాను. ఆరోజు గురువారం. బాబు వండర్ ల్యాండ్‍కి వెళ్ళాక వాడి షూస్ పోయి కొంచం ఇబ్బందిపడ్డాడు కానీ, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "బాబా! మీకు శతకోటి కృతజ్ఞతలు. నావల్ల ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి బాబా. నేను ఇప్పుడు కొన్ని సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించి, తొందరగా ఆ సమస్యలను తొలగించండి బాబా".
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me