1. సాయి చర్యలు అగాధాలు
2. బాబాకు నా మీద ఎంత ప్రేమో!
3. ఆధార్ కార్డుని ఎక్కడ పెట్టానో గుర్తుచేసిన బాబా
సాయి చర్యలు అగాధాలు
ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః!!! ఈ బ్లాగును చక్కగా, సమర్థవంతంగా నడిపిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. ఎందరో సాయిభక్తులు, అందరికీ వందనములు. నా పేరు విజయ. ఇదివరకు నా అనుభవాలు రెండు ఈ బ్లాగులో ప్రచురితమయ్యాయి. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ముందుగా, నా అనుభవాన్ని పంచుకోవడంలో నేను ఆలస్యం చేసినందుకు సాయినాథుడిని క్షమాపణ వేడుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం మా చెల్లెలి కూతురి పెళ్లి విషయం. తన పేరు సాయి సృజన. తను పాలిటెక్నిక్, తర్వాత బీటెక్ చేసింది. ఆ తరువాత తను ఎమ్.ఎస్. చేద్దామని, అందుకోసం జర్మనీ వెళదామని అనుకుంది. కానీ తను అనుకున్నది జరగాలంటే ఎన్నో సమకూరాలి. ఆ లోపల ఇంట్లోవాళ్ళు తనకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తను, 'జర్మనీలో జాబ్ చేసే అబ్బాయి అయితే బాగుండు, అక్కడే ఎమ్మెస్ చేసుకోవచ్చు' అని ఆశపడి సాయిని వేడుకుంది. సాయి ఎప్పటికప్పుడు 'సహనం వహించమ'ని కొన్ని మెసేజ్‌ల ద్వారా సూచిస్తుండేవారు. ఈలోగా ఎన్నో సంబంధాలు చూసి చూసి విసిగిపోయారు. అంతలో ఆ సాయినాథుని దయవల్ల అనుకోకుండా ఒక జర్మనీ సంబంధం వచ్చింది. అన్నిరకాలుగా ఇద్దరికీ కుదిరింది. అందరికీ నచ్చింది. ఇరువైపు పెద్దలు ఓకే అనుకున్నారు. కానీ అబ్బాయి జర్మనీ నుంచి రావడానికి లేదు. కరోనా వల్ల కొంత, తన సర్టిఫికెట్ల విషయంగా కొంత ఆలస్యం జరుగుతూ వస్తుంటే మళ్లీ మా సృజన సాయికి మొరపెట్టుకుంది. మేమందరం కూడా సాయిని వేడుకున్నాము. ఆ సాయినాథుని దయవల్ల అన్ని సమస్యలు తొలగి జర్మనీ నుంచి అబ్బాయి వచ్చాడు. 2021, ఆగస్టు 13న వారిరువురి పెళ్లి జరిగింది. సాయినాథుని దయవలన ఇప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. జర్మనీలో ఎమ్.ఎస్. చేయడానికి సృజనకి స్టూడెంట్ పాస్ కూడా వచ్చింది. అన్నిరకాలుగా ఆదుకుని సాయి తన కోరిక తీర్చారు.
ఈ సాయిలీలలోని ముఖ్యాంశాలు:
1. జర్మనీలో ఎమ్.ఎస్ చేయాలన్న కోరిక.
2. అక్కడే జాబ్ చేస్తున్న అబ్బాయి దొరకడం.
3. అన్ని అడ్డంకులను దాటుకుని అబ్బాయి ఇండియా వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.
4. నెల రోజులకు అటు ఇటు వ్యవధిలో అమ్మాయి కూడా జర్మనీ వెళ్లి తన భర్తతో కలిసి ఉండటం.
5. జర్మనీలో స్టూడెంట్ పాస్ రావడం (ఎమ్మెస్ చేయడానికి).
ఇవన్నీ సాయినాథుని ఆశీర్వాదాలే. ఆయన చర్యలు అగాధాలు. ఎటువైపు నుండి పావులు కదిపి ఎలా ఆశీర్వదిస్తారో ఆయనకే తెలుసు. వారి ఆశీర్వాదం పొందిన ప్రతిసారీ ఆశ్చర్యపోవడం, మనసు నిండా కృతజ్ఞతతో సాయి పాదాలకు మొక్కడం తప్ప మనం ఆయనకు ఇచ్చేదేముంది? సాయిని నమ్ముకున్నవాళ్లందరికీ సాయినాథుని అనుగ్రహం అనంతంగా ఉండాలని కోరుకుంటూ...
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సద్గురు సాయి నమో నమః!!!
బాబాకు నా మీద ఎంత ప్రేమో!
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. నేను బాబా భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నేను మా అమ్మావాళ్ల ఊరు వెళుతున్నప్పుడు, 'ఒక మనిషి నాకు కనిపించకుండా ఉండాలని, అలా కనిపించకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను' అని బాబాకి నమస్కారం చేసుకున్నాను. బాబా దయవల్ల ఆ మనిషి కనపడకుండానే నేను మా అమ్మావాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను.
నేను ప్రతిరోజూ ఏది చేసినా మొదట బాబాకి నివేదిస్తాను. అయితే, ఒకసారి కొంచెం ఆటంకమొచ్చి బాబాకి నివేదించలేకపోయాను. ఆరోజు లుంగీ, లాల్చీ ధరించి, తలకి కండువా చుట్టుకుని, గడ్డం ఉన్న ఒకతను నడుచుకుంటూ పోతూ కనిపించాడు. నేను ఇంతకుముందెప్పుడూ అతన్ని చూడలేదు. నాకు అతను అచ్చం బాబాలానే అనిపించి, 'నా పరిస్థితి గమనించి నా మీద ప్రేమతో బాబానే వచ్చార'ని అనుకున్నాను. వెంటనే మా ఇంట్లో ఉన్న అరటిపండ్లు, ఒక ఆపిల్ మా పాపతో అతనికి ఇప్పించాను. అతను వాటిని ఆరగించారు. 'నా బాబాకు నా మీద ఎంత ప్రేమో!' అని నేను చాలా ఆనందించాను.
ఇప్పుడు 2022, హోళీ పండుగ రోజున బాబా ప్రసాదించిన అద్భుత అనుభవం గురించి చెప్తాను. శ్రీసాయిసచ్చరిత్ర 40వ అధ్యాయంలోని హోళీ పండుగనాడు ఉదయాన హేమడ్‌పంత్‌కు స్వప్నంలో బాబా కనిపించి, "మధ్యాహ్నం భోజనానికి వస్తాన"ని సూచించడం, అలాగే నాటి మధ్యాహ్నం భోజనవేళకు చిత్రపటం రూపంలో బాబా అతని ఇంటికి వెళ్లడం గురించి మన అందరికీ తెలిసిందే. నేను ఈ సంవత్సరం హోళీ పండుగనాడు సాయి టీవీలో చెప్పినట్లు మా ఇంట్లో బాబాకి భోజనం పెట్టాలని అనుకున్నాను. అనుకున్నట్లే బాబాకు అన్ని వంటలు వండి పూజగదిలో బాబాను అలంకరించాను. తరువాత ధూపదీపాలు వెలిగించి, విస్తరాకు తెచ్చి బాబాకు వడ్డన చేస్తున్నాను. ఇంతలో మావారు ఒక దక్షిణామూర్తి ఫోటో, శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురుచరిత్ర పారాయణ పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇక చూస్కోండి, నా ఆనందానికి అవధులు లేవు. నా సాయినాథుడు నా ఇంటికి వచ్చారని సంతోషంలో ఉక్కిరిబిక్కిరైపోయాను. నేను అస్సలు ఊహించలేదు, 'నా బాబా నా మీద అంత ప్రేమ చూపిస్తార'ని. సాయి టీవీ వాళ్ళకి నిజంగా నేను ఋణపడి ఉన్నాను. వాళ్ళు, "పెద్ద ఖర్చు కాదు, సంకల్పం చేసుకుని బాబాకి భోజనం పెట్టండి" అని చెప్పారు. నేను బాబా మీద పూర్తి విశ్వాసంతో వాళ్ళు చెప్పినట్లే చేశాను. నా బాబా నన్ను కరుణించారు. వెంటనే మన 'సాయి మహరాజ్ సన్నిధి' గ్రూపులో "నీ ప్రయాణమంతా నేను నీతోనే ఉన్నాను. చాలాసార్లు నిన్ను నేను రక్షించాను" అని ఒక సాయి వచనం వచ్చింది. అది చూసి నాకు చాలా ఆనందమేసింది. బాబాకు భోజనం పెట్టి, తరువాత మా ఇంటిల్లిపాదీ ఆయన ప్రసాదం తిన్నాం. మరో మంచి అనుభవంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.
జై శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఆధార్ కార్డుని ఎక్కడ పెట్టానో గుర్తుచేసిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమ:!!! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును ప్రతినిత్యం చదువుతాను. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. కొద్దికాలం క్రితం నేను చాలా కష్టపడి ఆధార్ కార్డులో అడ్రెస్ మార్పించుకున్నాను. ఆ తరువాత 2022, మార్చి మూడోవారంలో నేను ఆ ఆధార్ కార్డు కోసం ఇల్లంతా వెతికినప్పటికీ ఎక్కడా కనిపించలేదు. పాసుపోర్టుకి దరఖాస్తు చేసుకోవడానికి దాని అవసరం చాలా ఉండటంతో నేను బాగా ఆందోళన చెంది, "బాబా! నా ఆధార్ కార్డు లభిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ రాత్రి నిద్రలో బాబా నేను ఆ ఆధార్ కార్డు ఎక్కడ పెట్టానో నాకు గుర్తుచేశారు. "థాంక్యూ బాబా. మీ కృపని, ఆశీర్వాదాన్ని ఇలాగే మా అందరిపై చూపించండి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
3 years aipoindi sairam
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam
ReplyDelete