సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1143వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తండ్రిలా అన్నీ తీర్చే బాబా
2. ఎంతో ధైర్యాన్నిస్తున్న బాబా వచనాలు
3. ఆరోగ్యం కాపాడిన బాబా

తండ్రిలా అన్నీ తీర్చే బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ బ్లాగును నడుపుతున్న సాయికి నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈ బ్లాగులో రెండోసారి నా అనుభవాలను పంచుకుంటూన్నాను. నాకు బాబా లీలల గురించి, ఆయన మహాత్మ్యం గురించి పూర్తిగా తెలియని రోజుల్లో ఒక గురుపౌర్ణమినాడు మా పెద్దక్క మా ఇంటికి వచ్చి, "బాబా గుడికి వెళదాం, వస్తావా?" అని అడిగింది. తను బాబాకి చాలా భక్తురాలు. నేను ఆ సమయంలో చాలా టెన్షన్‌లో ఉన్నాను. విషయమేమిటంటే, మా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, కానీ మా దగ్గర అంత డబ్బు లేదు. అయినా ఆ విషయం తర్వాత చూద్దామని అక్కతో కలిసి బాబా గుడికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాం. ఇంటి దగ్గర ఆటో దిగగానే ఒక తెలిసిన అంకుల్, "మీవారు డబ్బులు కావాలని అడిగారు. ఇంటికొచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పమ్మా" అని చెప్పారు. ఆయన ఇచ్చిన డబ్బులతో పిల్లల అడ్మిషన్ అయింది. బాబానే సమయానికి అతని రూపంలో మమ్మల్ని ఆదుకున్నారు. బాబా దయవల్ల మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుని, ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్నారు. ఇలా అడుగడుగునా బాబా ఒక తండ్రిలా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. ఆయనను నమ్మినవారికి ఎన్నడూ ఏ ఆపదా రాదు.


నేను చాలాకాలం వరకు శిరిడీ వెళ్లలేదు. కానీ, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మధ్యాహ్న ఆరతికి వెళ్ళాలని నాకు ఆశగా ఉండేది. ఇలా ఉండగా మేము శిరిడీ వెళ్లే సమయం వచ్చింది. శిరిడీకి వెళ్ళాక రూమ్ తీసుకుని, ఫ్రెష్ అయి, బాబా దర్శనానికి వెళ్ళాము. అయితే రెండు గంటలు దాటినా మేము బాబా దర్శనానికి లైన్లోనే వేచి చూస్తున్నాము. అంతలో మధ్యాహ్న ఆరతి సమయం అయ్యింది. మరో ఐదు నిమిషాల్లో ఆరతి మొదలవుతుందనగా నాకు ఏడుపు ఆగలేదు. కళ్ళనుండి నీళ్ళు కారిపోతుంటే, "బాబా, ఎందుకిలా?" అని అనుకున్నాను. అప్పుడే ఎవరో ఒకతను, "హాల్ ఖాళీగా ఉంది, పరుగెత్తండి" అని అన్నారు. అయితే, కాలు ఫ్రాక్చర్ అయి నేను అప్పటికి సరిగా నడవలేని స్థితిలో ఉన్నాను. అలాంటి నేను అప్పుడు పరుగెత్తడమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా నేను వెనుకాడలేదు. బాబా దయతో ఎలా పరిగెత్తానో నాకే తెలియదుగానీ మొత్తానికి సమాధిమందిరం హాల్లోకి చేరుకున్నాను. అక్కడ కూర్చోవడానికి నాకు కష్టంగా ఉంటే ఒకావిడ నా చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. ఆవిడ మేము ఉండే ఏరియాలోనే ఉంటానని చెప్పింది. తరువాత ఆరతి పాడిన నా సంతోషానికి అవధులు లేవు. బాబా దయవల్ల నా కోరిక తీరిందని ఆనందంగా బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఆకలిగా ఉందని హోటల్లోకి వెళ్ళాము కానీ, బయట తినటం నచ్చనందువల్ల నేను తినలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగే శనిశింగణాపూర్‌కి బయలుదేరాం. ఆటో ఎక్కగానే రోడ్డుమీద మా బావగారి అబ్బాయి కనిపించాడు. వాడితో కాసేపు మాట్లాడాక భోజనం గురించి చెప్పాను. అప్పుడు ఆ అబ్బాయి సాయి అన్నప్రసాదాలయం గురించి చెప్పాడు. అక్కడికి వెళ్లి కడుపునిండా తిన్నాను. నాలా చాలామంది ఉంటారనిపించి 3,000 రూపాయలు అన్నదానానికి కట్టాను. బాబా చల్లని చూపు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ.... "ధన్యవాదాలు బాబా".


ఎంతో ధైర్యాన్నిస్తున్న బాబా వచనాలు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! "బాబా! మీకు కోటి కోటి కృతజ్ఞతలు". సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు కృష్ణవేణి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నేను ఈమధ్యకాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో బాబా మీద భారంవేసి, "నువ్వే దిక్కు బాబా" అని ఏడ్చాను. తరువాత ఒకరోజు, "నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటాను" అనే సాయి వచనం వచ్చింది. ఆ తరువాత నేను మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్తుంటే, బాబా విగ్రహం ఉన్న ఆటో ఎదురైంది. నేను లగేజీతో కిందకి దిగలేక, "నన్ను క్షమించండి బాబా. మీకు దక్షిణ ఇవ్వలేకపోతున్నాను" అని అనుకున్నాను. నేను అమ్మావాళ్ళ ఇంటికి చేరుకున్న కాసేపటికి ఎవరో ఒక ముసలాయన వచ్చి, "నేను శిరిడీ వెళుతున్నాను. నాకు డబ్బులు ఇవ్వండి" అని అడిగారు. మా అన్నయ్య డబ్బులు ఇవ్వనంటే, ఆయన, "మీ ఇష్టం, ఒక రూపాయి అయినా ఇవ్వొచ్చు" అని అన్నారు. నా కొడుకు అతనికి 50 రూపాయలు ఇచ్చాడు. అతను ఇంకెవరి ఇంటికి వెళ్లకుండా తిన్నగా వెళ్ళిపోయాడు. నాకు అదంతా బాబా మహిమలా అనిపించింది. "బాబా! నా దగ్గరకొచ్చి నేను ఇవ్వదలచిన దక్షిణ తీసుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".


నా భర్త కళ్ళకు సమస్య వచ్చి రెండేళ్లుగా చికిత్సకోసం హాస్పిటల్‌కి వెళ్తున్నారు. 2022, మార్చి రెండవ వారంలో ఆ కంటికి సర్జరీ అయింది. అక్కడ కూడా బాబా ఉన్నారని నిరూపించారు. నిజానికి నేను మొదటిసారి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ బాబా మందిరం ఉన్నట్లు చూడలేదు. పైన చెప్పిన "నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటాను" అన్న సాయి వచనం చూసినప్పుడు నేను, "బాబా! నువ్వు అంత పెద్ద హాస్పిటల్లో ఉంటావా?" అని బాధతో అనుకున్నాను. తరువాత ఆపరేషన్ జరిగేరోజు హాస్పిటల్‌కి వెళ్లి కారు దిగగానే నాకు బాబా మందిరం కనిపించింది. అది కూడా వినాయకుడి మందిరం వెనకే ఉండటం చూసి నేను షాకయ్యి, " 'నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఉంటాను' అన్న నీ మాటను నిలబెట్టుకున్నావు బాబా. అన్ని హాస్పిటల్స్‌లో వినాయకుని విగ్రహమే ఉంటుంది కదా, అందుకే అలా అనుకున్నాను. నన్ను క్షమించు బాబా" అని అనుకున్నాను. ఆ రోజంతా నేను బాబానే చూస్తూ ఆయన నామమే తలచుకున్నాను. ఆయన ఆశీస్సులతో ఆపరేషన్ విజయవంతమైంది. ఇంకోవిషయం, నా భర్త ఆపరేషన్ గురువారంనాడే అయింది. ఇలా బాబా నాతోనే ఉన్నారని అడుగడుగునా గుర్తు చేస్తున్నారు. ఇంకా బాబా దయవల్ల మా మామయ్యగారి కంటి ఆపరేషన్ కూడా విజయవంతం అయింది. "థాంక్యూ సో మచ్ బాబా. మళ్ళీ పదిరోజుల్లో నా భర్త రెండో కంటికి ఆపరేషన్ ఉంది. అప్పుడు కూడా మీరే దగ్గరుండి చూసుకోవాలి బాబా. నా ఈ కష్ట సమయంలో మీరే కాపాడాలి బాబా. నాకు మీరు తప్ప దిక్కు ఎవరూ లేరు తండ్రి. నాకు అన్నీ మీరే అయి కాపాడాలి బాబా. దయచేసి ఆశీర్వదించండి బాబా. నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి బాబా". చివరిగా 'సాయి మహారాజ్ సన్నిధి' సభ్యులకు శతకోటి ధన్యవాదాలు. నా ఈ కష్ట సమయంలో బాబా వచనాలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి.


ఆరోగ్యం కాపాడిన బాబా


నా పేరు మురళీమోహన్. ఈమధ్య నా ఎడమ పాదం గుత్తి దగ్గర వాచినట్లు ఉండేది. నేను చాలా భయపడ్డాను. కారణం, ఆ ప్రదేశంలో వాపు వస్తే, కిడ్నీ సమస్యకి సంకేతమని నా ఫ్రెండ్ చెప్పాడు. వెంటనే నేను, "బాబా! మీ ఊదీతో ఈ సమస్య పరిష్కారం అయితే, నా అనుభవం మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా రెండు రోజులు బాబాని వేడుకుంటూ కొంచెం ఊదీ వాపు ఉన్న చోట రాసి, మరి కొంచెం ఊదీ నీళ్లలో కలిపి త్రాగుతుండేవాడిని. బాబా దయవల్ల మూడవ రోజుకి (2022, మార్చి 20) వాపు తగ్గింది. అలాగే మా మావయ్యగారి ఆరోగ్య విషయంలో బాబా కాపాడారు. తొలిదశలో ఉన్న అల్జీమర్ ని నయం చేసి మునుపటిలా ఆయన యాక్టీవ్ గా ఉండేలా అనుగ్రహించారు. ఇలా నా జీవితంలో ఏ టు జెడ్ ప్రతి విషయంలో బాబా కాపాడుతున్నారు. "కోటి కోటి ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక చేసిన తప్పులను క్షమించండి. ఎన్నాళ్ళ నుంచో నేను మీకు శరణాగతి చేసి మా ఇద్దరిలో(నేను, నా భార్య) ఎవరో ఒకరికి ఒక స్థిరమైన, సురక్షితమైన ఉద్యోగం ప్రసాదించమని పదేపదే వేడుకుంటూ మీరు అనుగ్రహించే సురక్షితమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. మీరు అనుగ్రహిస్తే ఆ అనుభవం కూడా మీ బ్లాగులో త్వరగా పంచుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి"


సర్వేజనా సుఖినోభవంతు!!!

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!



13 comments:

  1. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  2. Om sai ram 🌹🙏🌹

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam and I will be able to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om sai ram 🙏

    ReplyDelete
  5. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏THANK YOU SO MUCH BABA

    ReplyDelete
  6. మా అనారోగ్యం ను రూపు మాపి, నిర్ములించి నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సాయి దేవా..
    ఆది వ్యాధులను సైతం విభూదితో నిర్మూలించిన గొప్ప దేవుడివి నీవే .. సాయి దేవా మమ్మల్ని కరుణించి కటాక్షించి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సాష్టాంగ ప్రణామం చేసుకుంటున్నాను సాయీశ్వర..

    ReplyDelete
  7. మా కష్టాలను కడతేర్చి, మీ దివ్య ఆశీస్సులు మాపై ప్రసరింపజేసి.. మా అనారోగ్యాన్ని రూపుమాపి నిర్మూలించే సాయిదేవా మీకు శతకోటి వందనాలు సాష్టాంగ ప్రణామాలు దేవా

    ReplyDelete
  8. ఎల్లప్పుడును సాయి సాయి అనే నామం మాకు మీ దివ్యమైన గొప్ప ఆశీస్సులను అందిస్తుంది. గత 24 సంవత్సరాలుగా మీ ఆశీర్వాదాలు మాపై ఉంచినందుకు ధన్యవాదాలు సాయీశ్వరా..

    ReplyDelete
  9. శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై.. మీ భక్తులమైన మమ్మల్ని అనునిత్యం కాపాడు తండ్రి. మా అనారోగ్యాలను రూపుమాపి నిర్మూలించి ఆశీర్వదించు శిరిడి శ్వర.. నీవే కలవు నీవే దిక్కు నీవే రక్ష సాయి నీవే తప్ప మాకు ఎవరూ లేరు ఈ లోకంలో.. 🙏🕉️✡️🙏

    ReplyDelete
  10. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo