1. ఎప్పటికప్పుడు వెన్నంటి మమ్మల్ని రక్షించే మా తండ్రి సాయి
2. బాబాకి చెప్పుకున్న పది నిమిషాల్లోనే సమస్య పరిష్కారం
3. బాబా దయతో కోవిడ్ నెగిటివ్ రిపోర్టు
ఎప్పటికప్పుడు వెన్నంటి మమ్మల్ని రక్షించే మా తండ్రి సాయి.
నేనొక సాయి భక్తురాలిని. నా పేరు మంజుల. మాది గుంటూరు. సాయి బంధువులకు నా ప్రణామాలు. సాయి తండ్రికి అనంతకోటి ప్రణామాలు. గత 15 సంవత్సరాల నుంచి నేను సాయి తండ్రిని నమ్ముకున్నాను. నా జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఆ తండ్రి దయవల్ల గట్టెక్కగలిగాను. మేము ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవాళ్ళం(అలాగని ఇప్పుడు లేవని కాదు). కానీ ఫ్రీ సీట్ రావడంతో నా బిడ్డను ఎమ్.బి.బి.ఎస్ చదివించగలిగాను. ఆ ఫ్రీ సీట్ బాబా దయవల్లే వచ్చిందని నా నమ్మకం. నేను నా ఉద్యోగంలో ఎదురయ్యే ఎన్నో ఆటంకాలను ఎదుర్కోగలిగే చేయూతను నా తండ్రి ద్వారా పొందాను. బాబా దయవల్ల మావారు వృత్తిపరంగా ఎదుగుతూ ఉన్నారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...
గత సంవత్సరం మా ఇంటిల్లిపాదికి కోవిడ్ వచ్చి నా పరిస్థితి చాలా క్రిటికల్ అయ్యింది. దాని నుంచి కోలుకున్నా కూడా నా బిడ్డ పెళ్లి నిమిత్తం ఉంచిన డబ్బులు నా ట్రీట్మెంట్‌కి ఖర్చు అయ్యాయనే బాధ నన్ను మనిషిగా కోలుకోనివ్వలేదు. నెలరోజులపాటు నాలో నేనే మానసికంగా క్రుంగిపోతూ రోజూ తినటం, టాబ్లెట్లు వేసుకోవడం(నా బిడ్డ నన్ను మానసికంగా శాంతపరచటానికి టాబ్లెట్లు ఇస్తూ ఉండేది), నిద్రపోవటం ఇదే నా దినచర్యగా ఉండేది. ఒకరోజు నేను, "ఏమిటి నేను ఇంతలా నిద్రపోతున్నాను, ఎందుకు?" అని అడిగితే, "నువ్వు మానసికంగా చాలా అప్సెట్ అయ్యావు. అందుకే నిద్రపోవటానికి టాబ్లెట్లు ఇస్తున్నామ"ని చెప్పారు. నిజమే, నాకు చనిపోవాలని, ఎక్కడికైనా వెళ్ళి ఎందులోనైనా దూకేయాలని అనిపిస్తుండేది. అవన్నీ మావారితో, నా బిడ్డలతో చెప్పుకోలేను. కానీ వాళ్ళు నా పరిస్థితి గ్రహించి టాబ్లెట్లు ఇచ్చి నన్ను నిద్రపుచ్చేవాళ్ళు. నేను మాత్రం 'డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. పిల్ల పెళ్ళి ఎలా చేయటం?' అనే చింతలో ఉండేదాన్ని. అటువంటి స్థితిలో ఎప్పుడూ నాతో పెద్దగా మాట్లాడని మా ఆడపడుచు నా బాగోగులు కనుక్కుంటూ ఉండేది. ఒకసారి తను ఫోన్ చేస్తే, నాకున్న భయం తనతో పంచుకున్నాను. తను ఆరోజు నాకిచ్చిన ధైర్యంతో మరుసటిరోజు ఉదయం మా పాపతో, "నేను ఇక భయపడను, నాకు టాబ్లెట్లు ఇవ్వొద్దు" అని చెప్పాను. అందుకు తను, "అలాగే కానీ, కొంచం కొంచంగా డోస్ తగ్గించాలి" అని చెప్పి డోస్ తగ్గిస్తూ వచ్చింది. ఆ రోజు నా ఆడపడుచు నోట సాయిబాబానే ధైర్యం చెప్పారని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే, నేను ఎప్పుడూ మా ఆడపడుచుతో అంతసేపు మాట్లాడలేదు.
ఒకసారి సాయిబాబా దయవల్ల నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. నేను ఆ ఉద్యోగం చెయ్యగలనా, లేదా? అనే సందేహంతో బాబా దగ్గర చీటీలు వేస్తే, "ఒక ప్రయత్నం చేయి" అని వచ్చింది. ఆ బాబా సమాధానానికి కట్టుబడి నేను ఆ ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను. ఒకసారి నా ఉద్యోగంలో భాగంగా ఒక పోర్టుకు వెళ్ళవలసిన షిప్‌మెంట్ ఒకటి వేరొక పోర్టుకు వెళ్ళింది. నెలరోజుల తర్వాత కస్టమర్ ఫోన్ చేసి షిప్‌మెంట్ రావల్సిన పోర్టుకు రాకుండా అక్కడే ఉందని చెప్పారు. అప్పుడు నేను బాబాను ప్రార్ధించి, "ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ షిప్‌మెంట్న్ చేరాల్సిన పోర్టుకు చేర్చు తండ్రి" అని వేడుకున్నాను. 20 రోజుల తర్వాత ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా ఆ షిప్‌మెంట్ చేరాల్సిన పోర్టుకు వెళ్ళింది. ఇలా నా జీవితంలో ప్రతి మంచికి ఆ తండ్రి తోడ్పాటు ఉంటుందనేది వాస్తవం. ఎంతటి తుఫాన్ అయినా సాయి తండ్రి దయవల్ల శాంతిస్తుంది. కష్టాలు నా ప్రారబ్ధ కర్మ వల్ల వస్తున్నాయని, అవి ఆ తండ్రి దయనల్ల దూదిపింజల్లా తేలిపోతున్నాయిని నేను చాలా సందర్భాల్లో గ్రహించాను. సాయినాథుని నమ్ముకున్న నేను అవలీలగా నా బాధ్యతలను తీర్చుకుంటానని, నా కలలు నేరవేరతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నా బిడ్డకు పి.జి. సీటు వచ్చాక, తనకి పెళ్ళి అయ్యాక నా అనుభవాలను మీతో పంచుకుంటాను. "తండ్రీ! నీవు నన్ను బిడ్డలా చూసుకుంటావని, నీ బిడ్డలా నేను ఎల్లవేళలా మంచి చేస్తూ, మంచినే ఆలోచిస్తూ నీ చింతనతో గడపాలని ఆశీస్తూ... నీ భక్తురాలు".
అనంతకోటి బ్రహ్మాండనాయిక రాజధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబాకి చెప్పుకున్న పది నిమిషాల్లోనే సమస్య పరిష్కారం
శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులో మూడవసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల ఒకసారి మా ఆఫీసులో ఒక కస్టమర్ అకౌంటుకి సంబంధించి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కారమైతే పెద్ద మొత్తంలో లోన్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే రెండు రోజులపాటు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సమస్య వస్తూ సమస్య పరిష్కారం అవ్వలేదు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మీరే ఈ సమస్యను పరిష్కరించాలి. అలా అయితే నా అనుభవాన్ని ఈరోజే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, అలా అనుకున్న 10 నిమిషాల్లో సమస్య పరిష్కారమై అకౌంటు ఓపెన్ అయి లోన్ రిలీజ్ అయింది. వెంటనే నేను బాబాకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇంకా అదేరోజు నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని బ్లాగుకు పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలా అన్ని ఆపద సమయాల్లో మీరే నన్ను రక్షించాలి. నేను మీ మీదే ఆధారపడి ఉన్నాను. మా కుటుంబమంతా గత 6 నెలలుగా ఒక పెద్ద సమస్యతో పోరాడుతున్నాము. ఈ గండం నుండి మీరే మమ్మల్ని రక్షించాలని అర్ధిస్తున్నాను తండ్రి. నేను ఎంతో ఇష్టంగా రోజూ ఈ బ్లాగులో అనుభవాలు చదువుతున్నాను బాబా. మిమ్మల్ని విడవకుండా జీవితమంతా మీ సేవ చేసుకునే భాగ్యం, అదృష్టం మాకు కల్పించండి.
సర్వేజనా సుఖినోభవంతు!!!
శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా దయతో కోవిడ్ నెగిటివ్ రిపోర్టు
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! అందరికీ నమస్తే. నేను సాయి భక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. మన ప్రియమైన సాయి ప్రసాదించిన మరో అనుభవంతో మళ్లీ మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. సాధారణంగా నా పెద్దకొడుకు మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందిపెట్టడు. అలాంటిది తను ఈమధ్య స్కూలు నుంచి నాకు ఫోన్ చేసి తనకి చాలా తలనొప్పిగా ఉందని చెప్పాడు. తరువాత నేను బాబుని చూసేసరికి తను తలనొప్పితో బాధపడుతూ చాలా అలసటగా, బలహీనంగా ఉన్నాడు. ఆ లక్షణాలను బట్టి తనకి కోవిడ్ ఏమోనని నేను ఆందోళన చెందాను. నిజానికి తాను అదివరకే కోవిడ్ బారినపడి కోలుకున్నాడు. అయినా మళ్ళీ కోవిడ్ రాదన్న హామీ లేదు కదా! అందుచేత నేను, "బాబా! మీ దయవలన బాబుకి కోవిడ్ నెగిటివ్ రావాలి" అని సాయిని ప్రార్థిస్తూ బాబుని కోవిడ్ పరీక్షకు తీసుకెళ్లాను. బాబా ఆశీస్సులతో రిపోర్టు నెగిటివ్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీకు వాగ్దానం చేసినట్లుగా నేను నా అనుభవాన్ని తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. నేను మీ పాదాలనే ఆశ్రయించుకుని ఉన్నాను బాబా. ఇప్పటివరకు మీరు నా పక్కన నిలబడి ఏదీ తీవ్రమైన సమస్యలకు దారి తీయకుండా నాకు ఎక్కువగా బాధ కలగకుండా మీరు నా కర్మలను దహించి వేస్తున్నారని నాకు తెలుసు. కానీ గత కొన్ని నెలలుగా చేయినొప్పి వలన నరాలలో ఇరిటేషన్ పుట్టి నాకెంత ఇబ్బంది కలుగుతుందో మీకు తెలుసు బాబా. దయచేసి తొందరగా ఈ చేయినొప్పి తగ్గేలా ఆశీర్వదించండి". బాబా ప్రసాదించిన మరో అందమైన అనుభవంతో నేను మళ్ళీ మీ అందరినీ కలుస్తాను .
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼🙂🌺🥰🌸😘🌹💕👪
ReplyDelete🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteSaid always be with me
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba...please save me
ReplyDelete