ఈ భాగంలో అనుభవాలు:
1. భక్తుల కర్మలను తగ్గించే సాయినాథుడు
2. బాబా రక్ష
3. సాయి దయతో తగ్గిన తలనొప్పి
భక్తుల కర్మలను తగ్గించే సాయినాథుడు
ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా రెండువారాల పాటు నేను బాబాకి దూరంగా ఉన్నందుకు ఆయనకి క్షమాపణలు చెప్పుకుంటూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. పుట్టుకతోనే మా పాపకి గుండెలో సమస్య ఉంది. డాక్టర్లు, "ఒక సంవత్సరంలోపు సర్జరీ చేస్తే మరే సమస్య ఉండద"ని చెప్పి, ఈలోపు పాప బరువు పెరగడానికి మందులిచ్చి "ప్రతీ 15 రోజులకు ఒకసారి సాచురేషన్ చెక్ చేస్తూ, సాచురేషన్స్ తగ్గకుండా చూసుకోమ"ని అన్నారు. సాచురేషన్స్ మొదటి నెలలో 100%, రెండో నెలలో 98% ఉన్నాయి. తరువాత నేను మా పుట్టింటికి వచ్చి పదిహేను రోజుల తరువాత హాస్పిటల్లో చెక్ చేయిస్తే, సాచురేషన్ 91% ఉన్నాయి. ఒక్కసారిగా నేను, మా అమ్మ షాకయ్యాము. ప్రమాదమేమీ లేదు కానీ, నాకు చాలా బాధేసి దేవుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. 'నేనేం పాపం చేసానో? అసలు నిజంగా దేవుడు ఉన్నాడా?' వంటి ఆలోచనలతో రెండువారాలు బాబాను వదిలేసి లా అఫ్ అట్రాక్షన్, ఏంజెల్ నెంబర్స్ వంటివి అనుసరించాను. కానీ మనశ్శాంతి లేదు. రెండు వారాల తర్వాత ఒకరోజు మా పాప ఎందుకో బాగా ఏడ్చింది. అప్పుడు నాకు తెలియకుండానే నేను, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరించడం మొదలుపెట్టి పాపకి బాబా ఊదీ పెట్టాను. కాసేపటికి పాప ఏడుపు ఆపి పడుకుంది. గంట తరువాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, "నేను మీ కర్మలను చాలావరకు తగ్గించాను. నేనే లేకుంటే ఇంకా పెద్ద పెద్ద బాధలు, భారాలు మోయాల్సి వచ్చేది" అనే సాయి సందేశం కనిపించింది. ఎన్నో సంవత్సరాల నుండి బాబా మెసేజ్లు చూస్తున్న నేను మొదటిసారి అలాంటి మెసేజ్ చూసాను. అదికూడా నా స్థితికి తగ్గట్టు. "లవ్ యు బాబా. వెరీ వెరీ సారీ బాబా. అన్నిటికీ థాంక్యూ సో మచ్ బాబా".
అమ్మవాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ అయినందున వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‍లోని మా అత్తగారి ఇల్లు చుట్టూ మొక్కలతో నిండి ఉంటుంది. ఆ కారణంగానే హైదరాబాదులో ఉన్నప్పుడు సాచురేషన్స్ 100, 98% ఉండి అమ్మావాళ్ళ ఇంటికి వచ్చాక 91%కి పడిపోయాయని అనిపించి మావారు పాపను తీసుకుని నన్ను హైదరాబాదు వచ్చేయమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పదిహేను రోజులకి సాచురేషన్ చెకింగ్‍కి పాపని తీసుకుని హాస్పిటల్‍కి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! సాచురేషన్ మునుపటిలా నార్మల్ వస్తే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అద్భుతం! సాచురేషన్ 98% ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకరోజు పాప తల మీద నల్లమచ్చలు కనిపించాయి. అవేమిటో అని నాకు చాలా భయమేసి, "బాబా! వాటివల్ల పెద్ద ప్రమాదమేమి లేదని డాక్టర్ చెప్పాలి. అలాగే అవి త్వరగా తగ్గిపోతే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. డాక్టర్, "ఆ మచ్చలు చుండ్రుకి సంబంధించినవి. పిల్లల్లో కామన్‍గా వస్తాయి. నూనె రాయొద్దు" అని చెప్పారు. డాక్టరు చెప్పినట్లే కొన్నిరోజులు నూనె రాయలేదు. ఇప్పుడు మచ్చలు దాదాపు తగ్గిపోయాయి. "థాంక్యూ సో మచ్ బాబా. ఆలస్యంగా నా అనుభవాలు పంచుకున్నందుకు క్షమించండి బాబా. 2022, ఏప్రిల్ 9న నేను, నా భర్త మా పాపను తీసుకుని ఒక అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. అది నెరవేరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా."
చివరిగా ఒక మాట, "ఎప్పుడూ బాబాను మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోవాలని అనుకున్నా అది బాబా భక్తులకు సాధ్యపడదు. అంతలా మనం బాబాకు అలవాటు పడిపోతాం. చాలావరకు మన చెడు కర్మలను తగ్గించే ఉంటారు బాబా. మనం ఈ మాత్రమైనా బ్రతుకుతున్నామంటే అది ఆయన దయే. బాబాను నమ్మండి. ఎప్పుడూ మంచే ఆలోచిస్తూ మంచి పనులే చెయ్యండి. బాబా మీ వెంటే ఉంటారు".
ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
బాబా రక్ష
నేను ఒక సాయి భక్తురాలిని. బాబా లీలలు అనేకం. ఆయన అడుగడుగునా నాకు రక్షగా ఉంటూ ఎన్నోసార్లు ఆపదల నుండి కాపాడుతూ ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్లాగ్ యొక్క మహిమ అనంతం. నేను ఒక ఉద్యోగస్తురాలిని. ఇటీవల కాలంలో నా వృత్తి జీవితంలో నేను తీవ్ర ఒత్తిడిని ఎదురుకున్నాను. పని ఒత్తిడితోపాటు చాలా క్లిష్టమైన వ్యక్తులతో పని చేయించాల్సి రావడంతో విపరీతమైన ఆందోళనకు గురవుతూ సుమారు రెండునెలలుగా నేను నిద్రకు దూరమయ్యాను. నా పరిస్థితికి ఇంట్లో వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ, సెలవు పెట్టమని చెప్తుండేవారు. కానీ నేను సెలవు పెట్టే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో నేను ఎప్పుడూ వెళ్లే టూ టౌన్ బాబా గుడికి వెళ్లి, ఆయన పాదాలు పట్టుకుని, "బాబా! ఈ పరిస్థితి నుండి నన్ను బయటపడేయండి" అని కన్నీళ్ళు పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో అందరూ, "బాబా పలుకుతారు, కంగారుపడకుండా ధైర్యంగా ఉండు" అని అనేవారు. ఇటువంటి సమయంలో నేను ఈ బ్లాగును చూసి, "బాబా! నన్ను ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు తెస్తే, నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ సాయినాథుడు వెంటనే పలికారు, నన్ను రక్షించారు, నేను ఉన్నానని ధైర్యాన్ని ఇచ్చారు. కానీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో ఎలా పంచుకోవాలో నాకు తెలియలేదు. బాబా దయవలన తెలిసిన వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి బ్లాగుకి పంపాను. బాబా లేకపోతే నేను ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయేదాన్ని, "అడుగడుగునా నన్ను కాపాడవలసిందిగా మీ పాదాలు పట్టుకుని శరణు వేడుతున్నాను సాయి మహారాజా".
జై సాయినాథ్ మహారాజ్!!!
సాయి దయతో తగ్గిన తలనొప్పి
అందరికీ నమస్కారం. బాబా దయ ఈ బ్లాగు నడుపుతున్న అన్నయ్య మీద, భక్తులందరీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, మార్చి 28న ఉదయం నిద్రలేస్తూనే నాకు తలనొప్పి మొదలయ్యింది. ఏదైనా తింటే తగ్గుతుందిలే అనుకున్నాను. కానీ తగ్గలేదు, పైగా కడుపులో వికారం మొదలైంది. మళ్ళీ నిద్రపోతేనైనా తలనొప్పి తగ్గుతుందని నిద్రపోయాను. అయితే ఆ రోజంతా నిద్రపోతూనే ఉన్న కూడా తలనొప్పి తగ్గలేదు. ఇక అప్పుడు నీళ్లలో బాబా ఊదీ వేసుకుని త్రాగి, మరికొంత ఊదీ తలకు పూసుకుని, "బాబా! రేపు ఉదయానికల్లా తలనొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల తెల్లారేసరికి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి బాబా".
🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sai Ram 🙏
ReplyDeleteS- Sri ShiridiSaiBaba Saves His Devotees Alway's Since when I know the SaiBaba's he has saves in my life Somanytimes- T VenkatRatnam, Hyd
ReplyDeleteOm sai ram
ReplyDelete