1. టెన్షన్ పడిన ప్రతిసారీ శాంతపరచి సంతోషపరిచే బాబా
2. చెప్పినట్లే అనుగ్రహించిన బాబా
టెన్షన్ పడిన ప్రతిసారీ శాంతపరచి సంతోషపరిచే బాబా
శిరిడీవాస సాయిప్రభో!!!
జగతికిమూలం నీవేప్రభో!!!
నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరో భక్తులు తమ అనుభవాలను సంతోషంగా ఈ బ్లాగులో పంచుకుంటూ నలుగురికి బాబా కలియుగ దైవమని, మనకు ఏ కష్టమొచ్చినా, బాధ కలిగినా ఆయన ఉన్నారన్న ధైర్యాన్ని, ఉపశమనాన్ని ఇస్తున్నారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...
మనం సచ్చరిత్రలో బాబా భక్తుల మనస్సులో ఉన్న వాటిని బయటకు చెప్పి వాళ్ళను ఆశ్చర్యపరిచేవారని చదువుకున్నాము. నాకు కూడా బాబా అలాంటి అనుభవమొకటి అనుగ్రహించి నన్ను చాలా సంతోషపరిచారు. ఈమధ్య మా అక్క కొడుకు, కోడలు, వాళ్ళ కుటుంబం శిరిడీ వెళ్ళారు. మేము, వాళ్ళు ఒకే ఊరిలో ఉంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా మాకు చెప్పి వెళతారు. వాళ్ళు శిరిడీ వెళుతున్నామని చెప్పినప్పుడు నేను వాళ్లతో మా బాబుకోసమని ఒక పాలరాతి బాబా విగ్రహం తెమ్మని చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. తరువాత ఒకరోజు ఉదయం నేను నిద్రలేచి 'సాయి మహారాజ్ సన్నిధి'లో భక్తులు అనుభవాలు చదువుతూ, 'అరె! నేను ఒక విగ్రహమే తెమ్మన్నాను, ఇంకొకటి కూడా చెప్పాల్సింది' అని అనుకున్నాను. ఎందుకంటే, మాకు ఇద్దరు బాబులు. చిన్నబాబు రూమ్‌లో ఉంటాడు. కొద్దిసేపటిలో అక్క కొడుకు శిరిడీ నుండి ఫోన్ చేసి "మీకు ఎన్ని విగ్రహాలు కావాలి" అని అడిగాడు. నేను చాలా సంతోషించి, "రెండు" అని చెప్పి, "నీకు ఇదివరకు ఒక విగ్రహమని చెప్పాను. మళ్ళీ చెపితే బాగోదని ఊరుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. బాబా అంటే అదే" అని తనతో అన్నాను. సాయి సర్వాంతర్యామి అనుటలో సందేహం లేదు. ఆయన కలియుగ దైవం. మన మనసున ఉన్న ప్రతీది ఆయనకు తెలుసు.
నా భర్తకు చాలారోజుల నుండి భుజం నొప్పి ఉంది. మేము వయసును బట్టి నొప్పులు మామూలే అనుకున్నాము. అందుకు కారణం లేకపోలేదు. అదేమిటంటే, మా అత్తింటి కుటుంబంలో దాదాపు అందరికీ నొప్పులు, ఎముకలు అరిగిపోవడం వంటివి ఉన్నాయి. అయితే మావారికి భుజం నొప్పి కాస్త ఎక్కువగానే ఉండేది. పైగా ఎముక కొంచెం పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుండేసరికి ఈమధ్య ఎక్స్ రే తీయించాము. ఆ ఎక్స్ రే తీసిన అబ్బాయి, "దాదాపు ఎముక పూర్తిగా అరిగింది. కాళ్ళ నొప్పులు అంటే మామూలేగాని, భుజం కదా! ఏమీ కాదని చెప్పలేను. అసలే రోజులు కూడా బాగాలేవు. తొందరగా హైదరాబాద్ వెళ్ళి చూపించుకోండి" అని అనుమానం కలిగేలా చెప్పేసరికి నాకు చాలా భయమేసింది. తరువాత 2022, మార్చి 28న మావారు హైదరాబాద్ వెళ్ళారు. రిపోర్టులో ఏమి వస్తోందోనని నేను బాబాతో, "నా భర్త రిపోర్టులో ఎలాంటి చెడు లేకుండా చూడండి బాబా. మీ దయతో రిపోర్టు నార్మల్ వస్తే, ఈరోజే నా అనుభవాన్ని పంచుకుంటాను" అని చెప్పుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా' మరియు 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని నాకు తోచినప్పుడల్లా అనుకుంటూ ఉన్నాను. తరువాత బాబాకి చెప్పుకుని మా అబ్బాయికి కాల్ చేస్తే, "అమ్మా! 'టెన్షన్ పడలసిన అవసరం లేదు. ఎముక అరిగింది నిజమే కానీ వ్యాయామం చేస్తూ చేతికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని చెప్పి, ఈసారి వచ్చినప్పుడు ఎమ్.ఆర్.ఐ చేయించుకోండి' అని డాక్టరు చెప్పారు. మళ్ళీ ఎప్పుడో ఎందుకని వెంటనే ఎమ్.ఆర్.ఐ చేయించాము. అందులో కూడా ఎక్స్ రే లో ఉన్నట్లే వచ్చింది" అని చెప్పాడు. అది విని నా మనసు చాలా తేలికపడింది. అప్పుడు సాయంత్రం ఐదు గంటలైంది. ఇక ఎప్పుడెప్పుడు నా అనుభవాన్ని బ్లాగుకు పంపుదామా అని ఆరాటంతో సమయం చిక్కగానే నా అనుభవాన్ని వ్రాసాను. నాకు ఇలాంటి అనుభవాలు బాబా చాలా ప్రసాదించారు. నా బాబా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. నేను టెన్షన్ పడిన ప్రతిసారీ బాబా నన్ను శాంతపరచి సంతోషపరుస్తారు. మనకోసం బాబా ఉన్నారని తెలుపుటకు నేనెంతో ఆనందిస్తున్నాను.
నేను ఇంతకుముందు నా అనుభవంలో "మా బాబుకి ప్రమోషన్ వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. మేము బాబుకి ప్రమోషన్ ఏప్రిల్లో వస్తుందని అనుకున్నాము. అయితే మార్చి నెలలో ఒక బుధవారం రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా ఎంతో సంతోషంగా మా ఇంట్లో అటుఇటు తిరుగుతున్నారు. మరుసటిరోజు గురువారం మా చిన్నబాబు ఫోన్ చేసి తనకి ఏరియా సేల్స్ మేనేజరుగా ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. "ధన్యవాదాలు బాబా. మా కుటుంబం మీద మీ దయ ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి. దయామయా సాయిప్రభు! మా పెద్ద బాబు విషయంలో ఒక కోరిక ఉంది. దాన్ని అనుగ్రహించి మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి".
చెప్పినట్లే అనుగ్రహించిన బాబా
ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు బాబా చాలా అనుభవాలు ప్రసాదించారు. నేను ఈమధ్య నా భర్తకి H1b వీసాకి అప్లై చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ ఆయనకి H1b వీసా రావాలని సాయి నవగురువార వ్రతం ప్రారంభించాను. నాల్గవ వారం పూజలో బాబా క్రింది విధంగా నాకు దర్శనమిచ్చారు. నాకు చాలా ఆనందమేసింది.
తరువాత H1b వీసా రిజిస్ట్రేషన్స్ రేపు ముగుస్తాయనగా గురువారంనాడు హఠాత్తుగా అమెరికా నుండి నా భర్త కజిన్ ఒకరు H1b రిజిస్ట్రేషన్ చేయించు అని మెసేజ్ పెట్టారు. బాబా దయవలన మావారు సరేనని, H1bకి అప్లై చేసారు. కానీ తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోలేదు. 2022, మార్చి 31, గురువారంనాడు H1b వీసాకు సంబంధించి లాటరీ తీస్తారనగా రెండురోజుల ముందు నుంచి నేను, "బాబా! మావారికి H1b వస్తుందంటే నేను అనుకున్న రంగు వస్త్రాల్లో నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాను అడిగాను. నేను అనుకున్న రంగు వస్త్రాల్లోనే బాబా నాకు దర్శనం ఇచ్చారు. కానీ మార్చి 31, గురువారం నాడు నా పూజ పూర్తయినా, కంపెనీ నుండి మెయిల్ రాలేదు. కొంతసేపు తర్వాత ఒక గ్రూప్ ఓపెన్ చేస్తే, "దాని గురించి ఏమీ బాధపడకు బిడ్డ. అది నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కాని నన్ను నమ్ము. ఈ వారంలో అది పూర్తవుతుంది. విశ్వాసముంచు" అని, "సాయిబాబాని ధ్యానించడం ద్వారా రేపు ఉదయం నీవు ఫలితాన్ని పొందుతావు. శ్రీసాయిబాబాకు అన్నీ తెలుసు. భాదపడకు" అని నాకు అనుకూలంగా బాబా సందేశాలు వచ్చాయి.(క్రింద ఫోటోలు చూడండి)
మరుసటిరోజు ఉదయం 5:30కి నేను నిద్ర లేచే లోపే నా భర్త H1b లాటరీలో ఎంపిక అయ్యారన్న గుడ్ న్యూస్ వచ్చింది. అది బాబా మిరాకిల్ & టైమింగ్. "ధన్యవాదాలు బాబా! మీ దయతో నా భర్తకి H1b వీసా రావాలి. ఆయన H1b ఇంటర్వ్యూ పూర్తి చేసేలా, ఆయనకి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించు సాయితండ్రి. మీరే మా గురువు, దైవం, తండ్రి. మీరు లేకుండా నేను లేను సాయి".
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి!!!
శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!
Om sai ram ultra sound report with out problem and normal report with your blessings sai bless me.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOmsairam
ReplyDelete