సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1127వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే మన రక్షకుడు
2. కుటుంబాన్ని కాపాడిన బాబా
3.  కోరిన కోరికలు తీర్చే సాయినాథుడు

బాబానే మన రక్షకుడు


నా పేరు పద్మావతి. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులకు నా వందనాలు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నాకు చాలాకాలం నుండి వెరికోస్ వెయిన్స్ (ఉబ్బునరాలు) సమస్య ఉంది. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని డాక్టరు చెప్పారు. నేను 2021, అక్టోబరులో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆ సమయంలో నేను, "బాబా! చికిత్స సవ్యంగా జరిగి నేను ఇంటికి క్షేమంగా వస్తే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల లేజర్ ట్రీట్మెంట్ విజయవంతమై నా ఆరోగ్యం మామూలు స్థితికి వచ్చింది. "థాంక్యూ బాబా".


మా అమ్మాయి ఒక పప్పీ(కుక్క)ని పెంచుకుంటోంది. ఒకసారి దానికి వాంతులు అయి దాని ఆరోగ్యం బాగా చెడిపోయింది. అలాగే ఇంకోసారి దానికి రక్తవిరేచనాలు అయ్యాయి. ఆ రెండు సందర్భాలలోనూ నేను, "బాబా! మీ దయతో దాని ఆరోగ్యం బాగుంటే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల దాని ఆరోగ్యం బాగైంది. ఇప్పుడు మా పప్పీ బాగుంది. "ధన్యవాదాలు బాబా. దాన్ని ఎల్లప్పుడూ ఇలాగే కాపాడండి బాబా".


ఇటీవల నేను ఒక ఫంక్షన్‌కి వెళ్లొచ్చాక నాకు కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను, "హాస్పిటల్‌కి వెళ్ళకుండా నాకు తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. బాబా కోవిడ్ వల్ల నాకు స్వల్ప లక్షణాలే ఉండేలా చూశారు. మూడురోజుల తర్వాత నా భర్తకి కూడా కోవిడ్ వచ్చి జ్వరంతో బాధపడ్డారు. వెంటనే నేను, "ఎటువంటి ఇబ్బందీ లేకుండా నా భర్తని కాపాడమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నాకు, నా భర్తకి కోవిడ్ తగ్గి సాధారణ స్థితికి వచ్చాము. "థాంక్యూ బాబా. ఈ అనుభవాలు ఎప్పుడో పంచుకోవాల్సింది. కానీ ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. పదిహేనురోజుల క్రితం (2022, ఫిబ్రవరి నెల చివరిలో) నాకు వైరల్ ఫీవర్ వచ్చింది బాబా. ఆ కారణంగా ఫింగర్ జాయింట్స్ బాగా నొప్పి పెడుతున్నాయి తండ్రీ. ఈ జాయింట్ నొప్పులు త్వరగా తగ్గించండి. మూడు నెలల నుండి ఒకదాని తరువాత ఒకటిగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో నేను బాధపడుతున్నాను. ఈ ఆరోగ్య సమస్యల నుండి నన్ను రక్షించండి. అలాగే నన్ను, నా భర్తను, పిల్లలను సదా కాపాడాలి బాబా. నువ్వే మా రక్షకుడివి తండ్రీ".


కుటుంబాన్ని కాపాడిన బాబా


సాయిబంధువులకి నమస్కారం, బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న మా అమ్మాయికి హైదరాబాదులో మంచి ప్యాకేజీతో వేరే ఉద్యోగం వచ్చింది. మేమందరమూ చాలా సంతోషించాము. మా అమ్మాయి తన సామాన్లు తీసుకుని మా బావగారి మనవడితో బెంగళూరు నుండి బయలుదేరింది. అప్పుడు నేను, "బాబా! అమ్మాయిని క్షేమంగా హైదరాబాదు చేర్చండి. తను క్షేమంగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అమ్మాయి క్షేమంగా హైదరాబాద్ చేరుకుంది. "ధన్యవాదాలు బాబా".


ఒకరోజు మా అమ్మాయికి బాగా జ్వరం, దగ్గు వచ్చాయి. రెండు, మూడు రోజులైనా తగ్గలేదు. అప్పుడు కరోనా టెస్టు చేయించాము. నేను సాయికి దణ్ణం పెట్టుకుని, "కరోనా కాదని రిపోర్టు వస్తే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. కానీ‌, టెస్టు రిపోర్టులో మా అమ్మాయికి కరోనా అని వచ్చింది. నేను చాలా భయపడ్డాను. మా అమ్మాయిని చూసుకుంటూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నిద్రలో, "ఎందుకు అంత కంగారుపడతావు? నేను ఇంకా ఏదో అనుకున్నాను. మీ దగ్గర మెడికో ఉన్నంతవరకు మీకు ఏమీ కాదు" అన్న బాబా మాటలు వినిపించాయి. బాబా మాటలు నాకు పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ నాకు, మా ఇద్దరమ్మాయిలకి ఏమీ కాదని నా సాయితండ్రి అభయమిచ్చారని నాకనిపించింది. బాబా దయవల్ల మా అమ్మాయి రెండు, మూడురోజులు బాగా ఇబ్బందిపడిన తరువాత నెమ్మదిగా కోలుకోవడం మొదలై వారంరోజుల్లో కరోనా నుండి పూర్తిగా బయటపడింది. అదలా ఉంటే, నాకు కూడా చలిజ్వరం వచ్చింది. నేను మహాపారాయణ గ్రూపులో ఉన్నాను. గురువారంనాడు ఒళ్ళునొప్పులు, చలిజ్వరం, తలనొప్పి ఉన్నప్పటికీ అతికష్టం మీద పారాయణ పూర్తిచేసి, ఊదీ కొంచెం నోట్లో వేసుకుని, మరికొంత ఊదీని నుదుటన పెట్టుకుని పడుకున్నాను. రెండు దుప్పట్లు, స్వెటర్ వేసుకున్నప్పటికీ చలి ఆగలేదు. అప్పుడు బాబాని తలచుకుని మళ్ళీ ఊదీ పెట్టుకున్నాను. అరగంట తర్వాత చలి తగ్గింది. తర్వాత నాలుక అంతా ఎర్రగా అయిపోయి మూతి చుట్టూ పుండ్లు వచ్చాయి. మంచినీళ్లు త్రాగినా కూడా బాగా మండేది. వారం రోజులు నేను చాలా బాధని అనుభవించాక బుధవారం రాత్రి బాబా నా దగ్గరకు వచ్చినట్లు అనుభవమైంది. అంతే, బాబా దయవల్ల మరుసటిరోజు గురువారం ఉదయానికి నేను పూర్తిగా కోలుకుని ఏ ఆటంకం లేకుండా పారాయణ పూర్తిచేసుకున్నాను. మావారికి కూడా జ్వరమొచ్చింది. అయితే బాబా దయవల్ల ఆయనకి రెండురోజుల్లోనే తగ్గింది. ఈవిధంగా నా తండ్రి బాబా మా కుటుంబాన్ని కాపాడారు. "కృతజ్ఞతలు బాబా. ఈ ప్రపంచం నుంచి కరోనాను పూర్తిగా తొలగించి అందరినీ చల్లగా చూడండి తండ్రీ".


కోరిన కోరికలు తీర్చే సాయినాథుడు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. నేను సాయిభక్తురాలిని. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే అనుభవాలను చదివి, వాటిని మా బంధువులకు, స్నేహితురాళ్ళకు పంపుతుంటాను. వాటికోసం మా అక్క రోజూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. రోజూ ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలను చదవటం వలన తనకు బాబాపై భక్తి, విశ్వాసాలు ఇంకా ఇంకా పెరిగాయి. తను, 'యు.ఎస్.ఏలో ఎమ్.ఎస్. పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తన కొడుకుకి మంచి ఉద్యోగం వస్తే, తన అనుభవాన్ని బ్లాగులో పంచుకుని బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటాను' అని అనుకుంది. నేను కూడా, "బాబా! అక్క కొడుకు ఎంతో కష్టపడి చదివాడు. తనకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అతి త్వరలో తనకు మంచి ఉద్యోగం వచ్చింది. అక్క, నేను ఎంతో సంతోషంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకోవాలని ఈ అనుభవాన్నిలా బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాము. కోరిన కోరికలు తీర్చే సాయినాథునికి నా హృదయపూర్వక ప్రణామాలు.



6 comments:

  1. Om Sai Rsm Jai Sai Master

    ReplyDelete
  2. Om Sai Ram Jai Sai Master

    ReplyDelete

  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo