1. కరోనా నుండి కాపాడిన బాబా
2. తలచినంత మాత్రాన్నే సమస్యలను పరిష్కరించే దయామయుడు సాయినాథుడు
3. బాబాను నమ్ముకున్నవారికి ఎలాంటి బాధా ఉండదు
కరోనా నుండి కాపాడిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారిపై బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేనొక సాయిభక్తురాలిని. బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2022, జనవరి 20వ తేదీన మా అమ్మకి కొద్దిగా జలుబు చేసింది. మరుసటిరోజుకి జలుబు ఎక్కువ అవడంతోపాటు దగ్గు కూడా మొదలైంది. నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే, బయట ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీకాక, అమ్మకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి, వయసు కూడా ఎక్కువే. అమ్మని టెస్టు చేయించుకోమంటే, "మామూలు జలుబు అయుంటుంది" అని అంది. అయితే మరుసటిరోజుకి జ్వరం కూడా మొదలైంది. దాంతో ఇంకా ఆలస్యం చేయొద్దని టెస్టు చేయించాము. రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. ఇంకా సి.టి స్కాన్ వాల్యూ 17 అని వచ్చింది. నేను, "బాబా! అమ్మని మీరే కాపాడాలి తండ్రీ" అని బాబాను వేడుకుని, ఆయన మీదే భారం వేశాను. మాకు తెలిసిన డాక్టరుకి అమ్మ రిపోర్టులు పంపించాము. డాక్టరుగారు మందులు రాసి పంపించి, "ఈ మందులు వాడండి. టెన్షన్ పడకండి" అని చెప్పారు. మామూలుగా అమ్మ తనకున్న ఆరోగ్య సమస్యలకు హోమియో మందులు వాడుతుంది. తనకి అల్లోపతి మందులు పడవు. అయినా బాబా మీద భారం వేసి మందులు వాడడం మొదలుపెట్టాము. అమ్మకి రెండురోజుల్లో జ్వరం తగ్గింది, కానీ జలుబు, దగ్గు ఎక్కువగానే ఉండేవి. డాక్టరుగారు 5 రోజుల మందుల కోర్సు వాడమని చెప్పారు. ఆ కోర్సు పూర్తయ్యేలోపు జలుబు చాలావరకు తగ్గింది. కానీ దగ్గు మాత్రం అలాగే ఉంది. మళ్ళీ డాక్టరుగారికి కాల్ చేసి చెప్తే, సిరప్ కంటిన్యూ చేయమని చెప్పారు. అంతటితో బాబా చూపిన ప్రేమవల్ల అమ్మ కరోనా నుంచి త్వరగానే కోలుకుంది. కానీ తనకు నీరసంగా ఉండేది.
ఇకపోతే, అమ్మ అనారోగ్యం పాలైన నాలుగు రోజుల తర్వాత నా భర్తకి కూడా కొన్ని కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్టు చేయిస్తే, రిపోర్టు నెగిటివ్ వచ్చింది. అయినా మావారు మందులు వాడారు. బాబా దయవల్ల నా భర్త కూడా ఏ ఇబ్బందీ లేకుండా త్వరగా కోలుకున్నారు. అయితే అమ్మకి, నా భర్తకి కరోనా లక్షణాలన్నీ తగ్గాక నాక్కూడా లక్షణాలు మొదలయ్యాయి. టెస్టు చేయిస్తే, పాజిటివ్ వచ్చింది. ఆ స్థితిలో నేను ఇంక అమ్మవాళ్ళకి వంట చేసి పెట్టలేక 'అన్నీ బాబానే చూసుకుంటార'ని ఆయన మీదే భారం వేశాను. ఆయన దయవల్ల నాక్కూడా ఒక ఐదు రోజుల్లో తగ్గిపోయింది. అమ్మకి కరోనా ఉన్న సమయంలో మేము ఎక్కువగా మా నాన్నగారి గురించి టెన్షన్ పడ్డాము. ఎందుకంటే, నాన్నకి ఆస్తమా ఉంది. కానీ, బాబా కృపవలన నాన్నకి, అన్నయ్యకి, మా పిల్లలకి ఏ ఇబ్బందీ కలగలేదు. ఏదేమైనా బాబా చూపిన కరుణవల్ల అందరమూ ఏ ఇబ్బందీ లేకుండా కరోనా నుంచి బయటపడ్డాము. కానీ ఈమధ్య అమ్మ ఆరోగ్యం మళ్ళీ బాగుండడం లేదు "బాబా! మీరే అమ్మకి ఏ ఆరోగ్య సమస్యగానీ, ఇంకా ఏ ఇతర సమస్యలుగానీ లేకుండా కాపాడాలి తండ్రీ. అలాగే నాన్న ఆరోగ్యాన్ని కాపాడు తండ్రీ. అమ్మకి, నా భర్తకి కరోనా తగ్గాక మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు చెప్పుకుని ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. దయచేసి కరోనాని పూర్తిగా అంతమొందించండి బాబా. ప్రతిఒక్కరూ మీ పాదాలను గట్టిగా పట్టుకుని ఎప్పటికీ మీ నామస్మరణ చేస్తూ ఉండేలా అనుగ్రహించండి బాబా. మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఉండాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను తండ్రీ". చివరిగా, బాబా మాకు ప్రసాదించిన అనుభవాలన్నీ చదివిన మీ అందరికీ ధన్యవాదాలు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి.
సర్వేజనాః సుఖినోభవంతు.
సాయి రక్షక శరణం దేవా.
తలచినంత మాత్రాన్నే సమస్యలను పరిష్కరించే దయామయుడు సాయినాథుడు.
సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈరోజు మీతో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఆమధ్య ఒకసారి మా అమ్మ తన ఎడమచేయి భుజం నుండి వేళ్ళ వరకు విపరీతంగా లాగుతోందనీ, తిమ్మిర్లు ఎక్కుతున్నాయని రోజూ చెప్తూ ఉండేది. నేను అమ్మతో, 'బాబాకు కిచిడీ నైవేద్యం పెడతానని మరియు నవగురువారవ్రతం చేస్తాన'ని మ్రొక్కుకోమని చెప్పాను. అమ్మ అలాగే మ్రొక్కుకుంది. మరుసటిరోజు ఉదయం అమ్మ తన చెయ్యి బాధ చాలావరకు తగ్గిందని చెప్పింది. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది.
మా పెద్దమ్మాయికి PCOD సమస్య ఉంది. వాడుతున్న మందుల వలన పెద్దగా ఫలితం కనిపించలేదు. మందులు మార్చాలంటే స్కానింగ్ చేయాల్సి ఉంది. అయితే రెండునెలలపాటు ఎంత ప్రయత్నించినా స్కానింగ్‍కు వెళ్ళడానికి వీలుపడలేదు. తరువాత ఒక ఆదివారం నిద్రలేవగానే నేను బాబాని తలచుకుని, "బాబా! ఈరోజు ఎలాగైనా స్కానింగ్ చేయించేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయవలన అనుకోకుండా ఆరోజు స్కానింగ్ సెంటర్‌కి వెళ్లడం, స్కానింగ్ చేయడం, రిపోర్టు కూడా అదేరోజే రావడం జరిగిపోయాయి.
గత రెండు సంవత్సరాల నుండి మా ఇంటి దగ్గర ఉన్న ఒక దేవతకు పూజ చేయకపోవడం వల్ల నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఎంత చెప్పినా మావాళ్ళు పూజ చేసేవాళ్ళు కాదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! మా డబ్బులతో అయినా పూజ చేయించండి. అలాగే ఏ సమస్యా రాకుండా చూసుకోండి" అని చెప్పుకున్నాను. బాబా నేను కోరుకున్నట్లే చేయించారు. ఇంకా ఏ సమస్యా రాకుండా చూసుకున్నారు. అదే సమయంలో నేను సరిగ్గా 20 నిమిషాలు కూడా నిలబడలేకపోయేదాన్ని, కాళ్ళు విపరీతంగా లాగేవి, చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బాబా ఊదీ తీసుకుని, "తండ్రీ! ఈ ఊదీ నా కాళ్ళకు రాస్తాను. నా కాళ్ళనొప్పి తగ్గించండి బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన మూడునాలుగు రోజులు ఊదీ రాయడంతో నా కాళ్లనొప్పి తగ్గి నేను నిలబడగలుగుతున్నాను. తలచినంత మాత్రాన్నే సమస్యలను పరిష్కరించే దయామయుడు సాయినాథుడు. ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే.
బాబాను నమ్ముకున్నవారికి ఎలాంటి బాధా ఉండదు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రావణి. నేనొక సాయిభక్తురాలిని. గత 22 సంవత్సరాలుగా మా ఇంట్లో అందరమూ సాయిభక్తులం. మా ఇంట్లో ఎవరికి ఏ బాధ కలిగినా మేము మన బాబానే ప్రార్థిస్తాము. ఒకసారి నెలసరి సమయంలో నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. నేను అస్సలు తట్టుకోలేకపోయాను. అప్పుడు నేను, 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ, "బాబా! నా ఈ కడుపునొప్పి తగ్గితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అలా మ్రొక్కుకున్న 30 నిమిషాల్లో కడుపునొప్పి తగ్గిపోయింది. బాబా దయవల్ల ఏ బాధా లేకుండా హాయిగా నిద్రపోయాను.
ఒకరోజు నాకు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల గుండె దగ్గర మరియు వెన్నులో చాలా నొప్పిగా అనిపించింది. ఆ కారణంగా నేను పడుకోలేను, నడవలేను, పైగా శ్వాస కూడా సరిగా అందట్లేదు. దాంతో నాకు ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. కానీ అంతలోనే, 'మన బాబా ఉండగా నాకేం అవదు' అని ధైర్యం తెచ్చుకుని 'ఓం శ్రీసాయినాథాయ నమః' అని స్మరిస్తూ, "బాబా! మీ దయతో నా ఈ సమస్య పరిష్కారమైతే, ఈ అద్భుతాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. అలా అనుకున్నంతనే మన బాబా నా సమస్యను పరిష్కరించారు. బాబాను నమ్ముకున్నవారికి ఎలాంటి బాధా ఉండదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
'ఓం శ్రీ సాయినాథాయ నమః'.
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteThank you baba.. Om sai ram ��
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete