సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1106వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి అవసరాన్నీ తీర్చే బాబా
2. బాబా కరుణ వల్ల చిన్నగా పోయిన పెద్ద కష్టం
3. ఎలాంటి కష్టమొచ్చినా బాబాతో చెప్పుకుంటే, ఆ బాధ నుండి విముక్తి కలిగిస్తారు

ప్రతి అవసరాన్నీ తీర్చే బాబా


అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. మేము నల్గొండలో నివాసముంటున్నాము. నేను ఇప్పుడు ఈమధ్య బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మేము మా పెళ్లిరోజునాడు శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటాం. అయితే మేము నా ఆఫీసుకి దగ్గరగా ఉంటుందని ఒక సింగిల్ బెడ్‌రూం ఇంట్లో సర్దుకుపోతూ ఉండేవాళ్ళము. ఆ ఇంట్లో వ్రతమంటే కష్టం అవుతుందనిపించింది. అలా అనుకున్న నాలుగు రోజుల తర్వాత రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయమని ఇంటి ఓనర్ చెప్పారు. దాంతో వేరే ఇంటికోసం వెతకడం ప్రారంభించి మా పెళ్ళిరోజులోపు మంచి ఇల్లు దొరికితే, కొత్త ఇంట్లో వ్రతం చేసుకుందామని అనుకున్నాము. నేను, "బాబా! ఆఫీసుకు దగ్గరగా ఉండేలా మాకొక మంచి ఇల్లు చూపించండి" అని బాబాను వేడుకున్నాను. తమ్ముడు ప్రసాద్ ద్వారా బాబా మాకు ఒక మంచి ఇల్లు చూపించారు. బాబా ముందు చీటీలు వేస్తే ఆ ఇంటిలోకి మారమని వచ్చింది. దాంతో 2022, ఫిబ్రవరి 5న మేము ఆ ఇంట్లోకి మారాము. అయితే అది మూడంతస్తుల భవనంలో ఉన్న పెంట్‌హౌస్. నిర్మాణంలో ఉన్నందున ఇంకా లిఫ్ట్ అందుబాటులో లేదు. అందువల్ల ఆ ఇంటిలోకి సామాన్లు ఎలా తరలిస్తామని నేను ఆందోళన చెందాను. బాబా దయవల్ల కొత్త ఇంటికి సామాన్లు తరలించడంలో తమ్ముడు ప్రసాద్, మా ఆఫీసుకి చెందిన కొంతమంది చాలా సహాయం చేశారు. ప్రసాద్ ఇచ్చిన ఐడియాతో వాళ్ళు చాలా తేలికగా సామాన్లన్నీ తరలించగలిగారు. "అంతా సవ్యంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా జరిగితే, బ్లాగులో పంచుకుంటాను" అని నేను బాబాని కోరుకున్నట్లే అంతా సవ్యంగా జరిగింది. అయితే శిరిడీ నుండి తెచ్చుకున్న బాబా ఊదీ కనపడలేదు. దాంతో నాకు చాలా బాధేసి బాబాను తలచుకున్నాను. కొద్దిసేపటికి మావారు ఫోన్ చేసి, "బాబా ఊదీ ఉంది, టెన్షన్ పడకు" అని చెప్పారు. సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


తరువాత ఫిబ్రవరి 18న మా పెళ్లిరోజునాడు సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. బాబా దయవల్ల ఆరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమతవాళ్ళు, ప్రసాద్, అతని భార్య భవాని చాలా సహాయం చేశారు. ఆరోజు ప్రసాద్ వాళ్ళ మూడు సంవత్సరాల బాబు బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకున్నాడు. నాకు చాలా టెన్షన్‌గా అనిపించి, "బాబా! బాబు ఎలాంటి సమస్యా లేకుండా క్షేమంగా బయటకు రావాలి" అని బాబాను వేడుకున్నాను. మేము వెళ్లి తలుపు కొడితే, బాబు లోపల నుండి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. నిజంగా బాబా దయ. లేదంటే, అందరం చాలా టెన్షన్ పడేవాళ్ళం


ఇంకా నా భర్తకి తలనొప్పి వచ్చి రోజంతా అలానే ఉంది. అప్పుడు నేను, "నా భర్తకి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆయనకి తగ్గింది. అలాగే మా పెళ్లిరోజుకి ముందురోజు నాకు, మావారికి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వచ్చి చాలాసేపు మూడ్ అప్సెట్ అయింది. నాకు చాలా బాధేసి, "బాబా! నా తప్పు ఏమీ లేదు. మావారు వచ్చి క్షమాపణ చెప్పాలి. సమస్య పరిష్కారమైపోవాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నా భర్త వచ్చి, క్షమాపణ చెప్పి నార్మల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా. ఇంకెప్పుడూ మా మధ్య ఇలాంటి మిస్ అండర్ స్టాండింగ్స్ రాకుండా చూడు తండ్రీ. అందరినీ చల్లగా చూడు తండ్రీ". ఇంకా ఎన్నో అనుభవాలతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


బాబా కరుణ వల్ల చిన్నగా పోయిన పెద్ద కష్టం

నా పేరు హరిప్రియ. మాది విజయవాడ. నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చిన మన తండ్రి బాబాకు నమస్సుమాంజలి. కొన్నిరోజుల క్రిందట సంవత్సరంన్నర వయస్సున్న మా మనవడు దేవుని దగ్గర ఉన్న ఉద్దరిణి, పంచపాత్ర తీసి ఆడుకున్నాడు. కాసేపటికి ఆ ఉద్దరిణి కనిపించలేదు. అది వెండి ఉద్దరణి కావడం వలన మేము కొంచెం ఆదుర్ద పడి ఆ రోజంతా దానికోసం వెతికాము. కానీ దొరకలేదు. నేను రాత్రి పడుకునే ముందు, "బాబా! ఉద్దరిణి దొరికితే, 'సాయి మహారాజ్ సన్నిది'లో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఒక పది నిమిషాల తర్వాత సామాన్లు పెట్టుకునే స్టాండులో పైనే ఆ ఉద్ధరణి కనిపించింది. అప్పటికి 20 సార్లకుపైనే మేము అక్కడ అంతా వెతికాం. అంతా బాబా దయ.

మా అపార్ట్మెంట్ బోరు నీళ్లు బాగా నలకలతో ఉంటాయి. ఆ కారణంగా మేము 2022, ఫిబ్రవరి రెండోవారంలో మా వాషింగ్ మిషన్‌కి ఫిల్టర్ పెట్టాం. మొదటిరోజు బాగానే ఉంది. మరుసటిరోజు మిషన్ వేద్దామని చూస్తే, పవర్ బటన్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతుంది. రెండురోజులు అలాగే ఉండటంతో మిషన్ పాడైపోయి ఉంటుంది అనుకున్నాను. కానీ ప్రస్తుత మా పరిస్థితిని బట్టి పెద్ద మరామత్తు చేయించడంగానీ, కొత్తది కొనుక్కోవడంగానీ చేయలేము. ఇంకా నేను నా ఆరోగ్యరిత్యా మిషన్ లేకుండా బట్టలు ఉతుక్కోలేను. ఆ రాత్రి నేను నిద్రపోయే ముందు, "బాబా! నా పరిస్థితి తెలిసీ నాకు ఎందుకు పరీక్షలు పెడుతున్నావు" అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం మా అమ్మాయి వచ్చి, "వెనుక ఏదైనా అడ్డుపడిందేమో చూడమ్మా" అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోయింది.. నేను బాబాని తలుచుకుని విప్పి చూస్తే, రెండురోజుల క్రితం వాళ్ళు పాడైన ఫిల్టర్ బిగించి వెళ్లారని అర్థమైంది. దానినుంచి పటిక పొడి బయటకి వచ్చి ట్యూబ్‌కి అడ్డంగా ఉండిపోయింది. దాన్ని శుభ్రపరిస్తే మిషన్ మునపటిలానే పనిచేసింది. బాబా కరుణ వల్ల పెద్ద కష్టం చిన్నగా పోయింది. "ధన్యవాదాలు బాబా. నాకు తల్లి, తండ్రి మీరే బాబా. నా సర్వ భాద్యతలు మీవే తండ్రి".

ఎలాంటి కష్టమొచ్చినా బాబాతో చెప్పుకుంటే, ఆ బాధ నుండి విముక్తి కలిగిస్తారు


ఓం శ్రీసాయినాథాయ నమ:!!! సాయి భక్తులకు మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. బాబా చాలా సమస్యల నుండి మమ్మల్ని రక్షించారు. బ్లాగులో పంచుకుంటామని మొక్కుకున్నంతనే సాయి కాపాడుతున్నారు. ఎలాంటి కష్టమొచ్చినా బాబాతో చెప్పుకుంటే, ఆ బాధ నుండి విముక్తి కలిగిస్తారు. ఒకసారి మా తమ్ముడు కొడుకుకి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. దానికి తోడు విరోచనాలు కూడా అవడంతో బాబు బాగా నీరసించిపోయాడు. తరువాత టెంపరేచర్ ఇంకా పెరిగి రాత్రి నిద్రలో బాబుకి ఫిట్స్ కూడా వచ్చాయి. వెంటనే బాబుని ఆసుపత్రికి తీసుకెళితే ఐ.సి.యులో పెట్టారు. డాక్టర్లు బాబును చూసి, "టెస్టులు చేయాలి" అని చెప్పి, "జీన్స్ బట్టి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. మీ వంశంలో ఎవరికైనా ఫిట్స్ ఉన్నాయా?" అని అడిగారు. ఆ విషయం మా తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది విని నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మా నాన్నగారి చెల్లెలికి ఫిట్స్ ఉన్నాయి. నేను మా తమ్ముడితో, "ఏం భయపడవద్దు. బాబాకి మ్రొక్కుకుని ఆయన మీద భారం వేసి, ఆయన్ని తలుచుకుంటూ ఉండండి. బాబా ఉండగా బాబుకు ఏమీ కాదు" అని ధైర్యం చెప్పాను. నేను కూడా బాబాను, "బాబా! మా తమ్ముని కొడుకు రిపోర్టులు నెగిటివ్ రావాలి. మీ దయవలన తనకి ఎలాంటి సమస్య ఉండకూడదు. బాబును మీరే కాపాడాలి. మీ దయతో రిపోర్టులు నెగిటివ్ వచ్చి బాబు క్షేమంగా ఉంటే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. బాబా కరుణించారు. బాబు రిపోర్టులు నెగిటివ్ అని వచ్చాయి. బాబా దయవల్ల బాబు క్షేమంగా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా. మాకు తల్లి, తండ్రి, దైవం, అన్నీ మీరే. ఎల్లవేళలా మా మీద దయ చూపుతూ మా కుంటుంబాన్ని ఎలాంటి రోగబాధలు, కష్టాలు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చూడండి బాబా. మేము బతికున్నంత కాలం. మిమ్మల్ని తలచుకునే అదృష్టాన్ని ప్రసాదించండి సాయి".



5 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo