సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1112వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేనున్నాన'ని నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తున్న సాయినాథుడు
2. ప్రాబ్లమ్ లేకుండా అనుగ్రహించిన బాబా
3. సానుకూలంగా అనుగ్రహించిన బాబా

'నేనున్నాన'ని నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తున్న సాయినాథుడు


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయి బంధువులకు మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు ఆనందంతో నా కళ్ళ నుండి నీరు కారుతుంటాయి. సాయి కల్పవృక్షము. పిలిస్తే పలికే దైవం. ఆయన ఎప్పుడూ నావెంటే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు సంతోషం కలిగినా, భాద కలిగినా నేను మొదట సాయినాథునికే విన్నవించుకుంటాను. ప్రతి సమస్యలోనూ ఆయన నాకు తోడున్నారు. ఆయన ఊదీయే నాకు రక్ష. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...


ఒకరోజు నేను చాలా విచారంగా ఉండి, 'నాకు ఎవరున్నారు?' అని అనుకున్నాను. ఆరోజు రాత్రి కలలో సాయినాథుడు కనపడి, 'నీకు నేనున్నాన'ని నమ్మకం ఇచ్చారు.


ఈ మధ్యకాలంలో నాకు ఒక చిన్న ఆక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టరు, 'కుడిచెయ్యి విరిగిందని, కట్టుకట్టి, ఆ కట్టు నెల రోజులు అలాగే ఉంచమన్నారు. ఇంకా కట్టు విప్పినప్పుడు సెట్ కాకపోతే ఆపరేషన్ చేస్తామని, ఆపరేషన్ చేసినా కదలికలు సరిగా రాక పోవచ్చని చెప్పారు. నేను నిరాశకు గురై నా ఇద్దరు పిల్లల్ని ఎలా చూసుకోవాలని చాలా బాధపడి, "నా పరిస్థితి బాగైతే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. నేను రోజూ ఫిజియోథెరఫీకి వెళ్లి భరించరాని నొప్పితో బాధపడేదాన్ని. ఆ సమయంలో నా స్నేహితులొచ్చి, "ఎందుకు బాధపడతావు? మనం షెటిల్ ఆడుదామ"ని నాకోసం వాళ్లంతా బ్యాట్స్ తెప్పించుకుని రోజూ రాత్రి ఒక గంటసేపు ఆడుతుండేవాళ్ళు. నెమ్మదిగా నా చేయి ఇప్పుడు మామూలు స్థితికి వచ్చింది. అన్ని కదలికలు కరెక్టుగా వస్తున్నాయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ సాయినాథుడే నా స్నేహితుల రూపంలో నాకు సహాయం చేసి నన్ను రక్షించారు. కృతజ్ఞతతో నేను ఎప్పుడూ ఆ సాయికి ఋణపడి ఉంటాను.


ఈ మధ్యకాలంలో మా అమ్మాయికి దగ్గు ఎక్కువగా వస్తూ రాత్రి నిద్రపోవడానికి చాలా ఇబ్బందిపడేది. దాంతో రెండుసార్లు కరోనా టెస్టు చేస్తే, నెగిటివ్ అని వచ్చింది. డాక్టరు లంగ్స్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. నేను రోజూ బాబాను, "బాబా! మీ బిడ్డలను నువ్వే రక్షించాలి తండ్రి" అని వేడుకునేదాన్ని. తరువాత మళ్ళీ ఎక్సరే తీయిస్తే, "ఇన్ఫెక్షన్ క్లియర్ అయింది. ఇక ఇబ్బంది లేదు" అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు పాప బాగుంది, తనకి ఏ ఇబ్బందీ లేదు. ఇలా నన్ను, నా కుటుంబాన్ని ఆ సాయినాథుడే రక్షిస్తున్నారు. సాయికి నా శతకోటి వందనాలు. ఆయన పాదాలే నాకు రక్ష, ఆయన ఊదీయే ఔషధం. ఇకముందు కూడా సాయి నన్ను ఎల్లవేళలా రక్షించాలని కోరుకుంటున్నాను.


ప్రాబ్లమ్ లేకుండా అనుగ్రహించిన బాబా

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. నేను సాయి భక్తురాలిని. అనాధలకు ఆపద్బాంధవుడు సాయి. ఎలా తలచుకున్నా, "నేనున్నాను" అని పలికే కలియుగ దైవం సాయి. నేనిప్పుడు 2022 ఫిబ్రవరి 25న ఒక చిన్న విషయంగా 'ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలిస్తే, వెంటనే బ్లాగులో పంచుకుంటాను' అని సాయిని తలచుకున్నాను. తక్షణమే సాయి అనుగ్రహించారు. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా కోడలు గర్భవతి. ఈమధ్య తనకి ఫైల్స్ సమస్య అని డాక్టరుని సంప్రదించింది. డాక్టరు ఒక నెల రోజులు చికిత్స తీసుకోవాలని చెప్పి చికిత్స మొదలుపెట్టారు. మా కోడలు డాక్టరుని, "ఆహారం ఏమేమి తీసుకోవాలి?" అని అడిగితే ఆమె, "అన్ని తినవచ్చ"ని చెప్పింది. తరువాత ఒకరోజు మా కోడలు బయట ఫాస్ట్ ఫుడ్ తింది. అప్పటివరకు తన అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్న మా కోడలు ఆ రాత్రి మా బాబు దగ్గరికి వచ్చింది. ఆ రాత్రంతా తను గ్యాస్ సమస్యతో బాధపడింది. దానివలన మోషన్ వస్తున్నట్లు అనిపించడం, రాకపోవడం జరిగింది. నేను మామూలుగా కాల్ చేస్తే, మా కోడలు తన ఆరోగ్య సమస్య గురించి చెప్పకుండా 'మేము బాగున్నాము' అని చెప్పింది. తరువాత నేను మళ్ళీ కాల్ చేసినప్పుడు మాత్రం "అత్తమ్మా! నాకు ఇబ్బందిగా ఉంది. డాక్టరుకి ఫోన్ చేస్తే రమ్మన్నారు" అని అన్ని వివరాలు చెప్పింది. అసలే కడుపుతో ఉన్న పిల్ల. పైల్స్ అని వేరే డాక్టరు వద్ద చికిత్స తీసుకుంటుంది. ఇతరత్రా సమస్యలేమైనా వస్తాయేమోనని నాకు భయమేసి, "సరే వెళ్ళు" అని చెప్పాను. తరువాత, "బాబా! నా కోడలు డాక్టరు దగ్గరకు వెళ్తుంది. తనకు ఎలాంటి పెద్ద సమస్య లేదు, మామూలు సమస్యే అని నా కోడలు చెప్పిన వెంటనే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడున్నాను. బాబా ఎలా దయ చూపారంటే, డాక్టరు "ఫుడ్ ప్రాబ్లెమ్" అని చెప్పారు. అప్పుడు నా కోడలు తను బజ్జీలు, పానీపూరి తిన్నానని నాతో చెప్పింది. "ధన్యవాదాలు బాబా! నా కోడలు ఎటువంటి సమస్య లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా తనకి సుఖప్రసవం అయ్యేలా అనుగ్రహించండి. నీ చల్లని కృపాదృష్టితో మా పిల్లల్ని, మమ్మల్ని కాపాడు తండ్రి. బాబా.. సాయిబాబా! మీరే మాకు దిక్కు".

సానుకూలంగా అనుగ్రహించిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయి భక్తులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ప్రతిరోజూ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలు చదవడం వల్ల బాబాపట్ల భక్తి, విశ్వాసాలు పెరుగుతున్నాయి. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవాన్ని పంచుకుంటున్నాను. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. అది తెలిసి ఎవరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు, భయపడుతున్నారు. అందువల్ల నా వివాహం ఆలస్యం అవుతుంది. ఇలాంటి స్థితిలో నా గురించి తెలిసి, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని ఒక వ్యక్తి ముందుకొచ్చారు. కానీ చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. రెండు సంవత్సరాలుగా నేను బాబాను, "దయచేసి ఏదో ఒక దారి చూపండి బాబా" అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అయితే ఎంత ప్రయత్నించినా నా పెళ్లి విషయం కొంచెం కూడా ముందుకు వెళ్లట్లేదు. ఇట్టి స్థితిలో నేను మళ్ళీ బాబాను, "బాబా! నాకున్న సమస్య విషయంలో కొంచమైనా సానుకూలంగా ముందుకెళ్తే బ్లాగులో పంచుకుంటాను. ఇంకా 'ఓం సాయిరామ్' అని 108 సార్లు వ్రాస్తాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత 2022 ఫిబ్రవరి 25న మా సిస్టర్ అతనితో మాట్లాడటానికి వెళితే, బాబా దయవల్ల వాళ్ళ సమాధానం కొంచెం సానుకూలంగా వచ్చింది. నేను ఆలస్యం చేయకుండా బాబాకు మాటిచ్చిన ప్రకారం ఈరోజే(2022 ఫిబ్రవరి 25) నా అనుభవం మీతో పంచుకోవడానికి బ్లాగుకి పంపాను. "ధన్యవాదాలు బాబా. దయచేసి మా నాన్న దీనికి అంగీకరించేలా చేయండి. మీ మిరాకిల్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాకు సహాయం చేయండి. ప్లీజ్ బాబా".


5 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  3. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo