1. మనకి తెలియకుండా బాబా ఎన్నెన్నో చేస్తుంటారు.
2. నమ్ముకున్న వారి నమ్మకాన్ని ఎప్పుడూ వృధాగా పోనివ్వరు బాబా
మనకి తెలియకుండా బాబా ఎన్నెన్నో చేస్తుంటారు.
నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఎప్పటినుండో బాబాపై నమ్మకం. నేను ఈ బ్లాగులో ప్రచురించే అనుభవాలన్నీ చదువుతుండటం వల్ల ఆ నమ్మకం మరింత పెరిగింది. సాధారణంగా, 'బాబా నాకు ఏం చెయట్లేదు' అని కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను కూడా అనుకుంటాను. కానీ మనకి కనిపించకుండా, తెలియకుండా బాబా ఎన్నో చేస్తుంటారని, మనకి ఏ చెడు జరగకుండా వచ్చే ఉపద్రవాలను సదా ఆపుతుంటారని నాకు అనిపిస్తుంది. అయితే అవేవి మనకి తెలీదు. ఎందుకంటే, ఏదైనా జరిగితేనే అందులోని మంచి-చెడు తెలుసుకునే స్థితి మనది. కానీ మనకి తెలియకుండా మనల్ని కాపాడిన క్షణాలు ఎన్ని ఉన్నాయో ఆ సద్గురు సాయినాథునికే తెలుసు. అందుకే బాబా ఏం చేయట్లేదని మనం ఎప్పుడూ అనుకోకుండా మనకి తెలియని చెడు నుండి బాబా మనల్ని రక్షిస్తూ ఉన్నారని అనుకోండి. ఇక నా అనుభవాల విషయానికి వస్తే, నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను.
కొన్ని రోజుల క్రితం మా అమ్మ కాలి మీద ఏదో పురుగు కుట్టడం వల్ల బాగా ఎర్రగా అయి గడ్డలా అవ్వసాగింది. చీము కూడా గూడుకట్టగా అమ్మ నొప్పి అంటుండేది. ఆ గడ్డ బాగా పెద్దది అయ్యేసరికి నాకు చాలా భయమేసింది. నేను ఎన్నోసార్లు ఇటువంటి గడ్డల మీద బాబా ఊదీ రాస్తే తగ్గిందని ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలలో చదివాను. అందువల్ల నేను కూడా అమ్మ కాలికి ఊదీ రాసి, "బాబాని తలుచుకోమ"ని అమ్మతో చెప్పాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేచాక అమ్మని, "ఎలా ఉందమ్మా?" అని అడిగాను. ఆశ్చర్యంగా అమ్మ, "ఏ మందులూ తీసుకోకపోయినా నొప్పి తగ్గింది" అని చెప్పింది. అయితే రోజంతా ఏదో ఒక పని చేస్తుండటం వల్ల రాత్రికి మళ్ళీ నొప్పి వచ్చింది. ఆ విషయం అమ్మ నాతో చెప్పింది. ఆ రోజు ఊరు వెళ్లి ఉన్న నేను, "బాబా! అమ్మకి ఎలా అయినా తగ్గిపోవాలి. తనకి ఏ సమస్య ఉండకూడదు. ఆ గడ్డ తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, అమ్మకి ఫోన్ చేసి, "బాబాని తలచుకో" అని చెప్పాను. అయితే ఆ గడ్డవల్ల ఏదైనా సమస్య అవుతుందేమోనని నేను చాలా భయపడ్డాను. కానీ బాబా దయవల్ల ఏ సమస్య లేకుండ అది మామూలుగానే తగ్గిపోయింది. ఇలా బాబా మనకు తెలియకుండానే ఎన్నో విషయాల నుంచి కాపాడుతూ ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. కృపతో మీరు మాకు చేసే మేలు గురించి ఏం చెప్పినా తక్కువే తండ్రి".
ఈ మధ్య మా అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదు. మొదట ఆమెకు జ్వరం వచ్చింది. అప్పుడు నేను బాబాని తలుచుకుని, "బాబా! అమ్మమ్మకి జ్వరం తగ్గపోవాలి. జ్వరం తగ్గిపోతే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల జ్వరం అయితే తగ్గింది కానీ, మళ్ళీ కొన్ని రోజులకి జలుబు, దగ్గు మొదలయ్యాయి. ఆ విషయం అమ్మమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. అది విని నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మేము వేరే ఊళ్ళో ఉంటాము. ఒక మావయ్యవాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు. ఇంకో మావయ్యవాళ్లు కూడా అమ్మమ్మ ఉన్న ఊరు వెళ్ళరు. ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలై ఉంటాము. పాపం వయసుపైబడిన అమ్మమ్మ ఒక్కతే ఆ ఊరిలో ఒంటరిగా ఉంటుంది. ఆ ఊళ్ళో మందులు దొరకవు. వేరే ఊరు నుంచి తెచ్చుకోవాలి. కానీ మందులు తెచ్చివ్వడానికి అమ్మమ్మకి ఎవరూ లేరు. అందువల్ల నేను, "అమ్మమ్మని మంచిగా చూడండి బాబా" అని బాబాను ప్రార్థించాను. ఇంకా అమ్మమ్మతో, "బాబాని తలుచుకో, అంతా మంచిగా ఉంటుంది" అని చెప్పాను. అమ్మమ్మ దగ్గర బాబా ఊదీ లేనందున అమ్మమ్మని తలుచుకుని నా నుదుటన బాబా ఊదీ పెట్టుకుని, "బాబా! తన బదులు నేను ఊదీ పెట్టుకుంటున్నాను. తనని చల్లగా చూడు బాబా" అని అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఏమీ చేయలేక అమ్మమ్మతో ఇంటి చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. సరిగ్గా ఆ సమయంలో, "పని ఉంది, వస్తున్నాన"ని చెప్పి మా మామయ్య అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాడు. వస్తూ మందులు, టానిక్ కూడా తీసుకొచ్చాడు. ఆ విషయం తెలిసి సరిగ్గా సమయానికి మామయ్యను బాబానే పంపించారుని నాకు అనిపించింది. మనకు తెలియకుండా బాబా అదృశ్యంగా ఎన్నెన్ని చేస్తుంటారో చూసారా! ఇకపోతే మామయ్య తెచ్చిన మందులు వాడాక అమ్మమ్మకి కొంచెం నయమైంది. అప్పుడు నేను, "ధన్యవాదాలు బాబా! ఇప్పుడు అమ్మమ్మకి బాగానే ఉంది. కాకపోతే కొంచెం దగ్గు ఉంది. మీ దయవల్ల అది కూడా తగ్గిపోయి అమ్మమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలవ్వాలి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. బాబా కృపవలన కొద్దిరోజులకి అమ్మమ్మకి పూర్తిగా నయమై ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. "చాలా చాలా థాంక్స్ బాబా. మీ దయ లేకపోతే ఏదీ జరగదు తండ్రి. అమ్మకు, అమ్మమ్మకు మీరు ఎప్పుడూ ఇలాగే తోడుగా ఉండండి తండ్రి. అమ్మమ్మ వాళ్ళింట్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూడు తండ్రి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాలను బ్లాగ్లులో పంచుకున్నాను. ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు తండ్రి. అలాగే నా అనుభవాన్ని పంచుకోవడం మర్చిపోతే 'సాయి మహారాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులోని మెసేజ్ ద్వారా నాకు గుర్తు చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు బాబా. నేను ఏమైనా తప్పులు చేస్తే పెద్ద మనసుతో నన్ను క్షమించి, అవి నాకు తెలియజేసి సరిదిద్దుకునే మార్గాన్ని కూడా చూపించండి. నేను ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోను. నా జీవితంలో సంతోషంగా మనశ్శాంతితో ఉన్న ప్రతిక్షణమూ మీరు ఇచ్చిందే బాబా. నా మనసులో బలంగా అనుకునేది ఏంటో మీకు తెలుసు. నా బాధ అర్థం చేసుకుని అది జరిగేలా చేయండి బాబా. మళ్లీ ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకునేలా అనుగ్రహించండి తండ్రి".
నమ్ముకున్న వారి నమ్మకాన్ని ఎప్పుడూ వృధాగా పోనివ్వరు బాబా
సాయి భక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. బాబా కృపతో ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోబోతున్నాను. ఒకరోజు మావారు తన కాలివేళ్ళు వాచి బాగా నొప్పి పెట్టడంతో చాలా బాధపడ్డారు. అప్పుడు నేను, "బాబా! రేపటికల్లా మా వారికి నొప్పి తగ్గి, కాలు మామూలుగా అయితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి మావారు కాలు మామూలుగా అయింది. "ధన్యవాదాలు బాబా".
ఇంకోరోజు మా బాబు అసలు అన్నం తినలేదు. ఏది నోట్లో పెట్టినా బయటకు ఉమ్మేస్తుండేవాడు. అప్పుడు నేను, "బాబా! బాబు ఈ అన్నం మొత్తం తినాలి. వాడు గనక తింటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న కొద్దిసేపటికి బాబు మొత్తం తినేసాడు. "చాలా సంతోషం బాబా".
2022, ఫిబ్రవరి 22 సాయంత్రం మా సిస్టర్ మా ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి తను తన ఛాతిలో గట్టిగా పట్టినట్లు ఉండి గ్యాస్ట్రిక్ పెయిన్‌తో చాలా ఇబ్బందిపడుతూ నిద్రపోలేదు. కొంతసేపటికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని పడుకుంటానని తన గదికి వెళ్ళిపోయింది. మేము తనకి తగ్గిపోయి ఉంటుంది అనుకున్నాము. కానీ తెల్లవారుజామున 5-6 గంటల మధ్య తను కడుపు పట్టుకొని బాధపడుతూ మా గదికి వచ్చింది. అప్పుడు మాకు, 'తనకి నొప్పి తగ్గలేదని, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని రాత్రి తన గదికి వెళ్లిపోయింద'ని అర్థం అయింది. సరే, నా దగ్గర ఊదీ లేనందున బాబా ఫోటో ముందు పడివున్న అగరుబత్తీల పొడినే ఊదీగా భావించి బాబాను తలుచుకొని మా సిస్టర్ నుదుటన పెట్టి, మరికొంత నీళ్లలో కలిపి తనచేత త్రాగించి, "బాబా! సిస్టర్‌కి నొప్పి తగ్గితే ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని నా పని నేను చేసుకోసాగాను. ఎందుకంటే, బాబా తప్పకుండా తన నొప్పిని తగ్గిస్తారని నా నమ్మకం. అందుకే, 'ఇప్పుడు ఎలా ఉంద'ని కూడా నేను మా సిస్టర్‌ని అడగలేదు. కొద్దిసేపటి తర్వాత తానే నాతో, "రాత్రంతా ఎంతో బాధపడ్డాను. టాబ్లెట్ వేసుకున్న కూడా నొప్పి తగ్గలేదు. అలాంటిది ఇప్పుడు బాబా ఊదీ తీర్థం త్రాగగానే తగ్గిపోయింది" అని చెప్పింది. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నమ్ముకున్న వారి నమ్మకాన్ని ఎప్పుడూ వృధాగా పోనివ్వరు బాబా. "మొదటి రెండు అనుభవాలు పంచుకోవడం ఆలస్యమైంది. నన్ను క్షమించండి బాబా. మీ ఆశీర్వాదం ఎప్పుడూ మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ReplyDeleteBaba repu ma husband eye operation ki veltunamu.. Operation manchi ga jarigela chudandi tandri... Na baram anthaa me midaney vestunna plz bless me baba🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ma Babu repati nunchi final exams.. Mirey vadini chusuko vali. 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteBaba me mata vinakunda mimmalni adgakunda decision thesukunanu.. Anduke anubhavistunnanu... Pls baba nannu kshaminchi naku help cheyandi pls ������ om sai ram
ReplyDeleteOm sai ram������
ReplyDeleteOm sai ram please bless me to see my sister in law with health.please help����
ReplyDeleteOm Sairam
ReplyDelete