1. బాబా దయవల్ల పొందిన మేలు
2. అంతా బాబా ఆశీర్వాదమే
3. బాబా చేసిన గొప్ప మేలు
బాబా దయవల్ల పొందిన మేలు
ముందుగా ఈ బ్లాగును ఇంత అందంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కిషోర్. ఈమధ్యకాలంలో నాకు జరిగిన కొన్ని అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో లెక్చరరుగా పని చేస్తున్నాను. ఒకసారి నా గొంతులో కొంచెం నొప్పి వచ్చింది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోకుండా యథావిధిగా పాఠాలు చెప్తుండేవాడిని. అయితే నొప్పి రానురానూ తీవ్రమైంది. అప్పుడు డాక్టరు దగ్గరికి వెళితే, "గొంతులో బాగా పూత వచ్చింది. కనీసం ఒకటి, రెండు నెలలు మాట్లాడకుండా విశ్రాంతి ఇవ్వండి" అన్నారు. నేను బాగా ఆందోళన చెంది, "బాబా! నాకు త్వరగా తగ్గితే శిరిడీ వస్తాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఇంకా రోజూ బాబాను తలుచుకుంటూ, "త్వరగా తగ్గించమ"ని ప్రాధేయపడుతుండేవాడిని. ఆ సాయినాథుని దయవలన క్రమంగా గొంతునొప్పి తగ్గింది. తరువాత కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో నేను శిరిడీ వెళ్లి నా మ్రొక్కు తీర్చుకున్నాను. నా ప్రయాణమంతా ఆయన నా వెన్నంటే ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
ఈమధ్య ఒకసారి నా లాప్టాప్ పాడయింది. దాన్ని బాగు చేయిద్దామని లాప్టాప్ బాగు చేసే షాపుకి తీసుకుని వెళితే, వాళ్ళు దాన్ని చూసి, "బ్యాటరీ పోయింది, కొత్తది వేస్తామ"ని చెప్పి కొత్త బ్యాటరీ వేశారు. అయితే కొంతకాలం ఆంటే రెండు నెలలు బాగానే పని చేసాక మళ్ళీ సమస్య మొదలైంది. ఈసారి షాపువాళ్ళు, "లాప్టాప్ మా దగ్గర ఉంచండి. చెక్ చేసి ఇస్తామ"ని అన్నారు. సరేనని లాప్టాప్ ఇచ్చి వచ్చాను. తరువాత వారం గడిచినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అప్పుడు నేను షాపుకి వెళ్ళి అడిగితే, "లాప్టాప్ షార్ట్ సర్క్యూట్ అయింది. బాగుచేసి ఇస్తాము" అని చెప్పారు. దాంతో నేను, "ఏంటి బాబా, మొదట బ్యాటరీ పోయిందన్నారు. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిందంటున్నారు. త్వరగా ఈ సమస్య నుంచి గట్టెక్కించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. తరువాత నేను ఎప్పుడు ఫోన్ చేసినా షాపువాళ్ళు, "టైం పడుతుంది" అని అంటుండేవాళ్లు. అలా నెల రోజులకు పైన గడిచాక ఒకరోజు షాపువాళ్ళు నాకు ఫోన్ చేసి, షాపుకు రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన నాకు వాళ్ళు నా లాప్టాప్ చూపించి, "ఇదింక పనిచేయదు. మొత్తం పాడైపోయింది. దీనికి కారణం మేము ఇచ్చిన బ్యాటరీ" అని తమ తప్పు ఒప్పుకుని ఆ లాప్టాప్‌కి బదులు వేరే లాప్టాప్ ఇచ్చారు. ఇక నా సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే, అది నేను అస్సలు ఊహించలేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వేరే లాప్టాప్ ఇప్పించిన బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.
మా నాన్నగారు పదవి విరమణ చేసిన పోలీసు. ఆయనకు టీ తాగే అలవాటు కూడా లేదు. చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అలాంటి ఆయనకు ఒకసారి పెద్ద పెద్ద వాంతులై జ్వరంతో ఆరోగ్యం చాలా క్షీణించింది. కనీసం లేచి నడవలేని పరిస్థితి. అది చూసి నాకు చాలా బాధ కలిగి, "బాబా! నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే, నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకుని రోజూ బాబా నామస్మరణ చేయసాగాను. బాబా దయవల్ల క్రమంగా నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడి ఇప్పుడు చలాకీగా తిరుగుతున్నారు. "ధన్యవాదాలు బాబా".
ఒకరోజు నేను నా పర్స్ చూసుకునేసరికి అందులో ఉండే ఎటిఎమ్ కార్డు ఎక్కడో మిస్ అయి ఎంత వెతికినా కనబడలేదు. చివరికి నా ఆఫీసులో కూడా అంతటా వెతికాను. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. చివరికి నేను బాబా చెంత మొరపెట్టుకుని, "బాబా! కార్డు దొరికితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత బాబా దయవల్ల నాకు 'ఎటిఎమ్ కార్డు మిస్ అవ్వడానికి ముందురోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఎటిఎమ్ సెంటర్‌కు వెళ్లానని, బహుశా అక్కడే కార్డు మర్చిపోయి ఉంటానని' అనిపించి ఆఫీసు నుంచి నా భార్యకు ఫోన్ చేసి, "ఎటిఎమ్ సెంటర్‌కి వెళ్ళి వెతకమ"ని చెప్పాను. కొంతసేపటికి మా ఆవిడ ఫోన్ చేసి, "ఎటిఎమ్ కార్డు చెత్త బుట్టలో దొరికింది" అని చెప్పింది. నా ఆనందానికి మాటలు లేవు. చాలా చాలా ధన్యవాదాలు బాబా.
అంతా బాబా ఆశీర్వాదమే
ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఇటీవల మాకు దూరప్రాంతంలో ఉన్న 'IKEA' షాపింగ్‌కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. షాపింగ్‌కి వెళ్లేందుకు సంతోషంగానే ఉన్నా ఏదో కొంచెం భయం వల్ల వెళ్లేముందు బాబాకి చెప్పుకుని వెళ్లాలనిపించింది. వెంటనే నేను బాబా దగ్గరకి వెళ్లి, "బాబా! ప్రయాణం, షాపింగ్ అంతా మంచిగా జరిగితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తర్వాత మేము షాపింగ్‌కి వెళ్ళాము. షాపింగ్ పూర్తయిన తర్వాత కిందకి వస్తే బాగా వర్షం పడుతుంది. కొద్దిసేపు వేచి చూసాక వర్షం తగ్గేలోపు వేరే కొన్ని సరుకులు తీసుకుని రమ్మని మావారిని పంపాను. అవి తీసుకొచ్చిన వెంటనే వర్షం తగ్గింది. మేము ఏ సమస్య లేకుండా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే, రెండోసారి వెళ్లి మావారు తీసుకొచ్చిన సరుకులు చాలా ఉపయోగపడ్డాయి. అవి లేకపోతే మేము షాపింగ్‌కి వెళ్లి ఉపయోగం లేకుండా పోయేది. మా శ్రమంతా వ్యర్థం అయ్యేది. కాబట్టి ఆ సమయంలో వర్షం పడటం బాబా ఆశీర్వాదమే అనిపిస్తుంది. "థాంక్యూ వెరీ మచ్ బాబా. నన్ను అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".
యూరప్‌లో పిల్లలకి తరచూ హెల్త్ చెకప్ చేస్తుంటారు. ఇటీవల మా సాయిని హెల్త్ చెకప్‌కి తీసుకుని వెళ్లి, "హెల్త్ చెకప్‌లో 'ఏ సమస్య లేదు, నార్మల్' అని వస్తే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అంతా నార్మల్ అని వచ్చింది. "థాంక్యూ వెరీ మచ్ బాబా".
2022, ఫిబ్రవరి 22న మావారు ఇంటి పని మీద బయటికి వెళ్లారు. తరువాత మా ఇంటికి సంబంధించి ఒక పోస్ట్ వచ్చింది. ఆ విషయం మావారికి తెలియజేద్దామంటే సమయానికి నా మొబైల్లో బ్యాలెన్స్ లేదు. వెళ్లి చాలాసేపైనా మావారు కూడా ఫోన్ చేయలేదు. ఏం చేయాలో అర్థంకాక నాకు చాలా టెన్షన్ అయింది. ఆ సమయంలో నేను, "ఏదైనా మార్గం చూపించమ"ని బాబాను ప్రార్ధించాను. అంతలో మావారి దగ్గర నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. నేను తనకి మా ఇంటి సమస్యకు సంబంధించి వచ్చిన లెటర్ గురించి తెలియపరిచాను. దాంతో నా టెన్షన్ కొంత తగ్గి సంతోషంగా అనిపించి, "బాబా! సమయానికి మావారు మెసేజ్ పెట్టేలా చేసి మీరు నాకు చాలా సహాయం చేశారు. థాంక్యూ బాబా. నా భర్త ఏ సమస్య లేకుండా త్వరగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మావారు త్వరగా ఇంటికి వచ్చారు. "థాంక్యూ బాబా".
బాబా చేసిన గొప్ప మేలు
సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవం/ఆనందం ఈ బ్లాగులో పంచుకోవడానికి నేను ఒక నెల రోజుల నుండి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికీ ఆ అవకాశం దొరికింది. నేను ఉద్యోగస్థురాలిని. నా సర్వీస్ కొంచెం తక్కువగా ఉన్నందున పదవీవిరమణ చేసే సమయానికి నాకు బెనిఫిట్స్ తక్కువగా వస్తాయి. అయినా నేను, 'బాబా ఏదో అద్భుతం చేయకపోతారా!' అని అనుకుంటూ ఉండేదాన్ని. నేను ఊహంచిన దానికంటే ఎంతో ఎక్కువ మేలు చేసి చూపించారు బాబా. ఆయన పదవీ విరమణ కాలం రెండు సంత్సరాలు పెంచి నన్ను ఆదుకున్నారు. ఇలా బాబా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. నేను బాబాకి ఎంతో ఋణపడి ఉన్నాను. మరికొన్ని అనుభవాలు త్వరలో బ్లాగులో పంచుకుంటాను. "చాలా చాలా ధన్యవాదలు బాబా".
Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram please be with my husband.today coloana scope is there.please bless us with your blessings
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha