సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1099వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకున్న బాబా
2. ఏ ఆరోగ్య సమస్య అయిన బాబా కృపతో పోతుంది
3. ఊదీ లీలలు 

ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకున్న బాబా


ఈ బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. మాకు రెండు సంవత్సరాల ఐదు నెలల బాబు ఉన్నాడు. తన విషయంలో మేము దేవునికి చాలా మొక్కులు మొక్కుకున్నాము. ఆ మొక్కులు తీర్చాలని, అలాగే తనకి అక్షరాభ్యాసం చేయించాలని 2022లో మేము ఇండియా వెళ్ళాము. అప్పటి పరిస్థితుల్లో ప్రయాణానికి ముందు 72 గంటలలోపు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉన్నందున మేము టెస్టు చేయించుకుంటే, బాబా దయవల్ల నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇకపోతే, మేము యూరప్ నుండి ఇండియా రావడానికి రెండు ఫ్లైట్స్ మారాల్సి ఉంది. పైగా మేమున్న చోటు నుండి ఇండియాకి నేరుగా ఫ్లైట్ లేనందున ఫ్లైట్ ఎక్కడం కోసం మేము వేరే ప్రదేశానికి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళాక ఫ్లైట్ కాన్సిల్ అయింది. దాంతో ఆరోజంతా మేము ఎయిర్‌పోర్ట్‌లో ఉండాల్సి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము. అదీకాక ఉన్నట్టుండి మా బాబు ఎటు వెళ్ళిపోయాడో కనిపించలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయతో బాబు కనిపించాలి" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే బాబు కనిపించాడు. ఇంకా ఫ్లైట్ కాన్సిల్ అవ్వడం వల్ల మేము రెండుసార్లు కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సి వచ్చి చాలా మానసిక ఆందోళనకు గురయ్యాము. కానీ బాబా దయవల్ల రిపోర్టులు నెగిటివ్ వచ్చాయి. మొత్తానికి ఆయన కృపవల్ల మేము క్షేమంగా ఇండియాలోని మా ఇంటికి చేరుకున్నాము. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".


మేము ఇండియా వచ్చిన తరువాత ఇక్కడ కరోనా కేసులు బాగా పెరుగుతున్నందువల్ల మొక్కులు తీర్చుకోడానికి, ఇతర పనుల మీద బయటకి వెళ్ళడానికి భయమేసి, "బాబా! మీ దయవల్ల ఎలాంటి సమస్యా లేకుండా ఉండాలి, అలాగే మా బాబు మొక్కులన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్చుకోగలగాలి" అని అనుకున్నాను. కొంచెం ఆలస్యమైనా బాబా దయవల్ల మా మొక్కులన్నీ తీరాయి. అలాగే మాకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. అందుకు మనసారా బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


మేము ఇండియాలో ఉండగా మా సిస్టర్ కుటుంబం ట్రైన్‌లో బెంగళూరుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. కరోనా పరిస్థితుల్లో మాకు కొంచెం భయమేసి, 'బాబా దయవల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా బెంగుళూరు చేరుకోవాలి' అని అనుకున్నాను. వాళ్ళకి ఎలాంటి సమస్య రాలేదు. "థాంక్యూ బాబా".


నాకు ఎప్పటినుంచో శిరిడీ వెళ్ళాలని కోరిక. మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ నా కోరిక నెరవేరలేదు. ఆ విషయంగా నేను చాలాసార్లు బాధపడ్డాను. అలాంటిది ఇండియాలో ఉండగా మావారు అనుకోకుండా శిరిడీకి టిక్కెట్లు బుక్ చేశారు. నేను చాలా సంతోషించాను. కానీ కరోనా కారణంగా కొంచెం భయమేసింది. అయితే బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నాము. నేను ఎంతగానో ఆనందించాను.


తరువాత మేము ఇండియా నుండి యూరప్‌కి తిరుగు ప్రయాణమవుతూ, 'ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా క్షేమంగా యూరప్ చేరుకోవాల'ని అనుకున్నాను. బాబా దయవల్ల మేము క్షేమంగా యూరప్ చేరుకున్నాము. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


ఏ ఆరోగ్య సమస్య అయిన బాబా కృపతో పోతుంది


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రూప. 2022లో మా తమ్ముడికి కడుపునొప్పి బాగా ఎక్కువగా వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్ళినా తగ్గలేదు. దాంతో డాక్టరు స్కానింగ్ చేయించమని వ్రాశారు. అప్పుడు నేను, "బాబా! తమ్ముడు కడుపునొప్పి తొందరగా తగ్గేలా చూడు తండ్రి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల స్కానింగ్ చేయించుకోకుండానే తమ్ముడికి కడుపునొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా".


ఒకరోజు వేడివేడి సూప్ నా భర్త కాలు మీద పడింది. నేను వెంటనే, "బాబా! బొబ్బలు రాకుండా చూడు తండ్రి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మంట మాత్రమే ఉండి, బొబ్బలు రాలేదు.


2022లో మా ఇంట్లో, మా అమ్మవాళ్ళ ఇంట్లో అందరికీ దగ్గు, జలుబు వచ్చాయి. ఆ లక్షణాలంటేనే భయపడే రోజులివి. అందువల్ల నేను, "బాబా! మాకు వచ్చిన ఈ దగ్గు, జలుబు మామూలు దగ్గు, జలుబే అయి ఉండాలి. ఎలాంటి వైరస్ కాకుండా చూడు తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయవల్ల మాకు అందరికీ తొందరగానే తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. నేను అతి పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను తండ్రి. మందులతో తగ్గిపోయేలా చూడు తండ్రి. అలాగే మా అమ్మ యూరిన్ ప్రాబ్లమ్ తొందరగా సమసిపోయేలా అనుగ్రహించు తండ్రి. చివరిగా నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి తండ్రి సాయినాథా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


ఊదీ లీలలు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రవీంద్ర. ఒకరోజు నేను స్నానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా గుండె దగ్గర నరం పట్టేసి చాలా ఇబ్బందిపెట్టింది. వెంటనే నేను బాబాకి దణ్ణం పెట్టుకుని కొద్దిగా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. వెంటనే బాబా దయవల్ల బాధ తగ్గింది.


ఇంకోరోజు నేను మోకాళ్ళు మరియు గ్యాస్ట్రిక్ పెయిన్‍తో చాలా ఇబ్బందిపడ్డాను. ఆయింట్మెంట్ రాసుకున్నా తగ్గలేదు. అప్పుడు నేను బాధ ఉన్నచోట బాబా ఊదీ రాసుకుని, బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నా బాధ తగ్గాలి" అని అనుకున్నాను. దయామయుడైన బాబా కాసేపటికే నా బాధను తగ్గించారు. "ధన్యవాదాలు బాబా. నాకున్న మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గాలని కోరుకుంటున్నాను తండ్రి. రెండు సంవత్సరాల నుండి నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను బాబా. తొందరగా వచ్చేటట్లు చేయండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!



7 comments:

  1. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. om sairam
    sai always be with me

    ReplyDelete
  6. సాయినాథ ధన్యవాదాలు దేవా నా అనారోగ్యం రూపుమాపి నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు షిరిడి సాయి శివ సాయిబాబా మీకు వేల కోట్ల నమస్కారాలు బాబా

    ReplyDelete
  7. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo