సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1097వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టాన్ని దాటించిన బాబా
2. సాయితండ్రి దయామయుడు

కష్టాన్ని దాటించిన బాబా


అందరికీ నమస్కారం. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా చాలా కృతజ్ఞతలు. నా పేరు లలిత. మేము యు.కే.లో ఉంటున్నాము. ఈమధ్య యు.కే.లో నాకు సెర్వికల్ టెస్టు చేసి, "కణాలు అసాధారణంగా ఉన్నాయి. ఇంకో పరీక్ష చేసి అవసరమైతే బయాప్సీ చేసి చికిత్స చేయాల్సి ఉంటుంద"ని చెప్పారు. 'చికిత్స చేయకపోతే అదే క్యాన్సరుగా మారే అవకాశం ఉంద'ని నేను వెబ్సైటులో చదివాను. దాంతో జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధను, భయాన్ని అనుభవించాను. అయితే చికిత్స చేయించుకోవడానికై అపాయింట్‍మెంట్ దొరకడానికి 3 నెలలు పట్టింది. అందువలన నేను సాయిబాబాను నమ్ముకుని ఉపవాసము, ఐదు వారాల సాయి దివ్యపూజ చేశాను. ఇంకా బాబా లీలలను వెబ్సైటులో చదవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నేను బాబా ఊదీ మహిమ గురించి, దానికంటే మించిన గొప్ప ఔషధం, ట్రీట్మెంట్ వేరే ఏదీ లేదని తెలుసుకున్నాను. దాంతో నేను రోజూ ఊదీ ధారణ శ్లోకం చదివి నీటిలో ఊదీ వేసుకుని త్రాగసాగాను. దాంతోపాటు రోజూ సచ్చరిత్ర పారాయణ చేశాను. మహా పారాయణ గ్రూపులో కూడా చేరాను. అలాగే 'సాయి మహారాజ్ సన్నిధి'లో చూసి సాయి స్తవనమంజరి చదివాను. కాదు, బాబా నాతో చదివించారు. సరిగ్గా ఏకాదశి ముందురోజే స్తవనమంజరి నా కంటపడటం  బాబా లీల. ఆయన కృపవలన ఏకాదశిరోజు నుండి నేను సాయి స్తవనమంజరి చదవడం మొదలుపెట్టాను. అలాగే 9 రోజులు సాయి నామం 108 సార్లు వ్రాసి, ఫలితం పొందామని తోటి భక్తుల అనుభవం చదివాను. అప్పుడు నేను లెక్క చూసుకుంటే, నా అపాయింట్మెంట్‌కి సరిగ్గా 9 రోజులే ఉన్నాయి. ఇది కూడా బాబానే  నాకు తెలిసేలా చేశారని అర్దమై 108సార్లు సాయి నామం వ్రాసాను. పైవన్నీ చేయడమేకాక, "శిరిడీ దర్శించే వరకు నాకు ఇష్టమైనదొకటి తినను, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. చివరికి 2022, ఫిబ్రవరి 14న టెస్టు చేసి, 'నాది పెద్ద సమస్య కాదని, చిన్నదేనని, ఏ చికిత్సగానీ, బయాప్సీగానీ అవసరం లేదని, ఒక సంవత్సరం తరువాత మళ్లీ టెస్టు చేయించుకోమ'ని చెప్పి పంపించారు. ఆ 3 నెలలు నాకు ఒక నరకంలా గడిచినప్పటికీ భక్తుల అనుభవాలు నాకు చాలా ఊరటనిచ్చాయి. ఇదంతా బాబా నా జీవితంలో చేసిన అతి పెద్ద అద్భుతం. ఈ అనుభవం ద్వారా నేను బాబా ఊదీ మహిమను స్వయంగా అనుభవించాను. ఇకపోతే ఈ అద్భుతం జరిగేలోపు నేను పొందిన కొన్ని అనుభవాలు:


అనుభవం 1: నేను చాలా బ్లాగుల్లో ఊదీ మహిమ గురించి తెలుసుకున్నాను. కానీ సమయానికి నా దగ్గర ఊదీ లేదు. ఇక్కడ యు.కేలో బాబా గుడి కూడా లేదు. కాబట్టి ఊదీ దొరకడం కష్టమని నేను అనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా నా భర్త ఫ్రెండ్ తన పర్సులో రెండు బాబా ఊదీ ప్యాకెట్లు ఉన్నాయని తీసి ఇచ్చింది. అవి ఖచ్చితంగా బాబా నాకోసం పంపించారు


అనుభవం 2: నేను బాబాను "ఎలాగైనా నా దగ్గర దక్షిణ స్వీకరించండి" అని అడుగుతుండేదాన్ని. అనుకోకుండా సంస్థాన్‌కు డొనేట్ చేసే అవకాశం వచ్చింది. ఆవిధంగా బాబా నేను ఇవ్వదలచిన దక్షిణ స్వీకరించారు


అనుభవం 3: నా భర్త పుట్టినరోజునాడు నేను బాబాకి(పటం దగ్గర) భోజనం పెట్టి, 'ఈరోజు బాబా మా ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తారు' అని అనుకున్నాను. కానీ ఆరోజు ఒక్కరు కూడా మా ఇంటికి రాలేదు. దాంతో నేను 'నేను పెట్టిన భోజనం బాబా ఎందుకు స్వీకరించలేదు' అని బాధపడ్డాను. తరువాత 'సాయి మహారాజ్ సన్నిధి' ఓపెన్ చేసి చూస్తే, ఈ క్రింది సాయి వచనం కనిపించింది.

ఇక నా ఆనందాన్ని వేరే చెప్పాలా? 'అసలు బాబా నన్ను చూస్తున్నారో, లేదో' అనుకునే నాకు ఆ బాబా వచనం చూశాక 'బాబా నాతో ఉన్నార'ని ధైర్యం వచ్చింది. 


అనుభవం 4: ఒకసారి నేను ఒక బాబా గుడిలో పెద్ద పూలమాల, జామకాయలు పట్టుకుని నిలుచుని ఉన్నట్టు నాకు స్వప్నం వచ్చింది. ఆ తర్వాత గురువారం మా నాన్నకి ఫోన్ చేసి, వాటిని బాబా గుడిలో ఇవ్వమని చెప్పాను. ఆపై నేను ఇక్కడ, "వాటిని స్వీకరించు తండ్రి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. కొంతసేపటికి పూలమాల వేసిన ఫోటో మా నాన్న పంపించారు. నేను పంపిన వాటిని తాము స్వీకరించామని చెప్పడానికే బాబా ఆ ఫోటో పంపించారనిపించి నాకు చాలా సంతోషంగా అనిపించింది.


అనుభవం 5: ఒకరోజు నేను బాబా దగ్గర కూర్చుని బాగా బాధపడుతూ, "నాకు ఏదైనా సందేశం ఇవ్వండి బాబా" అని అడిగాను. తరువాత నెట్‌లో ఈ క్రింది ఫొటో నా కంటపడింది. అందులో బాబా తాము గురువారం దర్శనమిస్తామన్న సందేశం ఉంది. నిజంగానే ఆ తరువాత గురువారం బాబా మహాసమాధి దర్శనభాగ్యం నాకు కలిగింది. దాంతో బాబా తమ సందేశాల ద్వారా నిజంగానే మనతో మాట్లాడతారని అర్దమైంది.


సాయితండ్రి దయామయుడు


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నడుపుతున్న మా సాయి సోదరులకు కృతజ్ఞతలు. నా పేరు లత. నేను ఇంతకు ముందు ఈ బ్లాగులో చాలా అనుభవాలను పంచుకొన్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. 2021, కార్తీకమాసంలో ఒక సోమవారం నాడు మావారి బ్రెయిన్‍కి ఎక్స్-రే తీయాలని డాక్టరు చెప్పారు. కాని నేను బాబాను ప్రార్థించగా ఆ అవసరం లేకుండానే బాబా చేసారు. హాస్పిటల్‍కు వెళ్ళవలసి వస్తుందనుకున్న మమ్మల్ని కోటప్పకొండకు తీసుకెళ్ళి కోటయ్యస్వామి (బాబా) దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. నా సాయితండ్రి దయ ఏమని, ఎంతని వర్ణించగలను?  


మా మనవరాలి పుట్టినరోజుకి రెండు రోజుల ముందు మా అల్లుడుగారికి గొంతునొప్పి వచ్చి, కోవిడ్ టెస్టు చేయించవలసి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మా అల్లుడుగారి కోవిడ్ టెస్టు రిపోర్టు నెగిటివ్ వచ్చేలా చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే బాబా దయవలన టెస్టు రిపోర్టు నెగిటివ్ వచ్చింది. దాంతో ముందుగా అనుకున్నట్లు పాప బర్త్ డే  ఆనందంగా జరుపుకున్నాము.


ఒకసారి జ్వరమొచ్చినట్లు నా శరీరమంతా వేడిగా ఉంటే కోవిడ్ ఏమోనని నాకు భయమేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కారం చేసుకుని, "మరుసటిరోజు ఉదయానికల్లా శరీర ఉష్ణోగ్రత తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, నా తండ్రి దయవలన నా శరీర ఉష్ణోగ్రత తగ్గి నార్మల్ అయింది. నా తండ్రి దయామయుడు. "ధన్యవాదాలు బాబా! ఈ అనుభవాలను పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. నాకు ఒక సమస్య ఉంది. మీ దయతో అది కూడా తొందరగా పరిష్కారమైతే మీ అనుగ్రహాన్ని మరల మీ బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. నా తండ్రి, మీ బిడ్డలందరూ మీ ప్రేమను పొందాలి. వాళ్ళను చల్లగా చూడండి బంగారు తండ్రి".


7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sai Ram 🌹🌹🙏
    Sri sachidananda samardha sadguru Sai nath Maharaj ki Jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

    ReplyDelete
  5. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  6. షిరిడి సాయి నాథ.. మీకు శత కోటి సాష్టాంగ నమస్కారాలు.. నా అనారోగ్యాన్ని, నా కుమారుని అనారోగ్యాన్ని రూపుమాఫీ, మంచి గా ఆయురారోగ్యాలు ప్రసాదించి నందుకు, మా అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ మా వాళ్లందరికీ, అందరికీ ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలను ప్రసాదించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిబాబా.. నీవే కలవు నీవే తప్పా మాకు ఎవరూ లేరూ ఈభువిలో.. థాంక్యూ సాయిరాం బాబా దేవా షిరిడీ సాయిశ్వరా..

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo