సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1124వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి తోడుగా ఉంటే మనకి ఏ భయం ఉండదు
2. బాబా దయవల్ల విజయవంతమైన కంటి ఆపరేషన్
3. గొంతు సరిచేసి మనసారా తమని కీర్తించే భాగ్యాన్నిచ్చిన బాబా

సాయి తోడుగా ఉంటే మనకి ఏ భయం ఉండదు


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ప్రతి సంవత్సరం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి కళ్యాణం జరిగే సమయానికి మా కుటుంబమంతా అక్కడికి వెళ్లి కొన్నిరోజులు ఉంటుంటాము. అలాగే ఈ సంవత్సరం(2022) ఫిబ్రవరిలో వెళ్ళాము. ప్రయాణానికి ముందు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "ప్రయాణమంతా సంతోషంగా, సౌఖ్యంగా సాగి స్వామి దర్శనం బాగా జరగాలి బాబా. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలి. అలాగే మేమందరమూ క్షేమముగా తిరిగి ఇంటికి చేరుకోవాలి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మా ప్రయాణం సౌకర్యవంతంగా సాగింది. స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. సాయి తోడుగా ఉంటే మనకి ఏ భయము ఉండదు.


తరువాత ఒకరోజు నేను బయటకి వెళ్తుంటే ఎంత ప్రయత్నించినా నా హ్యాండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ అవలేదు. అప్పుడు నేను నా మనసులో, 'బ్లాగులో అందరూ తమకి జరిగిన ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు గురించి  పంచుకుంటుంటారు కదా సాయి' అని అనుకుంటూ ప్రయత్నిస్తే జిప్ ఓపెన్ అయింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొన్నిసార్లు అలా తలుచుకోగానే పనులు జరిగేలా చేసేస్తారు సాయి.


అదేరోజు మేము మా పెద్దమ్మవాళ్ళింటికి వెళ్తుంటే, నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, పెద్దమ్మవాళ్లు ఉండే వీధిలో కుక్కలు ఎక్కువగా ఉంటాయి. అవి రాత్రి వేళల్లో ఒక్కోసారి బయటవాళ్లని కరుస్తుంటాయి. అందువల్ల నేను, "పెద్దమ్మ వాళ్ళింటికి చేరుకునే వరకు అక్కడ కుక్కలు లేకుండా చూడండి బాబా" అని అనుకుంటూ వెళ్ళాను. బాబా దయవల్ల ఆరోజు అక్కడ కుక్కలు లేవు. మేము సురక్షితంగా పెద్దమ్మవాళ్ళింటికి చేరుకున్నాము. ఇప్పుడే కాదు, బయటకి వెళ్ళిన ప్రతిసారీ(ట్రాఫిక్‍లో) బాబాని తలుచుకుంటే ఏటువంటి ఇబ్బంది రానివ్వరు.


శివరాత్రి రోజున మేము పట్టిసీమ వెళ్ళాము. వెళ్ళేముందు ఇంట్లో నేను, "సాయీ! దర్శనం బాగా అయ్యేట్లు చూడు" అనుకున్నాను. నిజంగా ఎంత బాగా దర్శనం జరిగిందంటే, మాటల్లో చెప్పలేను. మాకు తెలిసినవాళ్ళు చాలామంది దర్శనం చేసుకోకుండానే తిరిగి వచ్చేసినా బాబా దయవలన మాకు మాత్రం చక్కటి దర్శనం జరిగింది. "బాబా! ఎప్పటికీ నాకు రక్షగా ఉండి ముందుకి నడిపించు తండ్రీ".


బాబా దయవల్ల విజయవంతమైన కంటి ఆపరేషన్


నా పేరు లక్ష్మి. కరోనాకు ముందు నా కళ్ళు చెక్ చేయించుకుంటే నార్మల్‌గానే ఉన్నాయి. ఆరునెలల తేడాలో మళ్ళీ చూపించుకుంటే, "ఆపరేషన్ చేయాల"ని అన్నారు. నేను ఇంజక్షన్‍కి కూడా భయపడతాను. అలాంటిది ఏకంగా ఆపరేషన్ అనేసరికి నేను ఇంకా భయపడిపోయాను. ఆ భయం వలన 2020, ఆగస్టులో ఆపరేషన్ చేయాలని చెప్తే, 2021, డిసెంబరు వరకు ఆపరేషన్ చేయించుకోడానికి నేను సిద్ధపడలేదు. చివరికి బాబా మీద భారమేసి, ఆయన్నే తలుచుకుంటూ ఆపరేషన్ చేయించుకుంటే ఆయన దయవల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. అస్సలు నొప్పి తెలియలేదు. ఇంకో విషయం ఆపరేషన్‌కి ముందు "చూపు వస్తుందన్న గ్యారంటీ ఇవ్వలేము" అని చెప్పిన డాక్టరు, సర్జరీ అయ్యాక నా భర్తతో "ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆవిడ బాగా కో-ఆపరేట్ చేశారు" అని చెప్పారు. అంతా బాబా దయ. బాబానే దగ్గరుండి ఆపరేషన్ చేయించారు. పదవరోజున చెకప్‌కి వెళ్తే, పూర్తిగా కనిపించలేదు. దాంతో నేను, మావారు, డాక్టరు చాలా భయపడ్డాము. అప్పుడు, "బాబా! నా కన్ను నార్మల్ అయితే, నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మళ్లీ వారానికి నా కన్ను నార్మల్ అయి స్పష్టంగా కనిపించసాగింది. బాబా అండ ఉంటే, మనకి భయం ఏముంటుంది? బాబా మనందరికీ తోడు-నీడలా ఉంటూ కాపాడాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".


గొంతు సరిచేసి మనసారా తమని కీర్తించే భాగ్యాన్నిచ్చిన బాబా


సాయిబంధువులకు నా నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు అరుణలక్ష్మీ. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవం నా సాయితండ్రి. నేను రోజూ నా దినచర్యలో జరిగేవన్నీ బాబా చిత్రపటం వద్ద  చెప్పుకుంటాను. నా ప్రతిమాట బాబా వింటూ ఉంటారని భావిస్తాను. నాకు బాబా భజనలలో పాడడం అంటే చాలా ఇష్టం. అయితే కొన్ని నెలల క్రితం నాకు బాగా ఎక్కువగా దగ్గు వచ్చేది. అవి కరోనా రోజులు కావడం వలన నాకు చాలా భయమేసింది. డాక్టరుకి చూపించుకుని మందులు వాడాను. బాబా దయవలన దగ్గు తగ్గిందికాని, తీవ్రమైన దగ్గువల్ల గొంతు దెబ్బతింది. అందువల్ల దగ్గు తగ్గినా నేను పాటలు పాడలేకపోయేదాన్ని. నాకు చాలా బాధ కలిగి, "బాబా! మిమ్మల్ని పాటల ద్వారా కీర్తించడం నాకు అలవాటు. నా గొంతు సరిచేసి మీ పాటలు పాడే అవకాశం నాకివ్వు తండ్రి" అని బాబాను దీనంగా వేడుకున్నాను. అద్భుతం! కొద్ది రోజులకే నా గొంతు బాగైంది. ఇప్పుడు మనసారా బాబాను గానంతో స్మరించుకుంటున్నాను. "సాయిబాబా మీ కృపకు శతకోటి ధన్యవాదాలు తండ్రి. నేను మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను తండ్రి".






4 comments:

  1. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam bless me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo