సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1103వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనసులో ఉన్న ప్రతి బాధని చూస్తూ తగిన సంకేతమిచ్చే బాబా
2. తోడుగా ఉండి అమ్మను కాపాడిన బాబా
3. శ్రీసాయి అనుగ్రహం

మనసులో ఉన్న ప్రతి బాధని చూస్తూ తగిన సంకేతమిచ్చే బాబా


సాయి భక్తులందరికీ నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. సాయినాథుడు నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. ముందుగా ఈ అనుభవం పంచుకోవడానికి ధైర్యం ఇచ్చింది సాయినాథుడేనని చెప్పాలి. ఎందుకంటే, మనందరం శారీరక ఆరోగ్య సమస్య మాత్రమే పెద్దదని, మానసిక సమస్య చిన్నదని అనుకుంటాం. అందువల్ల ఆ సమస్యతో బాధపడుతున్న నాలాంటి వాళ్లు దానిని బయటికి చెప్పే ధైర్యం కూడా చేయరు. అలాంటిది ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఒక భక్తురాలు తన మానసిక సమస్య తగ్గితే, బ్లాగులో పంచుకుంటానని వ్రాసారు. అది చదివాక నాకు పరోక్షంగా ధైర్యం వచ్చింది. ఇకపోతే నా పూర్వ కర్మ ఫలితం వల్ల అనుకుంటాను 'నా బాల్యం గొప్పగా లేదు'. అప్పటినుండే నేను మానసికంగా డిస్టర్బ్ అవుతూ పెరిగాను. పసితనం, బాల్యం, యుక్తవయసు అంతా నేను అలాగే మానసికంగా బాధను అనుభవిస్తూ వచ్చాను. అది నాతోనే పెరుగుతూ వచ్చింది. దానివల్ల ఆందోళన, ఒత్తిడి, ఆకస్మిక మానసిక సంఘర్షణ ఇలా ఎన్నో బాధలు పడ్డాను. అయితే బాబా దయవలన ఆయన భక్తుడైన నా భర్త నన్ను బాగా అర్థం చేసుకుని చక్కగా చూసుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడిప్పుడే నేను అనుభవిస్తున్న మానసిక సమస్య నుంచి బయటకి వస్తున్నాను. కానీ దాని ప్రభావం ఇంకా నా మీద ఉండటం వల్ల అప్పుడప్పుడు నా మనసు నా అధీనంలో ఉండటం లేదు. అప్పుడు విపరీతమైన ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. అందులో భాగంగా దేవుని మీద కోపం, దేవుని దూషించటం ఇలా నా అదుపులో లేని ఎన్నో జరుగుతుంటాయి. అందుకు నేను బాధపడని రోజు లేదు. అలా బాధపడుతూ ఒకరోజు, "నన్ను క్షమించండి బాబా" అని బాబాను అడిగాను. కానీ నా మనసులో 'ఇక బాబా నన్ను క్షమించరు. నా మొహం చూడరు'  అని బాధపడుతూ ఉండగా కింది మెసేజెస్ వచ్చాయి. 

భావం: 'నువ్వు తెలిసి తప్పు చేయడం లేదు.... తెలియక తప్పు జరుగుతుందని నాకు తెలుసు... దానికి నువ్వు క్షమించమని అడిగావు... అలా అనుకోకు ప్రియతమా... నీ సారీని ఆమోదించి నిన్ను క్షమిస్తున్నాను.... నేను నీతోనే ఉంటాను, చింతించకు'.

భావం: 'సాయిబాబా నిన్ను రక్షిస్తారు - నాకు ప్రియమైన నీ ప్రతికూల ఆలోచనలన్నింటినీ తొలగించి నా లీలలను నీకు చూపిస్తాను. దయచేసి నీ మనసును సానుకూల ఆలోచనలతో నింపుకో బిడ్డ. ఆందోళన చెందవలసినవసరం లేదు. సంతోషకరమైన వార్త రాబోతుంది, కేవలం 'సాయి'ని స్మరించు'.


అందుకే బాబాని తల్లి అని అంటారు. అటువంటి తల్లి తమ బిడ్డ మానసికస్థితి బాగాలేదని తెలిసి నన్ను దూరం చేసుకుంటారని ఎలా అనుకున్నాను? ఆయన నా ఆలోచన తప్పని, 'నేను ఉన్నాను. అన్నీ చక్కబడతాయ'ని గొప్పగా చెప్పారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఆయన మన మనసులో ఉన్న ప్రతి చిన్న, పెద్ద బాధని చూస్తూ వాటికి ఏదో ఒక సంకేతం ఇస్తారు. "థాంక్యూ బాబా. మీ భక్తులందరి సమక్షంలో క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు తండ్రి".


తోడుగా ఉండి అమ్మను కాపాడిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


సాయి బంధువులందరికి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు 20 సంవత్సరాలుగా బాబాతో అనుబంధం. నా జీవితంలో వచ్చిన ప్రతి సమస్యలోనూ బాబా నాకు తోడుగా ఉన్నారు. నాకు ఏ సందేహం వచ్చినా నేను బాబానే అడుగుతాను. ఆయన ఏదో ఒక రూపంలో నాకు సమాధానమిస్తారు. 2022, జనవరి నెలలో సంక్రాంతి తర్వాత నేను మా అమ్మగారిని మా ఇంటికి తీసుకుని వచ్చాను. జనవరి 27, గురువారంనాడు, "రేపు నువ్వు ఒక అద్భుతం చూస్తావు" అనే ఒక సందేశం నేను చూసాను. ఆ మరుసటిరోజు తెల్లవారుఝామున మా అమ్మ ఛాతీలో మంట, దగ్గుతో చాలా ఇబ్బందిపడ్డారు. మా ఊర్లో సరైన వైద్య సౌకర్యం లేనందున ఉదయం 10 గంటలప్పుడు అమ్మని దారుణమైన గతుకుల రోడ్డు గుండా వేరే ఊరిలో ఉన్న హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాము. డాక్టరు టెస్టులు చేసి తెల్లవారుఝామున అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో బాబా మాకు తోడుగా ఉండబట్టే అమ్మ రక్షింపబడింది. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం.


ఆ ఊరిలో మూడు రోజులు అమ్మకి వైద్యం చేసిన తర్వాత మేము అమ్మని విజయవాడకు తీసుకుని వెళ్ళాము. అంబులెన్సులో వెళ్తుండగా మధ్య దారిలో అమ్మ చాలా ఇబ్బంది పడుతుంటే నేను 'బాబా' అని గట్టిగా పిలిచాను. మరుక్షణమే ఒక కారు మీద బాబా, ఆంజనేయస్వామి దర్శనమిచ్చారు. నాకు ధైర్యంగా అనిపించింది. హాస్పిటల్‍కి వెళ్లిన తర్వాత అంబులెన్సులో అమ్మకి మరోసారి స్ట్రోక్ వచ్చిందని తెలిసింది. అప్పుడు కూడా బాబా తోడుగా ఉండి అమ్మను కాపాడారు. ఆ సాయితండ్రి దయవల్ల 15 రోజుల తర్వాత అమ్మ కోలుకున్నారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా అందరినీ చల్లగా చూడు తండ్రి".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


శ్రీసాయి అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ సాయినాథుని పాదపద్మములకు శతకోటి ప్రణామాలు. సాయి భక్తులకు మరియు బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నాపేరు నాగలక్ష్మి. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఆ సాయినాథుని దయవలన ఈరోజు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఈ అనుభవాలను పంచుకోవడం చాలా ఆలస్యంమైనందుకు సాయితండ్రికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కరోనా సమయంలో కొంచెం జలుబు, దగ్గు వచ్చినా చాలా భయం వేస్తుంది. అలాంటిది ఒకరి తరువాత ఒకరికి మా ఇంట్లో అందరికీ జలుబు, దగ్గు వచ్చాయి. మా చిన్నపాపకి జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో నేను సాయికి దణ్ణం పెట్టుకుని, "మాకు నయమయ్యేలా అనుగ్రహించు తండ్రి. మా అందరికీ తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల 12 రోజులలో అందరికీ నయమైంది. తరువాత మావారికి మళ్ళీ దగ్గు సమస్య వస్తే, అది కూడా తగ్గిపోతే బ్లాగులో పంచుకుంటానని మొక్కుకున్నాను. ఆ సాయినాథుని దయవలన ఆ సమస్య తగ్గింది. అలాగే ఈమధ్య మా పాపకి నెలసరి సమస్య వచ్చింది. అప్పుడు కూడా నేను బాబానే నమ్ముకున్నాను. ఆయన దయవలన ఆ సమస్య కూడా పరిష్కారమైంది. "ధన్యవాదాలు సాయీ. ఇలాగే మా పెద్దపాపకి మంచి జరిగేటట్లు చూడు తండ్రి. మీ కరుణ, ఆశీర్వాదం, అనుగ్రహం ఎప్పుడూ మా మీద ఉండేటట్లు అనుగ్రహించండి సాయి".



6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam Omsairam Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Akhilanda koti bramhanda nayaka rajadi Raja Yogi Raja parabramha sri satchithananda sadguru sri sai nadh maharaj ke jai

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo