1. బాబా చూపుతున్న కరుణ
2. శిరిడీ ప్రయాణం ఆగిపోకుండా కాపాడిన బాబా
3. బాబా ఆశీస్సులు
బాబా చూపుతున్న కరుణ
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు సంధ్య. నేను సాయినాథుని దివ్యపాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకోబోతున్నాను. ముందుగా, ఈ నా అనుభవం పంచుకోవడంలో ఆలస్యమైనందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. 2021, భాద్రపద మాసంలో మేము మా ఆచారం ప్రకారం పితృదేవతలకు పండగ చేద్దామని నిర్ణయించుకుని దగ్గర బంధువులకు, స్నేహితులకు, తెలిసినవాళ్ళకు ఫోన్ చేసి ఆహ్వానించాము. కానీ వర్షాకాలం, కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. అందువలన, 'పెద్దల పండగ ఎలా చేయాలి? పిలిచినవాళ్ళందరూ వస్తారా? లేదా? ఒకవేళ రాకపోతే వండిన వంటలు మిగిలిపోతాయేమో!' అని కాస్త భయపడి, "సాయినాథా! మొదటిసారి పితృదేవతలకు పండగ చేస్తున్నాము. ఆరోజు వర్షం పడకుండా ఉండాలి తండ్రీ. ఆహ్వానించిన అతిథులందరూ రావాలి, పండగ చక్కగా జరగాలి. వీటన్నిటికీ మీ ఆశీర్వచనం కావాలి బాబా. మీ మీదనే భారం వేశాము సాయితండ్రీ. నేను కోరుకున్నట్లు జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. బాబా మీద భారం వేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు కదా! నేను కోరుకున్నట్లే ఆరోజు వర్షం పడలేదు, బంధుమిత్రులతో చాలా చక్కగా పండగ జరిగింది. వండిన పదార్థాలు వృధా కాలేదు. ఇంకో విషయం, ప్రస్తుత కరోనా సమయంలో మా పని ఆవిడకు దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో మేము పనివాళ్లను పిలవలేదు. అయినప్పటికీ ఆరోజు మొదలుకొని మరుసటిరోజు వరకు మేము పనులన్నీ ఉత్సాహంగా చేసుకోగలిగాము. ఇదంతా బాబా దయ. ఆయన మాకు చాలా శక్తినిచ్చారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. మీ పాదాలే శరణం గురుదేవా!"
2022, ఫిబ్రవరి రెండోవారంలో మా బాబుకి విరోచనాలై భోజనం సహించలేదు. అప్పుడు బాబు, "అమ్మా! నాకు దిష్టి తీయి" అని అన్నాడు. నేను తనకి దిష్టి తీసి, బాబాను ప్రార్థించి ఊదీని, ఊదీతీర్థాన్ని ఇచ్చాను. తరువాత తను కాలేజీకి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తనకి ఒకటే చలిజ్వరం మొదలైంది. నేను వెంటనే తనకి ఊదీని, ఊదీతీర్థాన్ని ఇచ్చి పడుకోబెట్టాను. కొంతసేపటికి చలి తగ్గాక బాబా నామం చెప్పుకుంటూ తడిబట్టతో బాబు శరీరాన్ని తుడిచాను. తరువాత భయంతో నేను, "బాబా! హాస్పటల్‌కి వెళ్ళే అవసరం లేకుండా ఊదీతోనే బాబుకి విరోచనాలు, జ్వరం తగ్గిపోయేలా కృప చూపు సాయీ. మీ కృపవలన హాస్పటల్‌కి వెళ్ళే అవసరం లేకుండా బాబు పూర్తి ఆరోగ్యవంతుడవ్వాలి. మీ అపారప్రేమను, మీరు మాపై చూపుతున్న కరుణను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను సాయీ" అని ప్రార్థించాను. బాబా ఎంతటి దయార్ద్రహృదయుడంటే, ఉదయం నిద్రలేచాక మా బాబు, "మమ్మీ! జ్వరం, విరోచనాలు తగ్గిపోయాయి" అని చెప్పాడు. ఆనందంతో ఊపిరి పీల్చుకుని మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! మీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!"
ఒకరోజు మావారు తన చేయి లాగుతుందని, నొప్పిగా ఉందని నీరసంగా కూర్చున్నారు. నేను మావారి చేతికి బాబా ఊదీ రాసి, ఊదీతీర్థాన్ని ఇచ్చాను. వెంటనే మావారి చేతి సమస్య సమసిపోయింది. మేము ఊదీని, ఊదీతీర్థాన్ని తీసుకునే సమయంలో 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తాము. ఈ మంత్రం గురించి బ్లాగులో సాయిబంధువులు తమ అనుభవాలలో చెప్పడం వల్ల ఎందరో సాయిబంధువులకు ఉపయోగకరంగా ఉంది. సాయిబంధువులకు నా కృతజ్ఞతలు. అలాగే ఒకసారి మేము ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఈ బ్లాగులో ఒక సాయిబంధువు పంచుకున్న 'బాబా తన భక్తులనెన్నడూ నీచస్థితిలో ఉంచరు' అనే వాక్యం నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. దాంతో, 'ఒక భక్తుడి అనుభవం మరో భక్తునికి దారి చూపించడానికే' అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. భక్తుల అనుభవాలను సేకరించి బాబా ప్రేమను సాయిబంధువులందరికీ పంచుతున్న ఈతరం 'హేమాడ్‍పంత్' అనే మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. "బాబా! సాయిలీలలు అనే అమృతాన్ని ప్రతిరోజూ బ్లాగు ద్వారా సేవించే అదృష్టాన్ని మాకు కల్పించిన మీకు సాష్టాంగ దండప్రణామాలు. మీ పాదాలే మాకు శరణం సాయీశ్వరా!".
సద్గురు చరణం భవభయ హరణం, సాయినాథ శరణం!!!
శిరిడీ ప్రయాణం ఆగిపోకుండా కాపాడిన బాబా
సాయిబిడ్డలందరికీ నమస్కారం. భక్తులందరినీ తమ అనుభవాలను పంచుకునేలా ప్రోత్సహిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు దేవి. 1981వ సంవత్సరంలో మా పెద్దమ్మగారి కూతురి కుటుంబం, వాళ్ళతోపాటు మా పెద్దమ్మ కొడుకు ఆదిత్య శిరిడీకి ప్రయాణం పెట్టుకున్నారు. వాళ్లంతా రైల్వేస్టేషన్‌లో రైలు రాకకోసం ఎదురుచూస్తుండగా మా పెద్దమ్మ కొడుకు ఆదిత్య రైలు వచ్చి, కదలడానికి ఇంకా సమయం ఉందనుకుని పండ్లకోసమని తన అక్కావాళ్ళను వదిలి స్టేషన్ బయటకు వెళ్ళాడు. అయితే కొద్దిసేపటికే రైలు రావడం, బయలుదేరటానికి సిద్ధంగా ఉందని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ రిజర్వేషన్ టిక్కెట్లు ఆదిత్య దగ్గర ఉండటం వల్ల అతని అక్కావాళ్ళు పిల్లలతో సహా సామాన్లు పట్టుకుని ట్రైన్ ఎక్కకుండా ఆదిత్య రాకకోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు ఆతృతగా చూస్తున్నారు. అంతలో అతని అక్కకు ఒక రెప్పపాటుకాలం బ్రిడ్జి మెట్లు దిగుతూ ఆదిత్య కనిపించినట్లైంది. వెంటనే ఆమె, "అదిగో ఆదిత్య" అని అరిచింది. వెంటనే అందరూ చకచకా రైలు ఎక్కి సామాను సర్దుకుని కూర్చున్నారు. ఐదు నిమిషాల్లో రైలు కదిలింది. సరిగా అప్పుడే ఆదిత్య పరుగున వచ్చి రైలు ఎక్కాడు. అప్పుడుగానీ అతని అక్కకు అర్థం కాలేదు, కొంతసేపటిక్రితం తన తమ్ముడు ఆదిత్య బ్రిడ్జి మెట్లు దిగుతున్నట్లుగా బాబా తనకి భ్రమ కలిపించారని. దాంతో ఆమె తమ శిరిడీ ప్రయాణం ఆగిపోకుండా కాపాడిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంది.
బాబా ఆశీస్సులు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!
ముందుగా బాబాకి, గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయిప్రేమ. మాది తిరుపతి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2022, ఫిబ్రవరి 15న నేను దాదాపు రోజంతా రాత్రి పడుకునే వరకు ఆఫీసులో, ఇంట్లో ఎక్కడున్నా బాబా నామం చెప్పుకుంటూ బాబా ధ్యాసలో గడిపాను. ఆరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో శిరిడీలోని సమాధిమందిరం కనిపించింది. మరుసటిరోజు పొద్దున్నే శిరిడీ నుండి నాకు ఒక ఫోటో (ఆ ఫోటోను కింద జతపరుస్తున్నాను) పంపారు. అది చూసినంతనే నేను అమితానందాశ్చర్యాలకు లోనయ్యాను. ఎందుకంటే, రాత్రి నేను ఏ దృష్టాంతాన్నైతే చూశానో ఆ ఫోటో అచ్చం అలానే ఉంది. ఆ విధంగా బాబా ఆశీస్సులు పొందిన నా ఆనందాన్ని మీతో సంతోషంగా ఇలా పంచుకున్నాను.
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
ReplyDeleteOm srisairam thank you sister 🙏
ReplyDeleteOm sai ram ��
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SAI RAM
ReplyDeleteOM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteఓం శ్రీ షిరిడీ సాయి నాథా య నమః.🙏🙏🙏
ReplyDelete