1. బాబా ఏ సమస్యా రానివ్వరు - ఒకవేళ వచ్చినా బాబా ఉన్నారు
2. అంతా మన బాబా దయే కదా!
3. సాయితండ్రి అనుగ్రహంతో తగ్గిన నడుమునొప్పి
బాబా ఏ సమస్యా రానివ్వరు - ఒకవేళ వచ్చినా బాబా ఉన్నారు
ముందుగా బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. మా వీధిలో నీటి సమస్య ఉండటం వల్ల మంచినీళ్లకి చాలా ఇబ్బందిగా ఉండేది. రెండురోజులకోసారి మంచినీళ్ళు పట్టుకునేవాళ్ళం. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. ఒకసారి మంచినీళ్ల కోసం ఎంత ఎదురుచూసినా నీళ్ళు రాలేదు. నాకు ఏం చెయ్యాలో అర్థంకాక, "బాబా! నీళ్ళు వచ్చేలా చూడండి. నీళ్ళ సమస్య లేకుండా చూడండి బాబా. మీ దయవలన నీళ్ళు వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. అలా అనుకున్న వెంటనే నీళ్ళు రావడం మొదలైంది. ఇంక అప్పటినుంచి ఇప్పటివరకు రోజూ నీళ్ళు వస్తున్నాయి. అడిగినంతనే సమస్య లేకుండా చేశారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీరు ఉండగా నీళ్ళ సమస్యే కాదు, అసలు ఏ సమస్యా రానివ్వరు. ఒకవేళ వచ్చినా మీరు ఉన్నారనే ధైర్యం మాకు ఉంది బాబా".
కొన్నిరోజుల ముందు నేను వేరే ఊరికి వెళ్ళాను. అక్కడనుంచి వచ్చేటప్పుడు బ్యాగులో బట్టలు పెడదామని కూర్చుంటే నా కాలు బెణికింది. తరువాత బస్సులో 6 గంటలు కూర్చుని ప్రయాణించేసరికి కాలు బాగా వాచింది. దాంతో కట్టు ఏమైనా వేయాల్సి ఉంటుందేమోనని నాకు చాలా భయం వేసింది. అంతలా భయపడటానికి కారణమేమిటంటే, మా నాన్నగారి చెయ్యి విరిగాక కట్టు తీసి అప్పటికి నెల కూడా కాలేదు. అంతలోనే నాకు కట్టు వేయాల్సి వస్తుందంటే ఇంట్లో అందరూ బాధపడతారు. అందుకని నేను నా కాలు సంగతి ఇంట్లో చెప్పలేదు. కానీ కాలు వాపు బాగా పెరగడం వల్ల అమ్మకి విషయం తెలిసి తను బాగా భయపడింది. అప్పుడు నేను, "బాబా! నా కాలు వాపు తగ్గి, పూర్తిగా సెట్ అయ్యేలా చూడండి. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. 5 రోజులకి నా కాలు వాపు తగ్గడమే కాకుండా నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయి నార్మల్ అయ్యింది. ఇదంతా బాబా దయవలనే. లేదంటే, నా కాలు ఉన్న పొజిషన్‌ను బట్టి ఎవరైనా ఖచ్చితంగా కట్టు వేస్తారు, కనీసం 2 నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్తారు. కానీ అదేం లేకుండా కేవలం 5 రోజుల్లో బాబా అంతా నార్మల్ చేశారు. "థాంక్యూ బాబా".
2022, ఫిబ్రవరి 10న మా ఫ్రెండ్‌వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అని మా అక్క నన్ను మా ఫ్రెండ్‌వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళమని తన కొడుకుకి చెప్పింది. సరేనని మా అక్కకొడుకు నన్ను బైక్ మీద తీసుకుని వెళ్తుంటే, ఆ దారిలో ఒకచోట వివాహ వేడుక జరుగుతుండటం వల్ల ముందుకు పోవడానికి దారి లేదు. దాంతో మా అక్కకొడుకు వేరే దారిలో తీసుకుని వెళ్తానని మా ఇంటి వైపుగా వెళ్తుండగా బైక్ స్లిప్ అవడంతో నేను బైక్ మీద నుంచి కింద పడిపోయాను. వెంటనే ఒక ఆంటీ నన్ను పట్టుకున్నారు. లేదంటే, నేను రోడ్డుకి ఆనుకునేదాన్ని, దెబ్బలు గట్టిగా తగిలేవి. నాకైతే ఆ ఆంటీ రూపంలో బాబానే వచ్చి నన్ను కాపాడారు అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా".
అంతా మన బాబా దయే కదా!
నా పేరు సూర్యనారాయణమూర్తి. మేము హైదరాబాదులోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్నాము. నేనిప్పుడు ప్రియమైన సాయిబంధువులతో 2022, జనవరి చివరివారంలో మరియు 2022, ఫిబ్రవరి రెండవవారంలో బాబా నాకు ప్రసాదించిన అద్భుత లీలలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా, 2022 జనవరి 29వ తేదీ రాత్రి (తెల్లవారితే 30వ తేదీ) నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక అందమైన విశాల ప్రదేశంలో చాలామంది ప్రజలు ఉండటం చూశాను. వాళ్లంతా దేనికోసమో ఎదురుచూస్తున్నారు. వాళ్లలో నాకు తెలిసిన కొందరు సాయిభక్తులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరిని నేను, "ఈ హడావిడి ఏమిటి?" అని అడిగాను. అందుకతను, "ఇక్కడ మరికొద్దిసేపట్లో 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' నామసప్తాహం ప్రారంభం కానుంది. కార్యక్రమాన్ని ప్రారంభించే వారికోసం ఎదురుచూస్తున్నామ"ని చెప్పారు. అంతేకాక, "కొద్దిగా లోపలికి వెళితే బాబా విగ్రహం ఉంది. దర్శనం చేసుకుని రండి" అని చెప్పారు. అతని మాట ప్రకారం నేను లోపలికి వెళితే అక్కడ కాషాయరంగులో ఉన్న ఒక పెద్ద నిలువెత్తు బాబా విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తూనే నాకు సాక్షాత్తు బాబానే చూస్తున్న అనుభూతి కలిగి, 'ఇక్కడ బాబానే నిలబడి ఉంటే వీళ్ళు చూడలేదా? తెలియక బాబా విగ్రహమన్నారా?' అని అనుకుంటూ ఉండగా బాబా ఇలా అన్నారు, "చూడు బాబూ! ఇక్కడికి కొద్దిసేపట్లో శంకరయ్య (కీ.శే. డి.శంకరయ్యగారు అంకిత సాయిభక్తులు. వారు 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' నామ ప్రచారకులు) వచ్చి నామసప్తాహం ప్రారంభిస్తారు" అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతలోనే చక్కటి వస్త్రధారణలో శ్రీశంకరయ్యగారు అక్కడికి వచ్చారు. ఆయన వస్తూనే నన్ను చూసి, "నువ్వు బాబా పక్కన ఉండటం చాలా ఆనందంగా ఉంది. బాబా నామసంకీర్తన ప్రారంభిద్దాం, రా" అని నన్ను పిలిచి వెంటనే బిగ్గరగా 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని రాగయుక్తంగా పాడుతూ బాబాతో కలిసి భక్తుల పైనుండి ఆకాశంలోకి వెళ్ళిపోయారు. తరువాత నాకు మెలకువ వచ్చింది. బాబా దివ్యదర్శనానికి నా ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది.
తరువాత 2022, ఫిబ్రవరి 11 నాటి రాత్రి సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మా పెద్దమ్మాయి ఫోన్ చేసి మా అల్లుడుగారి ఆరోగ్యం కొంత ఇబ్బందిగా ఉందని, అవసరమైతే ఆ ఆరాత్రి వాళ్ళ ఇంటికి రావాల్సి ఉంటుందని చెప్పింది. తిరిగి రాత్రి గం.10:30ని.లకు నాకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. అంత రాత్రివేళ మేము క్యాబ్‌లో 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. నేను వెంటనే, "బాబా! మా అల్లుడి ఆరోగ్యం నెమ్మదించేలా చూడండి. మీ దయవల్ల ఇది జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆ బాబా దయవల్ల 20 నిమిషాలకు మా అమ్మాయి ఫోన్ చేసి, "ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది, అవసరమైతే పొద్దున్న రండి" అని చెప్పింది. నేను ఆ రాత్రి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' నామాన్ని జపిస్తూ గడిపాను. పొద్దున్నే మా అమ్మాయి ఫోన్ చేసి, "ఆయనకు ఎటువంటి ఇబ్బందీ లేదు. డాక్టర్ అవసరం కూడా లేద"ని సంతోషంగా చెప్పింది. ఇదంతా మన బాబా దయే కదా! మన బ్లాగ్ ఒక 'దివ్యహుండీ'. ఇందులో మన మ్రొక్కులు వేయగానే బాబా అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఈ బ్లాగ్ నిర్వాహకులైన సాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ బ్లాగులో మరిన్ని బాబా లీలలను చదువుకునేలా బాబా మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయితండ్రి అనుగ్రహంతో తగ్గిన నడుమునొప్పి
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీనివాసరెడ్డి. నా తల్లి, తండ్రి, గురువు అయిన సాయినాథుని దివ్యపాదాలకు శతకోటి ప్రణామాలు. సాయిబంధువులకు నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను గత రెండు నెలలుగా బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదువుతున్నాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని తొలిసారి బ్లాగులో పంచుకుంటున్నాను. ఒకసారి నేను కుర్చీలో కూర్చుని, పైకి లేస్తున్నప్పుడు నడుమునొప్పి వచ్చి రెండు, మూడు రోజులైనా తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! నా ఈ నడుమునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని, నొప్పి ఉన్న చోట కొద్దిగా ఊదీ రాసి, మరికొంత ఊదీని నీళ్లలో వేసుకుని పుచ్చుకున్నాను. సాయితండ్రి అనుగ్రహంతో నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. నేను నా అనుభవం వ్రాయడంలో ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి సాయీ".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeletePlease cure health with. Out surgery om sai ram.
ReplyDeletePlease be with us.give blessings to us.om sai ram
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete