సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1104వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, బాబా వింటారు
2. కేవలం బాబా కృపతో ఏదైనా సంభవం
3. బాబాకు నా మీద ఎంత ప్రేమో!

హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, బాబా వింటారు


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా అందరికీ నమస్తే. ఈ బ్లాగు నిర్వహిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న బ్లాగు నిర్వాహక బృందానికి ధన్యవాదాలు. బాబా మిమ్మల్ని, మీ బృందాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఈ బ్లాగులోని సమాచారాన్ని చదివి బాబాపట్ల భక్తిని పెంపొందించుకోవాలని సదా ఎదురుచూస్తుంటాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే..  గత కొన్ని నెలల్లో నా భర్త తీవ్ర అస్వస్థతకు గురై రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. ఆయన 27 కిలోల బరువు తగ్గి చాలా బలహీనపడిపోయారు. బాబా దయవల్లనే ఆయనకి స్వస్థత చేకూరి ఈరోజు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. బాబా చాలా సందర్భాలలో తమ భక్తులతో ఉంటారు. అది అర్థం చేసుకోవడంలో మనం కొన్నిసార్లు విఫలమవుతాము.


ఒకసారి ఒకే వారంలో మూడు కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా మేము ఆదివారంనాడు మా ఇంట్లో ఒక పూజ చేసి, ఆ మరుసటి మంగళవారంనాడు 21 రోజుల వ్రత సమాప్తి చేయాల్సి ఉంది. అదే సమయంలో నాకు నెలసరి సమయం వచ్చింది.  అప్పుడు నేను, "బుధవారం వరకు నా నెలసరి వాయిదా వేయమ"ని బాబాను ప్రార్థించాను. నేను చాలా ఆందోళన చెందినప్పటికీ బాబా నా కోరిక మన్నించారు. ఆయన దయవల్ల నేను ఏ అంతరాయం లేకుండా రెండు పూజలూ చేసుకోగలిగాను. తరువాత బుధవారంనాడు, 'గ్లోబల్ మహాపారాయణలో భాగంగా మరుసటిరోజు చివరి 50, 51 అధ్యాయాలు చదివి ఆరతి ఇవ్వాల'ని నాకు గుర్తు వచ్చింది. నేను ఆ అధ్యాయాలు చదివి, ఆరతి ఇవ్వాలని అనుకున్నాను. కానీ నెలసరి వస్తే, నేను అనుకున్నట్లు చేయడానికి కుదరదు. అందువల్ల నేను మళ్ళీ బాబాను, "శుక్రవారానికి నా నెలసరి వాయిదా వేయమ"ని ప్రార్థించాను. బాబా నా ప్రార్థనలు ఆలకించి శుక్రవారానికి నా నెలసరి వాయిదా వేశారు. హృదయపూర్వకంగా బాబాను ప్రార్థిస్తే, ఆయన వింటారు.


ఆదివారంనాడు మా ఇంటికి వచ్చిన అతిథులకు కోవిడ్ రాకూడదని నేను బాబాను ప్రార్థించాను. చుట్టుపక్కల దాదాపు అందరికీ కోవిడ్ వస్తున్నా బాబా దయవల్ల మా ఇంటికొచ్చిన అతిధులెవరికీ రాలేదు. అయితే మా పిల్లలకు కోవిడ్ వచ్చింది. కానీ బాబా కృపవలన పెద్దగా లక్షణాలు కనిపించలేదు. ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తున్నారు. మేము కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తమ సమయాన్ననుసరించి వాటన్నింటినీ పరిష్కరిస్తారనే నమ్మకం నాకు ఉంది. చివరిగా నా అనుభవాలు చదువుతున్న ప్రతి ఒక్కరినీ, అలాగే వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ రక్షించమని బాబాను ప్రార్థిస్తున్నాను. ఇంకా నా అనుభవాలు పంచుకునే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు.


కేవలం బాబా కృపతో ఏదైనా సంభవం


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి భక్తులకు మరియు సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు సరిత. నేను ఇప్పుడు బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను మూడోసారి ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. 2021, నవంబర్ నెలలో మా ఇంటి డాక్యుమెంట్ల కోసం నేను, నా భర్త ఎంతగానో వెతికాము. కానీ అవి దొరకలేదు. వాటిని మావారు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. ఇల్లంతా గాలిస్తున్నప్పటికీ అవి కనిపించకపోయేసరికి మావారికి టెన్షన్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా డాక్యుమెంట్లు దొరికేలా చూడు తండ్రి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని, 'శ్రీసాయి సూక్ష్మరూపాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ మళ్ళీ వెతకసాగాను. కొంతసేపటికి అలమారాపైన ఒక ఫైల్‍లో ఆ డాక్యమెంట్లు కనిపించాయి. ఇది కేవలం బాబా కృపనే. ఆయనను తలచుకోగానే డాక్యుమెంట్లు దొరికాయి.


2022, ఫిబ్రవరి 17, గురువారంనాడు నేను మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అప్పటికే కొత్తగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టి రెండుసార్లు బోరు వేస్తే ఫెయిల్ అయ్యింది. దాంతో మూడోసారి బోరు వేయడానికి సిద్ధమై, నన్ను కొబ్బరికాయ కొట్టి పని మొదలుపెట్టమన్నారు. నేను సరేనని, బాబాను తలుచుకుని, "బాబా! బోరు విజయవంతమవ్వాలి తండ్రి. అదే జరిగితే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టాను. బోర్ వేయడం మొదలుపెట్టారు. కానీ ఈసారి కూడా ఫెయిల్ అయ్యింది. అయినా నేను నిరంతరాయంగా బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళు వెంటనే నాల్గవ చోట బోర్ వేయడం మొదలుపెట్టారు. బాబా కృపతో ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఇది కేవలం బాబా చేసిన అద్భుతం. "థాంక్యూ వెరీ మచ్ బాబా"


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబాకు నా మీద ఎంత ప్రేమో!


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. నేను బాబా భక్తురాలిని. ఒకసారి నేను మా అమ్మవాళ్ల ఊరు వెళుతున్నప్పుడు 'ఒక మనిషి నాకు కనిపించకుండా ఉండాలని, అలా కనిపించకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను' అని బాబాకి నమస్కారం చేసుకున్నాను. బాబా దయవల్ల ఆ మనిషి కనపడకుండానే నేను మా అమ్మవాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను.


నేను ప్రతిరోజూ ఏది చేసినా మొదట బాబాకి నివేదిస్తాను. అయితే ఒకసారి కొంచం ఆటంకమొచ్చి బాబాకి నివేదించలేకపోయాను. ఆరోజు లుంగీ, లాల్చీ ధరించి, తలకి కండువా చుట్టుకుని, గడ్డం ఉన్న ఒకతను నడుచుకుంటూ పోతూ కనిపించాడు. నేను ఇంతకుముందెప్పుడూ అతన్ని చూడలేదు. నాకు అతను అచ్ఛం బాబాలానే అనిపించి, 'నా పరిస్థితి గమనించి నా మీద ప్రేమతో బాబానే వచ్చార'ని అనుకున్నాను. వెంటనే మా ఇంట్లో ఉన్న అరటిపండ్లు, ఒక ఆపిల్ మా పాపతో అతనికి ఇప్పించాను. అతను వాటిని ఆరగించారు.  'నా బాబాకు నా మీద ఎంత ప్రేమో!' అని నేను చాలా ఆనందించాను. మరొక మంచి అనుభవంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. 


జై శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!



6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram my sister in law is suffering from cancer.please cure her Baba.Be with us Baba.Give blessings to us.my husband has surgery.please avoid surgery with your blessings

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo