1. బాబా కరుణాకటాక్ష వీక్షణాలు
2. చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాయి తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు3. బాబా మీద భారం వేసి, ఆయన నామస్మరణ చేస్తుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి
బాబా కరుణాకటాక్ష వీక్షణాలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఈ ఆధునిక సాయి సచ్చరిత్రను(బ్లాగు) నిర్వహిస్తున్న సాయి బృందానికి, సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుండి మేము బాబాని కొలుస్తున్నాము. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. మేము ఊహించని విధంగా మా అమ్మాయికి మెడిసిన్ కోర్సులో సీటు ప్రసాదించి చాలా గొప్పగా అనుగ్రహించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా 'బాబా' అని మనస్ఫూర్తిగా వేడుకున్నంతనే, వెన్నంటుండి 'నేనుండగా భయమెందుక'ని అభయాన్నిచ్చి చేయి పట్టుకుని నడిపిస్తున్న ఆ సాయినాథుని లీలలు వర్ణించాలంటే మహాగ్రంథమే అవుతుంది. విదేశాలలో ఉంటున్న మేము ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఆ సమయంలో ఉన్న కోవిడ్ నిబంధనలననుసరించి ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా టెస్ట్ చేయించుకుంటే, బాబా రిపోర్టు నెగటివ్ వచ్చేలా చేసి ఏ సమస్యా లేకుండా అనుగ్రహించారు. తరువాత కారు పార్కింగ్ విషయంలో మెషిన్ తప్పుగా రీడ్ చెయ్యటం వలన పార్కింగ్ చార్జీలు అధికంగా వచ్చాయి. ఆ విషయంలో మా ప్రయత్నమేమీ లేకుండానే వాటిని దయతో బాబా సరిచేశారు.
విమాన ప్రయాణం చేసేటప్పుడు నాకు చెవి నొప్పి వస్తుంది. కుడిచెవి విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటాను. ఇయర్ ప్లగ్ వాడినా, చూయింగ్ గమ్ నమిలినా ఏ మాత్రమూ ఉపశమనం ఉండదు. నేను బాబాతో, "బాబా! ఈసారి చెవినొప్పి రాకుండా చూడండి" అని చెప్పుకున్నాను. ఇక బాబా చూపిన అనుగ్రహం చూడండి. ఇప్పటికి పదిసార్లు విమాన ప్రయాణం చేసిన నేను మొట్టమొదటిసారి చెవినొప్పి లేకుండా విమానం దిగాను.
ఇకపోతే ఇండియాలో దిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు యథాలాపంగా కొంతమందిని ఎంపిక చేసి తిరిగి ఆర్.టి.పి.సి.ఆర్ చేస్తారని మాకు తెలిసింది. బాబా దయవలన ఆ సమస్య నుండి కూడా బయటపడ్డాము. ఇండియాకి వచ్చిన వెంటనే వయస్సులో పెద్దవాళ్ళైన నా తల్లిదండ్రులను, ఇతర బంధువులను చూడాలని వెళ్ళాము. వాళ్ళకి, మాకు, మా అమ్మాయికి కరోనా ప్రభావం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా బాబా అనుగ్రహించారు. ఆయన కృపవలన ఈ ప్రయాణంలో కరోనా వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా ఉన్నాము. "బాబా! మీ చల్లని కరుణాకటాక్ష వీక్షణాలు, అనుగ్రహం మా కుటుంబం మీద, అందరి మీద ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సదా మీ నామస్మరణ చేస్తూ మీ ధ్యాసలోనే ఉండేలా అనుగ్రహించండి బాబా.
చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాయి తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు
ఓం శ్రీసాయి ప్రేమమూర్తయే నమః!!! సాయి బంధువులు అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు మన సాయి ప్రేమాశీస్సులను మీతో పంచుకోవాలని వచ్చాను. 2021, మే నెలలో మాకు కరోనా వచ్చి తగ్గాక మా తమ్ముడు, "కొన్నిరోజులు తన దగ్గర ఉండమ"ని అంటే తనతోపాటు బయలుదేరాము. ఎప్పుడు ప్రయాణంలో ఉన్నా బాబా ఫోటోగాని, మధురమైన ఆయన నామంగాని కనిపించాలని చూడటం తెలియకుండానే నాకొక సెంటిమెంట్ అయిపోయింది. చేతిలో బాబా ఫోటో ఉన్నా కూడా బయటకి చూస్తుంటాను. అయితే ఆరోజు నేను గమనించానో, లేదో లేక బాబానే కనిపించలేదో కానీ సగం దూరం వెళ్ళేవరకు నేను బాబాను ఎక్కడా చూడలేదు. ఇక అప్పటినుంచి జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టాను. అదేం చిత్రమోగానీ కనీసం సాయి అన్న నామం కూడా కనిపించలేదు. 'కోవిడ్ తగ్గాక అదే మొదటి ప్రయాణం. ఎందుకు బాబా కనిపించలేద'ని కొంచెం ఏదోలా అనిపించింది. మొత్తానికి మా ప్రయాణం పూర్తయి కారు తమ్ముడి వాళ్ళ అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. తమ్ముడు కారు దిగి గేట్ తీయటానికి వెళ్ళాడు. మేం ఇంకా కారులోనే ఉన్నాం. ఈలోపు అమ్మ, "అటు చూడు" అని ఒక భవనాన్ని చూపించింది. అది రెండు అంతస్తుల భవనం. దానిపై 'ద్వారకామాయి నిలయం' అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇంకా ఆ రెండు అంతస్తుల్లో రెండు పెద్ద పెద్ద 'బాబా ఫొటోలు' ఉన్నాయి. అంతకుముందు కూడా మేము తమ్ముని ఇంటికి వెళ్ళాము. కానీ, అప్పుడెప్పుడూ ఇలా బాబా ఫొటోలు మేము చూడలేదు. అమ్మ కూడా అదే అనింది, 'కొత్తగా పెట్టారు అనుకుంటా' అని. మొత్తానికి నేను కారు దిగేలోపు నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించారు నా సాయి. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంట్లోకి వెళ్ళగానే నాకు ఎంతో ఇష్టమైన నేరేడుపళ్ళతో బాబా స్వాగతం పలికారు. ఇందులో పెద్ద విశేషమేముందని మీకు అనిపిస్తుంది కదా! కానీ విశేషముంది. కరోనా వచ్చిన సమయంలో నాకు నేరేడుపళ్ళు తినాలని చాలా అనిపించింది. వాటికోసం తమ్ముడు తన స్నేహితుల ద్వారా చాలా ప్రయత్నించాడు కానీ, దొరకలేదు. ఇప్పుడు కూడా తమ్ముడు వాటిని కొనలేదు. మావయ్య వాళ్ళ పొలంలో కాసాయని పంపించారు. మేము వస్తున్నట్లు ఆయనకి తెలియదు. ఆయన అంతకుముందు పుచ్చకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు మొదలైనవి పంపారుకానీ నేరేడుపళ్ళను పంపటం ఇదే మొదటిసారి. ఇదంతా యాధృచ్ఛికంగా జరిగింది అంటారా? చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాయి తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో కదా! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీలైనప్పుడల్లా ఒక్కొక్కటిగా పంచుకుంటాను. "మీ ప్రేమని పంచుకోవటంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
బాబా మీద భారం వేసి, ఆయన నామస్మరణ చేస్తుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి
నా పేరు శ్రీదేవి. మాది గుంటూరు. ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. మన జీవితాలలో బాబా ప్రసాదించిన అద్భుత లీలలను పంచుకునేందుకు బాబా మనకిచ్చిన అపూర్వమైన అవకాశం ఈ వేదిక(బ్లాగు). ఈ బ్లాగు ద్వారా బాబా అనుగ్రహించిన ఎన్నో అనుభవాలను మీ అందరితో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా అమ్మ ఆరోగ్య విషయంలో ప్రతి చిన్న సమస్యను బాబాకు చెప్పుకుంటూ, వారి అనుగ్రహాన్ని ఈ బ్లాగులో పంచుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే... మేము మా అమ్మగారి తల నరాలకి సంబంధించి మందులు వాడుతుండగా ఒకసారి అమ్మ తనకి 'ఒక కన్ను సరిగ్గా కనపడటం లేదని, ఒక నిమిషం వరకు అంతా చీకటిగా ఉండి, తరువాత మళ్ళీ మామూలుగా ఉంటుంద'ని చెప్పింది. అందుచేత అమ్మని న్యూరాలజీ డాక్టరుకి చూపించాము. అప్పుడు నేను, "బాబా! అమ్మ కంటి నరాలలో ఏ సమస్యా లేదని చెప్పాలి" అని బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల అమ్మకి చెకప్ చేసిన డాక్టరు, 'అమ్మ కంటి నరాలు బాగున్నాయని, ఆమె ఎక్కువగా ఆలోచిస్తుంద'ని చెప్పి నాలుగు రోజులకి మందులు రాసిచ్చి, "తగ్గకపోతే నాలుగు రోజుల తరువాత కంటి డాక్టరుకి చూపించమ"ని అన్నారు. నా బాబా దయవల్ల అమ్మకి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనం బాబా మీద భారం వేసి ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయిని నా నమ్మకం. బాబా అనుగ్రహం మన అందరిపై ఉండాలని ఆ తండ్రిని వేడుకుంటూ...
శ్రీసాయినాథాయ నమః!!!
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai please be with my husband.today is surgery.please bless him
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete