1. అనారోగ్యానికి కలలో వైద్యం చేసిన బాబా
2. బాబా నామంతో సమస్యలు మాయం
అనారోగ్యానికి కలలో వైద్యం చేసిన బాబా
బాబా నామంతో సమస్యలు మాయం
నా పేరు శ్రీదేవి. మన సాయితండ్రి పిలిస్తే పలికే దైవం కదా! నేను కోరిన కోరికలను తీరుస్తూ ఇంకా ఇంకా తమపై విశ్వాసం, ప్రేమ పెరిగేలా చేస్తున్నారు మన సాయితండ్రి. ఒకసారి సంవత్సరంపాటు మా అత్తగారిని తలనొప్పి ఎంతగానో బాధిచింది. ఒకటి, రెండుసార్లు డాక్టరుని సంప్రదిస్తే, ‘సైనస్’ అని చెప్పి కొన్ని మందులిచ్చారు. అవి వాడినప్పటికీ, తగ్గినట్లే తగ్గి మళ్లీ నొప్పి ఆమెను బాధిస్తుండేది. 2021, సెప్టెంబరు 17న ఆవిడ మరోసారి డాక్టరు దగ్గరికి వెళ్లారు. కాసేపటికి నేను ఫోన్ చేస్తే, "డాక్టరు తలకి స్కానింగ్ చేయించమని చెప్పారు. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నామ"ని అన్నారు. అప్పుడు నేను, "అత్తయ్య స్కానింగ్ రిపోర్టులో ఎటువంటి పెద్ద సమస్యా లేకుండా ఉండేలా చూడమ"ని బాబాను వేడుకుని రిపోర్టు వచ్చేదాకా బాబా నామస్మరణ చేసాను. బాబా దయవలన, 'పెద్దగా సమస్యేమీ లేదని, మందులతో తగ్గిపోతుంద'ని డాక్టర్ చెప్పారు. ఇదంతా నా సాయితండ్రి దయే.
2021లో మా అన్నయ్యకి ఆర్థికంగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ కారణంగా తనదికాని సమస్యకు తను డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను అప్పుడు "అన్నయ్యకి సహాయం చేయమ"ని బాబాను వేడుకుని, 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే మంత్రాన్ని పఠించసాగాను. బాబా దయవల్ల ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. "ధన్యవాదాలు బాబా. కానీ బాబా, ఎప్పుడైనా మళ్ళీ ఈ సమస్య వస్తే, తనదికాని సమస్యకు అన్నయ్య డబ్బులు కట్టాల్సి వస్తుందని మీకు తెలుసు. కాబట్టి అసలు వ్యక్తుల ద్వారా ఆ డబ్బును తిరిగి ఇప్పించి అన్నయ్యను సమస్య నుండి పూర్తిగా కాపాడు తండ్రీ. సమస్య చిన్నదైనా, పెద్దదైనా నీవు తప్ప మాకు దిక్కెవరు బాబా?"
2021, సెప్టెంబరు 18న రాత్రి 11 గంటల సమయంలో నా స్నేహితురాలి చేయి విపరీతంగా నొప్పి పెట్టసాగింది. తను చెయ్యి కదిలించలేక చాలా ఇబ్బందిపడుతూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని తన చేతికి రాసుకుంది. తన భర్త డాక్టరుని పిలిపించి, నొప్పి తగ్గటానికి ఇంజక్షన్స్ వేయించారు. రెండు ఇంజక్షన్లు వేసినప్పటికీ తనకి నొప్పి తగ్గలేదు. తను భరించలేని నొప్పితో బాధపడుతూ నన్ను తలచుకుందట. సరిగ్గా అప్పుడే నాకు హఠాత్తుగా మెలకువ వచ్చి, 'ఇప్పుడెందుకు మెలకువ వచ్చిందా?' అనుకుంటూ మొబైల్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్ చేస్తే, హిందీలో ఉన్న సాయి సందేశం ఒకటి నా కంటపడింది. బాబాపట్ల నా మనసులో ఉన్న భావాలకు, ఏ సేవ చేయలేకపోతున్నానన్న బాధకు తగ్గట్టు బాబా ఇచ్చిన ఆ సందేశం వింటుంటే నా కళ్ళంట నీళ్లు వచ్చేసాయి. ఆ సందేశం బాబా నాకే ఇచ్చినట్లు ఉన్నప్పటికీ అంత మంచి సందేశాన్ని ఎవరికైనా పంపిస్తే బాగుంటుందనిపించి మా బ్రదర్‌కి, నా స్నేహితురాలికి పంపాను. వెంటనే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నేను తన కాల్ చూసి, 'అయ్యో ఈ సమయంలో మెసేజ్ పంపి తనని డిస్టర్బ్ చేసానా ఏంటి?' అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాను. తను, "ఈ సమయంలో మెసేజ్ చేసేవేంటి? సరేగాని, నాకు బాగోలేదు. కొద్దిసేపటి క్రితమే నొప్పి భరించలేక బాబాని తలుచుకుంటూ 'నువ్వేం చేస్తున్నావో' అని నిన్ను కూడా గుర్తు చేసుకున్నాను" అని చెప్పి ఏడ్చింది. 'ఇందుకేనేమో నన్ను లేపి, సందేశాన్ని పంపించారు బాబా?' అని నాకనిపించింది. అప్పుడు నేను తనతో, “బాబా ఊదీ రాసుకుని, బాబా నామస్మరణ చేస్తూ ఉండు. రేపటికల్లా నీ చేయినొప్పి తగ్గుతుంది" అని చెప్పి తను తన బాధను మరిచిపోయేలా బాబా గురించి మాట్లాడుతూ తెల్లవారుజామున మూడుగంటల వరకు సత్సంగం చేశాను. అప్పుడిక తను నిద్రపోతానంటే నేను ఫోన్ పెట్టేసాను. మరుసటిరోజుకి కూడా తనకి కొద్దిగా నొప్పి ఉండటంతో హాస్పిటల్‌కి వెళదామని అనుకున్నారు. కానీ నేను వాళ్ళ అమ్మాయితో, "నువ్వు మీ అమ్మకోసం, 'హాస్పిటల్‌కి వెళ్లకుండా అమ్మకు ఊదీతో ఇంటివద్దే నయమైపోయేలా అనుగ్రహిస్తే సచ్చరిత్ర పారాయణ చేస్తాన'ని బాబాకి మొక్కుకోమ"ని చెప్పాను. తను అలాగే చేస్తానని చెప్పింది. ఆరోజు సాయంత్రానికి హాస్పిటల్‌కి వెళ్లకుండానే సాయి మహత్యం వల్ల నొప్పి తగ్గిందని నా స్నేహితురాలు చెప్పింది. తరువాత ఆదివారంనాడు నేను నా స్నేహితురాలితో మాట్లాడినప్పుడు తను, "చేయినొప్పి లేదు కానీ రెండు వేళ్ళు స్పర్శ లేకుండా ఉన్నాయి, భయమేస్తోంది" అని చెప్పింది. అయితే, బాబా ఊదీ రాసుకుంటూ, బాబా నామం చేస్తూ, స్తవనమంజరి వింటూ ఉంటే బాబా దయవలన తను తన సమస్య నుండి పూర్తిగా బయటపడింది. నా సాయితండ్రికి వేలవేల వందనాలు.

Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness.jai sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
🕉 sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌹🤗🌺😀🌼🥰🌸
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalu teerchu thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDelete