సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 920వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకు చెప్పుకుంటే పరిష్కారమవుతుంది
2.బాబా ఎన్నోసార్లు ఆపదల నుండి రక్షించారు
3.నాన్న ఆరోగ్యాన్ని కాపాడిన సాయితండ్రి
4. నార్మల్‌గా కోవిడ్ తగ్గిపోయేలా చేసిన బాబా 

సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకు చెప్పుకుంటే పరిష్కారమవుతుంది


సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 3 సంవత్సరాల క్రితం మావారు మా బంధువులొకరి దగ్గర మూడు లక్షల యాభైవేల రూపాయలు అప్పుగా తీసుకుని మరో బంధువుకి అప్పు ఇచ్చారు. అతను ఇంతవరకు వడ్డీ కూడా కట్టలేదు సరికదా, పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడు. తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మినా కూడా 25% అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి. అటువంటివాళ్ళకి నమ్మకంతో వేరే చోట తెచ్చి, అప్పు ఇచ్చి మావారు సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇకపోతే, మావారికి అప్పుగా డబ్బిచ్చిన బంధువులు తామిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని ఇటీవల అడిగారు. అదికూడా, రెండురోజుల్లో మూడు లక్షల రూపాయలు ఇచ్చేలా చూడమని ఒత్తిడి చేశారు. అప్పుడు నేను, "బాబా! ఉన్నపళంగా మూడు లక్షల రూపాయలు ఎలా తెస్తాము? వాళ్లకు డబ్బు వేరేచోటనుండి సర్దుబాటు అయ్యేలా చేసి, మావారిని డబ్బు అడగకుండా చూడండి" అని బాబాను ప్రార్థించాను. ‘అలా జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. నేను అలా బాబాను వేడుకున్న తరువాత చిత్రంగా మా బంధువులకు డబ్బు వేరేచోటనుండి అందింది. దాంతో వాళ్ళు మావారిని డబ్బులు వెంటనే ఇమ్మని అడగలేదు. కానీ త్వరలో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలని, కాబట్టి తామిచ్చిన మూడున్నర లక్షల రూపాయలు వడ్డీతో సహా కావాలని అడుగుతున్నారు. "బాబా! దయచేసి మా వద్ద అప్పు తీసుకున్నవాళ్ళకు మంచి జరిగి, తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేటట్లు చేయండి. మావారు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇలా మధ్యలో ఉండి అప్పు ఇప్పించడం తప్పే అయినా మాపై దయచూపి సహాయం చేయండి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నువ్వున్నావనే ధైర్యమే మమ్మల్ని నడిపిస్తోంది. మాకు ఎల్లవేళలా అండగా ఉండి మమ్మల్ని కాపాడు తండ్రీ".


బాబా ఎన్నోసార్లు ఆపదల నుండి రక్షించారు


ముందుగా సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు నవ్య. నేను ఇంతకుముందు కూడా నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు నాల్గవ అనుభవం పంచుకుంటున్నాను. నాకు కోవిడ్ వచ్చి తగ్గిన మూడునెలల తరువాత, ఒకరోజు అనుకోకుండా బాబా గుడి దగ్గర వ్యాక్సిన్ వేస్తుంటే, నేనూ వ్యాక్సిన్ వేయించుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. అదేరోజు మా ఫ్రెండ్ కూతురి శారీ ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. అదేరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు. మా ఇంటి యజమాని కూడా అప్పుడే వచ్చారు. నేను కాస్త టెన్షన్ పడ్డప్పటికీ ఆరోజు పగలంతా హుషారుగా బాగానే ఉన్నాను. రాత్రికి మాత్రం ఫుల్ ఫీవర్, ఒళ్లునొప్పులు. దాంతో నాకు చాలా భయమేసి, బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగుతూ గడిపాను. కానీ మరుసటిరోజు ఉదయం లేవలేకపోయాను. టాబ్లెట్ వేసుకున్నాక తగ్గింది. అంతలో ఇంకొక ఫ్రెండ్ కూతురిది శారీ ఫంక్షన్ ఉంటే, ఫోటో షూట్ కోసం పాపని రెడీ చేసి, మా అపార్టుమెంటులో ఉన్న పార్కుకి తీసుకెళ్ళాను. అంతా బాగానే జరిగింది. ఫోటో షూట్ అయిపోయాక నేను ఇంటికి వచ్చేస్తుంటే, మా ఫ్రెండ్ వాళ్ళు నన్ను ఇంటికి పోనివ్వకుండా, నేను ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా నన్ను షాపింగ్‌కు తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన కాసేపటికే నా కన్ను క్రింద వాచినట్లు ఉబ్బిపోయింది. చాలాసేపటివరకూ అది తగ్గకపోయేసరికి నాకు భయమేసింది. వ్యాక్సిన్ వల్ల ఇలా అవుతుందా అని టెన్షన్, ఏడుపు ఒకటే తక్కువ. నీళ్ళతో కడిగిన వెంటనే బాబా ఊదీ గుర్తొచ్చి, నా పర్సులో ఉన్న ఊదీ తీసి కంటి క్రింద రాసుకున్నాను. ఇంకా, "బాబా! ఇది ఉదయానికల్లా తగ్గిపోతే ఈ అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. కాసేపటికి వాపు కొంచెం తగ్గింది. అప్పుడిక అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చాము. విచిత్రం ఏమిటంటే, ఇంటికి వెళ్ళేసరికి కంటి క్రింద వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఇలా బాబా నన్ను ఎన్నోసార్లు ఆపదల నుండి రక్షించారు. బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. "బాబా! మీరు లేకపోతే నేనీరోజు ఏమయ్యేదానినో, తలుచుకుంటేనే భయమేస్తోంది. మీరు ఎప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని ఆపదల నుండి రక్షించండి బాబా. థాంక్యూ బాబా”.


నాన్న ఆరోగ్యాన్ని కాపాడిన సాయితండ్రి


సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. మాది నెల్లూరు. గత 4 సంవత్సరాలుగా నాకు బాబాతో చాలా అనుబంధం ఏర్పడింది. ఎంత అంటే, అన్నిటికీ 'సాయి ఉన్నారు' అని అనుకునేంతలా. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, ఆగస్టు 30న కామెర్లు, పొట్టఉబ్బరంతో నాన్న అనారోగ్యంపాలై చాలా బాధని అనుభవించారు. దాంతో నాన్నని చెన్నైలోని విజయ హాస్పిటల్లో చేర్చాం. డాక్టరు కిడ్నీ ప్రాబ్లం అయివుండొచ్చని అనుమానపడి నాన్నని ఒకరోజు ICUలో ఉంచారు. అయితే బాబా దయవలన కిడ్నీ ప్రాబ్లమ్ కాదని రిపోర్ట్ వచ్చింది. అనారోగ్యంతో నాన్న చాలా బలహీనపడిపోయినప్పటికీ సాయి దయవల్ల తొందరగానే డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ బిల్లు 2 లక్షల రూపాయలు అయింది. సాయి కృపవలన మాకు డబ్బులు ఇవ్వాల్సినవాళ్ళు మేము అడుగకముందే డబ్బులు తిరిగి ఇవ్వడంతో ఎటువంటి ఇబ్బందీ మాకు కలుగలేదు. ఇలా అడుగడుగునా బాబా మాతో ఉండి నాన్నను కాపాడారు. "బాబా! ఇంకా మేము అర్థంకాని చాలా సమస్యలతో బాధపడుతున్నాము. ఆ సమస్యల నుంచి బయటపడేసి, ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఇంట్లో అందరూ మంచి ఆరోగ్యంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉండే రోజులు త్వరగా వచ్చేలా అనుగ్రహించు తండ్రీ. మా అన్నకి మంచి అమ్మాయితో దసరానాటికల్లా పెళ్లి జరిగేలా చూడు తండ్రీ. నా బిడ్డ త్వరగా నడవాలి. తను చక్కగా మాట్లాడుతూ అందరు పిల్లల్లాగా బాగుండాలి తండ్రీ. తెలిసీ తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రీ".


ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా.


నార్మల్‌గా కోవిడ్ తగ్గిపోయేలా చేసిన బాబా


సాయిభక్తులకు నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. మా ఇంట్లో అందరం బాబా భక్తులం. బాబా మాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇటీవల జరిగిన ఒక అనుభవం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2021, ఆగస్టులో మా ఇంట్లోవాళ్ళకి కోవిడ్ వచ్చింది. మేము అప్పుడు, "ఏంటి బాబా ఈ పరీక్షలు? ఎందుకిలా ఇబ్బందిపెడుతున్నావు? ఏమీ లేకుండా తగ్గిపోవాలి" అని దణ్ణం పెట్టుకున్నాము. బాబా దయవల్ల కోవిడ్ చాలా నార్మల్‌గా తగ్గిపోయింది. బాబా మన వెనకాలే ఉంటూ సదా కాపాడుతుంటారు. "ధన్యవాదాలు బాబా".



10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jai sairam. Bless amma for her eye operation and bless me for my health and wealth. Jai sairam

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba na samasyalani teerchu thandri

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo