సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 925వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాతో చెప్పుకున్నంతనే పరిష్కారమైన సమస్యలు
2.  'నువ్వు నా నీడలో ఉన్నావు, ఏం చింతించకు!'
3. వరద నుండి బాబా రక్షణ

బాబాతో చెప్పుకున్నంతనే పరిష్కారమైన సమస్యలు


అందరికీ నమస్తే. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నా పేరు అంజలి. 2021, సెప్టెంబర్ నెల మొదటివారంలో ఒకరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున బాబు ఆరోజు అస్సలు లేవలేదు. రోజంతా మంచం మీద పడుకునే ఉన్నాడు. రాత్రికి జ్వరం మరింత ఎక్కువ అయ్యేసరికి నాకు భయమేసి, "బాబా! ఎలాగైనా బాబుకి మామూలు జ్వరం అయ్యుండాలి తండ్రి. రెండు రోజుల్లో పాప బర్త్ డే ఉంది. కాబట్టి ఇంట్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడు తండ్రీ" అని కన్నీళ్ళతో బాబాను వేడుకున్నాను. ఇంకా బాబు గురించి, అలాగే మా కుటుంబం గురించి సంకల్ప పారాయణ గ్రూపులో ప్రార్థన పెట్టించాను. రెండోరోజు ప్రార్థన జరిగే సమయానికల్లా నా దయగల తండ్రి ఊదీ నీళ్లతో బాబుని నార్మల్ చేశారు. నేను నా మనసులో, 'బాబుకి జ్వరం తగ్గిపోయింది, అనవసరంగా ప్రార్థన పెట్టించానా?' అని అనుకున్నాను. నేను అలా అనుకున్న కొద్దిసేపటికి బాబుకి మళ్లీ జ్వరం వచ్చింది. దాంతో నా పొరపాటు నాకు అర్థమై, "క్షమించండి బాబా. మీ దయతో ఊదీ ప్రభావం వల్ల, ఇంకా మీకు చేసే ప్రార్థన వల్లే జ్వరం తగ్గింది. దయచేసి నన్ను క్షమించు తండ్రి" అని వేడుకున్నాను. అంతే కాసేపటికి జ్వరం తగ్గి మళ్లీ రాలేదు. బాబు తొందరగా నార్మల్ అయి చాలా ఆక్టివ్ అయ్యాడు. బాబా దయవల్ల నాకు, మావారికి, మా పాపకి ఎటువంటి ఇబ్బందిలేక అందరమూ బాగుండటంతో మా పాప బర్త్ డే సంతోషంగా జరుపుకున్నాము.


నేను రోజూ సంకల్ప ప్రేయర్ గ్రూపుకోసం పారాయణ చేస్తుంటాను. ఒకరోజు ఆలస్యమైనందున ఇంట్లో పారాయణ చేయకుండా ఆఫీసుకు వెళ్ళిపోయాను. ఆఫీసుకి వెళ్లిన తరువాత ఫోన్ లో చదువుదామని ఓపెన్ చేస్తే, ఫోన్ లో నేను పారాయణ చేయాల్సిన 27వ అధ్యాయం తెరుచుకోలేదు. మా గ్రూపులో అందరూ పారాయణ చేసారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. నా ఒక్కదాని వలన పారాయణ పూర్తి అయినట్లు రిపోర్టు చేయడం ఆగిపోతుందని చాలా టెన్షన్ గా అనిపించి, "బాబా! నాతో పారాయణ పూర్తి చేయించండి" అని బాబాని వేడుకున్నాను. తరువాత బాబా నాకు ఒక ఆలోచననిచ్చారు. తదనుగుణంగా వెంటనే ఆఫీసులోని నా సిస్టమ్ లో గూగుల్లో సాయిసచ్చరిత్ర పిడిఎఫ్ అని కొట్టాను. బాబా దయవలన నేను పారాయణ చేయాల్సిన 27వ అధ్యాయం తెలుగులో దొరికింది. చాలా ఆనందంగా పదినిమిషాల్లో పారాయణ పూర్తిచేసి రిపోర్టు పెట్టాను. అంతా బాబా దయ.


ఇంకోరోజు మా ఇంట్లోని కొత్త వాటర్ ఆక్వాగార్డు పని చేయలేదు. అప్పుడు నేను, "అది మంచిగా పనిచేసేలా చూడు బాబా" అని చెప్పుకున్నాను. అంతే, బాబా దయవల్ల కొద్దినిమిషాల్లో ఆక్వాగార్డు పని చేయడం మొదలుపెట్టింది. తరువాత 2021, సెప్టెంబర్ 9, గురువారంనాడు మావారికి ఒళ్ళునొప్పులతో చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆ విషయం ఆయన నాతో ఆరోజు సాయంత్రం చెప్పారు. నేను బాబాకి నమస్కరించుకుని, "తెల్లారికి అంతా నార్మల్ అయ్యేలా చూడు స్వామి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు తెల్లారికి మావారు నార్మల్ అయ్యారు. ఇలా బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదిస్తున్నారు. ఈ బ్లాగుని బాబానే నడిపిస్తున్నారు. బ్లాగులో పంచుకుంటే బాబాతో చెప్పుకున్నట్లే. నాకు ఏ సమస్య వచ్చినా బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకుంటాను. అలా చెప్పుకున్నంతనే సమస్య పరిష్కారమవుతుంది. "బాబా! మా అందరి మీద మీ దయ ఇలాగే ఉండాలి తండ్రీ. మీకు మాటిచ్చినట్లు నేను నా అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. తప్పులేవైనా ఉంటే క్షమించండి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై.


 'నువ్వు నా నీడలో ఉన్నావు, ఏం చింతించకు!'


'సాయి మహారాజ్ సన్నిధి'కి, సాయి కుటుంబానికి నా నమస్కారాలు. నా పేరు లలిత. ఈమధ్య కాలంలో బాబా ప్రసాదించిన అనుభవాలను నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు ఉన్నట్టుండి నా ఛాతీలో బాగా నొప్పి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నువ్వే మాకు దిక్కు. నాకు చిన్నచిన్న పిల్లలున్నారు. నాకు ఏమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? బాబా దయచేసి నాకు ఈ నొప్పి నుండి విముక్తిని ప్రసాదించండి. నాకు నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని మన సాయి కుటుంబంలో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత కొంచం బాబా ఊదీని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి, మరికొంత నీళ్లలో కలుపుకుని త్రాగి బాబా జపం చేశాను. బాబా నాపై దయ చూపారు. కొద్దిసేపట్లో నొప్పి తగ్గింది. అలా బాబా కృపతో నా సమస్య తీరింది.


ఇంకోసారి నా ఎడమ దవడ కింద చిన్న గడ్డ లేచింది. అప్పుడు నేను, "బాబా! నాకు ఏ సమస్యా లేకుండా చూడండి. ఇది మామూలు గడ్డ అయినట్లయితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధిలో పంచుకుంటాను, 108 ప్రదక్షిణలు చేస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. అలా బాబాకి చెప్పుకున్న తరువాత బాబా, "నీ బాధలు ఒకటి తరువాత ఒకటి తగ్గించుకుంటూ వస్తున్నాను. నువ్వు నా నీడలో ఉన్నావు, ఏం చింతించకు!" అని ఒక సందేశమిచ్చారు. దాంతో నాకెంతో సంతోషంగా అనిపించింది. తరువాత కొద్దిగా బాబా ఊదీ ఆ గడ్డ మీద రాసి, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. అలా ఐదు రోజులు చేసిన తరువాత హాస్పిటల్ కి వెళితే డాక్టరు చూసి, "ఏం ప్రమాదం లేదు. ఇది మామూలు గడ్డే" అన్నారు. బాబా దయవల్లే ఇది సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మీ ప్రేమ అందరిపై ఉండాలి".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


వరద నుండి బాబా రక్షణ


ముందుగా సాయి మహారాజ్‌కి ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు సరిత. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. గత సంవత్సరం వరదలొచ్చి మా కాలనీలోని చాలామంది ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మా ఇంట్లోకి కూడా మోకాలు లోతు నీళ్లు వచ్చి చాలా నష్టం వచ్చింది. అందువల్ల ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వర్షాలకు మేము చాలా భయపడి, "బాబా! ఇంట్లోకి నీళ్ళు రాకుండా చూడయ్యా. ఈ సంవత్సరం వరదల నుండి కాపాడితే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటామ"ని బాబాను వేడుకున్నాము. హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పటికీ బాబా దయవలన మా ప్రాంతంలో వరదవలన ఎటువంటి సమస్య రాలేదు. బాబా కృపవలన మేము క్షేమంగా ఉన్నాము. "థాంక్యూ బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.



9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation and bless me for my health and wealth of life. Jaisairam

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.. Om Sai Ram

    ReplyDelete
  4. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  6. Baba na samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  7. Pls Na job lo problems anni theesey.... Or nannu job lo nunchi theesey... Om sairam

    ReplyDelete
  8. నీ మహిమలు అమోఘం.. మీ అద్భుతమైన లీలలు మాకు సాయి అమృతం.. మా జీవితం లో అనేకంగా మీ దయ తో గొప్ప గొప్ప అనుభవాలు పొందినాము.. సాయిబాబా దేవా నీ నామస్మరణ గొప్ప దివ్యఔషాదం.. మా అనారోగ్యం రూపుమాపి నిర్మూలించి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యం తో ఉండి.. మీయొక్క అద్భుతమైన మహిమలు, అమోఘమైన లీలలు ప్రపంచం అంతటా ప్రచారం చేసుకునే గొప్ప సువర్ణవకాశం ప్రసాదించి నందుకు కృతజ్ఞతలు సాయిరాం దేవా.. హృదయ పూర్వక నమస్కారాలు శత కోటి సాష్టాంగ ప్రణామములు సాయిరాం బాబా దేవా..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo