సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 916వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నవారికి అన్నీ తామే చూసుకుంటారు బాబా
2. సాయి ఇచ్చిన ఆరోగ్యం
3. వెన్నంటే ఉంటారని నిదర్శనమిచ్చిన బాబా

నమ్ముకున్నవారికి అన్నీ తామే చూసుకుంటారు బాబా


బాబా పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు. 'సాయిని నమ్ముకున్నవారికి అన్నీ తామే చూసుకుంటారు' అనే సత్యాన్ని గుర్తుచేస్తూ బాబా చేయించిన మా పాప వివాహం గురించి పంచుకుంటాను.


నా పేరు లక్ష్మి. నేను మా పాప పెళ్లి విషయంలో, "ఈ వివాహం నువ్వే చేయించాలి తండ్రీ" అని బాబాపై భారం వేసి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్ చూశాను. అందులో, "నువ్వు కూర్చో! అన్నీ నేను చూసుకుంటాను" అని బాబా సమాధానం వచ్చింది. దాంతో నాకు ధైర్యం చేకూరింది. ఆ ధైర్యంతో ఏర్పాట్లు చేసుకున్నాము. పెళ్లికి మూడునెలల ముందు మేము వంటవాళ్ళని మాట్లాడుకున్నాము. అయితే వాళ్ళు నెల ముందు ‘మేము రాము’ అన్నారు. మేము టెన్షన్ పడి బాబాని తలుచుకుంటూ చాలామంది వంటవాళ్ళను అడిగినప్పటికీ ఎవరూ కుదరలేదు. ఈలోపు మా ఊరి బాబా గుడిలో ఉన్న మావారి స్నేహితుడు, "ఆ విషయం నేను చూస్తాలే" అని గుడిలో చేసే వంట ఆమెను పంపారు. బాబా చేసిన లీలకు చాలా సంతోషించాము.


ఇంకో విషయం ఏమిటంటే, పెళ్లికి ముందు తుఫాన్ అనేసరికి మళ్ళీ టెన్షన్. కానీ, 'అన్నీ చూసుకునే ఆ తండ్రి ఉండగా భయం లేదు' అనిపించింది. అలాగే ఆ వారమంతా వర్షం వలన ఏ ఇబ్బందీ లేకుండా చేసి అన్ని కార్యక్రమాలూ చాలా చాలా చక్కగా జరిపించారు బాబా.


ఇంకో వింత జరిగింది. పెళ్లి రోజు ఉదయం కళ్యాణమండపానికి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటున్నాము. ఇంతలో రెండు బీరువాల తాళాలు కనిపించలేదు. ఎంత వెతికినా కనపడలేదు. అప్పుడు నేను, మా పాప బాబాని తలచుకుని, దణ్ణం పెట్టుకున్నాము. అంతే, పదినిమిషాల్లో తాళాలు కనిపించాయి. దాదాపు రెండుగంటలపాటు టెన్షన్ పడిన తరువాత బాబాని తలచుకున్న వెంటనే, "నేను ఇక్కడే ఉన్నాను" అన్నట్టు తాళాలను చూపించి, తమ ఉనికిని తెలియజేశారు బాబా.


చివరిగా, మేము కరోనా సమయమని చాలా తక్కువమందిని పెళ్ళికి ఆహ్వానించాము. కానీ, మేము 200 మంది అనుకుంటే 400 మందికి పైగా వచ్చారు. అయినప్పటికీ బాబా దయవలన భోజనాల దగ్గర ఏ ఇబ్బందీ లేకుండా అందరికీ భోజనాలు పెట్టగలిగాము. అందరూ ‘భోజనాలు చాలా బావున్నాయ’ని ప్రశంసించేసరికి మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా ఏ ఆటంకమూ లేకుండా పెళ్లి చాలా బాగా జరిపించారు బాబా. ఈ వివాహం ఏ ఆటంకం లేకుండా జరిగితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని అనుకున్న నేను, ఆగస్టు 11న పెళ్ళైతే 20 రోజులు ఆలస్యంగా నా అనుభవాన్ని పంపుతున్నందుకు బాబాను క్షమించమని వేడుకుంటున్నాను. "థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సాయితండ్రీ. కరోనా నుంచి అందర్నీ కాపాడు తండ్రీ".


ఈ అనుభవాన్ని చదివిన మీ అందరూ కూడా మా పాపని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ... అందరికీ ధన్యవాదాలు.


సాయి ఇచ్చిన ఆరోగ్యం

ఓం శ్రీ సాయినాథాయ నమః.

సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. సాయి నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు నాకు జరిగిన మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈమధ్య నా భార్యకు ఉన్నట్టుండి ఒకేసారి జలుబు, జ్వరం మొదలయ్యాయి. ఇది అసలే కరోనా సమయం కావడం వల్ల నాకు చాలా భయం వేసింది. కానీ 'మన సాయితండ్రి ఉండగా భయం ఎందుకు?' అని కొంచెం బాబా ఊదీని నా భార్య నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. నాలుగు రోజులలో జలుబు, జ్వరం తగ్గుముఖం పట్టాయి. ఆమెకు తగ్గుతోంది అనుకునేలోపే నాకు మొదలయ్యాయి. ఆరోజు గురువారం అయినందున నేను మహాపారాయణ గ్రూపులో సభ్యుడినిగా సచ్చరిత్రలోని రెండు అధ్యాయాలు పారాయణ చేయాల్సి ఉంది. కానీ నా పరిస్థితి చూస్తే, జ్వరంతో ఒకటే చలిగా ఉంది. అప్పుడు నేను బాబాని ఒకటే వేడుకున్నాను, "నేను ఈ రెండు అధ్యాయాలు పూర్తిచేస్తాను. సాయంత్రంలోగా జ్వరం, జలుబు అన్నీ తగ్గేటట్టు చేస్తే నా అనుభవాన్ని గ్రూపులో పంచుకుంటాను బాబా" అని. తరువాత ఏదోవిధంగా పారాయణ పూర్తిచేశాను. బాబా దయతో ఆ సాయంత్రానికి నా ఆరోగ్యం కుదుటపడింది. అయితే నాకు, నా భార్యకి తగ్గగానే మా బాబుకి జలుబు, దగ్గు మొదలయ్యాయి. మరలా బాబాను వేడుకున్నాను, "బాబా! మీ దయతో మా బాబుకి కూడా తగ్గి, వాడు ఆరోగ్యంగా ఉంటే ఆ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని. బాబా కృపవలన ఇప్పుడు మేమందరమూ బాగున్నాం. ఇది మాకు బాబా ఇచ్చిన ఆరోగ్యం. బాబాకిచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

కొన్నిరోజుల తర్వాత అల్సర్ వల్లనో, గ్యాస్ట్రిక్ వల్లనో గానీ, నా చేతిలో, కడుపులో ఒకటే మంటగా ఉండేది. అన్నం తినేటప్పుడు, మ్రింగేటప్పుడు గొంతులో ఏదో అడ్డంపడుతూ మంటగా ఉంటుండేది. టాబ్లెట్స్ వేసుకున్నా అలాగే ఉండేది. అప్పుడు నేను, "సాయీ! ఈరోజు సాయంత్రానికల్లా ఛాతీలో మంట తగ్గితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాన"ని బాబాని వేడుకున్నాను. అద్భుతం! సాయంత్రానికల్లా మంట తగ్గిపోయి హాయిగా అనిపించి, సాయంత్రం సంతుష్టిగా అన్నం తిన్నాను. సాయి మహరాజుకు వేలవేల నమస్కారాలు.  

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

వెన్నంటే ఉంటారని నిదర్శనమిచ్చిన బాబా

సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ఎంతటి కష్టమైన పనైనా సాయిని నమ్ముకుని భారం ఆయన మీద వేస్తే, సులభదాయకం చేస్తారు. ఇక నా అనుభవానికి వస్తే... నేను వైద్య సంబంధిత కోర్సు చదువుకున్నందువల్ల మా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే, వాళ్ళకి అవసరమైన ఇంజెక్షన్లు చేస్తుంటాను. ఒకసారి మా పక్కింటి ఆంటీకి జ్వరం వస్తే, హాస్పిటల్‌కి వెళ్ళి ఐవి క్యాన్ పెట్టించుకున్నారు. కానీ అది సైడ్ అయ్యి వాపు వచ్చింది. అందువల్ల మళ్లీ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె నన్ను పెట్టమన్నారు. అయితే, నేను ఎప్పుడూ ఐవి పైప్ పెట్టలేదు. అందువల్ల కాస్త టెన్షన్‌గా అనిపించినప్పటికీ తప్పనిసరి పరిస్థితి అయి బాబా మీద భారం వేసి నాకు తెలిసిన పద్ధతిలో ఐవి పెట్టాను. బాబా దయవల్ల చక్కగా పెట్టగలిగాను. బాబానే నాచేత చేయించారు. బాబా తన భక్తులను అడుగడుగునా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తారనడానికి నిదర్శనాన్ని నాకు ఈవిధంగా ప్రసాదించారు. "బాబా! మీకు ధన్యవాదాలు, శతకోటి వందనాలు తండ్రీ. ఇలాగే, నేను అనుభవిస్తున్న వేదన నుండి పూర్తిగా బయటపడేలా నన్ను అనుగ్రహించు తండ్రీ".


6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼😀🌹🤗🌸🥰🌺

    ReplyDelete
  3. Jaisairam. Bless my mother for her eyes surgery and bless me for health and wealth. Jai sairam

    ReplyDelete
  4. Om sai ram baba na samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo