సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 928వ భాగం....


భక్తులకు బాబా పుణ్యతిధి శుభాకాంక్షలు
ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో తీరిన సమస్యలు - ఆరోగ్యం
2. ఏ ఆటంకాలూ లేకుండా బాబా నెరవేర్చిన పెళ్లికల

బాబా కృపతో తీరిన సమస్యలు - ఆరోగ్యం

సాయిబంధువులకు నా నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఈ బ్లాగులో నా అనుభవాలను కొన్నిటిని పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలతో మీ ముందుకు వచ్చాను.

మొదటి అనుభవం: ఇండియాకి ట్రిప్ వెళ్ళిన అనుభవం

మేము వృత్తిరీత్యా సౌదీలో ఉంటాము. మాకు ప్రతి సంవత్సరం సెలవులు ఇస్తారు. కరోనా కారణంగా ఇండియాకి వెళ్ళక దాదాపు సంవత్సరం 8 నెలలు అవుతోంది. దాంతో సెలవులకు ఇండియాకి వెళ్ళాలని అనిపించింది. కానీ కరోనా కారణంగా ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. ఈ విషయంగా ఒక సాయిభక్తురాలిని అడిగితే, తను సచ్చరిత్ర పుస్తకం ద్వారా బాబాను అడిగింది. అందులో, బేలాపూర్ పోవుటకు శ్రీమతి నిమోన్కర్ బాబాను అనుమతి అడిగినప్పుడు, “బేలాపూర్ వెళ్ళి 4 రోజులు బంధువులతో సంతోషంగా గడిపి రా” అని బాబా చెప్పిన లీల వచ్చింది. దాంతో, ఎప్పుడూ నాకు కాల్ చేయని తను వెంటనే నాకు కాల్ చేసి, “బాబా చెప్పారు, సంతోషంగా ఇండియా ప్రయాణం చేయండి” అని అన్నది. నాకు చాలా సంతోషం వేసింది. ఇదిలా ఉండగా, మావారు నాతో, “ఇప్పుడు ఇండియా వెళ్ళడానికి హాస్పిటల్ వాళ్ళు టికెట్లు ఇవ్వడం లేదు. మనం మన డబ్బు పెట్టుకొని వెళ్ళాలి. దానిగురించి ఆలోచిద్దాం” అని అన్నారు. బాబాని అడిగితే ‘ఇండియా వెళ్ళమ’ని సమాధానం వచ్చింది. బాబా మాటను అనుసరించి మేము ఆనందంగా ఇండియాకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తరువాత, అంతకుముందెన్నడూ నాతో మంచిగా ఉండని కొందరు బంధువులు, కుటుంబసభ్యులు నాతో మంచిగా ఉన్నారు. ఎక్కడా ఏ సమస్యా రాలేదు. 

ఇండియాలో ఉండగా ఒకరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. ఒకవేళ అది కరోనా ఏమోనని భయం వేసి, ‘సెలవులకు ఇండియా వెళదామని ఉన్నప్పటికీ మనసులో కాస్త భయంగా అనిపించి వెనకాడుతున్నప్పుడు, బాబా వెళ్ళమంటేనే కదా ఆనందంగా ఇండియా వచ్చాను. ఇప్పుడు ఇలా జరుగుతుందేమిటి?’ అనుకుని, బాబుకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను వేడుకున్నాను. తరువాత బాబుకి కోవిడ్ టెస్ట్ చేయిస్తే రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. బాబుకి వచ్చింది వైరల్ ఫీవర్. బాబా దయవల్ల మూడు రోజుల్లో తనకు జ్వరం తగ్గిపోయింది

మాకు మొత్తం 32 రోజులు సెలవులు ఉన్నాయి. ఇండియాలో 20 రోజులు గడిపిన తరువాత, ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే నాకు ఉన్నట్టుండి కళ్ళు బాగా తిరగటంతో అసలు కళ్ళు కూడా తెరవలేకపోయాను. ఒక్కసారిగా భయం వేసింది. నా భర్త తనకు తెలిసిన డాక్టరుకి కాల్ చేస్తే, తలతిరిగే సమస్యేమోనని (vertigo problem) కొన్ని మందులు ఇచ్చారు. నాకు ఆల్రెడీ సర్వికల్ స్పాండిలైటిస్ సమస్య ఉంది. ‘అందువల్లనే ఈ సమస్య వచ్చిందేమో, కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంటుంద’ని అన్నారు. చాలా వికారంగా, వాంతి వచ్చేలాగా ఉండటంతోనూ ఏమీ తినలేకపోయాను. కేవలం పాలు త్రాగి టాబ్లెట్ వేసుకుని, బాబా ఊదీ పెట్టుకుని, బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. అయినా సమస్య అలాగే ఉంది. అసలు లేవలేకపోయాను, పూర్తిగా మంచంపైనే ఉన్నాను. లేస్తే కళ్ళు తిరుగుతుండేవి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆ సాయిభక్తురాలికి కాల్ చేస్తే, ‘అది దృష్టిదోషమేమో’ అన్నది. అందువల్ల ఆ సాయంత్రం దిష్టి తీయించుకున్నాను. మరుసటిరోజు ఉదయం బాబా ఊదీని పెట్టుకుని, ఊదీనీళ్ళు త్రాగి, బాబా నామస్మరణ చేయసాగాను. అయినా కళ్ళు తిరగడం అలాగే వుంది. సాయంత్రం మరోసారి బాబా ఊదీని పెట్టుకుని, ఊదీనీళ్ళు త్రాగిబాబా నామస్మరణ చేసాను. నిజానికి ఉదయం నుంచి నామస్మరణ చేస్తూనే ఉన్నాను. కానీ సాయంత్రం ఒక అరగంట మాత్రం నిరంతరాయంగా తదేక దీక్షతో స్మరణ చేశాను. బాబా అనుగ్రహంతో కొంతసేపట్లోనే నా సమస్య నుండి పూర్తిగా ఉపశమనం లభించింది. ఉదయం నుండి ఆ సమస్య వల్ల మంచంపైనే ఉన్న నేను బాబా దయవల్ల ఆ సాయంత్రానికల్లా ఒక్కసారిగా మామూలు మనిషినయ్యాను. అంతా ఒక మ్యాజిక్ లాగా జరిగింది. ఇప్పుడు కూడా ఆ అనుభవాన్ని తలచుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరుసటిరోజు నేను చింతపల్లిలోని బాబా గుడికి వెళ్ళి బాబాను దర్శించుకుని వచ్చాను. ఆ మరుసటిరోజు మళ్ళీ ఆ సమస్య కొద్దిగా మొదలైంది. మేము సౌదీకి వచ్చే రెండు మూడు రోజుల ముందు మా చిన్నపాపతో కలిసి హాస్పిటల్‌కి వెళ్ళాను. బ్రెయిన్‌కి MRI స్కానింగ్ తీశారు. ‘ఏ పెద్ద సమస్యా లేకుండా చూడమ’ని బాబాకు మ్రొక్కుకుని, బాబా నామస్మరణ చేస్తూనే ఉన్నాను. బాబా దయవల్ల రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్నాక, ఆ సాయంత్రం డాక్టర్ నాతో, “ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ చేసి తన సూచనలతో కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయండి” అని చెప్పారు. ఏ పెద్ద సమస్యా లేకుండా చూసుకున్నందుకు ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తరువాత మేము సౌదీకి తిరిగి వచ్చాము. మేము ఇండియాలో చాలా సంతోషంగా గడిపాము. ఒక విషయంలో బాబా చాలా సహాయం చేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా బాబా ఎవరో ఒకరి రూపంలో సమాధానం చెప్పి, మాకు సహాయం చేసి మమ్మల్ని ఆ సమస్య నుండి గట్టెక్కించారు. ఏదో ఋణానుబంధం వల్లనే సాయిభక్తులను బాబా మనకు పరిచయం చేసి వారి ద్వారా సహాయం చేకూరుస్తారు. “బాబా, నీ ప్రేమకి నా శతకోటి వందనాలు సాయిదేవా!” ‘క్షేమంగా ఇండియా వెళ్ళొస్తే, వెర్టిగో సమస్య తగ్గితే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాను’ అని బాబాకు చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్నట్లే ఇప్పుడు ఆ అనుభవాలను పంచుకున్నాను.

రెండవ అనుభవం: మేము సౌదీలో ఉంటామని చెప్పాను కదా. ఒకరోజు ఇంటి బయట ఒకదానిని కాల్చాను. ఆ కారణంగా కొద్దిగా పొగ వచ్చింది. అంతే, ఆ విషయంగా ఎవరో కంప్లయింట్ ఇచ్చారు. వెంటనే సెక్యూరిటీవాళ్ళు, వేరే డాక్టర్స్ మా ఇంటిముందుకి వచ్చారు. అంతా ఒక ఇష్యూ అయింది. కంప్లయింట్ రాసుకున్నారు, ఐడి డిటెయిల్స్ తీసుకున్నారు. దాంతో, ఏమైనా కేస్ అవుతుందేమోనని భయపడి, వెంటనే ‘ఈ సమస్య నుండి కాపాడమ’ని బాబాకు మ్రొక్కుకున్నాను. వెంటనే, “నేనుండగా నీకు భయం ఎందుకు? నువ్వు మనసు లోపల నుండి పిలిచినా వెంటనే పలుకుతాను” అని ఒకరి వద్దనుండి వచ్చిన మెసేజ్ ద్వారా బాబా నాకు సమాధానం ఇచ్చారు. అయినా నేను మరుసటిరోజు వరకు భయపడుతూనే ఉన్నాను. ‘దేశం కాని దేశంలో ఉన్నాము, ఇంటికి ఎవరు వస్తారో, ఏమవుతుందో’ అని బాగా ఏడ్చాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా మాకు రాలేదు. కేవలం కంప్లయింట్ తీసుకున్నారు, అంతే. అంతా బాబా దయ. కానీ నేను మాత్రం భయపడుతూనే ఉన్నాను. నేను మహాపారాయణ క్లాసులకి క్లాస్ టీచరుగా ఉంటాను. ఈ సంఘటన జరగడానికి వారంరోజుల ముందు నేను మహాపారాయణవాళ్ళతో, “చాలామంది భక్తులు పారాయణ చేయడం లేదు. అంతేకాదు, గ్రూపులో ఎక్కువమంది భక్తులు లేరు, నాకు కష్టంగా ఉంది” అని చెప్పి, మీరు వేరే క్లాస్ టీచరుని చూసుకోండి” అని చెప్పాను. ఇప్పుడు పై సంఘటన జరిగిన తరువాత, ఆరోజు ఆదివారం కదా అని ఇండియాలో ఒకరికి కాల్ చేసి, “ఒక మహాపారాయణ క్లాసులో భక్తులు తక్కువగా ఉన్నారు, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి” అని అడిగాను. తరువాత బాబాకు నమస్కరించుకుని, “ఏంటి బాబా, ఎవరూ సరిగ్గా చదవటం లేదు. ఈ క్లాసుకి ఇంకా భక్తులు కావాలి” అని అడిగాను. ఒక్క వారంరోజుల్లో బాబా చేసిన మిరాకిల్ చూడండి. అనుకోకుండా ఎవరో నాకు ‘సౌదీలో మహిళా సమైక్య’ అని గ్రూప్ లింక్ షేర్ చేశారు. నేనందులో జాయిన్ అయ్యాను. అందులో నేను నా క్లాస్ వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తే, చాలామంది భక్తులు అందులో జాయినయ్యారు. క్లాస్ ఫుల్ అయిన తరువాత కూడా ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. ఈ పనిలో పడి నేను నా భయాన్ని మర్చిపోయాను. బాబానే ఒక వారంరోజుల్లో మహాపారాయణ క్లాసుకి కావలసినంతమంది భక్తులను సమకూర్చి, ఆ పనిలో పడి నేను భయాన్ని మరచిపోయేలా చేశారు. “థాంక్యూ సో మచ్ బాబా, ఎలాంటి సమస్యా రాకుండా ఉంటే నా అనుభవాన్ని షేర్ చేసుకుంటా అనుకున్నాను, చేసుకున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. “లవ్ యు సో మచ్ బాబా!

ఏ ఆటంకాలూ లేకుండా బాబా నెరవేర్చిన పెళ్లికల


నా పేరు నళిని. నేను బాబా భక్తురాలిని. నాకు ఏదైనా కష్టమొస్తే నేను సాయిని తలచుకుంటాను. వెంటనే ఆయన నా కష్టాన్ని/బాధని తీరుస్తారు. బాబా నాకు ఎన్నోసార్లు ఎన్నో విధాల సహాయం చేశారు. బాబా ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. పెళ్లి నాకున్న ఒక కల. బాబా ఆశీస్సులతో ఆ కల ఇటీవల నెరవేరింది. పెళ్లికి ముందు కరోనా థర్డ్ వేవ్ రానుందన్న భయంతో, "ఎటువంటి ఆటంకాలూ లేకుండా నా పెళ్లి బాగా జరిగి, పెళ్లికి వచ్చినవాళ్ళకి కరోనా కారణంగా ఏమీ జరగకుండా ఉంటే నా ఆనందాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. అయితే నా పెళ్ళికి ముందురోజు చాలా పెద్ద వర్షం వచ్చింది. నాకు భయమేసి బాబాని వేడుకున్నంతలో వర్షం ఆగి నా  పెళ్లి ఎటువంటి ఆటంకాలూ లేకుండా బాగా జరిగింది. బాబా ఆశీర్వాదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. "నువ్వు ఎప్పుడూ ఇలాగే నాతో ఉండాలి బాబా. అనుకోని కారణాల వలన కొన్నిసార్లు నేను నీ పూజ చేయకపోయినా నువ్వు నాతో ఉన్నావు. ఎల్లవేళలా నన్ను అర్థం చేసుకుని ఆదరించావు. నాకు ఎవరూ లేనప్పుడు(అయినవాళ్లకు దూరంగా ఉన్నప్పుడు) నన్ను కూతురిలా చూసుకున్నావు. థాంక్యూ బాబా".



6 comments:

  1. Jaisairam bless amma for her eye operation and bless me for my health and wealth. Help me to bye a home. Jai sairam

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌹😃🌺🥰🌼🤗🌸

    ReplyDelete
  3. om sairam
    sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundela chudu thandri sainatha

    ReplyDelete
  5. Baba ma samasayalini teerchu thandri

    ReplyDelete
  6. Om sai ram please bless my family. My mom expired on 2nd October. I think she is with you❤❤❤. Please vanish my pain. Sai tandri I love you❤❤❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo