1. పుట్టినరోజున కలలో దర్శనమిచ్చిన బాబా
2. బాబా తప్ప ఈ ప్రపంచంలో మనకు తోడు ఎవరూ లేరు!
3. బాబా కృపతో తగ్గిన ఆరోగ్య సమస్యలు
పుట్టినరోజున కలలో దర్శనమిచ్చిన బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. గత 7 సంవత్సరాలుగా నేను బాబాను పూజిస్తున్నాను. ఈ 7 సంవత్సరాలలో బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించి నా జీవితాన్ని ఎన్నో ఊహించని మలుపులతో ఎంతో చక్కగా మలచి నన్ను ఒక మంచి స్థితిలో నిలబెట్టారు. నేనెప్పుడూ బాబాని ఒకటే కోరుకుంటాను, "నా ఊపిరి ఉన్నంతవరకు నేను బాబా నామస్మరణ చేస్తుండాలని, బాబా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాల"ని. ఇక నా అనుభవంలోకి వస్తే...
2021, సెప్టెంబరు 3న నా పుట్టినరోజు. ఆరోజు వేకువఝామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను, నా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. నా ఫ్రెండ్ నాతో, "అక్కడ బాబా మందిరం ఉంది. రా! వెళ్లి దర్శనం చేసుకుందాం" అని అంది. అందుకు నేను, "మందిరం తెరిచి ఉందో, లేదో" అని అన్నాను. తను, "తెరిచే ఉంటుంది. రా, వెళ్దాం" అని నన్ను తీసుకుని వెళ్ళింది. మేము దాదాపు మందిరం వద్దకు చేరుకునేసరికి, సరిగా అప్పుడే మందిరం తెరవడానికి పూజారి వస్తున్నారు. నేను హమ్మయ్య అనుకున్నాను. పూజారి లోపలికి వెళ్లి బాబాకు ఆరతి ఇచ్చారు. తరువాత నాకు మెలకువ వచ్చింది. రెండు నిమిషాలకి, 'నా పుట్టినరోజునాడు బాబా నాకు కలలో దర్శనమిచ్చి, తమ ఆరతి చూసే భాగ్యాన్ని ప్రసాదించారు' అని అనుభూతి చెంది, "నాకు ఇంతకన్నా ఏం కావాలి సాయీ? ఈ జన్మకిది చాలు బాబా. థాంక్యూ సో మచ్ సాయీ" అని బాబాకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఇంకో అనుభవం: 2021, సెప్టెంబరు 11వ తేదీ ఉదయం నా ల్యాప్‌టాప్ ఆన్ కాలేదు. అది అప్పటికి 15 రోజుల ముందు నేను క్రొత్తగా జాయిన్ అయిన కంపెనీవాళ్ళు ఇచ్చిన క్రొత్త ల్యాప్‌టాప్. అందువల్ల ఏమైందోనని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఏదో ధైర్యం, 'బాబా ఉన్నారు, చూసుకుంటార'ని. మధ్యాహ్నానికి బాబా ఊదీ సంగతి గుర్తొచ్చి బాబా ఊదీని ల్యాప్‌టాప్‌కి పెట్టి, " ల్యాప్‌టాప్ ఆన్ అయ్యేలా చూడండి సాయీ. ఆన్ అయితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతలో మా అబ్బాయి వచ్చి, "ఏమైంది అమ్మా?" అని అడిగాడు. నేను తనతో, "ఎందుకో ల్యాప్‌టాప్ ఆన్ అవట్లేదు" అని చెప్పాను. వాడు అటు ఇటు పరిశీలించి పవర్ బటన్ నొక్కాడు. వెంటనే ల్యాప్‌టాప్ ఆనైంది. అడగగానే బాబా మా అబ్బాయి రూపంలో వచ్చి నాకు సహాయం చేశారనిపించి చాలా సంతోషం కలిగింది. "అన్నిటికీ ధన్యవాదాలు సాయీ".
బాబా తప్ప ఈ ప్రపంచంలో మనకు తోడు ఎవరూ లేరు!
ముందుగా తోటి సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు సునీత. నేను ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు ఎనిమిదవసారి నా అనుభవాలు కొన్ని పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకసారి మా బాబు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డాడు. ఇవి అసలే మామూలు రోజులు కానందువల్ల చాలా భయమేసి బాబాను ప్రార్థించి, తనకు బ్లడ్ టెస్ట్ చేయించాము. బాబా దయవలన అది మామూలు జ్వరమేనని చెప్పారు. అది విని చాలా సంతోషంగా అనిపించింది. ఒక వారం రోజులు మందులు వాడిన తరువాత బాబుకి నయమైంది. కొన్నిరోజుల తర్వాత మావారికి జ్వరం వచ్చి, మూడు రోజులైనా తగ్గలేదు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "బాబా! మావారికి జ్వరం తగ్గి, మళ్ళీ రాకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. తరువాత బాబా దయవలన జ్వరం తగ్గిపోయింది.
అలాగే మరో సంఘటనను మీతో పంచుకోవాలి. ఒకరోజు కంప్యూటర్ ఆన్ చేస్తే అది ఆన్ కాలేదు. నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్తే, "కంప్యూటర్ తీసుకున్నప్పటి బిల్లు ఉంటే గనక వాళ్లకు ఫోన్ చేస్తే, వాళ్లే వచ్చి చూస్తారు" అని చెప్పింది. సరేనని మధ్యాహ్నం ఒంటిగంటకు బిల్లు కోసం వెతకడం మొదలుపెడితే సాయంత్రం 5 గంటలైనా బిల్లు దొరకలేదు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "బిల్లు దొరికితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అంతే! ఐదు నిమిషాల్లో బిల్లు దొరికింది. అద్భుతం చూడండి... నాలుగు గంటలసేపు వెతికినా దొరకని బిల్లు బాబాని ప్రార్థించినంతనే దొరికింది. ఇదీ సాయి మహిమ. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప మనమేం చేయగలం? 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే బాబా తప్ప ఈ ప్రపంచంలో మనకు తోడు ఎవరూ లేరు. మనుషులకి బాధలు చెప్పుకుంటే, ఆర్చరూ, తీర్చరు. అదే బాబాకు చెప్పుకుంటే మాత్రం వెంటనే మన బాధలు తీరిపోతాయి. "సాయీ! నాకు తల్లి, తండ్రి అన్నీ నువ్వే. నా జీవితంలోని ఒక పెద్ద అద్భుతాన్ని పంచుకోవాలి బాబా. దానికి మీ దయ కావాలి బాబా. నువ్వు నాకు తోడు ఉన్నావు. మీ అనుగ్రహంతో నా కోరిక తప్పక నెరవేరుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది బాబా". మరో అనుభవంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వర్తిస్తున్న సాయికి చాలా చాలా ధన్యవాదాలు. ఇటీవల ఒకసారి మా అమ్మకి జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లక్షణాలంటేనే చాలా భయం వేస్తుంది. వెంటనే మా అమ్మ డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. డాక్టర్ రెండు రోజులకు మందులిచ్చి, తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! అమ్మకి వచ్చింది మామూలు జ్వరమే అయివుండాలి తండ్రీ. త్వరగా తగ్గితే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవలన అమ్మకి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. తప్పులేవైనా ఉంటే క్షమించు తండ్రీ. అమ్మ ఇంకో సమస్యతో కూడా బాధపడుతోంది. దానిని త్వరగా నయం చేయి తండ్రీ. నాకు కూడా ఒక పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. దయచేసి దాన్ని కూడా తొందరగా నయం చేయండి బాబా. నిన్నే నమ్ముకున్నాను తండ్రీ. దయచేసి రక్షించండి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation and bless me for my health and wealth of life. Jaisairam
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.. Om Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri sainatha
ReplyDeleteBaba ma samasayalini teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete