సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 930వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తండ్రిలా కాపాడుతున్న బాబా
2. ప్రార్థించినంతనే జలుబు తగ్గించిన బాబా
3. బాబా ఇచ్చిన ఆనందం

తండ్రిలా కాపాడుతున్న బాబా


అందరికీ నమస్కారం. మాది ఒరిస్సా. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటినుండి సాయిభక్తురాలిని. ప్రతి కష్టంలో సాయి నాకు తోడునీడలా వెన్నంటి ఉంటూ ఒక తండ్రిలా కాపాడుతున్నారు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2017లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి డాక్టరు వద్దకు చెకప్ కోసం వెళ్ళాను. అప్పుడు డాక్టర్ నాకు స్కానింగ్ చేసి, ‘కడుపులోని బిడ్డకి ప్రేగు చుట్టుకుని ఉన్నందువలన నార్మల్ డెలివరీ కష్టమ’ని చెప్పారు. దాంతో, మా ఇంటిలో అందరూ చాలా ఆందోళన చెందారు. నేను మాత్రం బాబాపై నమ్మకముంచి, "బాబా! నా బిడ్డ క్షేమంగా ఉండాలి. తనకి ఏమీ కాకూడదు" అని చెప్పుకున్నాను. తరువాత నాకు కాన్పు నొప్పులు మొదలైనప్పుడు, "తల్లి, బిడ్డ ఇద్దరిలో ఒకరికి మాత్రమే గ్యారంటీ ఇవ్వగలమ"ని డాక్టర్ చెప్పారు. అది విని మావాళ్ళందరూ భయపడిపోయారు. నేను మాత్రం, "బాబా! నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఆపరేషన్ చేయడానికి అంతా సిద్ధం చేశాక, చివరి నిమిషంలో డాక్టర్ వచ్చి స్కానింగ్ చేసి, "ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ అవుతుంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారు" అని చెప్పారు. అంతా బాబా చేసిన అద్భుతం! బాబా దయవల్ల నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నాము. అప్పటినుండి నాకు బాబాపై నమ్మకం మరింత అధికమయ్యింది.


ఒకసారి నాకు, నా భర్తకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి, విడిపోయేంతవరకు వెళ్ళాము. అప్పుడు నేను బాబాకి మ్రొక్కుకుని సచ్చరిత్ర పారాయణ చేశాను. పారాయణ పూర్తయిన మరుసటిరోజే అనుకోకుండా నా భర్త వచ్చి, నన్ను తీసుకుని వెళ్లారు. అది జరిగి మూడేళ్ళు అవుతుంది. నా భర్త నన్ను, మా బాబుని చాలా బాగా చూసుకుంటున్నారు. అంతా బాబా అనుగ్రహం. నేను బాబాని ఇంకో కోరిక కోరుకున్నాను. బాబా అది తీరుస్తారనే నమ్మకం నాకుంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అనుగ్రహం వలన అందరికీ మంచి జరగాలి. ఇంతకుమించి మిమ్మల్ని నేనేమీ కోరుకోను".


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


ప్రార్థించినంతనే జలుబు తగ్గించిన బాబా


సాయిబంధువులందరికి నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవాలు చిన్నవైనప్పటికీ కరోనా సమయంలో అతిపెద్దవిగా అందరినీ భయపెట్టేవి. ఒకసారి మా పెద్దపాపకి బాగా జలుబు చేసింది. తన పరిస్థితి చూసి నాకు చాలా భయమేసి, "బాబా! పాపకి జలుబు తగ్గిపోయేట్లు చూడండి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకల్లా పాపకి జలుబు తగ్గిపోయింది. అలాగే, ఒకరోజు మావారికి కూడా జలుబు చేసింది. అప్పుడు కూడా నాకు భయమేసి, "నా భర్తకి జలుబు తగ్గిపోవాల"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజుకల్లా మావారికి జలుబు తగ్గిపోయింది. ఇంకోసారి, మా పాపకి దంత సమస్య వచ్చి, డాక్టరుకి చూపించుకోవడానికని హాస్పిటల్‌కి వెళితే, అక్కడ చాలా సమయం గడపవలసి వచ్చింది. మరుసటిరోజునుండి నాకు జలుబు మొదలైంది. నాకు భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నాకు ఈ జలుబు తగ్గిపోయేటట్లు చూడండి" అని మ్రొక్కుకున్నాను. అంతే, బాబా దయతో నాకు జలుబు తగ్గిపోయింది. "బాబా! ఈ అనుభవాలు వ్రాయడంలో చాలా ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. అలాగే, కరోనా సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. కానీ తప్పనిసరై వెళ్లాల్సిన పరిస్థితి. దయచేసి ఈ భయాన్ని నా నుండి తరిమేయండి బాబా. నేను చాలా సమస్యలతో బాధపడుతున్నాను. అవేమిటో మీకు తెలుసు. వాటిని తీర్చి నా మనసుకు ప్రశాంతతనివ్వండి బాబా".


బాబా ఇచ్చిన ఆనందం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలను చదువుతుంటే మనస్సుకెంతో ప్రశాంతంగా ఉంటుంది. నేనొక సాయిభక్తురాలిని. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఆనందాన్ని మీతో పంచుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈమధ్య బాబా మరియు అమ్మ ఆశీస్సులతో మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాము. బాబా అనుగ్రహంతో గృహప్రవేశం చాలా బాగా జరగడమే కాకుండా ఆ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ క్షేమంగా ఉన్నారు. ఇదంతా బాబా వల్లనే సాధ్యమైంది. బాబా మనకు ఏది మంచిదో అదే చేస్తారు. బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై, ఇంకా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా. ఈ ప్రపంచాన్ని కరోనా బారినుండి కాపాడండి".



7 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation and bless me for my health and wealth of happiness. Jai sairam

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😀🌹🌺🤗🌼😃🌸😊

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH

    Om Sai Ram

    ReplyDelete
  5. Om sai ram baba ma samasayalini teerchu thandri pleaseeee

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo