
మొదట్లో తాత్యా శ్రావణ సోమవారాలు, ఏకాదశి, మహాశివరాత్రి వంటి రోజులలో ఉపవాసముండేవాడు. అతను బాబాతో కలిసి మశీదులో నిద్రించనారంభించిన తరువాత ఆయా రోజులలో బాబా, "అరే, ఏం సోమవారం, ఏం ఏకాదశి, ఏం శివరాత్రి చేస్తావు? ఇది తిను, ఇది తిను" అంటూ అతని చేత భోజనం (మాంసం, పళ్ళు, కొలంబాలోని ఇతర...