సాయి వచనం:-
'సర్వకర్తయైన దైవాన్ని శరణు పొంది, ఓరిమితో కర్మఫలం అనుభవించు. ఆయనెలా చక్కబెడతారో చూడు!'

'మన ఆలోచనలు, మన చేతలు మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి చుట్టూ నిరంతరం పరిభ్రమించడమే- ప్రదక్షిణ' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 525వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ట్రీట్‌మెంట్ ఇచ్చిన బాబా
  2. నా ఆందోళనను తీసేసిన సాయి

ట్రీట్‌మెంట్ ఇచ్చిన బాబా

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నడుపుతున్న సాయికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కరోనా సమయంలో మీరు పంచుతున్న సాయిభక్తుల అనుభవాలు మాకెంతో మనోధైర్యాన్నిస్తున్నాయి. నా పేరు పద్మావతి. బాబాకు నేను ఒక చిన్న భక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

2020, జులై 26న (ఆదివారం) నాకు ఒళ్ళునొప్పులతో పాటు బాగా జ్వరం కూడా వచ్చింది. ఈ కరోనా సమయంలో జ్వరం రావడంతో ఏమి చేయాలో తోచక బాబాకు నమస్కారం చేసుకుని డోలో, యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకున్నాను. నాతోపాటు మావారికి, ఆ రాత్రికి మా బాబుకి కూడా జ్వరం వచ్చేసింది. భయంవల్ల పడుకున్నా నాకు నిద్రపట్టలేదు. అప్పుడు మా బాబు నాతో, “పడుకొని కూడా బాబా ధ్యానం చేసుకో అమ్మా!” అన్నాడు. దాంతో అలాగే పడుకొని, ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే నామాన్ని స్మరించుకుంటూ ఉన్నాను. అలాగే, “ఎక్కడ ఉన్నారు బాబా? ప్లీజ్, నా దగ్గరే ఉండండి, నాకు భయమేస్తోంది” అంటూ బాబాను తలచుకుంటూనే ఉన్నాను. ఆరోజు (ఆదివారం) నుండి గురువారం (ఏకాదశి) వరకు బాబా నాకు ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూనే ఉన్నారు. గురువారంరోజు బాబా మా ఇంటికి వచ్చినట్లు దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో నేను బాబా పాదాలను ప్రేమగా కడిగి, బాబాను ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాను. తరువాత నేను, “బాబా! మమ్మల్ని కాపాడండి, మీ దయవల్ల మేమంతా ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల రెండు రోజులలో మా అందరికీ జ్వరం తగ్గిపోయింది. అలా బాబా మా ఇంటికి వచ్చి మా ముగ్గుర్నీ కాపాడారు. జ్వరం తగ్గినప్పటికీ ముగ్గురం 15 రోజుల పాటు బాగా నీరసించిపోయాము. 15 రోజుల తరువాత మాకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే, అంతా నార్మల్ అని, అది మామూలు వైరల్ ఫీవర్ అని రిపోర్ట్ వచ్చింది. రిపోర్టులు పరిశీలించిన డాక్టర్, “ఇప్పటివరకు మీరు వాడిన మందులు చాలు, ఇంకేమీ వాడకండి, మంచి ఆహారం తీసుకోండి” అని అన్నారు. మేము తీసుకొన్నది డాక్టర్ ట్రీట్‌మెంట్ కాదు, బాబానే మాకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. బాబా లేకపోయుంటే మా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండేది. బాబా మా ప్రక్కనే ఉంటూ మమ్మల్ని కాపాడారు. ఇప్పుడు నాకు, మా బాబుకి తరచూ దగ్గు వస్తోంది. అది కూడా బాబా దయవల్ల త్వరలోనే తగ్గిపోతుందని అనుకుంటున్నాను. మాకు సర్వం బాబానే. బాబా మాతోపాటే మా ఇంట్లో ఉంటారు. మా అందరికీ పెద్దదిక్కు బాబానే. ఏది జరిగినా ఆయన చెప్పినట్లే జరుగుతుంది. మాకు తల్లి, తండ్రి, గురువు, అతిథి అన్నీ బాబానే!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

నా ఆందోళనను తీసేసిన సాయి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! సాధారణంగా నా బంగారు గాజులను మా మామగారు లాకర్లో పెడతారు. మార్చి నెలలో ఒక ఫంక్షన్ సందర్భంగా లాకర్ నుండి గాజులు తీసుకురమ్మని మా మామగారిని అడిగాను. మా మామగారు గాజులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ ఫంక్షన్ తరువాత గాజులను మా మామగారికి ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు. గాజులను నా సూట్‌కేసులో పెట్టుకున్నానని నేను అనుకున్నాను. కొన్నాళ్ళకి సూట్‌కేసు సర్ది, కొన్ని వాడని నగల పెట్టెలను పారేశాను. తరువాత కొన్ని నెలలకి గాజులు వేసుకుందామని సూట్‌కేసులో చూస్తే గాజులు కనిపించలేదు. అంతకుముందు వాడని నగల పెట్టెలు పారేశాను కదా, అందులో సరిగా చూడలేదేమోనని చాలా భయమేసింది. ఆ గాజులు పుట్టింటివాళ్ళు చేయించివుంటే అవి పోతే బాధపడినప్పటికీ అమ్మావాళ్ళకి సర్దిచెప్పేదాన్ని. కానీ ఆ గాజులు మావారు చేయించినవి. అందువల్ల గాజులు కనిపించకపోయేసరికి బాధతో పాటు మా అత్తగారువాళ్ళు ఏమనుకుంటారో అని చాలా భయమేసింది. ఇంట్లో అడగలేను. మా అత్తగారితో లాకర్లోని గాజుల ప్రస్తావన తెస్తే, “గాజులు లాకర్లో లేవు, అవి నీ దగ్గరే ఉన్నాయి కదా” అన్నారు. నా మైండ్ పని చేయలేదు. నిద్ర పట్టలేదు. మళ్ళీ సూట్‌కేసంతా జాగ్రత్తగా వెతికాను, కానీ గాజులు కనిపించలేదు. గాజులను మా మామగారికి ఇచ్చానో లేదో గుర్తు రావటం లేదు. మన బ్లాగులో ఒక అనుభవంలో ఒక సాయిభక్తుడు తన స్నేహితుడు కనపడకపోతే ‘శ్రీసాయి సూక్ష్మాయ నమః’ అనే మంత్రాన్ని స్మరించానని రాశారు కదా! నేను కూడా ఆ మంత్రాన్ని 108 సార్లు స్మరించి, “బాబా! మీ అనుగ్రహం ఉంటే పచ్చరంగు వస్త్రాలలో దర్శనమివ్వండి” అని ప్రార్థించాను. కానీ ఒక్కరోజు కూడా బాబా నాకు పచ్చరంగు వస్త్రాలలో దర్శనమివ్వలేదు. నాకు దడ పుట్టింది. కానీ, ఫేస్‌బుక్‌లో మాత్రం “టెన్షన్ పడకు’ అని బాబా సందేశాలు వచ్చేవి.

ఒకరోజు ధైర్యం చేసి మా మామగారిని, “లాకర్లో ఉన్న గాజులు తీసుకొస్తారా?” అని అడిగాను. అప్పుడు కూడా మా అత్తగారు “గాజులు నీ దగ్గరే ఉండాలి” అన్నారు. బహుశా ఆమెకి సరిగా గుర్తులేదేమోనని మా మామగారు గాజులు తీసుకురావటానికి వెళ్లారు. కానీ ఏమి వినాల్సి వస్తుందోనని నా మనసంతా ఒకటే ఆందోళన. చివరికి మా మామగారు గాజులపెట్టెతో వచ్చారు. నా నెలరోజుల ఆందోళనంతా బాబా తీసేశారు. నన్ను ఒక పెద్ద అపవాదు నించి కాపాడిన బాబాకు ఎంతో సంతోషంతో మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

8 comments:

  1. om sai ram please bless all .omsai baba nice leelas.i am regular devotee of this blog

    ReplyDelete
  2. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  3. Om Sairam love u sai,pls bless me with faith and strength sai

    ReplyDelete
  4. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. Baba meeru ma mother daggara vundi a rogam nayam cheyandi baba vedukuntuna baba daya chupu thandri nuvve maku dikku

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe