ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఆశీస్సులతో నాకు, నా సోదరులకు ఉద్యోగాలొచ్చాయి
- బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం
బాబా ఆశీస్సులతో నాకు, నా సోదరులకు ఉద్యోగాలొచ్చాయి
ఒరిస్సా నుండి సాయిభక్తురాలు భాగ్యశ్రీ తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నా పేరు భాగ్యశ్రీ నాయక్. మా స్వస్థలం ఒరిస్సా. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య ప్రదీప్ ఇంజినీరింగ్ చేశాడు. చిన్నన్నయ్య దీపక్ ఎంబీఏ చేశాడు. నేను, ప్రదీప్ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చేశాము. నేను మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రదీప్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కానీ నేను ఇంజనీరింగ్ పూర్తిచేసేవరకు, అంటే ఆ నాలుగేళ్లలో తనకి ఉద్యోగం రాక ఖాళీగానే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తన ఉద్యోగ విషయంలో ఆశను కోల్పోయారు. అబ్బాయిలకు ఉద్యోగం రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. బంధువులు, ఇరుగు పొరుగువారు, కుటుంబసభ్యులు తనని తీవ్రంగా ఎగతాళి చేస్తుండేవారు. ఆ సమయంలో నేను తన కోసం నవగురువార వ్రతం ప్రారంభించాను. మొదటివారం నేను ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారి నాతో, “మీ అన్నయ్య స్వభావం తెలిసి కూడా అతని కోసం ఎందుకు ఈ పూజలు చేస్తున్నావు?” అని అన్నారు. అతను ఎందుకలా అన్నారంటే, ఆ సమయంలో అన్నయ్యపై సమాజంలో చెడు ముద్ర ఉంది. ఆ మాటలేమీ పట్టించుకోకుండా నేను శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేదాన్ని. నాలుగవ వారం శేజారతి పూర్తయిన తరువాత నా మనసుకెందుకో అన్నయ్య మెయిల్స్ చెక్ చేసి చూడాలని బలంగా అనిపించింది. వెంటనే మెయిల్స్ చూసేసరికి, అన్నయ్యకి ఆఫర్ లెటర్ వచ్చి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అంత త్వరగా బాబా చూపిన అనుగ్రహానికి నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వ్యక్తపరచలేను.
ఇకపోతే రెండవ అన్నయ్య దీపక్ ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక తన ఎంబీఏ ఫలితాలు వెలువడ్డాయి. అయితే చివరి సంవత్సరంలో 6 సబ్జెక్టులు ఉంటే, ఏవో కారణాలచేత ఐదు సబ్జెక్టుల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. రెండు నెలలు గడిచినా ఆ ఒక్క సబ్జెక్టు రిజల్ట్ రాలేదు. ఆ సమయంలో తనకి ఒక ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్ళు మార్క్‌లిస్ట్ చూపించమని అడగటంతో సమస్య మొదలైంది. శని, ఆదివారాలు కావడంతో రెండురోజులు సమయం ఉన్నా సోమవారం వాటిని తప్పక సమర్పించవలసి ఉంది. ఒకవేళ రిజల్ట్ వస్తుందేమో అని ఆశపడటానికి శని, ఆదివారాలు కాబట్టి అది కూడా లేదు. మేము చాలా టెన్షన్ పడ్డాము. నేను సాయిని ప్రార్థించాను. నా సాయి దయవల్ల శనివారమే రిజల్ట్ వెలువడింది. మా సంతోషానికి అవధులులేవు. ఇప్పుడు అన్నయ్య సంతోషంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.
ఇప్పుడు నా ఉద్యోగానికి సంబంధించిన అనుభవం చెప్తాను. 2016లో నేను ఇంజనీరింగ్ పూర్తిచేసి, పైకోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్లాను. 2016 ఏప్రిల్‌లో తిరిగి మా ఇంటికి వచ్చేశాను. కొన్ని ఆర్థికసమస్యల కారణంగా అక్కడే నేను ఐదు నెలలపాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ కారణంచేత నేను ఉద్యోగం కోసం వేరే ఎక్కడికీ వెళ్ళలేకపోయాను. చివరికి 2017 సెప్టెంబరులో నేను బెంగళూరు వెళ్ళాను. పెద్దన్నయ్య నన్ను ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశాడు. నేను మంచి మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణురాలినైనప్పటికీ సుమారు రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నందున నాకు మంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి కావు. అందువల్ల మా ఇన్‌స్టిట్యూట్ హెచ్ఆర్ నన్ను ఇంటర్వ్యూలకు పంపడం మొదలుపెట్టారు. నేను సుమారు 30కి పైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కొన్నిసార్లు నేను అన్ని రౌండ్లూ క్లియర్ చేసినప్పటికీ నాకు ఆఫర్ లెటర్ రాలేదు. ఇలా రోజులు గడిచిపోతుండేవి. రోజురోజుకూ నాలో విసుగు పెరిగిపోతుండేది. చివరకు నేను సమస్యను బాబాకు చెప్పుకుని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నవగురువారవ్రతం మొదలుపెట్టాను. 9 గురువారాల వ్రతం పూర్తయిన నెలరోజుల తరువాత బాబా కృపతో నాకు ఉద్యోగం వచ్చింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, రెండేళ్లు ఖాళీగా ఉన్న తరువాత కూడా నాకు ఫ్రెషర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మరోవిషయం చెప్పాలి, కొన్ని నెలల ముందు నేను ఒక కంపెనీలో అన్ని రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేశాను. అదొక స్టార్టప్ కంపెనీ. వాళ్ళు కేవలం తొమ్మిదివేల రూపాయల జీతం ఇస్తానన్నా కూడా నేను ఆ ఉద్యోగంలో చేరాను. కానీ వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ ఇచ్చేవారు కాదు. 4 నెలలు వేచి ఉన్నప్పటికీ ఆఫర్ లెటర్ రాలేదు. ప్రతిరోజూ నేను, "నాకు ఆఫర్ లెటర్ వచ్చేలా చూడమ"ని సాయిబాబాను అడుగుతుండేదాన్ని. బాబా అది నాకు ఇవ్వలేదుగానీ, ఆ కంపెనీ కంటే మంచి కంపెనీలో, మంచి జీతంతో ఉద్యోగాన్ని ఇచ్చారు. "ఓ నా సాయీ! మీరు మమ్మల్ని చాలా ఏడిపిస్తారు. కానీ చివరికి మీదైన ప్రత్యేక మార్గంలో మా ప్రతి సమస్యను పరిష్కరించి మమ్మల్ని అనుగ్రహిస్తారు. అందుకే మాకు సహనం చాలా అవసరమని మీరు బోధిస్తారు. నా ప్రతి ప్రార్థనను అనుగ్రహిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
source: http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2537.html

బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం
నెల్లూరు నుండి శివ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
నా పేరు శివ. మాది నెల్లూరు. 10 రోజుల క్రితం మా మావయ్య ఆరోగ్యం దిగజారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్చాము. ఒకరోజంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ తన పరిస్థితిలో ఏ మార్పూ లేదు. అందువల్ల మేము తనని గుంటూరు తీసుకువెళ్దామని అనుకున్నాము. ఇలాంటి పరిస్థితిలో అంతదూరం ప్రయాణం చేయడం మంచిది కాదని డాక్టర్లు చెప్పారు. కానీ మేము మాత్రం తనని గుంటూరు తీసుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నాము. నెల్లూరు నుండి గుంటూరుకు దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతదూరం ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యంలో తనకేమైనా అయితే ఎలా అని మేమంతా భయపడ్డాము. అప్పుడు బాబాకి నా బాధని విన్నవించుకున్నాను. "బాబా! మావయ్యని గుంటూరు తీసుకువెళ్తున్నాము. దారిలో తనకేమీ కాకుండా చూసుకోండి. అంతేకాదు, తను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి బాబా!" అని ప్రార్థించాను. మేము గుంటూరు వెళ్తుండగా, మార్గమధ్యంలో అంతటి అనారోగ్యంతో ఉన్న మావయ్య బాబా అనుగ్రహంతో చక్కగా లేచి కూర్చున్నారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగా మెరుగుపడింది. "బాబా! కేవలం మీ అనుగ్రహంతోనే మావయ్య కోలుకున్నారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా!".

Nenu ninna 9 Thursday's vartam complete chesanu Job Koraku.Baba! Nakey cheppinattu ga undhi.Baba,Emi ee leela,Tandri!!
ReplyDeleteOm sai ram ji!! 🙏🙏🙏🙏🙏
ReplyDelete