ఈ భాగంలో అనుభవం:
- నమ్మకముంటే అన్నీ సరిచేస్తారు బాబా
సాయిభక్తుడు మోహన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
హాయ్! నా పేరు మోహన్. నేను 2012 నుండి సాయిబాబా భక్తుడిని. గాయపడిన అనేక హృదయాలకు బ్లాగు ద్వారా నిజమైన ఔషధాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ నాకు ప్రశాంతతని, సంతోషాన్ని ఇస్తుంది. నేనిప్పుడు రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.
మొదటి అనుభవం:
నేను 2017వ సంవత్సరంలో బి.టెక్ పూర్తి చేశాను. కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలలో నాకు ఉద్యోగం రాలేదు. అయినా నేను బాధపడలేదు. 'ఉద్యోగం పొందడం పెద్ద కష్టమేముంది? అది చాలా తేలిక' అని అనుకున్నాను. కానీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి 6 నెలలు గడిచినా నేను ఒక్క ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించలేకపోయాను. దాంతో కామన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లాగా నేనొక చిన్న ఐటి కంపెనీలో ఇంటర్న్‌గా చేరాను. ఆ కోర్సు కోసం 10,000 రూపాయలు చెల్లించాను. ఆ సంస్థ ఒక మోసపూరిత సంస్థ అని, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు చూపించరని తరువాత తెలిసి నేను చాలా నిరాశకు గురయ్యాను. నా కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పే ధైర్యంలేక మౌనంగా ఉండిపోయాను. నా స్నేహితులందరూ ఉద్యోగాలు చేస్తుంటే, నాకు మాత్రం చిన్న ఉద్యోగమైనా లేకపోవడంతో నేను మానసికంగా చాలా కృంగిపోయాను. దానికి తోడు నాకు బాగా దగ్గర వ్యక్తులలో ఒకరు నన్ను చాలా అవమానపరిచారు. అది నా హృదయాన్ని తీవ్రంగా గాయపరచింది. అలా సంవత్సరం గడిచిపోయింది. నేను దేవునిపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాను. నేనొక వెర్రివానిలా అయిపోయాను. కొన్ని నెలల తరువాత నా కజిన్ ఒకరు తన కంపెనీలో ఉద్యోగ అవకాశం ఉందని చెప్పాడు. కానీ ఆ సమయంలో నేను ఒకరకమైన మానసికస్థితిలో ఉన్నాను. "నాకు ఆ ఉద్యోగం రాదు, అలాంటప్పుడు ఇంటర్వ్యూకి మాత్రం వెళ్లడం ఎందుకు? ఆందోళనపడటమెందుకు?" అని అనుకున్నాను. కానీ, మళ్ళీ ఏదో ఒకవిధంగా సమాధానపడి ఇంటర్వ్యూకి తయారవడం మొదలుపెట్టాను. ఆ సమయంలో అనుకోకుండా నేను ఫేస్‌బుక్‌లో ఒక సాయిబాబా పేజీ చూశాను. అందులో, "ఈరోజు ఏమి జరుగుతుందో చూడు, నువ్వు నమ్మలేవు, నువ్వు విజయం సాధిస్తావు" అని ఉంది. ఆ సమయంలో నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, నేను ఆశ్చర్యపోయేలా నాకు ఆ ఉద్యోగం వచ్చింది. జీతం కూడా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ. ఆ క్షణాన నా కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. నన్ను నేను నియంత్రించుకుంటూ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, 'సాయిరామ్' అని ఆయన స్మరణ చేసుకుంటూ ఉండిపోయాను. ఇప్పుడు నేను మంచి పేరున్న కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఆయనపై నమ్మకాన్ని కోల్పోయినా బాబా నన్ను మరచిపోలేదు. సరైన సమయంలో నా ఊహకు మించి నన్ను అనుగ్రహించారు. చాలామంది యువకులు నాలానే బాధపడుతుండొచ్చని నాకు తెలుసు. ఒక విషయం నేను వారికి తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి సాయిపై మీ నమ్మకాన్ని కోల్పోకండి. కళ్ళుమూసుకుని బాబా చూపించే మార్గం వైపు నడవండి. ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ సాయిని నమ్ముకుని నేరుగా నడవండి. ఒక మంచిరోజున మీరు మీ జీవితంలో మీకు కావలసిన దానికంటే ఎక్కువ పొందుతారు.
రెండవ అనుభవం:
కొన్ని రోజుల క్రితం నా ఫోన్ డెడ్ అయిపోయింది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు. నా వంతుగా అన్నివిధాలా ప్రయత్నించాను. కానీ అది స్విచ్ ఆన్ కాలేదు. కొంతసేపు ఆందోళనచెందాక నా హృదయం, "సాయిపై నమ్మకముంచి ప్రశాంతంగా ఉండు" అని చెప్పింది. దాంతో నేను చింతించటం మానేసి, సమస్యను పూర్తిగా బాబాకు అప్పగించాను. రెండురోజుల తరువాత అకస్మాత్తుగా ఫోన్ పనిచేయడం మొదలుపెట్టింది. నాకంతా వింతగా అనిపించింది. అది ఎలా పనిచేస్తుందో నాకు అర్థంకాక చూస్తుంటే, 'కేవలం ఛార్జింగ్ పెట్టాన'ని అమ్మ చెప్పింది. నా సాయి తండ్రి అద్భుతాలను చూస్తూ, అనుభవిస్తూ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మనం ఆయనను విశ్వసించి ప్రతిదీ ఆయన పాదాలవద్ద ఉంచి వేచిచూస్తే, అన్నీ సరిచేస్తారాయన. ఆయన మనల్ని పరీక్షించవచ్చు, కానీ మీరు ఆయన పాదాలను విడువకండి. ఎల్లప్పుడూ ఆయనను నమ్ముకుని ముందుకుసాగండి, ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షిస్తారు. "సదా నాతో ఉన్నందుకు ధన్యవాదాలు బాబా!"

సాయినాథ.. నేనిప్పుడు చుట్టూ సమస్యలు కష్టాల వలయంలో చిక్కుకున్నాను . చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు నాకు కష్టాలపాలు చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో నీ మీద ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయేలా ఉన్నాను నువ్వు ఉన్నావ్ అని నిరూపించి, ఈ విపత్కర పరిస్థితిలో నా వెంట ఉండు తండ్రి!
ReplyDeleteOm sairam. Sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai
ReplyDeleteJai shiridi sainath maharajuki jai. Om sai ram.
ReplyDeleteom sairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sairam
ReplyDeleteSai always be with me
🌹🌹సదా నాతో ఉన్నందుకు ధన్యవాదాలు బాబా!"🌹🌹
ReplyDeleteBaba baba baba baba baba baba baba baba baba baba baba 🙏🥲
ReplyDelete