ఈ భాగంలో అనుభవాలు:
- పిలిస్తే బాబా వస్తారు
- బాబా కృపతో దక్కిన ఆభరణం
పిలిస్తే బాబా వస్తారు
నా పేరు సుచిత్ర. 2019లో మావారు బాబా మాల ధరించారు. 2019, డిసెంబరు 3న మేము భిక్ష ఏర్పాటు చేసి కొంతమంది భక్తులను ఆహ్వానించాము. ఇంకా మూడురోజులు ఉందనగా, నేను భిక్ష అయిపోయాక తాంబూలంలో బాబాకు ఇష్టమైన రెండు రూపాయలు పెట్టి దక్షిణగా సమర్పించుకుందామని అనుకున్నాను. కానీ రూపాయి నాణాలైతే దొరుకుతాయిగానీ, రెండు రూపాయల నాణాలు దొరక్కపోవచ్చు అని అనుకొని ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. భిక్ష ఏర్పాటు చేసే రోజు వేకువఝామున 3 గంటలకి కలలో బాబా దర్శనమిచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తరువాత ఒక సాయిభక్తుడు షాపులన్నీ తిరిగి రూపాయి నాణాలు ఎక్కడా దొరకలేదని రెండు రూపాయల నాణాలే తీసుకొచ్చాడు. వాటిని చూడగానే మూడురోజుల క్రితం నేను అనుకున్న విషయం గుర్తొచ్చింది. 'సముద్రం లోతు కొలువవచ్చును కానీ, మనసు లోతు కొలువలేమ'ని చిన్నప్పటినుంచి విన్న సామెతలో చెప్పినట్లుగా, ఏ భక్తుని మనసులో ఏముందో బాబాకి తెలుసునని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
బాబాకు అలంకరణ జరుగుతున్న సమయంలో మావారు వచ్చి, "బాబాని ఇంటికి రమ్మని పిలిచావా?" అని అడిగారు. అయ్యో! మర్చిపోయానే అనుకొని నేను బాబా పటం ముందు కూర్చొని, "తండ్రీ! అందరికంటే ముందు నిన్ను పిలవాలి. కానీ మరచిపోయాను. అందుకు నన్ను క్షమించి, దయచేసి మా ఇంటికి రండి బాబా!" అని బాబాను పిలిచాను. తరువాత భిక్ష చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు వచ్చారు. ఆరోజు రాత్రి 10.30 సమయంలో మావారు నాతో, "బాబా ఏ రూపంలో మన ఇంటికి వచ్చారో స్వప్నంలో చూపించమని బాబాని అడుగు" అన్నారు. నేను, "ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? బాబాను భిక్షకి పిలవడం, పైగా ఏ రూపంలో వచ్చారో అడగటం ఏమిటి?" అనుకున్నాను. అయినా ఆయన మాట కాదనలేక నేను బాబా ముందు కూర్చొని ప్రార్థించి నిద్రపోయాను. ఆ రాత్రి స్వప్నంలో బాబా ఒకామెను చూపించారు. నిజానికి నేను ఆమెను భిక్షకు ఆహ్వానించేందుకు ఫోన్ చేస్తే, ఫోన్ కలవలేదు. ఆమె వేరే భక్తురాలి ద్వారా తెలుసుకొని బాబాకి అభిషేకం చేస్తున్న సమయంలో వచ్చింది. ఆమె మధ్యాహ్నం ఆరతి పూర్తయిన వెంటనే, ఎందరు ఉండమని చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. ఆమె రూపాన్నే బాబా స్వప్నంలో చూపించారు. ఆమె రూపంలో బాబా మధ్యాహ్న ఆరతి తీసుకొని వెళ్లారని మాకు చాలా సంతోషం కలిగింది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ! ఆమెకు సంతానం లేదు. తను మీకు మంచి భక్తురాలు. తనకు సంతానాన్ని ప్రసాదించండి".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.
బాబా కృపతో దక్కిన ఆభరణం
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేను నా చిన్నతనం నుండి సాయిభక్తురాలిని. ఒకసారి మా అమ్మగారిని తన సహోద్యోగి, "నేను ఒక పార్టీకి వెళ్లాల్సి ఉంది, మీ బంగారుహారాన్ని ఇస్తే, రేపే తిరిగి ఇచ్చేస్తాను" అని అడిగింది. ఆవిడ అమ్మకు 6 సంవత్సరాలుగా పరిచయం, ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసు. అందువల్ల అమ్మ తన 4 లక్షల విలువ గల బంగారు ఆభరణాన్ని ఆవిడకిచ్చింది. అయితే మూడురోజులు గడిచినా ఆవిడ హారం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో మా అమ్మ ఆందోళన చెంది హారం గురించి ఆవిడను అడిగింది. అందుకావిడ కొంతసేపు వాదించి, అది అసలు బంగారు ఆభరణం కాదని, "నేను దాన్ని పోగొట్టుకున్నాను. దానికి బదులు డబ్బు కూడా ఇవ్వను" అని మొరటుగా చెప్పింది. ఆ మాటలతో అమ్మ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఆ మొరటు మహిళతో ఏం మాట్లాడాలో తనకి తెలియక అక్కడినుండి వచ్చేసింది. తరువాత నాకు ఫోన్ చేసి బాధపడుతూ విషయాన్ని చెప్పింది. నేను అమ్మతో, "బాధపడకు, నేను బాబాని ప్రార్థిస్తాను, ఆయన చూసుకుంటారు" అని చెప్పాను. మరునిమిషం నేను పూజగదిలోకి వెళ్లి, “బాబా! నా తల్లి తన సహోద్యోగికి సహాయం చేయడానికి తన హారాన్ని ఇచ్చింది. కానీ ఆ మహిళ నా తల్లిని మోసం చేస్తోంది. హారం ఆ మహిళ వద్దే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ హారం మాకు తిరిగి వచ్చేలా దయచేసి మీరే ఏదైనా చేయండి” అని బాబాను ప్రార్థించాను. అదేరోజు అద్భుతం జరిగింది. ఆరోజు సాయంత్రం ఆవిడ మా అమ్మ వద్దకు వచ్చి, తాను చేసిన తప్పు ఒప్పుకుని, అమ్మకు క్షమాపణలు చెప్పి హారాన్ని తిరిగిచ్చింది. ఆ వార్త తెలిసి నిజంగా నేను మూగబోయాను. అంత త్వరగా నా ప్రార్థనకు సమాధానం ఇచ్చినందుకు బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, బాబా ఖచ్చితంగా సమాధానమిస్తారు. బాబా ఆమె మనసుని మార్చి సమస్యను పరిష్కరించారు. "బాబా! మరోసారి మీకు చాలా చాలా కృతజ్ఞతలు".