సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2118వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన కరుణ
2. తలచిన వెంటనే పలికే దైవం ఆ సాయినాథుడు

బాబా చూపిన కరుణ

సాయి భక్తులకు నమస్కారాలు. ఒకప్పుడు నా భర్త ఒకరికి షూరిటీ సంతకం చేశారు. వాళ్ళు మోసం చేయడంతో మాకు అప్పులు ఎక్కువై నా భర్త మద్యానికి బానిస అయ్యారు. మేము ఉంటున్న ఇల్లు అమ్ముకొని బయటికి వచ్చాము. కానీ అప్పులు పూర్తిగా తీరలేదు. నేను ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నందువల్ల నా జీతంతో ఇల్లు నడుస్తుండేది. మాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్ అయిన సంవత్సరం మా పెద్ద ఆడబిడ్డ కూతురి పెళ్లి జరిగింది. ఆ సమయంలో వాళ్ళు నన్ను చాలా మాటలు అన్నారు, 'నా కూతురి పెళ్లి చేయడం గురించే కాకుండా తనని పనికి పంపి జీవనం సాగించు' అని. ఈవిధంగా బంధువులందరూ ఏదో ఒక మాట అంటుండేవారు. నాకు భయంగా ఉండేది. నేను స్కూలుకి వెళ్లే దారిలో 'SAI VEN' అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ పెళ్లి జరుగుతుంటే నా మనసుకి, 'బాబా! నేను నా కూతురికి పెళ్లి చేయగలనా? నా దగ్గర ఏమీ లేదు. ఇంకా అప్పులు ఉన్నాయి. నా భర్తకి బాధ్యత లేదు. పిల్లల్ని ఇంకా చదివించాలి' అని అనిపించి ఏడుపు వచ్చేది. బాబా దయవల్ల పాప ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత డిగ్రీలో చేరింది. రెండు సంవత్సరాల తర్వాత అపోలోలో నర్సింగ్ ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా చేరి నాకు కొంత సహాయంగా ఉండేది. ఆరునెలలు చేసిన తర్వాత 'హాస్పిటల్ దూరమని, ఆడపిల్ల సంపాదన మీద పడి ఉన్నారని' మా తోడికోడలు, అత్తగారు మావారికి చెప్పి పాపని హాస్పిటల్‌కి వెళ్లకుండా మాన్పించారు. దాంతో మా పాప మనసు కొంచం బాధపడి, ఓదార్పుకోసం మా అమ్మ వాళ్ళింటికి వెళ్లింది. అక్కడ బాబా తమ కరుణ మా మీద కురిపించారు. హఠాత్తుగా మా తమ్ముడి స్నేహితుడు మా అమ్మాయిని చూసి, ఇంటికెళ్లి మాట్లాడుకొని 'అమ్మాయిని తన తమ్ముడికి ఇస్తారా?' అని అడిగారు. ఆవిధంగా అమ్మాయికి పెళ్లిసంబంధం కుదిరింది. కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. బాబా మీద భారం వేసాను. ఎలా సర్దుబాటు అయ్యాయో కానీ, డబ్బులు సర్దుబాటు అయి వారంలోపు బాగా గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. పెళ్లి మగ పెళ్లివాళ్ళు చేసుకున్నారు. మా అమ్మాయి పెళ్లి జరుగుతుందా అనుకుంటే బాబా దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించారు. తలుచుకుంటే, నాకు ఎప్పటికీ కలగలాగే అనిపిస్తుంది.

ఇకపోతే, నేను అమ్మాయి పెళ్లి అప్పుడు సత్యనారాయణస్వామి వ్రతం చేయించాలని అనుకున్నాను. కానీ మా వియ్యంకులవారు, "పెళ్లిలో వద్దు, తర్వాత చేద్దాం" అన్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత చేద్దామంటే, పెళ్లికి చేసిన అప్పులు నెలనెలా కడుతూ ఉండటం వల్ల డబ్బులు సర్దుబాటు కాలేదు. అప్పుడు బాధగా బాబాని తలుచుకొని గుడిలో అయినా చేద్దామని అడిగితే, 'వెయ్యి రూపాయలు కడితే దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చొని వ్రతం చేయవచ్చు' అన్నారు. నేను ఉన్న స్థితికి అది పెద్ద మొత్తమే అయినాసరే చేయిద్దామని మా అమ్మాయికి చెప్పాను. మా అమ్మాయివాళ్ళ మామగారు, మా అమ్మవాళ్లు అక్కడ వద్దు, ఇక్కడ సాయిబాబా గుడిలో చేయిద్దామని అన్నారు. అక్కడ సామూహికంగా చేస్తారు, నాకేమో కొత్త దంపతులు పీటల మీద కూర్చొని చేస్తే బాగుంటుందని. కానీ నేను ఏం చేయలేక, "సరే, మీ ఇష్టం" అని, వ్రతం కోసం 150 రూపాయలు పంపమంటే, పంపించాను. వ్రతం అయ్యాక మా అమ్మాయి నాకు ఫోటోలు పంపించింది. అవి చూసిన నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నిజంగా బాబా మా మీద ఎంతో కరుణ చూపించారు. ఆరోజు వ్రతంలో మా అమ్మాయి,  అల్లుడు గుడికి వెళితే, కొత్త దంపతులని వాళ్ళిద్దరిని పీటల మీద కూర్చోబెట్టి, వాళ్ళ చేతుల మీదగా వ్రతం జరిపించారు. 1000 రూపాయలు పెద్ద మొత్తం నా దగ్గర లేనందున అప్పు చేయాల్సిన పరిస్థితి. బాబా ఆ అవసరం లేకుండా నా మనసులోని కోరిక తీర్చారు. బాబాకు నా మీద ఎంత దయ? ‌ఎవరూ లేరని బాధపడుతున్నప్పుడు బాబానే నాకు తోడు అయ్యారు. నాకు అన్నీ ఆయనే. నేను ఆయన మీదే భారం వేసాను. నా జీవితాన్ని నడిపిస్తుంది బాబానే. "శతకోటి ధన్యవాదాలు బాబా. మా అమ్మాయి వివాహమై రెండున్నర సంవత్సరాలవుతుంది. వాళ్ళకి ఒక బిడ్డను ప్రసాదించు బాబా. మీ కరుణ వల్ల అబ్బాయి టెన్త్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. బాబు కూడా బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూడు బాబా. నా భర్త తాగుడు మానేసి బాధ్యతగా ఉండేలా కరుణించు బాబా". 


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo