1. తలపై తమ అభయహస్తాన్ని ఉంచి ఆశీర్వదించిన బాబా
2. మూగజీవికి తగిన ఆశ్రయాన్ని చూపి, వాటిపట్ల బాధ్యతను తెలియజేసిన బాబా3. బాబా అనుమతిస్తే పనులు చకచకా అయిపోతాయి
తలపై తమ అభయహస్తాన్ని ఉంచి ఆశీర్వదించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు విజయచంద్ర. మాది పశ్చిమ గోదావరి జిల్లా. ముందుగా సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి ప్రేమికులారా, సాయి స్వరూపులారా మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పను? దైవం మానుషరూపేణా అన్నట్టు మీరందరూ సాక్షాత్తూ సాయి స్వరూపులే అని తలుస్తాను. మీరు అనుమతినిస్తే, నా బాబాతో నాకున్న అనుభవాలను పంచుకుంటాను. ఇప్పటివరకు నా జీవితంలో బాబా నా యందు చూపిన కృప, దయ, లీలలు కోకొల్లలు. నన్ను, మనందరినీ నడిపించేది బాబానే. ఆయనతో ప్రతిరోజు మనకు ఒక అనుభవం ఉంటుంది. ఇది పచ్చి నిజం, అతిశయోక్తి కాదు. బాబా మన గురువు, దైవం, స్నేహితుడు మనకు సర్వమూ ఆయనేనని మన భావన కదా! మనమందరం ప్రతిరోజు బాబాతో మాట్లాడుతాం కదా! అవునా? కాదా? నేనైతే బాబాతో అన్నీ చెపుతాను. నాకు ఆయనంటే అమితమైన ప్రేమ. అలానే సాయి స్వరూపులంటే కూడా అంతే అభిమానం. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇక నా అనుభవానికి వస్తే...
అది 2001వ సంవత్సరం. నా వయస్సు 33-34 ఉంటుంది. నేను వెంకటరాయ డయాగ్నస్టిక్స్ & హాస్పిటల్ నందు సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‍గా పని చేస్తున్నాను. మా హాస్పిటల్లో ఒక డాక్టరు, నా సహోద్యోగి జ్యోతిష్యం చెప్పడంలో దిట్ట. ఆయన ఎవరికైనా ఏదైనా చెప్తే చాలా మటుకు నిజాలయ్యేవి. ఆయన ఒకరోజు నాకు కూడా చెప్పారు. ఆయన చెప్పిందేమిటంటే, "విజయ్, నీకు ప్రాణగండం ఉంది" అని. ఒక్కసారిగా నేను భయభ్రాంతుడనయ్యాను. మృత్యువు అంటే ఎవరికైనా భయమే కదా! ఆయన వేరే వాళ్ళకి చెప్పినవన్నీ జరిగి ఉన్నందున 'ఇదేంట్రా దేవుడా?' అనుకుంటూ బాధతో ఇంటికి బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ ఏవో ఆధ్యాత్మిక గ్రంధాలు తీసుకుని ఇల్లు చేరాను. మనసంతా ఒక రకమైన భయం, బాధ ఆవహించి ఉన్నాయి. పిల్లలు చిన్నవాళ్లు. పెద్దబాబు 6వ తరగతి, చిన్నవాడు 2వ తరగతి చదువుతున్నారు. పిచ్చిపిచ్చి ఆలోచనలతో ఏం చేస్తాం అనుకుని స్నానం వగైరాలు కానిచ్చుకుని మా ఇంట్లో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న బాబా చిత్రపటం ముందు కూర్చుని నా దృష్టి ఆయన మీదే నిలిపి, "ఏమయ్యా బాబా, ఏంటిది? నీవే నా సర్వస్వం అనుకున్నానే, నా రక్షకుడివని తలచానే, నాకేంటి ఈ విపరీత పరిస్థితి నాయన" అని కన్నీళ్లు పెట్టుకుని బాబాను వేడుకున్నాను. అంతే, ఒక క్షణంపాటు నా తనువు గగుర్పాటుకి లోనయ్యింది. చిరునగవు మోముతో ఆ దివ్యమంగళ స్వరూపుడు తమ అభయహస్తాన్ని నా తలపై ఉంచి, 'నీకు ఏమి భయం లేదు' అన్నట్టు దీవించారు. శ్రీసాయినాథుని హస్తస్పర్శ నాకు స్పష్టంగా తెలిసింది. నాలో నెలకొన్న భయాందోళనలు మటుమాయమయ్యాయి. మరో అద్భుత విషయం ఏమిటంటే, మా ఇంట్లో ఉన్న బాబా చిత్రపటాలు, బాబా మూర్తుల దగ్గరల్లా విభూదే విభూది. ఆ విషయం గురించి ఇతరులతో చెపుదామనుకున్నాను కానీ వాళ్ళు నమ్ముతారో, లేదోనని భయపడ్డాను. అందువల్ల ఎవరితోనూ పంచుకోలేదు, కేవలం నా భార్యతో తప్ప. బాబా లీల నిజమైనప్పటికీ లోకులు పలు కాకులని అంటారు కదా! వాళ్ళు ఇంత లీల చూపిన సాయినాథుని నమ్మక ఏమైనా ప్రతికూలంగా మాట్లాడుతూ అవాకులు చెవాకులు పేలుతారని భయపడ్డాను. మనం నమ్మే మన బాబాని, మన సాయి బంధువులను అవమానిస్తే మనకే కదా బాధ. అందుచేత మౌనంగా ఉండిపోయాను. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత నా ఈ అనుభవాన్ని సాయి బంధువులతో ఈవిధంగా పంచుకునేలా సాయి అనుగ్రహించడం ఆయన లీల కాకపోతే ఇంకేంటి? "ధన్యవాదాలు బాబా".
మూగజీవికి తగిన ఆశ్రయాన్ని చూపి, వాటిపట్ల బాధ్యతను తెలియజేసిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు అనురాధ. ఎప్పుడూ నీవెంటే ఉన్నానంటూ ఆ కరుణామూర్తి అయిన మన సాయినాథుడు ప్రేమతో నాకు అనుగ్రహించిన కొన్ని అనుభవాలను గతంలో మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు సాయితండ్రి ఆశీర్వదించిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడమనేది సాయిమా ఆదేశంగా భావిస్తున్నాను. 2021వ సంవత్సరం జులై నెలలో ఒక గురువారం నాడు బాబాకు అభిషేకం పూర్తి చేసిన తరువాత డోర్ బెల్ మ్రోగితే బయటకు వెళ్ళాను. అక్కడ మావారు 35 రోజుల వయస్సున్న ఒక చక్కటి కుక్కపిల్లతో నిలబడి ఉన్నారు. వాస్తవానికి నాకు కుక్కలంటే చాలా భయం. కానీ అది గురువారంనాడు వచ్చింది. బాబా కూడా సచ్చరిత్రలో, "ఏ ఋణానుబంధం లేనిదే ఎవరు ఎవరినీ కలవర"ని చెప్పారు. కాబట్టి, దానిని బాబానే పంపించారని తలచి, బాబా ఊదీ పెట్టి మరీ ఇంట్లోకి ఆహ్వానించాను. మేము ప్రేమతో ఆ కుక్కపిల్లకు 'లియో' అని పేరు పెట్టాము. మూగజీవులు ఎంతటి నిస్వార్థమైన ప్రేమను చూపిస్తాయో నాకు అనుభవంలోకి తెచ్చింది మా లియో. నేను లియో మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాను. ఆరు నెలల తరువాత బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ కారణంగా లియోకి సర్జరీ చేయవలసి వచ్చి సర్జరీ చేయించాము. కానీ డాక్టరు మన ఇళ్లలో ఉండే ఫ్లోర్ జారుడుగా ఉండటం వలన సర్జరీ తరువాత కూడా భవిష్యత్తులో బోన్ ప్రాబ్లమ్ ఎక్కువ కావచ్చని చెప్పారు. అంతేకాకుండా మరికొన్ని ఇతర కారణాల వలన లియోని ఎవరికైనా దత్తత ఇచ్చేలా పరిస్థితులు దారితీసాయి. మాకు లియోతో ఋణానుబంధం అంతవరకే ఉందేమో ఆ బాబాకే ఎరుక. నేను మనస్పూర్తిగా బాబాను ఒకటే వేడుకున్నాను, "బాబా! లియోని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళ దగ్గరికి పంపించే ఏర్పాటు చేయండి. వాళ్ల ఇంటి వాతావరణం లియో ఆరోగ్యానికి సహకరించేలా, భవిష్యత్తులో తనకి బోన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండేలా చూడండి. లియో అటువంటి ఇంటికి వెళితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని. 2 నెలల తర్వాత (లియోకి 8నెలల వయసు) 2022, జనవరి 1న నేను కోరుకున్నట్లే లియో ఒక మంచి ఇంటికి వెళ్లేలా బాబా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లియో జ్ఞాపకాలు నన్ను చాలా బాధకు గురిచేసాయి. నా మనసు ఎంతో వేదనను అనుభవించగా, "బాబా! ఎందుకు బంధాలను ముడి వేస్తావు. మరల దూరమయ్యే పరిస్థితులను కల్పిస్తావు" అని అనుకున్నాను. అప్పుడు నా అంతర్వాణి (నా బాబా) చెప్పిన సమాధానం: "నువ్వు ఆ ఒక్క కుక్క మీదే అనుబంధం పెట్టుకోవద్దు. మూగజీవులు ఎంతో నిస్వార్థమైన ప్రేమను చూపిస్తాయి. నువ్వు కూడా వాటిపట్ల అంతే నిస్వార్థమైన ప్రేమను చూపించు" అని వాటిపట్ల నా బాధ్యతను గుర్తు చేశారు. దాంతో నేను ముందుగా ప్రతి గురువారం కుక్కలకు స్వీట్లు ఆహారంగా ఇవ్వాలని సంకల్పించి బాబా ఆశీర్వాదంతో ఆవిధంగా చేస్తున్నాను. ఈవిధంగా తమను సేవించుకోమని బాబా నన్ను ఆదేశిస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. అన్ని జీవులతో ఆత్మ స్వరూపునిగా ఉన్నది ఆయనే కదా. బాబా తన మార్గంలో ఉన్నవారి జీవితాలలో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ నుండి ఏదో ఒక విషయాన్ని మనకు నేర్పుతూనే ఉంటారు. "బాబా! అటువంటి ఛాలెంజ్‌లను ఎదుర్కొనే మానసిక శక్తిని, దాని ద్వారా మీరు మాకు భోదించాలనుకున్న విషయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని నా హృదయపూర్వక ప్రార్థన తండ్రి. ఈ అనుభవాన్ని పంచుకోవడంతో జరిగిన ఆలస్యానికి నన్ను మన్నించు బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
బాబా అనుమతిస్తే పనులు చకచకా అయిపోతాయి
సాయి భక్తులందరికీ నమస్తే. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈరోజు బాబా నాకు ప్రసాదించిన ఇంకొక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. క్రిందటి సంవత్సరం మేము ఒక సైట్(స్థలం) విషయంలో ఆ సైట్ కొనాలా, వద్దా అని బాబాను చీటీల ద్వారా అడిగితే, 'కొనవద్ద'ని బాబా సమాధానం వచ్చింది. అందుకని ఆ సైట్ కొనే ఆలోచనను మానుకున్నాము. మళ్ళీ ఈ మధ్య మా పాపకోసం స్థలం కొందామనిపించి బాబాను అడిగితే, 'కొనమ'ని బాబా సమాధానం ఇచ్చారు. బాబా టైమింగ్, ఆయన లీలలు మనకు అర్ధం కావు. బహుశా అప్పట్లో మా ఆర్ధిక పరిస్థితిని బట్టి బాబా నుండి ఆ విధమైన జవాబు వచ్చి ఉంటుంది అనుకుని కార్యంలోకి దిగాము. బాబా అనుమతితో చేసే ఏ పనైనా గుఱ్ఱంలా పరిగెడుతుంది. మా కజిన్ ఆ స్థలం డెవలపర్‍ని సైట్ కావాలని అడగగానే అతను ప్రస్తుతం అమ్ముతున్న ధరకి కాకుండా తక్కువ ధరకే, పూర్వం తీసుకుని అమ్మేస్తున్నవాళ్ళ దగ్గరినుండి మాకు ఇప్పించాడు. ఇది ఒక అద్భుతం. ఇకపోతే రెండోది, మొదటి గురువారం అడ్వాన్స్ ఇచ్చి, మిగతా అమౌంట్ విషయంలో మా ప్రోగ్రాం ప్రకారం లోన్ తీసుకుని దాన్ని క్యాష్ చేసుకుని ఇవ్వడానికి మేము ఊరు వెళ్ళే తేదీలు, బ్యాంకు సెలవులు మొదలైనవన్నీ కలిసిరాక చాలారోజులు గడపాల్సి వస్తుందేమోనని నేను చాలా ఆలోచించాను. కానీ ఆ తరువాత గురువారంనాడు ఒకేఒక్క రోజులో ఏ ఇబ్బందీ లేకుండా అనుకున్నంత గోల్డ్ లోన్ రావడం, దాన్ని ఇవ్వాల్సిన వారికి ఇచ్చేయడం, కొంత మొత్తం బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చెయ్యడం అన్నీ జరిగిపోయాయి. చివరిగా కొంత అమౌంట్ ఆరోజు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లిమిట్ దాటిపోవడం వల్ల 2022, మే 2న ట్రాన్స్ఫర్ చేసాము. ఆలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడానికి బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు పంపాను. బాబా అనుమతించాక పనులు ఎలా చకచకా అవుతాయి అన్నదానికి ఈ నా అనుభవం పెద్ద ఉదాహరణ. బాబా అండ ఉంటే ఆ ధైర్యమే వేరు. "ధన్యవాదాలు బాబా. ఇక రిజిస్ట్రేషన్ ఒక్కటే మిగిలింది. అది కూడా అతి త్వరలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా పూర్తి అయ్యేటట్లు చూడు సాయి".
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
Om sai ram
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteఓం నమో సాయి బాబా ఈ రోజు భక్తుల అనుభవాలు చాలా బాగా వున్నాయి. మొదటి సాయి లీల బాగుంది. బా బాని శరణు వేడి తే కాపాడుతారు.అది సాయి దయ.రోజు చదువు తాను. నా కు చాలా ఇష్టం. నా భర్త ని.,కొడుకు ని కూతురు ని కలకాలం కాపాడు సాయి బాబా
ReplyDeleteOM SAIRAM
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete