సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1179వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కంటికి రెప్పలా కాపాడే బాబా
2. సాయి తన బిడ్డలను బాధపడనివ్వరు
3. సాయికి చెప్పుకున్నంతనే జరిగిన పని

కంటికి రెప్పలా కాపాడే బాబా


సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. మా కుటుంబానికి బాబా చాలా ఆశీస్సులు అందించారు. ఇక ముందు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. కరోనా మొదటి వేవ్‌లో మా కుటుంబంలో అందరికీ కరోనా వచ్చింది. మా బాబు డాక్టరు అయినందువల్ల ఇంట్లోనే మా అందరికీ ట్రీట్మెంట్ చేశాడు. మా బాబుకి, పాపకి, అమ్మకి పదిరోజుల్లోనే తగ్గినా, మా వారికి 14 రోజులైనా తగ్గపోవడంతో మేము చాలా కంగారుపడ్డాము. ఆయనకి అదివరకే హార్ట్ సర్జరీ అయింది. బీపీ, షుగర్ కూడా ఉన్నాయి. అందువల్ల ఆయన కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఎన్ని మందులు వాడినా ఆయన CRP చాలా ఎక్కువైంది. దాంతో స్టెరాయిడ్స్ స్టార్ట్ చేశాము. అయినా CRP కంట్రోల్ అయ్యేది కాదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో ఆయనకు కరోనా కంట్రోల్ అవ్వాలి" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల రెండో రోజు నుండి CRP కంట్రోల్‍లోకి వచ్చింది. ఇప్పుడు ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు.


కరోనా నుండి కోలుకున్న కొన్నిరోజులకి మా అమ్మకి గుండెదడ ఎక్కువైంది. మేము చాలా కంగారుపడ్డాము. నాలుగు సంవత్సరాల ముందు ఆమెకు అదే సమస్య ఉండేది. మందులు వాడితే తగ్గింది. కరోనా తరువాత అది మళ్ళీ మొదలైంది. అమ్మని గుండె డాక్టరుకి చూపించాము. కానీ ఎన్ని మందులు వాడినా అమ్మకి తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! అమ్మకి గుండెదడ తగ్గి నార్మల్ అయ్యేలా అనుగ్రహించండి" అని సాయిని వేడుకున్నాను. ఆయన దయవల్ల ఇప్పుడు అమ్మకి కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు 7, 8 సార్లు వచ్చే దడ ఇప్పుడు రెండు లేదా మూడుసార్లు వస్తుందని అమ్మ అంటుంది. సాయి ఆశీస్సులతో త్వరలో నార్మల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సాయి భక్తురాలైన అమ్మ కూడా 'బాబాయే తన గుండెదడ తగ్గిస్తార'న్న నమ్మకంతో ఉంది.


మా అబ్బాయికి కరోనా తగ్గిన తరువాత ఏది తిన్నా కొద్దిసేపటికి దగ్గు వచ్చి, గొంతులో ఏదో ఉన్నట్లు చాలా ఇబ్బందిపడేవాడు. స్వయంగా తనే ఒక డాక్టర్ అయినందువల్ల పేషెంట్ల ముందు చాలా ఇబ్బందికి గురయ్యేవాడు. ఎన్ని సిరప్‍లు వాడినా ఆ దగ్గు సమస్య తగ్గేది కాదు. అప్పుడు నేను, "బాబా! బాబుకి దగ్గు తగ్గిపోవాలి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల అప్పటినుండి దగ్గు పూర్తిగా తగ్గింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు.


డాక్టరైన మా అబ్బాయి చాలా ఊళ్ళకి వెళ్లి వైద్యం చేస్తుంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా స్వయంగా తానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, ఎంత రాత్రయినా తిరిగి ఇంటికి వచ్చేస్తుంటాడు. అయితే తరచూ దూరప్రాంతాలకు కారు డ్రైవ్ చేయడం వలనో, లేక పుస్తకాలు ఎక్కువగా చదవడం వలనో తన కళ్ళు చాలా స్ట్రెయిన్ అయ్యేవి. అయినా తానే డ్రైవ్ చేసుకుని వెళ్తుండేవాడు. ఇలా ఉండగా ఈమధ్య కళ్ళు డ్రై అయిపోయి నొప్పి పెట్టడంతో తను చాలా ఇబ్బందిపడ్డాడు. అప్పుడు కంటి డాక్టరుకి చూపిస్తే, ఐ డ్రాప్స్ ఇచ్చారు. వాటిని వాడినా ఆ సమస్య అలాగే ఉండటంతో నేను, "బాబా! బాబు కళ్ళు నార్మల్ అయ్యేట్లు చూడు తండ్రి. వెండికళ్ళు మీ హుండీలో వేస్తాను" అని బాబాకు మొక్కుకున్నాను. ఇప్పుడు బాబు కళ్ళు నార్మల్ అయ్యాయి. చదవడానికి, కారు డ్రైవ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదంతా బాబా దయవల్ల సాధ్యమయింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం బాబా వల్లనే అవుతుంది అని నా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మిమ్మల్ని కొలిచిన భక్తులను కంటికి రెప్పలా కాపాడతారని నా నమ్మకం. అదే నిజం కూడా. నాకు మీరే దిక్కు సాయి. నన్ను నా కుటుంబాన్ని సదా కంటికి రెప్పలా కాపాడు తండ్రి". ధన్యవాదాలు సాయి.


సాయి తన బిడ్డలను బాధపడనివ్వరు


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయి బంధువులకు నా నమస్కారం. గత 5 సంవత్సరాలుగా నేను బాబాకు అంకిత భక్తుడిని. 2022లో ఒకసారి నా కుడికాలు, అలాగే నా శరీరంలో కుడివైపు అంతా ఒక్కటే నొప్పిగా ఉంటూ కాలు లాగేస్తూ ఉండేది. అందువలన నేను ఏ పని చేసుకోలేకపోయేవాడిని. కనీసం నడవటానికి కూడా ఇబ్బందిపడుతుండేవాడిని. అప్పుడు నేను ఎంతో ఆర్తిగా, "బాబా! ఈ పార్శ్వపు నొప్పులను తొలగించి నాకు హాయిని ప్రసాదించండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, రెండు రోజుల్లో నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. "థాంక్యూ బాబా".


మా పాప హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుకుంటుంది. తనకు గవర్నమెంట్ నుండి స్కాలర్‌షిప్ వస్తుంది. దానికోసం మేము ఆన్లైన్లో అప్లై చేసి, ఆ పేపర్స్ కాలేజీలో ఇవ్వాల్సి ఉండగా నేను ఆ పేపర్లు మా పాపకిచ్చి కాలేజీవాళ్ళు అడిగినప్పుడు ఇమ్మని చెప్పాను. తను అలాగేనని ఆ పేపర్లు తీసుకుంది. తరువాత 2022, ఏప్రిల్ 23న కాలేజీవాళ్ళు ఆ పేపర్ల గురించి అడిగారు. కానీ ఆ పేపర్లు కనిపించలేదు. దాంతో మా పాప నాకు ఫోన్ చేసి, "డాడీ ఆ పేపర్లు లేవు" అని చెప్పింది. నాకు చాలా బాధేసి, "సాయీ! ఆ పేపర్లు సాయంత్రంకల్లా దొరికేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. సాయి మహిమ చూపారు. మా పాప ఆ పేపర్లు తన ఫ్రెండ్ పెట్టెలో(మా పాపే అందులో పెట్టింది) దొరికాయని ఫోన్ చేసి చెప్పింది. అది విని నాకు చాలా సంతోషమేసింది. "థాంక్యూ సాయి. మీరు మీ బిడ్డలను బాధపడనివ్వరని మాకు తెలుసు".


సాయికి చెప్పుకున్నంతనే జరిగిన పని


సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు అంజలి. మా తమ్ముడు ప్రసాద్‍కి బదిలీ అయి దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా, తన పే స్లిప్‍లో తను పని చేస్తున్న చోటుగాని, శాలరీలో హెచ్.ఆర్.ఏ గాని మారలేదు. ఆ విషయమై పిర్యాదు పెట్టుకుని చాలా రోజులు అవుతున్నా ఏ స్పందనా లేదు. చివరికి నేను వేరే వాళ్ళని సంప్రదిస్తే మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టమన్నారు. నేను బాబాను తలుచుకుని నా పోర్టల్ నుండి మెయిల్ పెట్టాను. అంతే బాబా దయవల్ల పదిరోజుల్లో పని అయిపోయింది. ప్రసాద్ పనిచేసే చోటు, శాలరీ హెచ్.ఆర్.ఏ రెండూ మారాయి. "థాంక్యూ సో మచ్ బాబా. అన్ని చికాకులను తొలగించు తండ్రి. తమ్ముడు ప్రసాద్‍ని, తన కుటుంబసభ్యులందరినీ, ఇంకా అందరినీ చల్లగా చూడు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


6 comments:

  1. 🙏🕉️✡️🙏 సాయి నాధ సర్వదేవతల నవ్యాకృతివి నీవే .. వైద్యులకే వైద్యుడివి నీవే.. సకల ఆది వ్యాధులను సైతం విభూతితో రూపుమాపి నిర్మూలించిన గొప్ప మహిమలు కలిగిన సాయి దేవుడివి నీవే.. మీకు ఇవే మా కృతజ్ఞతలు.. ధన్యవాదాలు.. సాష్టాంగ ప్రణామాలు సాయీశ్వర..

    ReplyDelete
  2. మా అనారోగ్యాలను మీ ఆశీస్సులతో విభూది మహిమతో తొలగించిన గొప్ప దేవా.. మీకివే మా కృతజ్ఞతలు ధన్యవాదాలు సాయిఈశ్వరా.. మా భారం అంతా మీదే సాయినాథా.. మీకు శత కోటి సాష్టాంగ ప్రణామములు.. దేవా

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. మాకు సన్మార్గం కల్పించడానికే అనారోగ్యం, ఆర్థిక భాదలు కల్పించారు థాంక్యూ సాయినాథ.. ఇక చాలు దేవా. మేము అనారోగ్య ఆర్థిక భాధలు భరించలేక పోతున్నాము.. దయచేసి ఇక ఇప్పటి నుంచి మీ పాదాల పైన శ్రద్ధ భక్తులు రెట్టింపు అయ్యేలాగా మీ దయ తోని దివ్యమైన ఆశీస్సులు అందించి.. అన్నీ సెట్ చేసి.. మాకందరికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించు దేవా సాయినాథ.. మీరే దిక్కు మీరే సర్వస్వం.. సాయినాథా కరుణించు కాపాడు.. అమ్మానాన్న, గురువుగారు, దైవం అన్నీ మీరే సాయిరామ్ బాబా

    ReplyDelete
  5. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo