1. ఆరునెలల మనోవేదనకు ముగింపునిచ్చిన బాబా
2. శ్రీసాయి అనుగ్రహం
3. నెలసరి రాకుండా అనుగ్రహించిన బాబా
ఆరునెలల మనోవేదనకు ముగింపునిచ్చిన బాబా
నా పేరు సిహెచ్. రమాసుందరి. మాది పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు. నేను శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కరిస్తూ 2022, ఏప్రిల్ 8, శుక్రవారంనాడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేము గత ఏడాది(2021)లో పల్లెటూరులో ఉన్న మా ఇంటిని ఒకాయనకి అద్దెకి ఇచ్చాము. ఆయన, "నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. చిన్నమ్మాయి, అబ్బాయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భార్య అనారోగ్యంతో మా అబ్బాయి దగ్గర హైదరాబాదులో ఉంటుంది. నేను, మా పెద్దమ్మాయి ఈ ఇంట్లో ఉంటాం. ఇదే ఊళ్ళో మేము ఇల్లు కట్టుకుంటున్నాము. అది పూర్తికావడానికి ఒక ఆరునెలల సమయం పడుతుంది. ఇంటి నిర్మాణం పూర్తవగానే వెళ్ళిపోతామ"ని చెప్పారు. మేము ఆయనకి ఇల్లు అద్దెకి ఇచ్చాము. వాళ్ళు ఇంట్లో దిగేరోజు మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళ పెద్దమ్మాయి మా ఇంటిని, మమ్మల్ని అకారణంగా తిట్టడం, తల్లిదండ్రులను మాట్లాడనివ్వకపోవడం చూసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 'సరే! ఆ సాయితండ్రి చూసుకుంటాడు' అని అనుకున్నాము. సుమారు ఆరునెలల క్రితం ఆ తండ్రి ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్‌ను ఈ అమ్మాయి దగ్గరే వదిలేశారు. అప్పటినుండి మాకు మానసిక ఆందోళన ప్రారంభమైంది. ఆ అమ్మాయి ధాటికి ఆగలేక మా ఇంటి పైవాటాలోకి ఎవరూ అద్దెకు వచ్చేవారు కాదు. ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని నానా మాటలు అనడం, మేము వెళ్తే మమ్మల్ని కూడా తిట్టడం, తండ్రి ఫోన్ నెంబర్ అడిగితే తనకు తెలియదని నానా రభస చేయడం చేస్తుండేది. ఎలాగో కష్టపడి ఒక మంచి కుటుంబానికి పైవాటాని అద్దెకి ఇచ్చాము. అయితే ఈ అరునెలల కాలంలో ఆమె పైవాటాలో ఉన్నవాళ్ళని తిట్టడం, వీధిలో అరవడం వంటివి చేస్తుండటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించమని మాపై ఒత్తిడి తెచ్చారు. మాకు ఈ గొడవలు కొత్త. పోలీసు రిపోర్ట్ ఇస్తే, ఆమె ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే ఇంకా సమస్యల్లో కూరుకుపోతాం. అందుకని పెద్ద మనుషులని పంపిస్తే, వాళ్ళ మీద కేసు పెడతానని బెదిరించింది. పోనీ, ఆమె తల్లిదండ్రులను సంప్రదించుదామా అంటే వాళ్ళ చిరునామా మాకు తెలీదు. ఫోన్ చేసి తండ్రి నెంబర్ ఇమ్మంటే, ఫోన్‍లోనే ఈమె మమ్మల్ని తిట్టేసేది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అద్దె మాత్రం ప్రతినెలా ఒక అపరిచిత ఖాతా నుండి మా అకౌంటులో జమ అవుతుండేది.
మేము బాబా, భరద్వాజ మాస్టరుగార్లను నమ్ముకున్నవాళ్ళము. మేము ఈ సమస్యని బాబాకి చెప్పుకుని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. ఇలా అండగా 2022, ఏప్రిల్ 7వ తేదీన మా చెల్లెలు మా ఈ సమస్య గురించి విని, "ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమైతే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకి దణ్ణం పెట్టుకో అక్కా!" అని అంది. వెంటనే నేను తను చెప్పినట్లు బాబాకి చెప్పుకున్నాను.. ఆ రాత్రి, వాళ్ళ నాన్నగారిని వెంటనే రెస్పాండ్ అవమంటూ మా ఇంట్లో అద్దెకుంటున్న ఆ అమ్మాయి సెల్ నెంబరుకి ఒక మెసేజ్ పెట్టాను. నిజానికి ఆ సెల్ ఆమె దగ్గరే ఉంటుంది. కాబట్టి పని జరుగుతుందని నాకు ఏ మాత్రమూ ఆశ లేదు. కానీ అనుకోకుండా ఆ అమ్మాయి తండ్రి కూతురు దగ్గరకి రావడం, ఆమెకి తెలియకుండా నా మెసేజ్ చదవడం జరిగాయి. మరుసటిరోజు ఉదయమే హైదరాబాదులో ఉన్న తన భార్య చేత నాకు ఫోన్ చేయించి మాట్లాడించారు. ఆమె, "మా రెండో అమ్మాయి అనుకోకుండా చనిపోయింది. చాలా కష్టాల్లో ఉన్నాము. మతిస్థిమితం లేని పెద్దమ్మాయిని ఒక నెలరోజుల్లో తీసుకెళ్ళిపోతాము. రెండునెలల్లో మీ ఇల్లు ఖాళీ చేసేస్తాము. మమ్మల్ని క్షమించండి" అని వేడుకుంది. బాబా దయవల్ల ఆరునెలలుగా మేము అనుభవిస్తున్న మనోవేదన ఈరోజు(2022, ఏప్రిల్ 8) ఇలా తీరింది. ఈ బ్లాగు ద్వారా నా గురుదేవునికి శతకోటి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
శ్రీసాయి అనుగ్రహం
నా పేరు తనుశ్రీ. నేను ఒక గృహిణిని. మేము యు.ఎస్.ఏలో ఉంటాము. నాకు ఇద్దరు పిల్లలు. నా పెళ్ళైన వెంటనే మా నాన్నగారు చనిపోయారు. అంతటితో మొదలయ్యాయి నాకు సమస్యలు. 2016, జనవరి 1న నేను అనుకోకుండా ఒక విపత్తు గురించి విన్నాను. ఇంకా దాదాపు ఆరేళ్లు సమస్యలు ఎదుర్కున్నాను. అవి ఓపెన్‍గా చెప్పలేను. అందుకే చెప్పట్లేదు. నేను నా సమస్యలను చీటీలలో వ్రాసి, ఆ చీటీలకు ఊదీ రాసి బాబా పాదాల దగ్గర పెట్టి, రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అంతేకాదు, బాబా పారాయణ పుస్తకం నా పక్కనే పెట్టుకుని నిత్యమూ మొరపెట్టుకుంటుండేదాన్ని. అలా బాబా దగ్గర మొరపెట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు ఏడ్చాను. బాబా దయ నా మీద ఉంది. ఆయన అద్భుతాలు చేసి నన్ను కాపాడారు. చాలామంది సహాయంతో నా భర్త నా సమస్యలను పరిష్కరించారు. నా భర్త నాకు హెల్ప్ చేసిన ప్రతిసారీ బాబానే తన ద్వారా నాకు సహాయం చేస్తున్నారని నేను అనుకునేదాన్ని. అయినవాళ్లను నమ్ముకోవద్దు, బాబానే నమ్మండి. నేను అలాగే చేశాను. "బాబా! మీ దయతో నా భర్తకి ఇప్పుడు బోనస్ రానుంది. 50 వేల డాలర్లు వచ్చేలా అనుగ్రహించండి బాబా. మీ దయతోనే అది సాధ్యం. నాకు వేరే వాళ్ళు (రామాంజనేయులు అనే వ్యక్తి) డబ్బులు ఇవ్వాలి. నాకు రావాల్సిన డబ్బంతా ఇచ్చేలా చేయండి బాబా. మీ ఊదీ అద్భుతాలు చేస్తుంది. మా తమ్ముడికి, అన్నయ్యకి, మా కుటుంబానికి, ఇంకా అందరికీ అఖండ సంపద, ఆయురారోగ్యాలు, బుద్ధి, ధైర్యం అన్నీ ఇచ్చి కాపాడు తండ్రీ. తమ్ముడికి విదేశంలో ఉద్యోగం, అఖండమైన జీతం ఇవ్వు తండ్రీ. తమ్ముడు భార్యాపిల్లలతో కలిసి చల్లగా ఉండాలి తండ్రీ. అమ్మని కొడుకులు, కూతురు అందరూ బాగా చూసుకోవాలి. అద్భుతాలు నువ్వు చేస్తావు తండ్రీ. నేను నీ పాదాల దగ్గర శరణు వేడుకుంటున్నాను".
నెలసరి రాకుండా అనుగ్రహించిన బాబా
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా, సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ 3, ఆదివారం నా మేనకోడలి అక్షరాభ్యాసం జరిగింది. సరిగా అప్పుడే నా నెలసరి సమయం కావడంతో, నాకు నెలసరి వస్తే నేను ఆ కార్యక్రమానికి వెళ్లడం కుదరదేమోనని భయపడి, "సాయీ! నాకు నెలసరి రాకుండా చూడండి. నేను అక్షరాభ్యాసంలో పాల్గొనేటట్లు చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల నాకు నెలసరి రాకపోవడంతో నేను ఆ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నాను. ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం బాగా జరిగింది. "థాంక్యూ సాయీ. కొంచెం ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు క్షమించు తండ్రీ. మీరు తోడుగా ఉంటే ఎటువంటి పరీక్షనైనా ఎదుర్కోవచ్చు సాయీ. సదా మాకు రక్షగా ఉండు తండ్రీ".
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteCarpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
🙏 ఓం సాయి రామ్ 🙏
ReplyDelete