సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1169వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఊదీ మహాత్మ్యము

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. సర్వంతర్యామి అయిన శ్రీసాయినాథుడు నేను ఆయన భక్తుడనైనప్పటి నుండి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఆయన ఎన్నోసార్లు నాకు స్వప్న దర్శనమిచ్చారు. తద్వారా ఆయన నాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. నేను అదృష్టవంతుడిని. ఒకప్పుడు నాకు కిడ్నీలో రాళ్ల వలన నొప్పిగా ఉండేది. కొద్దిరోజులు మందులు వాడితే రాళ్లు పోయాయి. అయితే రెండు సంవత్సరాల తరువాత కొద్దికొద్దిగా నొప్పి మళ్ళీ మొదలైంది. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు ఉదయం నేను మా పొలం దగ్గరున్న సమయంలో నొప్పి ఎక్కువగా వచ్చింది. తట్టుకోలేక హాస్పిటల్‍కి వెళదామనుకున్నాను. అంతలో బాబా ఊదీ మహిమ గుర్తొచ్చి నుదుటన ఊదీ పెట్టుకొని, మరికొంత ఊదీ నీటిలో కలుపుకుని త్రాగి, ఇంకొంచం ఊదీ నొప్పి ఉన్న చోట రాసాను. ఊదీ మహాద్భుతంగా పని చేసింది. అతి కొద్దిసేపట్లోనే నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇంతకుముందు నొప్పి వచ్చినప్పుడు ఇంజక్షన్ చేయించుకుంటే, కొంత సమయం తరువాతగాని తగ్గేది కాదు. అలాటిది ఈసారి బాబా ఊదీతో తొందరగా తగ్గి హాస్పిటల్‍కి వెళ్లాల్సిన పని తప్పింది. ఈ విధంగా బాబా ఎల్లప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా! మాకు ఏది అవసరమో, ఏది అనవసరమో మీకు తెలుసు బాబా. దయచేసి కిడ్నీలోని రాళ్ళ వల్ల వచ్చే ఈ నొప్పి నుండి నాకు పూర్తిగా విముక్తి ప్రసాదించండి బాబా".

సర్వే జనా సుఖినోభవంతు!!!
సర్వం సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo