ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా కృపతో దొరికిన హారం - చేకూరిన ఆరోగ్యం
2. పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చి ఆనందాన్నిచ్చిన బాబా
3. కరుణించి కాపాడే దైవం
బాబా కృపతో దొరికిన హారం - చేకూరిన ఆరోగ్యం
నా పేరు సత్యకళ్యాణి. మాది పశ్చిమగోదావరి జిల్లా. నేను అడుగుడుగునా సాయిప్రేమను పొందుతున్న భాగ్యశాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఎన్నిసార్లో నన్ను ఆపదల నుండి గట్టెంక్కించారు. నేనిప్పుడు ఇటీవల జరిగిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ నెల రెండవ వారంలో నా బంగారు హారం ఒకటి కనిపించలేదు. బ్యాంకు లాకర్లో చూసినా, ఇంట్లోవెదికినా ఆ హారం ఆచూకీ తెలియక నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడింక బాబాను ప్రార్థించి, "బాబా! హారం దొరికిన వెంటనే నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుని, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల మర్నాడే నా హారం నాకు దొరికింది. నా ఆందోళన తీరి ఆనందంగా సాయి ప్రేమకు మనసారా ధన్యవాదాలు తెలుపుకొని, ఇలా మీ అందరితో నా అనుభవాన్ని పంచుకున్నాను.
ఎంత చెప్పుకున్నా తనివి తీరనిది బాబా ప్రేమ. ఎంతో ప్రేమతో ఆయన నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. 2022, ఏప్రిల్ నెల మూడవ వారంలో నేను ఒక రాత్రిపూట విపరీతమైన ఆయాసంతో చాలా బాధపడ్డాను. మరో రెండు రోజుల్లో దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో, ఆ పెళ్ళికి వచ్చిన నేను ఈవిధంగా బాధపడ్డాను. మర్నాడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, ‘యాంజియోగ్రామ్ చెయ్యాల’ని చెప్పారు. ‘ఇదేమిటి భగవంతుడా, ఇలా జరిగింది?’ అని ఎంతో బాధపడి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాని ఆర్తిగా ప్రార్థించుకున్నాను. బాబా దయవలన, ‘అంతా క్లియర్‌గా ఉంది, సమస్య ఏమీ లేద’ని డాక్టర్ చెప్పారు. ఆ మర్నాడు నేను పెళ్ళికి కూడా హాజరయ్యాను. నాకప్పుడు అర్థమైంది, ‘బాబా తన ప్రేమను తల్లితండ్రుల రూపంలో, బంధువులు, స్నేహితుల రూపంలో, డాక్టర్లు, సిస్టర్ల రూపంలో, ఇంకా అనేక రూపాలలో మనకు పంచుతారు’ అని. నాపై ఇంత ప్రేమ చూపిన బాబాకి అనేకవిధాల ధన్యవాదములు తెలుపుకుంటూ...
పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చి ఆనందాన్నిచ్చిన బాబా
ముందుగా సాయి బంధువులకు మరియు ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు నా అనుభవాలు చాలాసార్లు మీతో పంచుకున్నాను. మరలా మరో అనుభవంతో మీ ముందుకు వచ్చాను. "నా అనుభవాలను చాలా ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా". 2021, డిసెంబర్లో యు.ఎస్.ఏలో ఉంటున్న మా పాప, బాబు ఇండియా రావడానికి అనుకోకుండా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ కరోనా భయంతో వాళ్లు, "అమ్మా! మేము ఫ్లైట్ ఎక్కి, దిగి ఇంటికి వచ్చేదాక ఏం చెప్పలేం. నువ్వు ఎదురుచూసి బాధపడకు" అని నాతో చెప్పారు. అప్పుడు నేను బాబాతో, "బాబా! నా పిల్లలు యు.ఎస్.ఏ వెళ్లి ఆరు సంవత్సరాలైంది. మనవరాలికి మూడు సంవత్సరాలు వచ్చాయి. క్వారంటైన్ వంటి సమస్యలు ఏమీ లేకుండా వాళ్ళు ఇంటికి వచ్చేలా చేయండి" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు డిసెంబర్ 15న ఇండియాకి వచ్చి జనవరి 29 వరకు చాలా ఆనందంగా గడిపి తిరిగి వెళ్లారు. బాబా దయకు నేను చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా. మీ దయ దూరంగా ఉన్న నా బిడ్డలపై సదా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. మా బాబు పెళ్లి విషయంలో నేను చాలా టెన్షన్ పడుతున్నాను. తొందరగా ఆ సమస్యను పరిష్కరించండి బాబా. నా కోరిక తొందరగా తీరి, సాయి బంధువులతో మరల నా అనుభవాన్ని పంచుకునేలా దీవించండి బాబా. నేను క్షణక్షణం నా భయాలు మరియు అన్ని బరువు బాధ్యతలను మీమీద వేస్తున్నాను. మీరు చాలా దయతో నన్ను కాపాడుతున్నారు బాబా. కానీ నా భయాలను ప్రతిక్షణం మీతో చెప్పుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
కరుణించి కాపాడే దైవం
సాయి బంధువులకు నా నమస్కారం. నా పేరు సుభాషిణి. సాయి వంటి దైవం లేనే లేదు. 'సాయీ' అంటే చాలు మన బాధలు తీరుస్తారు. ఆయన నాకు అన్ని విధాలా సహాయం చేస్తున్నారు. నాకు తరచూ వెన్నుపూస నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించుకుంటేనే తగ్గుతుంది. అలాంటిది ఈ మధ్య 2022, ఏప్రిల్ 8న ఆ నొప్పి వచ్చినప్పుడు నేను బాబాను తలుచుకుని నొప్పి ఉన్న చోట ఊదీ రాసుకున్నాను. మరసటిరోజు ఉదయానికి నొప్పి చాలావరకు తగ్గి సాయంత్రానికి పూర్తిగా తగ్గిపోయింది. తరువాత ఏప్రిల్ 12న మావారికి నాలాగే వెన్నునొప్పి వస్తే బాబా ఊదీ రాసి, కొద్దిగా ఊదీ నోటిలో వేసాను. 5 నిమిషాల్లో ఆయనకి నొప్పి తగ్గి నిద్రపోయారు. ఇదంతా బాబా దయ. బాబా అందరినీ కరుణించి కాపాడే దైవం. "ధన్యవాదాలు బాబా. ఏవైనా తప్పులుంటే క్షమించు తండ్రి".
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDelete🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI
ReplyDeleteOm sai ram
ReplyDelete