సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1170వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం
2. సాయినాథుని దయవల్ల తప్పిపోయిన గండం 
3. సాయి తీర్చిన కోరిక

బాబా అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి మలబద్ధకంతోపాటు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు నాకు వచ్చాయి. నాకు తెలిసిన గృహచికిత్సలు పాటించినా ఫలితం కనిపించలేదు. సమస్య ఉధృతంగా ఉండటంతో బాబాను ప్రార్ధించి, ఊదీ సేవిస్తూ. 'నా సమస్యకు ఉపశమనం లభిస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకుందామ'ని నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. కాని మలబద్దకం వంటి సమస్యలను బ్లాగులో చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గుగా అనిపించి, వద్దులే మనం బాబాని మన:పూర్వకంగా ప్రార్ధించాము కదా, అది చాలు అనుకున్నాను. 'మన మనసులో మెదిలే ఆలోచనలన్నీ తమకు తెలుస్తుంటాయ'ని బాబా చెప్తారు కదా! ప్రక్కరోజు బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుదామని బ్లాగు ఓపెన్ చేసి, అందులో ఉన్న ఒక భక్తుని అనుభవం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ భక్తుడు మలబద్దకం గురించి, మలంలో రక్తం రావటం గురించి పంచుకున్నారు. తద్వారా, 'బ్లాగులో ఎటువంటి సమస్యనైనా పంచుకోవచ్చ'ని బాబా నాకు చెప్తున్నారనిపించింది. నాకు (మనకు) బాబానే సర్వస్వం. ఆయన వైద్యులకే వైద్యుడు. అమ్మ దగ్గర, డాక్టరు దగ్గర మనం అన్నీ చెప్పుకుంటాము కదా! వెంటనే, నేను ఇంకేమీ ఆలోచించకుండా, "నాకు మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నాకు క్రమంగా మలబద్ధకం నుండి ఉపశమనం లభించింది. త్వరలోనే నాకు నార్మల్ అవుతుందని నమ్మాను. 


నా నెలసరి విషయంలో నాకు కొన్ని సమస్యలు, సందేహాలు ఉండేవి. దానివల్ల నేను నెలలో ఎక్కువ రోజులు పూజ చేసుకోలేకపోయేదాన్ని. ఆ సందేహాలు డాక్టరు దగ్గరకి వెళితే తీరేవికావు. అందుచేత బాబా దగ్గర, "బాబా! నాకు నెలసరి ఎందుకు ఇలా ఉంటుంది? ఇలా ఉంటే పూజ చెయ్యెచ్చా? దయచేసి నెలలో ఎక్కువ రోజులు పూజ చేసుకునేలా అనుగ్రహించండి బాబా" అని మొరపెట్టుకునేదాన్ని. ఇలా ఉండగా ఒక గురువారం నేను బాబా మందిరానికి వెళ్ళాను. మామూలుగా అయితే నేను పల్లకీ సేవ, శేజారతి చూసుకుని ఇంటికి వస్తాను. కానీ ఆరోజు దర్శనం చేసుకున్న వెంటనే నాకు నెలసరి వచ్చినట్లుగా సందేహమొచ్చి ఇంటికి వచ్చేశాను. కానీ మధ్యలోనే వచ్చేసినందుకు చాలా బాధేసింది. ఆరతికి ఉండలేకపోయినందుకు ఏడ్చేసాను కూడా. మరుసటిరోజు బ్లాగులో ఒక భక్తురాలు తమ ఇంటి గృహప్రవేశం సందర్భంలో బాబా అనుగ్రహన్ని పంచుకున్నారు. అందులో ఆమె తన నెలసరి గురించి ప్రస్తావించారు. ఆ అనుభవం ద్వారా బాబా నా నెలసరి సమస్యకు సంబంధించి నాకున్న సందేహలకు సమాధానమిచ్చారు. ఈ బ్లాగులో వచ్చే ఒక భక్తుని అనుభవం మరో భక్తుని సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. "థాంక్యూ సో మచ్ బాబా". 


మేము విదేశాలలోనే ఉంటున్నాము. ఒకసారి నేను, నాభర్త ఇద్దరమూ ఇండియాకి వచ్చాము. మా అమ్మాయి ఒక్కతే అక్కడ ఉంది. మాకు అక్కడ బంధువులు ఎవ్వరూ లేరు. ఉన్న సన్నిహిత స్నేహితులు కూడా చాలా తక్కువ. అయినప్పటికీ బాబా అండగా ఉన్నారనే ధైర్యంతో అమ్మాయిని వదిలి నేను ఇండియాకి వచ్చాను. తరువాత ఒకరోజు మా అమ్మాయికి గొంతునొప్పి, ఒళ్ళునొప్పులు, దగ్గు వచ్చాయి. భయానికి, ఆందోళనకు గురిచేసే లక్షణాలు అవి! అందువల్ల నేను వెంటనే బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల కోవిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. కానీ ఆరోజు అమ్మాయికి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఫ్లూ జ్వరాల సీజన్. అంతకుముందు రెండు సంవత్సరాలు ఆ కాలంలో మా అమ్మాయి ఒకసారి మూడురోజులు జ్వరంతో, మరోసారి విపరీతమైన దగ్గుతో బాగా నీరసించిపోయి చాలా ఇబ్బందిపడింది. ఈసారి మేము లేని సమయంలో తను అనారోగ్యం పాలవడంతో తనకి అక్కడ సహాయం చేసే వాళ్ళెవరూ లేరని నేను ఆందోళన చెంది నా బాబాకి మొరపెట్టుకున్నాను. ఆ కరుణామూర్తి దయవలన మా అమ్మాయి  ఒక్కరోజులోనే నార్మల్ అయింది. "బాబా! నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు".


మా అమ్మాయి స్నేహితురాలి తల్లిదండ్రులు చాలా దూర ప్రాంతంలో ఉంటారు. ఒకరోజు అర్థరాత్రి ఆ అమ్మాయికి చెస్ట్ పెయిన్ వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉండడంతో తను వెంటనే హాస్పిటల్‍కి వెళ్ళింది. నేను వెంటనే "బాబా! ఆ అమ్మాయికి త్వరగా నార్మల్ అవ్వాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. డాక్టరు, "యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల పెయిన్ వచ్చింద"ని చెప్పి మరుసటిరోజు ఇంటికి పంపించారు. ఒక్కరోజులోనే ఆ అమ్మాయి నార్మల్ అయింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ అమగ్రహం నా కుటుంబం మీద, అందరి మీద కుండపోతగా వర్షించాలని వేడుకుంటున్నాను తండ్రి. మా అందరినీ చల్లగా చూడండి బాబా".


సాయినాథుని దయవల్ల తప్పిపోయిన గండం


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు గీత. ఒకసారి మా అన్న అంటే చిన్నాన్న కొడుకుకి ఆరోగ్యం బాగాలేకపోయింది. తనను పరీక్షించిన డాక్టర్లు తన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని చెప్పి, “మా ప్రయత్నం మేము చేస్తాము. కానీ, 48 గంటల వరకు వెంటిలేటర్ అవసరం లేకుండా తను బాగా ఊపిరి తీసుకోవాలి. అప్పుడే మేము ఇస్తున్న చికిత్స ఆయనకు పని చేస్తుంది” అని చెప్పారు. నేను మా వదినతో ఫోన్లో మాట్లాడినప్పుడు తను ఈ విషయం నాకు చెప్పి చాలా బాధపడింది. నేను ఆమెకు ధైర్యం చెప్పి, “అన్నకు ఏమీ కాదు, తను త్వరలోనే బాగవుతారు” అని చెప్పాను. ఆ తరువాత నేను సాయినాథునికి పూజ చేసి, "అన్న ఆరోగ్యం మెరుగుపడేలా అనుగ్రహించమ"ని మనసారా వేడుకుని, "అన్న ఆరోగ్యం మెరుగుపడాల"ని చెప్పుకున్నాను. అప్పటినుండి బాబా కృపాకటాక్షాల వల్ల వైద్యుల పర్యవేక్షణలో అన్న కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. స్వయంగా లేచి నిలబడి నడవలేకపోయినా ప్రక్కవారి సహాయంతో లేచి నిలబడి నడగలిగారు. తన పరిస్థితి మరింత మెరుగవడానికి మరికొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ సాయినాథుని దయవల్ల తనకు గండం గడిచింది. ఆ సాయినాథుని మనసారా వేడుకుంటే కానిది ఏదీ లేదు కదా?

 

శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి తీర్చిన కోరిక


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను రోజూ మా ఇంటికి దగ్గరలో ఉండే సాయిబాబా మందిరానికి వెళుతుండేదాన్ని. అక్కడ ప్రతి గురువారం మైకులో బాబా భజన, విష్ణుసహస్రనామ పారాయణ జరుగుతుండేవి. నాకు కూడా అలా మైకులో పాడాలనిపించి, "సాయి గోవిందా! నేను కూడా మైకులో పాడాలి" అని నా కోరికను బాబాతో చెప్పుకున్నాను. కొన్నిరోజుల్లోనే ఆ మందిర పూజారి మైకులో పాడమని నాతో చెప్పారు. బాబా నా కోరిక తీర్చినందుకు నేను చాలా ఆనందించాను. "సాయి గోవిందా! ఇలా ఎప్పుడూ నా వెంట ఉండి నన్ను కాపాడండి. మీ చల్లని ఆశీస్సులు నాకు, అందరికీ ఉండాలి తండ్రి".


6 comments:

  1. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🥰🌺😘🌼🤗🌹🙂🌸💕👪

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo