సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1164వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టాలను కడతేర్చే సాయినాథుడు
2. బాబా స్మరణతో సమస్యలు మాయం
3. పెళ్లి సంబంధాన్ని తప్పించిన బాబా

కష్టాలను కడతేర్చే సాయినాథుడు


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేను ఒక సాయి భక్తురాలిని. నేను 2022లో నా ఆఖరి సెమిస్టర్ పరీక్షలు వ్రాసాను. వాటి ఫలితాలు వచ్చాక చూస్తే నేను ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. ఆఖరి సంవత్సరంలో ఒక పేపర్ ఉండిపోవడం వల్ల ఒక సంవత్సరం వృధా అయ్యే పరిస్థితి వచ్చినందుకు జీవితంలో త్వరగా స్థిరపడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాకు చాలా బాధేసింది. అసలే కొన్ని కారణాలు వల్ల నా జీవితంలో నేను ఊహించని సమస్యలు వచ్చాయి. కనీసం నా కెరీర్ అయిన మంచిగా మొదలవ్వాలని ఎంతో తాపత్రయపడ్డాను. కానీ ఇలా జరగడం వల్ల నేను చాలా నిరాశకి గురయ్యాను. ఆ స్థితిలో నా మిత్రులు రీవాల్యుయేషన్‍కి అప్లై చేయమని సూచించారు. వారి సలహామేరకు నేను ఎటువంటి ఆశ పెట్టుకోకుండా రీవాల్యుయేషన్‍కి అప్లై చేసి, "బాబా! రీవాల్యుయేషన్‍లో నేను పాస్ అయ్యేలా అనుగ్రహించండి" అని మనసులో బాబాని తీవ్రంగా ప్రార్ధించాను. బాబా నా ప్రార్ధన ఆలకించి నన్ను రీవాల్యుయేషన్‍లో పాస్ చేసారు. ఒక సంవత్సరం వృధా కాకుండా కాపాడి నా చదువు ఆ సంవత్సరమే పూర్తయ్యేలా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఒకరోజు నేను వేరే ఊరు వెళ్లొచ్చి బస్సు దిగి నా బండి మీద మా ఇంటికి వెళ్తున్నాను. తీవ్రమైన ఎండ వల్ల కొబ్బరినీళ్లు త్రాగుదామని ఒక కొబ్బరిబొండాల బండి దగ్గర ఆగాను. వాటిని విక్రయిస్తున్న ఆమె నాకోసం కొబ్బరిబొండాం కొట్టే క్రమంలో కత్తి పొరపాటున తన చేతి వేలుకి తగిలి పై చర్మమంతా కోసుకుపోయి రక్తం బాగా వచ్చింది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. గబగబా దగ్గర్లో ఉన్న షాపుకి పోయి బ్యాండ్ ఎయిడ్ తెచ్చి ఆమెకి ఇచ్చాను. అయినా చాలా రక్తం పోతుంది. దాంతో ఆమెను హాస్పిటల్‍కి తీసుకు వెళ్ళాలని చుట్టుపక్కల చూస్తే ఆ వీధిలోనే హాస్పిటల్ కనిపించింది. ఆమెను అక్కడికి తీసుకుని వెళ్లి నర్సుకి చెప్తే, కట్టుకట్టి ఇంజక్షన్ చేసింది. ఆ హాస్పిటల్లో బాబా(విగ్రహం) ఉన్నారు. ఆయనకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఆమెకి త్వరగా తగ్గాలి" అని అనుకున్నాను. ఒక నాలుగు రోజులు తర్వాత వెళ్లి, ఆమెను "తగ్గిందా?" అని అడిగాను. అందుకామె సంతోషంగా తగ్గిపోయిందని చెప్పి, తన వేలు చూపించింది. అంతా ఆ సాయినాథుని కృప. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".


బాబా స్మరణతో సమస్యలు మాయం


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ బ్లాగు సమస్యలు వచ్చినపుడు ఎలా గట్టెక్కాలో తెలియజేస్తూ, ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. నేనిప్పుడు బాబా ఆశీర్వాదంతో ఒక సమస్య నుండి మేము ఎలా బయటపడ్డామో మీతో పంచుకుంటున్నాను. 2022, మార్చి నెలాఖరులో మా చెల్లెలి మామగారు (మానాన్న స్నేహితుడు) హఠాత్తుగా బిపి ఎక్కువై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు అతన్ని ఐసియులో ఉంచి, "24 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేము" అన్నారు. అయితే ఆలోగా అతనికి హార్ట్ స్ట్రోక్ కూడా రావడంతో డాక్టరు, "పరిస్థితి కాస్త విషమంగా ఉంది. ఇంకో 12 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేము" అన్నారు. ఇంక మా చెల్లెలు చాలా భయపడి, "ఏం చేయాలో తెలియట్లేదు, చాలా భయమేస్తుంది" అని చెప్పింది. బాబా ఎప్పుడూ నాతో 'సాయిరామ్' అనే నామజపం చేయమంటుంటారు. ఆ విషయమే చెల్లెలితో చెప్పి, "వీలైనన్ని ఎక్కువసార్లు 'సాయిరామ్' అనే నామాన్ని జపించు" అని చెప్పాను. నేను కూడా, "బాబా! అతనికి ఎటువంటి హాని జరగకుండా క్షేమంగా ఇంటి తిరిగి రావాల"ని బాబాని వేసుకొని ఆరోజంతా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. బాబా దయవల్ల 24 గంటల తర్వాత డాక్టర్లు, "ప్రమాదం తప్పింది" అని చెప్పారు. మేమంతా చాలా సంతోషించాము. నేను బాబాకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ తరువాత మా ఇంట్లో ఒక సమస్య తలెత్తింది. బాబా నామజపం చేయడం ద్వారా రెండు రోజుల్లో ఆ సమస్య నుండి బయటపడ్డాము. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


పెళ్లి సంబంధాన్ని తప్పించిన బాబా


సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు 2022, ఏప్రిల్ 9న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను చదువుకుంటుండగా 19 సంవత్సరాల వయసప్పుడు నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయికి 26 సంవత్సరాలుంటాయి. అందరూ అతను చాలా మంచివాడని అన్నారు. నన్ను వాళ్లే చదివించుకుంటామని అన్నారు. మా కుటుంబంలో అందరికీ ఆ సంబంధం నచ్చి వారంలో నిశ్చితార్థం అనుకున్నారు. అయితే అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేనందున, "బాబా! ఏదో ఒకటి చేసి మీరే నా పెళ్లి ఆపేయాలి" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే మా కుటుంబానికి ఆ అబ్బాయి చాలా చెడ్డవాడని తెలిసింది. దాంతో మా కుటుంబంలో అందరూ కలిసి ఆ సంబంధం క్యాన్సిల్ చేసారు. నిజానికి ఆ పెళ్లి సంబంధం వల్ల నాకెక్కడ పెళ్ళైపోతుందోనని నేను బాగా డిస్టర్బ్ అయి కొన్నిరోజులు సరిగా చదువుకోలేక చాలా బాధపడ్డాను. బాబా దయవల్ల ఆ సంబంధం తప్పిపోవడంతో నేను చాలా సంతోషించాను. ఎందుకంటే, నేను ఆనందంగా చదువుకోవచ్చు. వారంలోనే పరీక్షలున్నాయి. "సాయిబాబా! ఇదంతా మీ దయ. ఎప్పుడూ ఇలాగే నా వెంట ఉండి కాపాడండి. థాంక్యూ సో మచ్ బాబా. మీ అనుగ్రహాన్ని ఎప్పుడూ మర్చిపోను"


8 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  3. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om Sairam
    Sai Always Be With Me

    ReplyDelete
  5. Carpenter manasu marchi ma money maku ravali baba please

    ReplyDelete
  6. సాయిదేవా హృదయ పూర్వక నమస్కారాలు.. మీపై భక్తి శ్రద్దలు ప్రగాఢ విశ్వాసం నిలుపుకుని.. మా అనారోగ్య సమస్యలు రూపు మాపి నందుకు, ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యలు ప్రసాదించి నందుకు.. సాయి బాబా మీకు శతకోటి సాష్టంగా ప్రణామములు సాయిరాం.. దేవా ఓం సాయిరాం ఓంసాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం

    ReplyDelete
  7. సాయిదేవా హృదయ పూర్వక నమస్కారాలు.. మాకుటుంభం ఎల్లపుడు మీపై భక్తి శ్రద్దలు ప్రగాఢ విశ్వాసం నిలుపుకునే శక్తి యుక్తులు ప్రసాదించి నందుకు .... మా అనారోగ్య సమస్యలు రూపు మాపి నందుకు, ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యలు ప్రసాదించి నందుకు.. సాయి బాబా మీకు శతకోటి సాష్టంగా ప్రణామములు సాయిరాం.. దేవా ఓం సాయిరాం ఓంసాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo