సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1165వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

1. తిరిగి ఇంటికి చేర్చిన సాయి
2. ఉంగరం ఎక్కడుందో తెలియజేసిన బాబా
3. సయాటికా నొప్పిని తగ్గించిన బాబా

తిరిగి ఇంటికి చేర్చిన సాయి


సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి భక్తులకు నమస్కారాలు. అద్భుతమైన సాయి సేవ చేస్తున్న బ్లాగు నిర్వాహక బృందానికి చాలా ధన్యవాదాలు. సాయి కరుణ మహావృక్షంలా తోడుగా ఉంటుందనే భావన భక్తులకు కలగజేయడానికి, అలాగే తమ భక్తులందరినీ వారివారి జీవితాలలో నడిపించటానికి బాబా ఈ బ్లాగును ఒక మాధ్యమంగా చేసుకున్నారని నాకనిపిస్తుంది. నేను ఒక సాయి భక్తురాలిని అనే దానికన్నా, ఆ దయామూర్తే నా జీవితాన్ని ఉద్ధరించడానికి నాకు తమయందు నమ్మకం ఏర్పరచి, నన్ను తమ భక్తురాలిగా మలుచుకున్నారు అనడం సమంజసం. నా జీవితమే సాయి అనుగ్రహం. నా జీవితంలో నాది అని ఎమీ లేదు. అన్నీ ఆయనే, అంతటా ఆయనే. ఆయన కరుణ గురించి ఎంతని చెప్పగలం? ఎంత చెప్పిన ఆయన లీలలు తరగవు. అవి అనంత సాగరాలు. ఆయన అనంత ప్రేమమూర్తి, ఆనంద నిధి, కరుణకి నిలయం. సాయి సచ్చరిత్రలో అన్నాసాహెబ్ దబోల్కర్‍తో బాబా, "ఇతరులకు పెట్టకుండా ఏమీ తినొద్దు. పక్కన ఎవరూ లేకపోతే నాకు సమర్పిస్తున్నావా? నేను నీ పక్కన లేనా?" అన్న బాబా మాటను ఆచరించడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. దాన్ని నేను మరచిపోయినప్పుడల్లా నాకు తలనొప్పి వస్తుంది. ఇది నన్ను సరైన మార్గంలో నడిపించటానికి బాబా ఇస్తున్న శిక్షణ అని నా నమ్మకం. ఇక నా అనుభవానికి వస్తే...


నాకు అనేక కారణాల వల్ల తరచుగా తలనొప్పి వస్తుంటుంది. దాని కారణంగా నేను ఒక్కోసారి నా సాధారణ పనులను కూడా చేసుకోలేను. ఆ స్థితిలో నేను ఎప్పుడూ బాబా ఊదీ దగ్గర పెట్టుకుంటాను. ఇటీవల 2022, ఏప్రిల్ నెల మొదటివారంలో మా వదిన వాళ్ళింట్లో ఒక ఫంక్షన్ ఉండటం వల్ల నేను అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. సాయి దయవల్ల ఫంక్షన్ బాగా జరిగింది. కానీ సరైన విశ్రాంతి లేకపోవడం, బయట తిండి పడకపోవడం వల్ల నాకు భరించలేనంత తలనొప్పి వచ్చింది. మందులు వేసుకున్నా తగ్గలేదు. నేను ఊదీ దగ్గర పెట్టుకుని, "తలనొప్పి తగ్గించమ"ని రోజంతా బాబాని వేడుకుంటూ ఉన్నాను. ఇంతలో మా తిరుగు ప్రయాణానికి ఫ్లైట్ ఎక్కాల్సిన సమయమైంది. తీవ్రమైన తలనొప్పి బాధతో నేను ఎలా ప్రయాణం చేస్తానని అందరూ భయపడ్డారు. నేను మాత్రం బాబా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేరుస్తారని నమ్మకంతో ఫ్లైట్ ఎక్కాను. నేను నమ్ముకున్నట్లే అంతటి తలనొప్పిలో కూడా బాబా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చారు. మరుసటిరోజుకి తలనొప్పి కూడా తగ్గింది. అంతా ఆ ప్రభువు దయ!  ఆయనను పట్టుకుంటే జరగనిది ఏముంది? ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఇటువంటి సాయి లీలలు భక్తులకు ధైర్యాన్ని, ఊరటను ఇస్తాయని ఆ సాయితండ్రి నా ఈ అనుభవాన్ని పంచుకోమన్న ఆలోచనను నాకు కలిగించారని నా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". 


సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!


ఉంగరం ఎక్కడుందో తెలియజేసిన బాబా


ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి, సాయి భక్తులకు నా ధన్యవాదాలు  నా పేరు పావని. మా ఇంటి ఓనర్ 2022, ఏప్రిల్ 10న ఒక ఉంగరం పెట్టుకోవాలని చూస్తే, అది కనిపించలేదు. మిగిలిన బంగారమంతా ఉంది, ఆ ఉంగరమొక్కటే కనిపించలేదు. దాంతో ఆమె, 'శ్రీవెంకటేశ్వరస్వామి ఉంగరం, పెళ్లికి ముందు తీసుకున్నది. మావారు వస్తే నన్ను తిడతారు' అని చాలా బాధపడింది. అప్పుడు నేను సాయిని తలచుకుని, "సాయీ! ఉంగరం కనిపించేలా చేయండి లేదా అది ఎక్కడ ఉందో తెలియచేయండి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. తరువాత నేను ఆమెతో, "ఆ ఉంగరం ఎవరికన్నా ఇచ్చారేమో, ఒకసారి గుర్తుచేసుకోండి" అని అన్నాను. అప్పుడు ఆమె, "మూడు సంవత్సరాల క్రిందట ఒక ఫంక్షన్‍కి వెళ్ళేముందు మావారు, 'నాకు ఈ ఉంగరం టైట్‍గా ఉంది, మీరు పెట్టుకోండి నాన్న' అని  మా మావయ్యగారికి ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు అడుగుదామంటే వాళ్ళు మాతో మాట్లాడటం లేదు. మరి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి?" అని ఆరోజు ఫంక్షన్‍లో తీసిన వీడియో చూశారు. ఆ వీడియోలో వాళ్ల మామగారి చేతికి ఆ ఉంగరం ఉన్నట్లు కనిపించింది. దాంతో ఆమె, "మావారు రాగానే ఈ వీడియో చూపిస్తాను" అని చెప్పింది. నేను అడిగినట్లే బాబా ఉంగరం ఎక్కడుందో అలా తెలియజేశారు. "ధన్యవాదాలు తండ్రి".


సయాటికా నొప్పిని తగ్గించిన బాబా


నా పేరు భారతి. మేము కాకినాడ నివాసులం. జీవితంలో అనుక్షణం బాబా నా చేయి పట్టి నడిపిస్తున్నారని నా నమ్మకం. బాబా అనుగ్రహంతో మేము ఎన్నో కష్టమైన సమస్యలను దాటాము. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం సాయి బంధువులతో పంచుకుంటున్నాను. నేను గత కొన్నేళ్ళుగా చేస్తున్న యోగాను ఇటీవల 6 నెలల క్రిందట ఇంట్లో, ఉద్యోగంలో వస్తున్న ఒత్తిడి మరియు సమయాభావం మూలంగా మానేసాను. ఆరు నెలల తర్వాత మళ్ళీ యోగ మొదలుపెట్టాను. నాకు తీవ్రమైన సయాటికా నొప్పి ఉంది. అది మందులు వాడుతుంటే తాత్కాలికంగా తగ్గుతుంది. యోగా చేయడం వలన ఆ నొప్పి ఒక్కసారిగా మళ్ళీ తిరగబెట్టింది. నా భర్త చాలా మంచివారు. ఆయన, "వద్దంటే, ఎందుకు మళ్ళీ యోగా చేసావు? అందుకే ఈ నొప్పి తిరగబెట్టింది. నీదే తప్పు" అని అనేవారు. 48 గంటలపాటు నరకయాతన అనుభవించాను. నేను అర్థరాత్రి వేళల్లో నొప్పితో బాధపడుతూ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదువుతూ, బాబా ఊదీ రాసుకుని, "నొప్పి తగ్గించు బాబా" అంటూ కన్నీళ్లతో బాబాను వేడుకున్నాను. మూడవ రోజుకి బాబా పలికారు. ఆయన దయవల్ల నొప్పి నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టి ఇప్పుడు నడవగలుగుతున్నాను. నేను ఆ కష్ట సమయంలో బాధతో, "బాబా! నొప్పి తగ్గించు. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నట్లే నా అనుభవాన్ని ఇలా మీ అందరితో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!





6 comments:

  1. Adbhutham Sai nathuni daya 🙏🏻 Om Sri Sainathaya Namah!!

    ReplyDelete
  2. omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  3. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo