1. పిలిస్తే పలుకుతానని నిరూపించిన బాబా
2. నార్మల్ రిపోర్ట్ వచ్చేలా ఆశీర్వదించిన బాబా
3. కోరుకున్నట్లే అనారోగ్యాన్ని తొలగించిన బాబా
పిలిస్తే పలుకుతానని నిరూపించిన బాబా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! శ్రీసాయినాథునికి నా సాష్టాంగ నమస్కారాలు. బ్లాగు మిత్రులందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు. నా పేరు లక్ష్మీ. శ్రీసాయినాథుని కృపవల్ల నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. గత సంవత్సరంలో ఒకసారి నా కాలు బెణికి రెండురోజులు అస్సలు నడవలేకపోయాను. చాలా నొప్పి వచ్చేది. ఆ సమయంలోనే నేను ఈ బ్లాగును మొదటిసారి చూసి, బ్లాగులోని తోటి సాయిభక్తుల అనుభవాలు చదివాక, "నొప్పి తగ్గితే, నేను కూడా నా అనుభవం పంచుకుంటాను" అని శ్రీసాయితో చెప్పుకున్నాను. కానీ మర్చిపోయాను. ఆలస్యమైనందుకు మన్నించమని శ్రీసాయిని వేడుకుంటున్నాను.
గత సంవత్సరంలో నేను కోవిడ్‍తో తీవ్రంగా బాధపడ్డాను. ఆ సమయంలో కోవిడ్ కేసులు, మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరైన వైద్య చికిత్స అందుబాటులో లేక మేమంతా భయాందోళనలకు గురై కనీసం నిద్ర కూడా లేక ఎంతో బాధపడ్డాం. నేనైతే నా బ్రతుకు ఇంకా కష్టం, రేపు తెల్లవారుతుందా అని అనుకునేదాన్ని. అటువంటి స్థితిలో ఒకరోజు నేను శ్రీసాయి చిత్రపటం వద్దకు వెళ్లి, "నన్ను కాపాడండి బాబా" అని సాయిని ప్రార్థించి, ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. నెమ్మదిగా నా ఆరోగ్యంలో మార్పు వచ్చి కేవలం 5 రోజుల్లో కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదంతా శ్రీసాయి దయ.
గత సంవత్సరంలోనే నేను డెంగ్యూతో కూడా బాధపడ్డాను. పరిస్థితి విషమించి నా బ్లడ్ గ్రూపు గలవారు ఎవరూ దొరక్క ఆశలన్ని వదులుకున్నాము. ఆ సమయంలో శ్రీసాయే నాకు తోడుగా ఉండి నన్ను కాపాడారు. ఎవరో అపరిచిత వ్యక్తి తనంతట తానే వచ్చి నాకు రక్తదానం చేశారు. హాస్పిటల్లో అదేరోజు ఉదయం నేను చాలా జ్వరంతో బాధపడుతుంటే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో సాయి నా తల నిమురుతున్నట్లనిపించింది. ఆ విషయం గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడు కూడా నాకు కన్నీళ్లు వస్తున్నాయి. అప్పటినుంచి ఎన్ని ఇంజక్షన్లు చేసినా నొప్పి అనిపించేది కాదు. ఎందుకంటే, నేను సాయి నామస్మరణ చేసుకుంటూండేదాన్ని. నా బాధను బాబానే భరించారనిపిస్తుంది. నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం. బాబా తన భక్తుల బాధలను భరిస్తారని మనం సాయి చరిత్రలో చదువుకున్నాము. నమ్మిన భక్తులకోసం సప్త సముద్రాలు దాటి వస్తారు మన సాయి. నేను బ్రతికానంటే అది కేవలం శ్రీసాయి అనుగ్రహమే అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ఇలా ఎన్నోసార్లు పిలిస్తే పలుకుతా అని బాబా నిరూపించారు.
నా సోదరికి పెళ్ళై 4 సంవత్సరాలైంది. తన వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల తను పుట్టింటిలోనే ఉండాల్సి వచ్చి చాలా బాధపడేది. ఎవరూ సహాయం చేయలేని పరిస్థితి. అయినప్పటికీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త, అత్తమామల వల్ల జీవితం మీదే తను ఆశ వదులుకున్న సమయంలో సాయి భక్తులొకరు సాయి దివ్యపూజ చేయమని సలహా ఇచ్చారు. ఆ విధంగా మేము అడగకనే మాకు సహాయం చేయటానికి ఆ సచ్చిదానంద స్వరూపుడు శ్రీసాయిబాబా వచ్చారు. బాబా మీద భారం వేసి నా సోదరి శ్రీసాయి సచ్చరిత్ర చదువుతూ, దివ్యపూజ మొదలుపెట్టింది. తర్వాత ఒక్కొక్కటిగా తన కష్టాలు మాయమయ్యాయి. తన అత్త వారింట్లో మార్పు వచ్చి ఇప్పుడు తనను బాగా చూసుకుంటున్నారు. మేము తనకు పుత్ర సంతానం కలిగితే బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాము. శ్రీసాయి దయవల్ల ఆమెకు చక్కని బిడ్డ జన్మించాడు. శ్రీసాయి దివ్యపూజ పుస్తకంలో ఇలాంటి కథే ఉండటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. శ్రీసాయికి ధన్యవాదాలు. ఇలాంటి సాయి లీలలు ఎన్నో మా బంధువులకు మరియు మిత్రులందరికీ జరిగాయి. కాబట్టి మిత్రులారా! శ్రీసాయే మనకు శరణం. "అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసమర్థ సద్గురు సాయినాథా! సమస్త ప్రాణకోటి మీద మీ కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి". ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను. బాబా దయతో ఉద్యోగం వస్తే, మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను.
నార్మల్ రిపోర్ట్ వచ్చేలా ఆశీర్వదించిన బాబా
నా పేరు అలేఖ్య. ముందుగా సాయినాథునికి అనంతవేల కృతజ్ఞతలు. బాబా దయవల్ల నేను ఈ బ్లాగులో ఎన్నో అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ఇటీవల కాలంలో మా నాన్నగారికి స్టెంట్ వేశారు. మూడు నెలలు అయ్యాక నాన్న తనకి కళ్ళు తిరుగుతున్నట్లు, అలాగే కొంచెం డల్‍గా అనిపిస్తుంది అని చెప్పారు. మాకు భయమేసి హైదరాబాద్ వెళ్లి చెకప్ చేయించుకోమన్నాము. నాన్న అలాగే వెళ్లారు. అక్కడ డాక్టర్ ఒక టెస్ట్ రాశారు. అది తెలిసి నాకు చాలా భయమేసి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ రిపోర్టు గురించి బాబాను వేడుకున్నాను. ప్రతిరోజూ ఉదయం బ్లాగులోని అనుభవాలు చదవడంతోనే నా రోజు మొదలవుతుంది. ఆ రోజు ఉదయం నేను బ్లాగులో అనుభవాలు చదువుతుంటే, ఆరోజు ప్రచురితమైన మూడు అనుభవాలలోనూ 'నార్మల్ రిపోర్ట్ వచ్చింది' అని ఉంది. దాంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. ఉదయం 11:30కి డాక్టర్ రిపోర్టు చూసి, "రిపోర్టు నార్మల్‍గా ఉంది. సమస్య ఏమీ లేద"ని అన్నారు. ఆనందంగా బాబాకు అనంత వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈ బ్లాగు వారికి కూడా ధన్యవాదాలు. ఈ బ్లాగు ద్వారా చాలా విషయాలకు బాబా సమాధానం ఇస్తున్నారు. చివరిగా ఇంకో విషయం చెప్పాలి. నేను తొమ్మిది గురువారాలు పూజ చేస్తున్నాను. నాన్న రిపోర్టు వచ్చింది తొమ్మిదవ గురువారం నాడే. అంతేకాదు, ఆరోజే బాబా నాకు శిరిడీ నుండి తమ విగ్రహం, ప్రసాదాలను పంపించారు.
కోరుకున్నట్లే అనారోగ్యాన్ని తొలగించిన బాబా
ప్రప్రధమంగా శ్రీసాయినాథునికి నా నమస్కారాలు. బ్లాగు నిర్వహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు సత్యనారాయణమూర్తి. నేను ఇదివరకు నా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని వారాల క్రితం మా అబ్బాయికి హఠాత్తుగా జ్వరమొచ్చి, వాంతులు, విరోచనాలు కూడా అయ్యాయి. ఈ కరోనా సమయంలో డాక్టరు దగ్గరకి వెళ్లడానికి నాకు ఇబ్బందిగా అనిపించి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయతో రేపటికల్లా బాబుకి జ్వరం, వాంతులు, విరోచనాలు తగ్గిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ గడిపాను. బాబా దయవల్ల మర్నాటికి జ్వరం నార్మల్ అయింది, వాంతులు, విరోచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. "సాయినాథా! మీకు అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ".
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDelete🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.. మాకు మీ దివ్యాశీస్సులు ఎల్లపుడు ఉండేలా దీవించండి సాయిరామ్ బాబా..
ReplyDeleteCarpenter manasu marchi money maku vachela cheyi thandri please baba..
ReplyDeletePlease bless my son with full aaush .Om sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sri ai nathaya namaha🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete