1. ప్రార్థిస్తే అన్ని సమస్యలూ తీరుస్తారు బాబా2. అడగటం ఆలస్యం - అనుగ్రహించిన బాబా
3. కష్టకాలంలో ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా
ప్రార్థిస్తే అన్ని సమస్యలూ తీరుస్తారు బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నా పేరు రవీంద్ర. నేను హైదరాబాదులో ఉంటున్నాను. ముందుగా, మన గురువు, దైవం, మార్గిదర్శి అయిన సాయిబాబాకు నా ప్రణామాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి, అనుభవాలు చదువుతున్న భక్తులకు నమస్కారాలు. 'మన అనుభవాలు బ్లాగులో పంచుకుంటామ'ని బాబాకి మ్రొక్కుకుంటే, బాబా మన కర్మలను పోగొట్టి మన కోరికలను తీరుస్తున్నారు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ 4వ తేదీ రాత్రి అకస్మాత్తుగా నా గుండెల్లో దడ మొదలై ఎంతసేపటికీ తగ్గలేదు. నేను బాబా ఊదీని నోట్లో వేసుకుని, కొంచెం నీళ్లు త్రాగి, "బాబా! మీ దయతో ఈ దడ తగ్గినట్లైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అంతకుముందు ఎంతసేపటికీ తగ్గని దడ బాబా దయవల్ల కొద్దిసేపట్లోనే తగ్గింది.
ఒకసారి నేను 4, 5 రోజులపాటు ఆస్తమాతో ఇబ్బందిపడ్డాను. అప్పుడు డాక్టరు దగ్గరకి వెళ్తూ, "బాబా! నేను డాక్టర్ దగ్గరకి వెళుతున్నాను. మీరు నాతోపాటు రండి. డాక్టర్ ఇచ్చే మందులతో నాకు ఆస్తమా తగ్గిపోవాలి" అని చెప్పుకున్నాను. బాబా దయవలన నాకు ఆస్తమా తగ్గింది. "ధన్యవాదాలు బాబా".
ఈమధ్య నా గొంతులో ఏదో అడ్డంగా ఉన్నట్లు అనిపించి చాలా భయమేసింది. అప్పుడు బాబాకి మ్రొక్కుకుని ఊదీ తీసుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజుకల్లా సమస్య లేకుండా పోయింది. నాకు ఏదో మిరాకిల్‍లా అనిపించింది. అలాగే, ఒకసారి నా కొడుకు తనకి కడుపునొప్పిగా ఉందని చాలా బాధపడ్డాడు. మందులు వాడినా నొప్పి తగ్గలేదు. అప్పుడు బాబాకి మ్రొక్కుకుని, బాబా ఊదీని నీళ్లలో కలిపి బాబుకి ఇచ్చాను. బాబా దయవలన రెండురోజుల్లో తనకి కడుపునొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".
ఈమధ్య నా భార్యకి డ్రెస్సు టైట్‍గా ఉండటం వలన ఛాతీ దగ్గర పట్టేసినట్లుండి నొప్పితో తను రెండురోజులపాటు ఇబ్బందిపడింది. అప్పుడు నేను, "బాబా! నా భార్యకు నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత బాబా దయవల్ల నా భార్యకి నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. దయతో మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా రక్షించండి".
ఒకతను నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా చాలారోజుల నుండి నన్ను ఇబ్బందిపెడుతుంటే నేను బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే, బాబా దయవలన నాకు రావలసిన డబ్బులు నాకు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. నాకున్న అప్పులు తీర్చుకునే మార్గం చూపించండి. నేను రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను బాబా. మీ దయతో ఉద్యోగం వస్తే, వెంటనే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను. దయచేసి ఈ నెలలోనే నాకు ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి బాబా".
సర్వేజనాః సుఖినోభవంతు!!!
అడగటం ఆలస్యం - అనుగ్రహించిన బాబా
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ముందుగా బాబాకు శతకోటి వందనాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నా పేరు సింధు. నేను సాయిభక్తురాలిని. నాకు ఏ సమస్య వచ్చినా బాబాకి చెప్పుకుంటాను. ఆయన అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తున్నారు. ఒకసారి నేను బాబాకి నివేదించిన ప్రసాదంలో నాకు బాబా ముఖ దర్శనమైంది. అలా నాకు తోడుగా ఉన్నామని బాబా నిదర్శనమిచ్చిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ఇదివరకు నేను ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. 2022, మార్చి నెల చివరిలో మా నాన్నగారి పెన్షన్‍కి సంబంధించిన ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కనపడకుండా పోయింది. అది లేకుంటే వచ్చే సంవత్సరం పెన్షన్‍కి చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన నేను చాలా కంగారుపడి, "బాబా! ఆ డాక్యుమెంట్ దొరికేలా చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. వెంటనే నేను అదివరకు చూసిన ఒక బ్యాగులోనే ఆ డాక్యుమెంట్ కనిపించేలా చేశారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా. నేను సదా మీకు ఋణపడి ఉంటాను".
ఒకరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను చాలా టెన్షన్ పడి, "బాబా! అతను ఫోన్ ఆన్ చేసేలా చేయండి. నేను ఈ టెన్షన్ భరించలేను. ప్లీజ్ బాబా, నేను కోరుకున్నట్లు అనుగ్రహిస్తే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఒక్క ఐదు నిమిషాల్లోనే బాబా అనుగ్రహించారు. అతను ఫోన్ ఆన్ చేసి నాకు ఫోన్ చేశారు. అలా బాబా నన్ను టెన్షన్ నుండి బయటపడేశారు. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు గానీ, నాకు చాలా ముఖ్యమైనది. నేను నమ్మిన మన బాబా తమ భక్తులు బాధపడుతుంటే చూడలేరు. ఇది నిజం. "బాబా! మీకు హృదయపూర్వక నమస్కారాలు. అన్నిటికీ మీకు ధన్యవాదాలు బాబా. నేను కోరిన ఒక కోరికను కూడా మీరు త్వరలో తీరుస్తారని నమ్ముతున్నాను బాబా. ప్లీజ్ బాబా". చివరిగా, ఈ అవకాశాన్నిచ్చిన బ్లాగువారికి నా ధన్యవాదాలు.
కష్టకాలంలో ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా
"బాబా! మీకు శతకోటి పాదాభివందనాలు". నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు రెండవసారి నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఇదివరకు ఒక కంపెనీలో పనిచేస్తుండేదాన్ని. కొన్ని కారణాల వల్ల నేను ఆ ఉద్యోగం మానేసి చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పుడు నేను మనస్పూర్తిగా బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయతో నాకు ఒక ఉద్యోగం వస్తే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల సరిగ్గా 4 నెలలకి నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇంకా కొన్ని సమస్యలున్నాయి సాయీ. వాటికి కూడా మీరు పరిష్కారం చూపాలి స్వామీ".
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDelete🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteHow to share my experience in this blog please help
ReplyDelete