సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1174వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మ్రొక్కుకున్నంతనే ప్రతి సమస్యని పరిష్కరిస్తున్న బాబా
2. బాబా అనుగ్రహం
3. కనిపించకుండాపోయిన రెండు ఉంగరాలను తిరిగి అప్పగించిన బాబా

మ్రొక్కుకున్నంతనే ప్రతి సమస్యని పరిష్కరిస్తున్న బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నా జీవితంలో వచ్చిన ప్రతి సమస్యలోనూ బాబా నాకు తోడుగా ఉన్నారు. నాకు ఏ సందేహం వచ్చినా బాబా నాకు ఏదో రూపంలో సమాధానమిస్తారు. సాయినాథుడు నాకు ప్రసాదించిన అనుభవాలను నేను ఇదివరకు మీతో చాలా పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 

ఒకరోజు నేను స్కూటీపై వెళుతుండగా అనుకోకుండా స్కూటీతో సహా క్రింద పడిపోయాను. స్కూటీ రిపేరుకు వచ్చింది. మెకానిక్ దగ్గర చూపిస్తే, ‘రిపేర్ చేయడానికి 15,000 రూపాయలు ఖర్చవుతుంద’ని అన్నాడు. దాంతో నాకు చాలా బాధవేసి, “బాబా! ఇప్పటికే అప్పులతో సతమతమవుతున్నాము. ఇప్పుడు స్కూటీ రిపేర్ కోసం 15 వేల రూపాయలు ఎక్కడినుండి తీసుకురావాలి బాబా?” అంటూ బాబా ముందు కూర్చుని చాలా ఏడ్చాను. తరువాత, “బాబా! మీ దయవల్ల 5 వేల రూపాయల లోపు స్కూటీ రిపేరయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల 2,500 రూపాయలకే స్కూటీ రిపేర్ చేశారు. “థాంక్యూ బాబా!”

2022, మార్చ్ నెల మధ్య నుండి సుమారు నెలరోజుల వరకు నా భుజాలు, చేతులు చాలా నొప్పి పెడుతుండేవి. ఆ కారణంగా నాకు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ‘ఎందుకిలా ఇంతలా నొప్పిపెడుతున్నాయి?’ అని ఆలోచిస్తే, ‘ఫోన్లో గేమ్ ఎక్కువగా ఆడటం వల్లనేమో’ అని నా మనసులో అనుమానం వచ్చింది. నాకు వచ్చిన అనుమానం నిజమో కాదో తెలుసుకుందామని నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, నాకు వచ్చిన అనుమానం నిజమే అయితే ఈరోజు శేజ్ ఆరతిలో మీరు గ్రీన్ కలర్ డ్రెస్సులో దర్శనమివ్వండి” అని అనుకున్నాను. ఆరోజు బాబా గ్రీన్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. దాంతో, నా అనుమానం నిజమేనని బాబా చెబుతున్నారని రూఢి చేసుకుని, బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ దయవల్ల నేను ఫోనులో గేమ్ ఆడడం తగ్గించాలి. చేతులు, భుజాలు నొప్పి తగ్గి నేను హుషారుగా పనిచేసుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఆ తరువాత బాబా దయవల్ల నేను ఫోన్ చూడటం, గేమ్ ఆడటం తగ్గిపోయింది. చేతులు, భుజాల నొప్పులు కూడా చాలావరకు తగ్గిపోయాయి. “మిగిలిన ఆ కాస్త నొప్పిని తగ్గించండి తండ్రీ!”

మావారికి ఇదివరకు ఒకసారి కంటికి కురుపు రావడంతో తనకు ఆపరేషన్ అయింది. ఇటీవల మళ్ళీ ఇంకొక కురుపు వచ్చింది. దాంతో, మళ్ళీ తనకు ఆపరేషన్ చేయాల్సివస్తుందేమోనని భయపడి నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ దయవల్ల ఏ సమస్యా లేకుండా కురుపు పగిలిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. నేను అలా బాబాకు మ్రొక్కుకున్నరోజు సాయంత్రం ఆ కురుపు పగిలిపోయింది. బాబా చూపిన కరుణకు ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

నాకు చాలా సంవత్సరాలనుండి మూత్రాశయం దగ్గర దురద వస్తోంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను. వాళ్ళిచ్చిన మందులు వాడాను. అయినా దురద తగ్గలేదు. పైగా ఒళ్ళంతా కూడా దురద వస్తోంది. ఆ దురద భరించలేక ఒకరోజు బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ దయవల్ల దురద తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో దురద చాలావరకు తగ్గిపోయింది. “బాబా! మీ దయవల్ల ఇప్పుడు దురద అంతగా లేదు. మిగిలిన ఆ కొంచెం దురద కూడా తగ్గేలా చేయి తండ్రీ!”

సర్వేజనాః సుఖినో భవంతు!!!

బాబా అనుగ్రహం

సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాపై వర్షించిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. ఈ మధ్యకాలంలో నా సర్టిఫికెట్స్ కోసమని నేను అదివరకు చదివిన కాలేజీకి వెళితే, కాలేజీవాళ్ళు కొన్ని రోజులు తర్వాత రమ్మన్నారు. నేను మళ్లీ 20 రోజుల తర్వాత వెళ్ళాను. అప్పుడు అక్కడ బాబా ఫోటో రూపంలో నాకు దర్శనం ఇచ్చారు. నేను బాబాకి నమస్కరించుకుని, "బాబా! ఏ ఇబ్బంది పెట్టకుండా నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల కాలేజీవాళ్ళు వెంటనే నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా. మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు తండ్రి". ఇకపోతే, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాని జీవిత భాగస్వామి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అయితే బాబా దయవల్ల నేను కోరుకున్న లక్షణాలున్న వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. అది నిజంగా బాబా చేసిన అధ్భుతమేనని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బాబా దయవల్ల నా పెళ్లి ఆ వ్యక్తితో జరగాలని బాబాని మనసారా వేడుకుంటున్నాను.

కనిపించకుండాపోయిన రెండు ఉంగరాలను తిరిగి అప్పగించిన బాబా

నా పేరు మాలతి. నేను సాయినాథునికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆయనకి మాటిచ్చిన ప్రకారం నా అనుభవం తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ 26న నా ఉంగరాలు రెండు కనిపించలేదు. ఇళ్ళంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. వాటిలో ఒకటి నా పెళ్లి ఉంగరం కాగా ఇంకొకటి మా అమ్మ ఇచ్చిన ఉంగరం. అమ్మ ఇప్పుడు లేరు. ఆమె బాబా చరిత్ర పారాయణ చేస్తూ వారి సన్నిధికి చేరుకుంది. ఆమె గుర్తుగా నాకు మిగిలింది ఆ ఉంగరం ఒక్కటే. అలాంటిది ఆ రెండు ఉంగరాలు కనిపించకపోయేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. అయినప్పటికీ బాబా నేను వాటిని ఎక్కడ పెట్టానో, నాకు గుర్తు చేసి నాకు అప్పజెప్తారు అనే నమ్మకంతో "అవి దొరికితే, వెంటనే నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత విచిత్రంగా ఆ రెండు ఉంగరాలు బాబా పాదాల చెంతనే కనిపించాయి. "ధన్యవాదాలు బాబా! మీకు మాట ఇచ్చిన ప్రకారం వెంటనే నా అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకునే అదృష్టం కల్పించినందుకు కూడా కృతజ్ఞతలు తండ్రి".

6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Sai baba mama is sai's devotee.you wrote about him .We don't know about him.you are giving good information about devotees before sai's death.i liked very much . Please baba cure my urine infection.Give health to me and my family.i will post my thanks in this blog.om sai ram

    ReplyDelete
  3. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  4. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo